హరివంశ పర్వము
మహాభారతమును తన తాతలైన పాండవుల ఘనచరిత్రను సంపూర్ణముగా విని జనమేజయుడు తనకు కలిగిన అసంతృప్తిని దాచలేక వైశంపాయనుడితో " మహాత్మా ! భారతమును పూర్తిగావిన్నా నా మనసున అసంతృప్తి మిగిలి ఉంది. అందుకు కారణం మహానుభావుడైన శ్రీకృష్ణుడు జన్మించిన యదువంశము గురించి భారతంలో అవసరమైనంత వరకే చెప్పబడినది. మీరు సర్వజ్ఞులు కనుక నాకు శ్రీకృష్ణుడు జన్మించిన వృష్టివంశ చరిత్ర వినిపించి నన్ను ధన్యుడిని చేయండి " అని అడిగాడు. వైశంపాయనుడు అదివిని చిరునవ్వు నవ్వి. జనమేజయమహారాజా ! నీకు కలిగినట్లే వ్యాసుడికి అసంతృప్తి కలిగింది. సక్షాత్తు విష్ణంశ సంభూతుడైన వ్యాసుడు భారతము వ్రాసి ముగించిన పిదప భగవంతుడు ధర్మరక్షకుడైన శ్రీకృష్ణుడు జన్మించిన వృష్టివంశ చరిత్రను ఖిలపర్వము అనే పేరుతో రచించాడు. భారతం పద్దెనిమిది పర్వాలే ఖిలపర్వము దానిలో ఒక భాగం అయింది. ఖిలపర్వము చేరితేనే అది మహాభారతం అయ్యింది. ఇక వృష్టివంశ చరిత్ర శ్రీకృష్ణుడి లీలావైభవం ఆలకించు జనమేజయ మహారాజా ! " అని వైశంపాయనుడు చెప్పి వృష్టివంశముగురించి చెప్పసాగాడు.
చంద్రుడి జననము [మార్చు]
వృష్టివంశముకు మూల పురుషుడు చంద్రుడు. చంద్రుడి తండ్రి బ్రహ్మ మానసపుత్రుడు సప్తరుషులలో ఒక్కడు అయిన అత్రిమహర్షి. అత్రిమహర్షి ఒకసారి లోకహితమును కోరుతూ తపమాచరించాడు. అప్పుడు అతడు ఉఉధ్వరేతస్కుడు కాగా ఆ రేతస్సు బిందువులుగా అతడి కన్నుల నుండి స్రవించి అది దిక్కులన్నింటిని ఆక్రమించగా ఆ రేతోతేజమును దశదిశలు భరించజాలక భూమి మీద వదిలి వేసాయి. అప్పుడు బ్రహ్మ లోకములను రక్షించ తలచి వేయీశ్వముల రధమును చేసి అందు ఉంచాడు. ఆ రేతస్సు తేజోవంతమైన బాలుడై బ్రహ్మరధమును అధిరోహించి లోకముంతా తిరిగి సామ్రాజ్యమును సాధించి రాజతేముతో వెలుగసాగాడు. అది చూసిన దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహము జరిపించాడు. తరువాత చంద్రుడు అత్రిమహర్షి హోతగా, భృగుమహర్షి అధ్వర్యుడుగా, నారదమహర్షి ఉద్ఘాతగా రాజసూయమును చేసాడు. ఆ యాగముకు సనత్కుమారుల వంటి మహాముని పరివేష్టితుడైన విష్ణువు తిలకించాడు. యాగసమాప్తి అందు హిరణ్య, రత్న, రజిత గర్భాయిన ముల్లోకాలు దానముగా ఇవ్చబడినవి. ఆ యాగ ప్రభావముగా చంద్రుడు ధృతి, ప్రభ, కీర్తి, ధృష్టిని పొంది అధిక తేజముతో విరాజిల్లాడు. మిక్కుటమైన సంపదలు చంద్రుడికి అత్యధిక అధిశయము కలించింది. అతడు గర్వాంధుడై భృహస్పతిని ఓడించి అతడి భార్య తారను బలవంతంగా తీసుకు వెళ్ళాడు. ఎంత మంది విడువమని నచ్చ చెప్పినా చంద్రుడు దానిని పెడచెవిన పెట్టాడు.
దేవదానవయుద్ధము [మార్చు]
ఈ అధర్మాన్ని సహించలేని శివుడు దేవతలమీద బ్రహ్మశిరము అను అస్త్రమును ప్రయోగించి బలహీన పరిచాడు. దేవతలు బలహీనులు కాగానే దానవులు విజృభించి దేవతల మీదకు యుద్ధానికి వచ్చారు. ఆయుద్ధములో దేవతలు అనేకులు మరణించారు. దేవతలు చివరకు దానవులకు ఝడిసి బ్రహ్మను శరణువేడగా బ్రహ్మదేవుడు బృహస్పతిని పిలిపించి చంద్రుని తారను రప్పించి తారను భృహస్పతికి ఇప్పించాడు. కాని అప్పటికి తార గర్భవతిగా ఉన్నందున అమె అప్పుడు ఒక బాలుని ప్రసవించింది. ఆ బాలుడు తారను చూసి ఆగ్రహించి తనకు ఇలాంటి జన్మ ఇచ్చిందుకు తల్లిని శపించ తలిచాడు. బ్రహ్మదేవుడు ఆ బాలుని వారించి శాపించకుండా ఆపాండు. తరువాత బ్రహ్మ తారను అడిగి ఆ శిశువు చంద్రుడిది అని తెలుసుకుని పుట్టిన శిశువును చంద్రుడికి ఇప్పించి తారను భృహస్పతివెంట పంపాడు.
భోజవంశము [మార్చు]
చంద్రుడు తన పుత్రుని చూసి అతడి ప్రకాశము చూసి మురుసి పోయాడు. అతడికి బుధుడు అని నామకరణము చేసాడు. బుధుడికి ఇలతో వివాహము జరిగినది. వారికి పురూరవుడు జన్మించాడు. పురూరవుడుని ఊర్వశి వరించి వివాహము చేసుకొన్నది. వారికి ఆయువు, అసమాయువు, ధృడ్హఆఆయువు, పరమాయువు, శతాయువు అను పుత్రులు కలిగారు. ఆయువుకు నహుషుడు, వృద్ధశర్ముడు, రంభుడు, రజి, అనేయుడు అను పుత్రులు కలిగారు. వారిలో నహుషుడికి యయాతి, సంయాతి, ప్రయాతి అనుపుత్రులు కలిగారు. యయాతికి దేవయాని వలన యదువు, తుర్వసుడు కలిగారు. శర్మిష్ఠ వలన ద్రుహ్యుడు, పూరుడు అను పుత్రులు కలిగారు. యదువుకు సహస్రజిత్తు, క్రోష్టుడు, నలుడు, రిపుడు అను కుమారులు కలిగారు. సహస్రజిత్తుకు హేహయుడు, వేణుహయుడు, హైహయుడు అను కుమారులు కలిగారు. హైహయునకు ధర్మనేత్రుడు, కార్తి, సహస్రజిత్తు, మహిష్మంతుడు, భద్రశ్రేణ్యుడు, దుర్ధముడు, ధేనుకుడు అను కుమారులు కలిగారు. ధేనుకునకు కృతవీర్యుడు, కృతాజ్ఞి, కృతధన్వుడు, కృతాంజలుడు జన్మించారు. కృతవీర్యునకు కార్తవీర్యుడు అను కుమారుడు కలిగాడు. కార్తవీర్యునకు శూరుడు, శూరసేనుడు, ధృష్టుడు, జయధ్వజుడు అను కుమారులు కలిగారు. జయధ్వజుడు అవంతీ పురరాజయ్యాడు. అతడి నూరుగురు కుమారులు తాలజంఘులు. తాలజంఘుల వంశంకరుడు వృషుడికి మధువు అను కుమారుడు కలిగాడు. మధువు వలన మాధవులు, వృష్టి వలన వృష్టులు వృద్ధి చెందారు.
అంధకవంశము [మార్చు]
Andhaka Vamsamu
వృష్థి వంశము [మార్చు]
శ్యమంతకమణి కధ [మార్చు]
భూదేవి విలాపము [మార్చు]
సముద్రుడు శంతనుడు [మార్చు]
శ్రీకృష్ణుడి అవతారము [మార్చు]
పూతన వధ [మార్చు]
శకటాసుర సంహారము [మార్చు]
శ్రీకృష్ణుడి బాలక్రీడలు [మార్చు]
యమళార్జున భంజనము [మార్చు]
బృందావనముకు తరలుట [మార్చు]
కాలకలి నిర్మూలనము [మార్చు]
నీలాపరిణయము [మార్చు]
కాళీయమర్ధనము [మార్చు]
బలరాముని ప్రభావము [మార్చు]
బలదేవుడు [మార్చు]
గోవర్ధనోద్ధరణ [మార్చు]
రాసక్రీడలు [మార్చు]
వృషభాసుర వధ [మార్చు]
కంసుడి కలత [మార్చు]
కేశి సంహారము [మార్చు]
మధురకు పయనము [మార్చు]
మధురలో ప్రవేశించుట [మార్చు]
కుబ్జను అనుగ్రహించుట [మార్చు]
కంసుడి విల్లును విరచుట [మార్చు]
కంసుడి జన్మరహస్యము [మార్చు]
కంస వధ [మార్చు]
ఉగ్రసేనుడికి పట్టముగట్టుట [మార్చు]
గురుకుల వాసము [మార్చు]
జరాసంధుడి దండయాత్ర [మార్చు]
నృగాలవాసుదేవుడి సంహారము [మార్చు]
జరాసంధుడి దందయాత్ర [మార్చు]
కాలయవనుడి అంతము [మార్చు]
ద్వారక నిర్మాణము [మార్చు]
రుక్మిణీ కల్యాణము [మార్చు]
ప్రద్యుమ్నుడు [మార్చు]
శుభాంగి స్వయంవరము [మార్చు]
అనిరుద్ధుడి పరిణయము [మార్చు]
బలరాముడి జూదము [మార్చు]
నరకాసుర వధ [మార్చు]
సురకన్యల విముక్తి [మార్చు]
పారిజాతాపహరణము [మార్చు]
ఘంటాకర్ణ విముక్తి [మార్చు]
పౌండ్రుని వధ [మార్చు]
శివకేశవ సమాగమము [మార్చు]
బాణాసుర వృతాంతము [మార్చు]
123