హఠయోగ ప్రదీపిక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హఠయోగ ప్రదీపిక ఆంగ్ల అనువాద పుస్తక ముఖచిత్రం.

స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక, హఠయోగములో ప్రాచీన పుస్తకముగా చెప్పబడుతున్నది. 15వ శతాబ్దములో వ్రాయబడిన ఈ గ్రంధము పురాతన సంస్కృత గ్రంధములతో పాటు స్వత్మరామ ప్రతిపాదించిన యోగ ముద్రలు కూడా ఉన్నవి. వీటిలో ఆసనాలు, ప్రాణాయామము, చక్రములు,కుండలిని,బంధములు, క్రియలు, శక్తి, నాడి, ముద్ర ఇంకా ఇతర విషయములు కలవు. ఈనాడు అనేక ఆధునిక ఇంగ్లీషు అనువాదములు దొరుకుతున్నవి.

రెండు స్రవంతులైన ఇద (మానసిక) మరియు పింగళ (భౌతిక) శక్తులను ఉపయోగించి, షుషుమ నాడి (స్వీయ శక్తి)ని ఉద్గారించడానికి, శరీరంలోని వివిధ ప్రదేశాలలో వెన్నెముక ప్రాధమిక స్థానం నుండి తల పైభాగంవరకూ గల, కాస్మిక్ శక్తి కేంద్రాలను, సమాధి పొందేంత వరకు, వివిధ చక్రముల ద్వారా ప్రేరేపించవలెను.

అతి లోతైన ఏకాగ్రతలద్వారా, శారీరక మానసికాలపై పట్టు సాధించి, మేధోజలాల స్తంభనలవరకూ సాధనలు చేసి, స్వీయబ్రాహ్మణాన్ని పొందడమే హఠయోగం. అకుంఠిత దీక్షతో సాధన చేసే హఠయోగము, సాధకున్ని రాజ యోగ శిఖరాలకు చేర్చుతుందని భావిస్తారు.

పాశ్చాత్య దేశాలలో, హఠయోగము వ్యాయామ శిక్షణా పద్ధతిగా ప్రాచుర్యము పొందినది. హఠయోగ అసలు మానసిక ఉద్దేశ్యాలను అర్థం చేసుకొనక, కేవలం భౌతిక సాధనలు మాత్రమే జరుగుతున్నవి. ప్రస్తుతము, 3 కోట్ల అమెరికా ప్రజలు హఠయోగాన్ని సాధన చేస్తున్నారని అంచనా. అయితే భారత ఉపఖండములో మాత్రం నేటికీ హఠయోగము సంప్రాదాయ పద్ధతిలోనే అనుసరించబడుతున్నది. 20వ శతాబ్దములో అంతర్జాతీయ చైతన్య స్రవంతిలోకి ప్రవేశించిన అనేక గొప్ప యోగులను అందించిన, వ్యవస్థీకృత సంస్థల అజమాయిషీలేని సాంప్రదాయ గురు-శిష్య సంబంధము భారత, నేపాలీ మరియు కొన్ని టిబెట్ వర్గాలలో నేటికీ సజీవంగా ఉన్నది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]