హనుమంతుడు
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
విషయ సూచిక |
హిందూమతంలో ప్రాముఖ్యత [మార్చు]
ఛాలా గ్రెఅత్
వివిధ గాధలు [మార్చు]
హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధ క్లుప్తంగా ఇవ్వబడింది.
జననం, బాల్యం [మార్చు]
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
విద్యాభ్యాసం [మార్చు]
హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.
గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.
కిష్కింధ కాండ [మార్చు]
వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెదకుచు రామ లక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకొని, వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసికొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను.
రాముని చేత వాలి హతుడవ గా సుగ్రీవుడు వానర రాజయ్యెను. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లినవారిలో, దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు.
వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు (జటాయువు అన్న) సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.
ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.
హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశి ని గోష్పదంలా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.
సుందర కాండ [మార్చు]
హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండ [మార్చు]
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.
శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.
రావణుని శక్తితో మూర్ఛిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.
తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతి లో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవని ని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.
ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రామునిచేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది.
శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేసెను. సభలోని వారందరూ ఆశ్చర్యపోయిరి. లక్ష్మణునికి కోపము వచ్చినది. ఆంజనేయా! నీవు ఏమి చేయుచుంటివి అని ప్రశ్నించెను. హనుమంతుడు మాత్రం "శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం" అని పల్కెను. అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోద్రిక్తుడై "శ్రీరాముడు నీలో ఉన్నాడా?" అని ప్రశ్నించెను. శ్రీరాముడు మాత్రం అంతా ప్రశాంతంగా గమనించుచుండెను. అప్పుడు హనుమంతుడు తన హృదయమును చీల్చెను. అప్పుడు హనుమంతుని హృదయం నుండి కాంతిమంతంగా సీతారాములు అగు పడిరి. అందరూ ఆశ్చర్యానందాలతో పరవశించిపోయిరి.
మహాభారతంలో [మార్చు]
గ్రహ బాధలనుండి విముక్తికోసం [మార్చు]
హనుమఒథుదు థన బుద్ధిథొ జయైన్ఛాదు
హనుమంతుని పేరు [మార్చు]
హనుమంతుని వాక్చాతుర్యము [మార్చు]
పూజా సాంప్రదాయాలు [మార్చు]
baktito 21 rojulu swamyvarini aradhinchavalenu.
దేవాలయాలు [మార్చు]
శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్టింపబడడం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటిలోనూ సీతారాముల పటమో, విగ్రహాలో, ఆలయాలో ఉండడం సాధారణం. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా వూళ్ళలోను, రోడ్లప్రక్కన, చెట్లక్రింద - ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. భయాపహారిగా ఆంజనేయుడు పల్లెలలో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు.
హనుమంతుని కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ [మార్చు]
- తణుకు కు దగ్గర గల తీపర్రు లో ప్రసన్న ఏకాదసముఖి వీరాంజనేయ స్వామి ఆలయం కలదు .
- హనుమాన్ జంక్షన్: అభయాంజనేయ స్వామి
- గురవాయిగూడెం: మద్ది వీరాంజనేయ స్వామి
- విజయవాడ: దాసాంజనేయస్వామి, మాచవరం
- సురేంద్రపురి, యాదగిరిగుట్ట: పంచముఖ హనుమదీశ్వరాలయం
- తిరుమల: కోనేటి గట్టు ఆంజనేయ స్వామి, బేడీ ఆంజనేయస్వామి, జాబాలి తీర్థం
- రాజమండ్రి, సుందర ఆంజనేయస్వామి దేవాలయం
- కాకినాడకు దగ్గర లో ని మామిడాడ వద్ద గల గంద్రేడు గ్రామం లో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కలదు.
- అరగొండ, అర్ధగిరి ఆంజనేయస్వామి దేవాలయం, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా
- భర్తిపూడి, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా: ప్రసన్నాంజనేయ స్వామి
- వెల్లాల సంజీవరాయుడు, కర్నూలు జిల్లా
- కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి, గుంతకల్లు, అనంతపురం జిల్లా
- వేటపాలెం, ప్రకాశం జిల్లా
- మద్దిమఱ్ఱి, శ్రీశైలం వద్ద
- హైదరాబాదు, సికందరాబాదు జంటనగరాలు: తాడ్‌బంద్, బడీచౌడీ, సుల్తాన్ బజార్ కూరల మార్కెట్టు, కర్మన్ ఘాట్, ఖైరతాబాద్, సోమాజీగూడా, వివేక్ నగర్, సైఫాబాద్ ఆంధ్రాబ్యాంక్, చార్మినార్ క్రాస్ రోడ్ వద్ద లక్ష్మీ గణపతి దేవాలయం
- పొన్నూరు ఆంజనేయస్వామి
- సామర్లకోట ఆంజనేయస్వామి
- కొండగట్టు, ఆంజనేయస్వామి (ప్రముఖ పున్యక్షెత్రమ్ ), కరీంనగర్ జిల్లా
- [అగ్రహరమ్] ].,కరీంనగర్ జిల్లా
- నల్లబండగూడెం, నల్గండ జిల్లా : పంచముఖ ఆంజనేయ స్వామి
- గండి, వేంపలే, వైఎస్ఆర్ జిల్లా :ఆంజనేయస్వామి
- తణుకు కు దగ్గర గల వేల్పూరు లో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కలదు
- Vijayawada-Paritala Anjaneya swamy temple
ఇతర రాష్ట్రాలలో [మార్చు]
- ఉత్తర ప్రదేశ్, వారాణసి: సంకట్ మోచన్ హనుమాన్
- ప్రసన్న వీరాంజనేయస్వామి మందిరం: మహాలక్ష్మీ లే-అవుట్, బెంగళూరు, కర్ణాటక
- రామాంజనేయ స్వామి మందిరం - రాగి గుడ్డ, జె.పి.నగర్, బెంగళూరు, కర్ణాటక
- ఝన్‌కూ -సిమ్లా -హిమాచల్ ప్రదేశ్
- హనుమాన్ టోక్ - గాంగ్‌టక్ - సిక్కిమ్
- శ్రీ విశ్వరూప ఆధివ్యాధిహర భక్తాంజనేయ స్వామి మందిరం - చెన్నై
- శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయ స్వామి ఆశ్రమము - చెన్నై
- మెహందీపూర్ బాలాజీ మందిరం - ధౌసా, రాజస్థాన్
- యోగాంజనేయస్వామి మందిరం, షోలింగాపూర్, తిరుత్తణి, తమిళనాడు.
విదేశాలలో [మార్చు]
- మస్కట్, ఒమన్ - శివాలయంలో ప్రతిష్టింపబడిన ఆంజనేయ స్వామి
- ట్రినిడాడ్, టొబాగో
- శ్రీలంక - సువారా ఎలియా
- ఫ్రిస్కో, టెక్సాస్, యు.ఎస్.ఏ - కార్యసిద్ధి ఆంజనేయస్వామి
ప్రార్థనలు [మార్చు]
సాంప్రదాయానుసారముగా శ్రీసీతారామ స్తుతి హనుమంతునకు అత్యంత ప్రీతికరమైనది. "యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్". అయితే రక్షణకు, విజయానికి, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యుభయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వ సాధారణం.
హనుమంతుని ప్రార్ధనలలో ప్రసిద్ధమైనవి
- ఆంజనేయ దండకం - "శ్రీ ఆంజనేయం ప్రన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం ...." అని సాగే ఈ దండకము తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా పల్లెటూళ్ళలో రాత్రుళ్ళు ఒంటరిగా వెళ్ళేవారు భయవిముక్తికి ఈ దండకం చదువుకోవడం జరుగుతుంది.
- హనుమాన్ చాలీసా: గోస్వామి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన. ఎమ్.ఎస్.రామారావు దీనికి ఒక తెలుగు సేత వెలువరించాడు.
- సుందర కాండ - సుందరకాండ పారాయణ కూడా హనుమదారాధనే అంటారు.
- విభీషణుడు చెప్పిన ఆపదుద్ధారక ఆంజనేయ స్తోత్రము
- హనుమత్కవచమ్
- ఆంజనేయ స్తోత్రము - "మనోజవం మారుత తుల్య వేగం..." వంటి శ్లోకాలతో కూడినది. ఇందులో అన్ని శ్లోకాలూ ప్రసిద్ధము.
- ఆంజనేయ స్తోత్రము - "రం రం రం రక్త వర్ణం ..." అని ప్రారంభమై ప్రతి శ్లోకంలోనూ "సకల దిశ యశం రామదూతం నమామి" అని ఉంటుంది.
- శంకర భగవత్పాదుల హనుమత్పంచరత్న స్తోత్రము
- హనుమంతుని ద్వాదశ నామ స్తోత్రము
- ఆంజనేయ మంగళాష్టకము
ఇంకా వివిధ నామ స్తోత్రాలు, భజనలు, పాటలు చాలా ఉన్నాయి.
వివిధ నామ స్తోత్రాలు, భజనలు, పాటలు
పైన ఇచ్చిన లంకె లో వున్న స్తోత్రాలు:
Sri Hanumath Trikala Dhyanam- శ్రీహనుమత్ త్రికాలధ్యానం Sarva Rakshaka Aanjenya Stotram – సర్వరక్షక ఆంజనేయ స్తోత్రం Sri Adishankarakrita Hanumath Strotram – శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం Sri Hanumannuti Roopa Shlokaashtakam – శ్రీ హనుమన్నుతి రూప శ్లోకాష్టకము Sri Anjaneya Astothara Shata Naama Stotram – శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామ స్తోత్రమ్ Sri Hanumadbadabaanala Stotram – శ్రీ హనుమద్బడబానల స్తోత్రం Sudarshana Samhitokta Vibhishanakrita Hanumat Stotram – సుదర్శన సంహితోక్త విభీషణకృత హనుమత్ స్తోత్రం Eeswaraprokta SriHanumacchakra Dhyanam – ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం Neelakrita Hanumat Stotram – నీలకృత హనుమత్ స్తోత్రము Sri Prasannanjaneya Stotra Pancha Ratnani – శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని Sri Hanumat Stotram – శ్రీ హనుమత్ స్తోత్రం Sri Anjaneya Stotram – శ్రీ ఆంజనేయ స్తోత్రం Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం Sri Anjaneya Mangalastuthi – శ్రీ ఆంజనేయ మంగళస్తుతి
తెలుగు సాహిత్యం [మార్చు]
తెలుగు సినీ సాహిత్యంలో హనుమంతుని గురించిన పాటలు పద్యాలను వివిధ తెలుగు సినిమాలలో చిత్రీకరించి ప్రజలందరికీ అందించారు. వీరాంజనేయ అనే పేరుతో ఒక సినిమా కూడా రూపొందించారు.
వనరులు [మార్చు]
- సుందర కాండము - గీతాప్రెస్, గోరఖ్‌పూర్ - తెలుగు అనువాదకులు: డాక్టర్. ఎమ్.కృష్ణమాచార్యులు, డాక్టర్ గోలి వేంకటరామయ్య.
- వాల్మీకి రామాయణం - సరళ సుందర వచనము - బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - రోహిణి పబ్లికేషన్స్
- సుందర కాండము - శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు- రోహిణి పబ్లికేషన్స్
- శ్రీ సీతారాముల దాసుడు - గరిమెళ్ళ సీతారామదాసు
- సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర వైభవం - కుందా శ్రీనివాసరావు
మూలాలు [మార్చు]
ఇవికూడా చూడండి [మార్చు]
- శ్రీ హనుమత్ విషయ సర్వస్వం - http://srihanumanvishayasarvasvam.blogspot.com/
- http://www.jayahanumanji.com/
- హనుమజ్జయంతి
- రామావతారము
- రామాయణం
- సీత
- లక్ష్మి
- విష్ణువు
- హనుమంతుడు
- హిందూ మతము
- हनुमान హనుమాన్
- Hanuman హనుమాన్
- శ్రీ హనుమత్ విషయ సర్వస్వం - http://srihanumanvishayasarvasvam.blogspot.com/
బయటి లింకులు [మార్చు]
- श्री हनुमान चालीसा, संकटमोचन हनुमानाष्टक, बजरंग बाण, आरती దేవనాగరి లిపిలో హనుమాన్ చాలీసా, ప్రార్ధనలు
- భక్తుల వెబ్ సైటు
- హనుమాన్ చాలీసా, ఆరతి, భజనలు వంటివి - MP3
- హనుమంతుని గురించి స్వామి శివానంద
- హనుమంతుని జీవిత గాధ
- శ్రీ విశ్వరూప పంచముఖ హనుమాన్ ఆశ్రమము, తిరువళ్ళూర్, చెన్నై
- విక్రమన్ స్వామీజీ వెబ్సైట్
|
|||||||||||
