స్మిత్‌సోనియన్ సంస్థ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వాషింగ్టన్ డి.సీలోని నేషనల్ మాల్ లో "క్యాసిల్" గా ప్రసిద్ధిపొందిన స్మిత్‌సోనియన్ భవనం సంస్థ యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నది

స్మిత్‌సోనియన్ సంస్థ ఒక విద్యా సంస్థ, పరిశోధన సంస్థ మరియు సంగ్రహాలయాల సముదాయము. ఈ సంస్థను నడపడానికి నిధులు అమెరికా ప్రభుత్వము, దాతలు, విరాళములు మరియు బహుమతుల దుకాణము/పత్రిక అమ్మకాలు వలన వచ్చిన లాభాల నుండి సమకూరుతుంది.. ఈ సంస్థ యొక్క భవనాలు, ఇతర వసతులు చాలా మటుకు వాషింగ్టన్ డి.సి. లో ఉన్నప్పటికీ, 15 సంగ్రహాలయాలు, 8 పరిశోధనా కేంద్రాలు న్యూయార్క్ నగరం, వర్జీనియా, పనామా మరియు ఇతర ప్రాంతాలలో కూడా ఉన్నవి. మొత్తము అన్నిటిలో సుమారుగా 14.2 కోట్ల ప్రదర్శనా వస్తువులు ఉన్నవని అంచనా. ఈ సంస్థ "స్మిత్‌సోనియన్" పేరుతో ఒక మాస పత్రికను ప్రచురిస్తున్నది.

చరిత్ర[మార్చు]

స్మిత్‌సోనియన్ సంస్థ స్థాపనకు ఒక బ్రిటిష్ శాస్తవేత్త .జేమ్స్ స్మిత్‌సన్ (1765-1829) మరణానంతరము ఇచ్చిన నిధులు తోడ్పడినవి. ఆ తరువాత అమెరికా శాసనసభ (కాంగ్రెస్) చేసిన చట్టము తో ఈ ప్రభుత్వ/ప్రైవేటు భాగస్వామ్య సంస్థ ఏర్పడినది.

స్మిత్‌సోనియన్ మ్యూజియంలు[మార్చు]

జాతీయ వాయు మరియు అంతరిక్ష మ్యూజియంలో అనేక రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నవి. అందులో ముఖ్యమైనవి: ఫోర్డ్ ట్రైమోటర్ మరియు డగ్లస్ డి.సి-3 (పైది మరియు పైనుండి రెండవది)

స్మిత్‌సోనియన్ పరిశోధనా సంస్థలు[మార్చు]