స్వాతి పిరమాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ స్వాతి పిరమాల్
జననం
స్వాతి

(1956-03-28) 1956 మార్చి 28 (వయసు 67)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థముంబై విశ్వవిద్యాలయం
Harvard School of Public Health
వృత్తిపిరమిల్ ఎంటర్‍ప్రైసెస్ ఉపాధ్యక్షురాలు
జీవిత భాగస్వామిఅజయ్ పిరమల్
పిల్లలుఆనంద్ పిరమల్
నందిని పిరమల్

పద్మశ్రీ డాక్టర్ స్వాతి పిరమాల్ భారతదేశపు సుప్రసిద్ద వైద్యురాలు, పారిశ్రామికవేత్త. అత్యంత ప్రభావశీలురు, శక్తివంతమైన పాతిక మంది మహిళల జాబితాలో స్థానం సంపాదించుకున్న మహిళ. ప్రజారోగ్య పరిరక్షణకు తన వంతు సహాయం చేస్తున్న ఆరోగ్య కార్యకర్త. చౌక ధరలలో కొత్త ఔషధాలను కనుగొని లక్షలాది పేద ప్రజల ఆరోగ్య అవసరాలను తీరుస్తున్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పిరమిల్ ఎంటర్‍ప్రైసెస్ సంస్థకు ఈవిడ ఉపాధ్యక్షురాలు. ఈ సంస్థ చౌక ధరలలో మందులను ఉత్పత్తి చేస్తుంది.

నేపధ్యము[మార్చు]

1956 మార్చి 28 లో బొంబాయిలో జన్మించారు. 1980 లో ముంబై విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యను పూర్తి చేశారు. 1992 లో హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ సంస్థ నుండి మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. ఈ సంస్థ పూర్వవిద్యార్థుల సంఘంలో కూడా ఈవిడ చేరారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల రోగుల మేలు కోసం నడుంకట్టారు. కాన్సర్, మధుమేహ, వాపు, సాంక్రమిక వ్యాధులపై పరిశోధన చేస్తున్న శాస్తవేత్తల బృందానికి ఈవిడ నాయకత్వం వహిస్తున్నారు. వీరి బృందం ఇప్పటి వరకు 200 అంతర్జాతీయ మేధోహక్కులను (పేటెంట్స్) కలిగి ఉన్నది, పరీక్ష దశలో ఉన్న పదునాలుగు కొత్త ఔషధాలను కనుగొంది. వీరి పిరమిల్ ఎంటర్ప్రైసేస్ లిమిటెడ్ సంస్థ ఒక బహుళజాతి సంస్థ . ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలలో వీరి తయారీ కర్మాగారాలు ఉన్నాయి. గత రెండు దశాబ్ధాలుగా ఈవిడ సాంక్రమిక వ్యాధులైన మధుమేహము, కీళ్ళ జబ్బులు, హృదయ సంబంధిత వ్యాధుల నివారణలో కృషిచేస్తున్నారు. ముంబాయిలో గోపీకృష్ణ పిరమాల్ ఆసుపత్రిని స్థాపించి సాంక్రమణ, వంశపారంపర్య వ్యాధులైన్ కీళ్ళ, ఎముకల వ్యాధులు, బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పోరోసిన్), మలేరియా, క్షయ, మూర్ఛ, పోలియో వ్యాధులపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మరెక్కడా లేని క్రీడా చికిత్సా కేంద్రము (Sports-medicine Centre) ఈ ఆసుపత్రిలో ప్రారంభించబడింది. ఈ కేంద్రంలో వికలాంగ బాలలకు, వృద్దులకు, క్రీడలలో గాయపడిన వారికి కీళ్ళు, ఎముకల చికిత్సలను విజయవంతంగా అందిస్తున్నారు. ఓస్టాప్ ఇండియా (Ostop India) అనే సంస్థను స్థాపించి బోలు ఎముకల వ్యాధి నివారణా చర్యల గురించి ప్రజలలో విస్తృత అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సంస్థ ద్వారా మధుమేహ, మూర్ఛ వ్యాధి నిర్ధారణా కేంద్రాలు, మనదేశంలో సంక్రమణా వ్యాధుల వ్యాప్తి పై ప్రజల అవగాహనకు జాతీయ స్థాయి ఉద్యమం ప్రారంభించారు. ఈవిడ రోగసంబంధమైన పోషణము (clinical nutrition ), మూత్రపిండ సంబంధిత వ్యాధుల పోషణము లపై పలు గ్రంథాలను కూడా రచించారు.

గ్రామీణ ప్రాంతాలలో మహిళా ఆరోగ్య, సార్థికారిత, వృత్తి విద్య, యువ నాయకులను ప్రోత్సహించే పిరమాల్ సంస్థకు ఈవిడ అధిపతిగా పనిచేస్తున్నారు. అందరికీ పరిశుద్ధమైన తాగునీరు అందిందే ఉద్దేశంతో పనిచేస్తున్న సర్వజల్ ఫౌండేషన్ కార్యకలాపాలు కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే సాగుతుంటాయి. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తొంభై ఏళ్ళ భారత పారిశ్రామికవేత్తల అత్యున్నత సంఘము అసోచాం (ASSOCHAM) కి ఆమె మొట్టమొదటి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఈ కాలంలో ముఖ్యమైన పరిపాలనా, ప్రజా విధానాలను మెరుగు పరచడానికి ఈవిడ ప్రభావితం చేశారు.ఈమె కృషి ఫలితంగా ప్రజారోగ్య విధానంలో పలు ముఖ్యమైన మార్పులు వచ్చాయి. దీని ఫలితంగా పేదలపై రోగాల భారము, ఖర్చు గణణీయంగా తగ్గింది. అత్యంత శక్తివంతమైన పాతిక మంది మహిళల జాబితాలో ఈమె పేరు ఎనిమిది సార్లు ప్రతిపాదించబడింది. ప్రస్తుతము ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

భారత ప్రధానమంత్రి శాస్త్రీయ సలహామండలిలో ఈవిడ సభ్యురాలు. అలాగే ప్రధాన మంత్రి వర్తక/వాణిజ్య సలహామండలిలో కూడా సభ్యురాలుగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధిపతుల సలహామండలిలో కూడా ఈమె సభ్యురాలు. అలాగే పలు ఆర్థిక, తయారీ, సేవా సంస్థల పాలనా మండళ్ళలో సభ్యురాలుగా పలు బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబాయి, హార్వర్డ్ విశ్వవిద్యాలయము, పపెన్సిల్వేనియా విశ్వవిద్యాలయము (యూ పెన్) పాలనా మండళ్ళలో కూడా చోటు దక్కించుకున్నారు. ఆరోగ్య, వ్యాపార రంగములలోని సమస్యలను కలసికట్టుగా పరిష్కరించడానికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల భాగస్వామ్య వేదికను ఏర్పాటు చేయడానికి ఎంతగానో కృషిచేశారు.పలు ప్రభుత్వ వర్తక వాణిజ్య, ప్రణాళికా, పర్యావరణము, కళాలు, మహిళా సాధికారిత, జాతీయ సమైక్యత, ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళలో ఈవిడ క్రియాశీలకంగా సేవలు అందిస్తున్నారు.

విద్యాభ్యాసము[మార్చు]

పురస్కారములు, గౌరవాలు[మార్చు]

పద్మశ్రీపురస్కారం

డాక్టర్ స్వాతిని అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. వీటిలో భారత ప్రభుత్వ మూడవ అత్యుత్తమ పురస్కారము పద్మశ్రీ కూడా ఉంది.

  • 2004–05 – BMA Management Woman Achiever of the Year Award [2]
  • 2006 – ఫ్రాన్స్ ప్రభుత్వ నైట్ ఆఫ్ ది ఆర్డర్ పురస్కారము - Chevalier de l’Ordre National du Merite (Knight of the Order of Merit), from the French President Jacques Chirac.
  • 2006 – భారత ప్రధానమంత్రి నుండి శాస్త్ర సంకేతిక యువ నాయకత్వ పురస్కారము ( Lucknow National Leadership Award, in the Young Leader in the field of Science and Technology category from the Prime Minister of India.)
  • 2006 – Chemtech Pharma Award for “Outstanding Contributions” in Pharma Biotech industries
  • 2007 – రాజీవ్ గాంధీ అత్యుత్తమ మహిళా కార్యసిద్దికర్త పురస్కారము (Outstanding Woman Achiever) - రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్రధానము.
  • 2010-2011 – అసోచాం అధ్యక్షురాలు [3]
  • 2010 – విశ్వ సాధికారిత (Global Empowerment) పురస్కారము, లండన్, ఇంగ్లాండు.
  • 2012 – భారత రాష్టపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ నుండి అత్యున్నత పద్మశీ పురస్కారం స్వీకరించారు (180).[4]
  • 2012 – హార్వర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అత్యున్నత పురస్కారము
  • 2012 – Received the Lotus Award at New York, from Children’s Hope India, for Leadership and Philanthropy.

మూలాలు[మార్చు]

  1. http://alumni.sph.harvard.edu/s/1319/GID2/social.aspx?sid=1319&gid=2&pgid=252&cid=1285&ecid=1285&ciid=2757&crid=0
  2. "girlsindia.in/dr-swati-a-piramal/".
  3. "Dr.Swati Piramal to head ASSOCHAM, announces four-point agenda".
  4. Bharti, Prasar. "President gives away Padma Awards". Archived from the original on 2016-03-05. Retrieved 2013-03-07.

బయటి లింకులు[మార్చు]