స్లమ్‌డాగ్ మిలియనీర్
| స్లమ్‌డాగ్ మిలియనీర్ | |
|---|---|
| దర్శకత్వము | డానీ బాయిల్ లవ్‌లీన్ టాండన్ (సహ దర్శకత్వం) |
| నిర్మాత | క్రిస్టియన్ కోల్సన్ |
| రచన | సైమన్ బీఫాయ్ వికాస్ స్వరూప్ (నవల) |
| తారాగణం | దేవ్ పటేల్ ఫ్రీడా పింటో అనిల్ కపూర్ ఇర్ఫాన్ ఖాన్ |
| సంగీతం | ఎ.ఆర్ రహమాన్ |
| సినిమెటోగ్రఫీ | ఆంథోనీ డాడ్ మాంటిల్ |
| కూర్పు | క్రిస్ డికెన్స్ |
| డిస్ట్రిబ్యూటరు | ఫాక్స్ సర్చ్‌లైట్ పిక్చర్స్ వార్నర్ బ్రదర్స్ (US) పాథే ఇంటర్నేషనల్ |
| విడుదలైన తేదీలు | నవంబర్ 12 2008 (అమెరికా కొన్ని ప్రాంతాల్లో) డిసెంబర్ 26 2008 (అమెరికా మొత్తం) జనవరి 9 (యూ.కె) జనవరి 22 2009 (భారతదేశం) |
| నిడివి | రెండు గంటలు |
| దేశము | యునైటెడ్ కింగ్‌డమ్ |
| భాష | ఆంగ్లము హిందీ |
| బడ్జెట్ | 15 మిలియన్ డాలర్లు |
| Gross revenue | $61,605,255 |
| Official website | |
| All Movie Guide profile | |
| IMDb profile | |
స్లమ్‌డాగ్ మిలియనీర్ 2008లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఆంగ్ల చిత్రము. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవనం, వారిలో నిగూఢమైన ప్రతిభను అత్యంత హృద్యంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది. ఇలా పెరిగిన ఒక బాలుడు పెద్దవాడైన తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమంలో పాల్గొని రెండు కోట్ల రూపాయలు ఎలా గెల్చుకొన్నాడన్నది ఈ చిత్ర కథాంశం.
విషయ సూచిక |
[మార్చు] సంక్షిప్త కథ
ఈ సినిమాకు సైమన్ బీఫాయ్ స్క్రీన్ ప్లే రాసినా, డానీ దర్శకత్వం వహించినా, చిత్రానికి ఆధారం మాత్రం బ్రిటన్ లో మాజీ భారతీయ దౌత్య ప్రతినిథి వికాస్ స్వరూప్ రాసిన క్యూ అండ్ ఏ అనే నవల. కథ విషయానికొస్తే ముంబై లోని ధారవి అనే మురికివాడ నేపథ్యంలో మొదలౌతుంది. సినిమా ప్రారంభంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఇర్ఫాన్ ఖాన్) వీధిబాలుడిగా పెరిగిన జమాల్ మాలిక్ (దేవ్ పటేల్) ను హింసకు గురి చేస్తూ విచారిస్తుంటాడు. జమాల్, ప్రేమ్ కుమార్ (అనిల్ కపూర్) చే నిర్వహించబడే కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఒక పోటీదారు. జమాల్ ఈ పోటీలో చివరి ప్రశ్న దాకా వస్తాడు. కానీ అప్పుడే పోలీసులు వచ్చి అతన్ని మోసం కేసులో విచారణకోసం తీసుకుని వెళ్తారు.
అప్పుడు జమాల్ తనకు పోటీలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా తెలిశాయో వివరణ ఇస్తాడు. అమితాబ్ బచ్చన్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం. తరువాత జరిగిన హిందూ-ముస్లిం కొట్లాటలలో తన తల్లిని కోల్పోవడం మొదలైన విషయాలనుంచి ప్రారంభిస్తాడు. తరువాత అతను తన అన్న సలీం (మహేష్ మంజ్రేకర్) తో కలిసి ఒక అనాథ బాలికయైన లతిక (ఫ్రీడా పింటో) తో సాన్నిహిత్యం పెంచుకుంటారు.వీళ్ళకి నా అనే వాళ్ళు లేకపోవడంతో అదే ప్రదేశంలో వీధి బాలలుగా జీవిస్తుంటారు. మమన్ అనే స్థానిక దాదా, అక్కడి వీధి బాలల్ని చేరదీసి వారిచేత చట్టవ్యతిరేకమైన పనుల్ని చేయిస్తుంటాడు. అలాగే కొందరికి చూపు పోగొట్టి, పాటలు పాడుతూ భిక్షాటన సాగించే యాచకులుగా మారుస్తుంటాడు. కాలక్రమంలో ముగ్గురూ విడిపోతారు.
పెరిగి పెద్దయ్యాక జమాల్ ఒక కాల్‌సెంటర్ లో టీ అందించే పనిలో చేరుతాడు. తరువాత కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమంలో పాల్గొని అన్ని ప్రశ్నలకూ వరుసగా సమాధానాలు చెబుతూ రెండు కోట్ల రూపాయల ప్రశ్న వరకూ వస్తాడు. మురికివాడలో పెరిగిన కుర్రాడికి ఇంత పరిజ్ఞానమా! అని సందేహం తలెత్తుతుంది. చివరికి జమాల్ ఆఖరి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి రెండు కోట్లు గెలుచుకుంటాడు.
[మార్చు] నిర్మాణం
ఈ కథ అంతా తృతీయ ప్రపంచ దేశాల్లోని మురికివాడలు, అక్కడి పేదరికానికి అద్దం పడుతుంది. ప్రధానంగా ముంబై లోని మురికివాడల్లో చిన్నారుల దయనీయ స్థితిని చూపిస్తుంది. ఈ కథను చిత్రంగా మలచదలుచుకున్న రచయిత సైమన్ బీఫాయ్ పలుమార్లు భారతదేశంలోని మురికివాడల్లో సంచరించాడు. అక్కడి ప్రజలని, ముఖ్యంగా చిన్నారుల్ని పలకరించాడు. వారి ఆలోచనల్నీ, వారి నడతలోని తెగింపునూ పరిశీలించాడు. వాటినే తన కథలో ఇముడ్చుకొన్నాడు. ఇక దర్శకుడు డానీ బోయెల్ కూడా ముంబై లోని ధారవి లో గడిపాడు. జుహు బీచ్ లోని వీధి బాలలు భిక్షాటన చేయడాన్ని , చిన్న చిన్న వ్యాపారాలు చేయడం కూడా గమనించాడు. మాఫియా తాలుకు మూలాలు మురికి వాడల్లో బలంగా ఉంటాయన్నది డానీ అభిప్రాయం. యాష్ చోప్రా తీసిన దీవార్, రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య, కంపెనీ, అనురాగ్ కశ్యప్ రూపొందించిన బ్లాక్ ఫ్రైడే చిత్రాలను డేనీ నిశితంగా పరిశీలించాడు. ఈ విషయంలో ఆయనకు సహ దర్శకురాలు లవ్లీ టాండన్ సహకరించింది. నవంబర్ 2007 లో చిత్రీకరణ ప్రారంభించారు. భారతీయ చిత్రాల శైలిలోనే చిత్రీకరణ చేశారు. చిత్ర సాంకేతిక బృందం హాలీవుడ్‌దే అయినా నటీనటులంతా భారతీయులే.
| “ | ముంబై వాసుల జీవితాన్ని ఆవిష్కరించాను. వారు జీవించేందుకు ఆరాటపడతారు. పోరాడతారు. ఆ జీవితాన్నే ప్రేమిస్తారు. దాన్నే చూపించాలని తపించాను. కాబట్టే పురస్కారాలు వస్తున్నాయి. ఇంకా వస్తాయి కూడా | ” |
[మార్చు] పురస్కారాలు
ఈ సినిమా పలువురి ప్రశంసలందుకుంది. ప్రధాన అంతర్జాతీయ పత్రికలన్నీ ఈ చిత్రాన్ని మొదటి పది చిత్రాల జాబితాలో ప్రకటించాయి. నాలుగు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను కైవసం చేసుకుంది. ఇంకా 10 ఆస్కార్ నామినేషన్లనూ, 11 బాఫ్టా ( బ్రిటీష్ అకాడమీ ఫిలిం అవార్డు) నామినేషన్లనూ సంపాదించగలిగింది.
[మార్చు] ఆస్కార్ అవార్డులు
ఈ చలన చిత్రానికి 2008 సంవత్సరానికి గాను ఇవ్వబడిన ఆస్కార్ ఎవార్డులలో 8 ఎవార్డులను గెలుచుకుంది:
- ఉత్తమ చిత్రం :స్లమ్ డాగ్ మిలియనీర్
- ఉత్తమ దర్శకుడు : డానీ బోయల్
- ఉత్తమ సంగీత దర్శకుడు : ఏ ఆర్ రెహమాన్
- ఉత్తమ ఎడిటింగ్ : క్రిస్ డెకెన్స్
- ఉత్తమ సినిమాటోగ్రఫీ : ఆంటోనే డాడ్ మాంటల్
- ఉత్తమ ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే :సైమన్ బుఫై
- ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : రసూల్ పూకుట్టి
- ఉత్తమ ఒరిగినల్ సాంగ్ : జైహో
[మార్చు] విమర్శలు
సల్మాన్ రష్దీ, అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖులు ఈ చిత్ర కథాంశంపై విభేదిస్తున్నారు. భారతదేశ పేదరికాన్ని మార్కెట్లో పెట్టేశారనేది విమర్శకుల వాదన.