హయాత్‌నగర్‌

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హయాత్‌నగర్‌
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో హయాత్‌నగర్‌ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో హయాత్‌నగర్‌ మండలం యొక్క స్థానము
హయాత్‌నగర్‌ is located in ఆంధ్ర ప్రదేశ్
హయాత్‌నగర్‌
ఆంధ్రప్రదేశ్ పటములో హయాత్‌నగర్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°19′37″N 78°36′17″E / 17.327042°N 78.604717°E / 17.327042; 78.604717
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము హయాత్‌నగర్‌
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 81,070
 - పురుషులు 42,557
 - స్త్రీలు 38,513
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.57%
 - పురుషులు 75.25%
 - స్త్రీలు 52.60%
పిన్ కోడ్ 501505

హయాత్‌నగర్‌, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది హైదరాబాదుకి 25 కి.మీ. దూరంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళే దారిలో రామోజీ ఫిల్మ్ సిటీ కి 3 కి.మీ. సమీపంలో ఉంది. ఇక్కడ హయాత్ బక్షీ బేగం కట్టించిన మసీదు వల్ల హయాత్ నగర్ అని పేరు వచ్చింది.

హయాత్‌బక్షీ మసీదు[మార్చు]

హయాత్‌బక్షీ మసీదు

హైదరాబాద్ నగర శివారులోని హయత్‌నగలోని చారివూతాత్మక కట్టడమే హయాత్‌బక్షీ మసీద్. గోల్కొండను పాలించిన ఐదవ సుల్తాన్ మహమ్మద్ భార్య హయాత్‌బక్షీ బేగం. సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మినార్‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

3000 పైగా జనభా కలిగి, 2000 పైగా ఓటర్లు కలిగి ఉన్నారు. చాలా వరకు ప్రజలు వ్యవసాయం పై అదారపడి జీవనం సాగించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానాల్లొ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రజలు అటు పట్టణ, ఇటు పల్లెటూరు జీవన విధానాలను అలవర్చుకున్నారు.

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

హయత్ నగర్ దృశ్యాలు
హయత్ నగర్ దృశ్యాలు
హయత్ నగర్ దృశ్యాలు