హాక్ ఐ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇతర వాడుకలు కొరకు, Hawkeye (disambiguation) చూడండి.

హాక్ ఐ ఒక సంక్లిష్ట కంప్యూటర్ సిస్టమ్. బంతి గమన మార్గాన్ని దృశ్యపరంగా కనిపెట్టడానికి క్రికెట్, టెన్నిస్ తదితర క్రీడలలో దీన్ని ఉపయోగిస్తారు, ఇది బంతి యొక్క అత్యంత నిర్దిష్టమైన గణాంకాలలో కదిలే ఇమేజ్ మార్గాన్ని నమోదు చేసి ప్రదర్శిస్తుంది.[1] క్రికెట్ మరియు టెన్నిస్‌లో ఇది ఇప్పుడు నిర్ణయ ప్రక్రియలో భాగమైంది. UKలో హాంప్‌షైర్ లోని రామ్సేకి చెందిన రోక్ మనోర్ రీసెర్చ్ లిమిటెడ్ ఇంజనీర్లు దీన్ని 2001లో రూపొందించారు. దీనికోసం UK పేటెంట్‌‌ని సమర్పించారు కాని డాక్టర్ పాల్ హాకిన్స్ మరియు డేవిడ్ షెర్రీలు దీన్ని ఉపసంహరించుకున్నారు.[2] తర్వాత, టెక్నాలజీ మరొక కంపెనీ అయిన హాక్ ఐ ఇన్నోవేషన్ లిమిటెడ్‌ సంస్థకి బదలాయించబడింది, ఇది టెలివిజన్ తయారీ సంస్థ సన్‌సెట్ + వైన్‌ జాయించ్ వెంచర్‌గా ఉంటోంది, దీన్ని సోనీ సంస్థ 2011 మార్చ్‌లో ఏకమొత్తంగా కొనేసింది.[3]

పనిచేసే తీరు[మార్చు]

హాక్ ఐ సిస్టమ్‌లు అన్నీ ఆట జరిగే ప్రాంతం చుట్టూ వివిధ స్థలాలు మరియు కోణాలలో నెలకొల్పబడి ఉన్న కనీసం నాలుగు హైస్పీడ్ వీడియో కెమెరాల ద్వారా అందించబడిన దృశ్య చిత్రాలు మరియు టైమింగ్ డేటాను ఉపయోగించే త్రికోణీకరణ సూత్రాలపై ఆధారపడి ఉంటాయి.[2] ఈ సిస్టమ్ హైస్పీడ్ వీడియో ప్రొసెసర్ మరియు బాల్ ట్రాకర్ ద్వారా అందించబడిన వీడియో సమాచారాన్ని శరవేగంగా ప్రోసెస్ చేస్తుంది. డేటా స్టోర్ అనేది ఆడుతున్న ప్రాంతం యొక్క ముందే నిర్ధారించబడిన నమూనాను కలిగి ఉంటుంది మరియు ఆట నిబంధనలకు సంబంధించిన డేటా దీంట్లో పొందుపర్చబడి ఉంటుంది.

ప్రతి కెమెరా నుంచి పంపబడిన ఒక్కో ఫ్రేమ్‌లో, బంతి దృశ్యానికి అనురూపంగా ఉండే పిక్సెల్స్ సమూహాన్ని సిస్టమ్ గుర్తిస్తుంది. తర్వాత ఇది కాలానికి సంబంధించి సమాన దూరంలో భౌతికంగా వేరు చేయబడిన కనీసం రెండు కెమెరాలపై దాని స్థానాన్ని సరిపోల్చడం ద్వారా ప్రతి ఫ్రేమ్‌లోను బంతి యొక్క 3D స్థానాన్ని గణిస్తుంది. వరుసగా కదిలే ఫ్రేమ్‌లు బంతి ప్రయాణించిన మార్గాన్ని రికార్డు చేస్తాయి. ఇది బంతి భవిష్యత్ గమన మార్గాన్ని కూడా "అంచనా వేస్తుంది" మరియు ఆడుతున్న ప్రాంతంలో ఏ భాగంలోకి అది వెళ్లుతుందనే వివరాలు అప్పటికే డేటాబేస్‌లోకి ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. ఆట నిబంధనల ఉల్లంఘనలను నిర్ణయించడానికి ఈ సిస్టమ్ పరస్పర సంబంద చర్యలను వ్యాఖ్యానిస్తుంది కూడా.[2]

సిస్టమ్ బంతి మార్గం మరియు ఆడుతున్న ప్రాంతం యొక్క గ్రాఫిక్ చిత్రాన్ని తయారుచేస్తుంది, అంటే ఈ సమాచారం నిర్ణేతలు, టెలివిజన్ వీక్షకులు లేదా శిక్షణా సిబ్బందికి సమీప వాస్తవ సమయంలోనే అందించబడుతుందని దీనర్ధం.

స్వచ్ఛమైన ట్రాకింగ్ సిస్టమ్ ఒక బ్యాకెండ్ డేటాబేస్‌తో మరియు నిల్వచేయబడిన సామర్థ్యాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి విడి ఆటగాళ్లు, ఆటలు, బంతి బంతికి పోలికలు వంటివాటికి సంబంధించిన గణాంకాలు మరియు ధోరణులను ఇది సంగ్రహించి విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది.

హాక్ ఐ ఇన్నోవేషన్స్ లిమిటెడ్[మార్చు]

మొత్తం టెక్నాలజీ, మేధో సంపద వించెస్టర్, హాంప్‌షైర్ కేంద్రంగా పనిచేసే హాక్ ఐ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ అనే పేరున్న మరొక విడి కంపెనీకి బదలాయించబడింది.

2006, జూన్ 14న విజ్‌డన్ గ్రూప్ నేతృత్వంలోని మదుపుదారులు కంపెనీని కొన్నారు [4], వీళ్లు సంపన్న USA కుటుంబ సభ్యుడు మరియు వ్యాపార సామ్రాజ్యానికి చెందిన మార్క్ గెట్టీని కంపెనీలో చేర్చుకున్నారు. క్రికెట్‌లో విజ్‌డెన్ ఉనికిని బలోపేతం చేయడం, టెన్నిస్ మరియు ఇతర అంతర్జాతీయ క్రీడల్లోకి సంస్థను ప్రవేశపెట్టడం ఈ కొనుగోలు ఉద్దేశం, హాక్ ఐ బాస్కెట్‌బాల్ కోసం ఒక సిస్టమ్‌ రూపొందించడంపై పనిచేస్తోంది. హాక్ ఐ వెబ్‌సైట్ ప్రకారం, టెలివిజన్‌పై కనిపించే దాని కంటే ఎక్కువ డేటాను సిస్టమ్ రూపొందిస్తుంది, దీన్ని ఇంటర్నెట్‌లో సులభంగా చూపించవచ్చు.

2010 సెప్టెంబర్‌లో అమ్మకానికి పెట్టిన ఈ సంస్థను జపనీస్ ఎలెక్ట్రానిక్ దిగ్గజం సోనీ 2011 మార్చ్‌లో కొనేసింది.[3]

క్రికెట్[మార్చు]

ఈ టెక్నాలజీని 2001 మే 21న లార్డ్స్ క్రికెట్ మైదానంలో, ఇంగ్లండ్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఛానెల్ 4 మొదటిసారిగా ఉపయోగించింది. వేగంగా దూసుకొస్తున్న బంతుల గమన దిశను పట్టుకోవడానికి అనేక టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఈ టెక్నాలజీని ప్రాధమికంగా ఉపయోగించాయి. 2008/2009 శీతాకాల సీజన్‌లో ICC రెఫరల్ సిస్టమ్‌‌ నమూనాను పరీక్షించింది, దీంట్లో భాగంగా, ఎల్‌బిడబ్ల్యూ నిర్ణయాన్ని జట్టు తోసిపుచ్చినప్పుడు మూడో అంపైర్‌కి నిర్ణయాలను తీసుకోవలసిందిగా ప్రతిపాదించడానికి హాక్ ఐ ఉపయోగించబడింది. బ్యాట్స్‌మన్‌ని బంతి తాకిన తర్వాత అది వాస్తవంగా చేరుకునే పాయింట్‌ని ఈ సిస్టమ్ ద్వారా మూడో అంపైర్ చూడగలడు.[5]

క్రికెట్ ప్రసారాల్లో దీన్ని ప్రధానంగా లెగ్ బిఫోర్ వికెట్ నిర్ణయాలను విశ్లేషించడంలో ఉపయోగిస్తుంటారు, బ్యాట్స్‌మన్ కాళ్లను తాకిన తర్వాత ముందువైపుకు బంతి ఎటు పయనిస్తుంది, బంతి స్టంపులను తాకుతుందా వంటి నిర్ణయాలను ఇది విశ్లేషిస్తుంది. లెగ్ బిపోర్ వికెట్ నిర్ణయాల్లో సాంప్రదాయిక స్లో మోషన్ లేదా హాక్ ఐ కోసం మూడో అంపైర్‌ని చర్చించడాన్ని క్రికెట్‌లో దాని ఖచ్చితత్వంపై ఇప్పటికీ సందేహాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడు అనుమతిస్తున్నారు.[6]

బౌలింగ్ వేగాన్ని వాస్తవంగా కవర్ చేసే దీని సామర్థ్యం కారణంగా, లైన్ అండ్ లెంగ్త్ లేదా స్వింగ్/టర్న్ సమాచారం వంటి బౌలర్ల బౌలింగ్ యొక్క డెలివరీ క్రమాలను చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒవర్ చివరలో, మొత్తం ఆరు డెలివరీలను ఈ సిస్టమ్ ఏకకాలంలో చూపుతుంది, స్లోయర్ డెలివరీలు, బౌన్సర్లు, లెగ్ కట్టర్లు వంటి బౌలర్ల వైవిధ్యాలను ఇది చూపిస్తుంది. మ్యాచ్ క్రమంలో బౌలర్ పూర్తి రికార్డును కూడా ఇది చూపిస్తుంది.

హాక్ ఐ విశ్లేషణ ద్వారా బ్యాట్స్‌మన్లు కూడా ప్రయోజనం పొందుతారు, ఎందుకంటే బ్యాట్స్‌మెన్ స్కోర్ చేసిన డెలివరీలను కూడా ఇది రికార్డు చేస్తుంది. ఇవి తరచుగా బ్యాట్స్‌మెన్ యొక్క 2-D ఛాయాచిత్రాన్ని, బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్న బంతులకు సంబంధించిన రంగుతో చూపించే డాట్లను చూపుతుంటాయి. బంతి పిచ్‌పై సరిగ్గా ఎక్కడ పడుతుంది లేదా బౌలర్ చేతినుంచి బంతి ఎంత వేగంతో వెళుతుంది (బ్యాట్స్‌మన్ స్పందించే సమయాన్ని కొలవడానికి) వంటి అంశాలపై సమాచారం మ్యాచ్ అనంతర విశ్లేషణలో సాయపడుతుంది.

టెన్నిస్[మార్చు]

2004 US ఓపెన్‌ క్వార్టర్ ఫైనల్స్‌లో జెన్నిఫర్ కాప్రియాటిచేతిలో సెరెనా విలియమ్స్ ఓడిపోయినప్పుడు, విలియమ్స్ ద్వారా అనేక ముఖ్యమైన కాల్స్ సవాలు చేయబడ్డాయి. టీవీ రీప్లేస్‌లో కొన్ని నిజంగానే లోపంతో కూడి ఉన్నాయని తేలింది. కాల్స్ తమకు తాముగా ఉపసంహరించబడనప్పటికీ, ఛైర్ అంపైర్ మారియానా అల్వెస్ టోర్నమెంట్ నుంచి మరియు తదనంతర US ఓపెన్స్ నుంచి కూడా తొలగించబడ్డాడు. ఆ సమయంలో U.S. ఓపెన్ ద్వారా ఆటో-రెఫ్ సిస్టమ్ పరీక్షించబడి దాని ఖచ్చితత్వం ప్రదర్శించబడినందున ఈ లోపాలకు సంబంధించినంతవరకు లైన కాలింగ్ సహాయం గురించి చర్చలు జరిగాయి.[7]

2005 చివరలో హాక్ ఐని న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ITF) పరీక్షించింది, దీన్ని వృత్తిపరమైన ఉపయోగం కోసం ఆమోదించింది. న్యూయార్క్ పరీక్షలు ITF హై స్పీడ్ కెమెరా కొలిచిన 80 షాట్లతో కూడి ఉన్నాయని, ఇది MacCAM పరికరంతో సరిపోలి ఉందని హాక్ ఐ నివేదించింది. ఆస్ట్రేలియాలో టెన్నిస్ టోర్నమెంట్ ప్రదర్శన సమయంలో అంతకు ముందు సిస్టమ్‌ను పరీక్షించినప్పుడు, (స్థానిక టీవీలో చూడబడింది) టెన్నిస్ బంతి "అవుట్" అని చూపించిన సందర్భంలో అది "ఇన్" అని చెప్పబడిన పదం చోటుచేసుకున్న సందర్భం కూడా ఉన్నాయి. [citation needed] టెన్నిస్ బంతి దీర్ఘవృత్తంలో కాకుండా గ్రాఫికల్ డిస్‌ప్లేలో వృత్తంలా ప్రదర్శించబడిందని చెప్పిన రీతిలో లోపముందని వివరించబడింది. [citation needed] దీన్ని తక్షణమే సరిచేశారు.

హాక్ ఐని వింబుల్డన్, క్లీన్స్ లోని స్టెల్లా అర్టోయిస్, ఆస్ట్రేలియన్ ఓపెన్, డేవిస్ కప్ టెన్నిస్ మాస్టర్ కప్ వంటి కీలకమైన టెన్నిస్ టోర్నమెంట్లలో టెలివిజన్ కవరేజీలలో ఉపయోగించారు. US ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ తాను 2006 US ఓపెన్ కోసం ఈ టెక్నాలజీని అధికారికంగా ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. దీంట్లో ప్రతి ప్లేయర్ కూడా ఒక్కో సెట్‌కి రెండుసార్లు సవాలు చేయవచ్చు.[8] దీన్ని IBM అమలు చేసిన PointTracker అనే అతి పెద్ద టెన్నిస్ సిమ్యులేషన్‌లో భాగంగా ఉపయోగించబడింది.

పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగిన 2006 హోప్‌మన్ కప్, పాయింట్ ఎండింగ్ లైన్ కాల్స్‌ని సవాలు చేయడానికి ప్లేయర్లకు అనుమతించిన మొట్టమొదటి ఎలైట్ లెవస్ టెన్నిస్ టోర్నీగా పేరుకెక్కింది. అప్పట్లో దీన్ని హాక్ ఐ టెక్నాలజీని ఉపయోగించి రిఫరీలు సమీక్షించేవారు. ఇది బాల్ స్థానం గురించి సమాచారాన్ని కంప్యూటర్లకు అందించడానకి పది కెమెరాలు ఉపయోగించింది.

2006 మార్చ్ నెలలో నాస్‌డాక్-100 ఓపెన్, హాక్ ఐ అధికారికంగా ఒక టెన్నిస్ టూర్ ఈవెంట్‌లో మొదటిసారిగా ఉపయోగించబడింది. ఆ సంవత్సరం చివరలో, US ఓపెన్ ఆట ఆడుతున్నప్పుడు సిస్టమ్‌ను ఉపయోగించిన తొలి గ్రాండ్ స్లామ్ ఈవెంట్‌గా చరిత్రకెక్కింది, దీంట్లోనే ఆటగాళ్లు లైన్ కాల్స్‌ని సవాల్ చేయడానికి అనుమతించబడింది.

2007లో లైన్ కాల్స్‌ని సవాలు చేసిన సందర్భంలో హాక్ ఐని అమలు చేసిన మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ ఈవెంట్‌గా 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్ర కెక్కింది. దీంట్లో రాడ్ లీవర్ ఎరీనాలోని ప్రతి టెన్నిస్ ప్లేయర్ కూడా ఒక సెట్‌లో రెడు తప్పులను సవాల్ చేయడానికి అనుమతించబడ్డారు. మరొక అదనపు సవాలు చేస్తే టైబ్రేకర్‌ని ఆడవలసి ఉంటుంది. అడ్వాంటేజ్ పైనల్ సెట్‌కి చెందిన ఒక ఈవెంట్‌లో, ప్రతి 12 గేమ్‌లలో ఒక్కో ఆటగాడు రెండు సెట్లలో సవాలు చేయడానికి అనుమతించారు అంటే సిక్స్ ఆల్ ట్వల్వ్ ఆల్ అన్నమాట. కొన్ని సార్లు హాక్ ఐ తప్పు అవుట్‌పుట్‌ని ఇవ్వడంతో వివాదాలు నెలకొన్నాయి. 2008లో, టెన్నిస్‌ క్రీడాకారులు ఒక సెట్లో 3 తప్పు సవాళ్లు చేయడానికి అనుమతించబడ్డారు. ఏదైనా మిగిలిపోయిన సవాలును తదుపరి సెట్లో ఉపయోగించడానికి వీలులేదు. ఒకసారి, అమేలీ మౌరెస్మో ఆడిన ఒక మ్యాచ్‌లో, బంతి లైను లోపలే పడిందని రిఫరీ చెప్పన నిర్ణయాన్ని సవాలు చేసింది. కాని హాక్ ఐ మాత్రం బంతి మిల్లీమీటర్ కంటే తక్కువ పరిమాణంలో లైన్ అవతల పడిందని చూపించింది. కాని తీర్పు మాత్రం లైన్ లవోలే పడిందని వచ్చింది. ఫలితంగా పాయింట్‌ని తిరిగి ఆడగా మౌరెస్మో తప్పు సవాలును కోల్పోలేదు.

Ball compared with impact.
ప్రభావంతో పోల్చబడిన బంతి

2007 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో హాక్ ఐ టెక్నాలజీని వాడిగా కొన్ని చిన్న వివాదాలు చెలరేగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ లైన్ బయట బంతి పడిందని హాక్ ఐ సిస్టమ్ తప్పుగా చెప్పడంతో గేమ్ నుంచి నిష్క్రమించవలసి వచ్చినందుకు సిస్టమ్‌ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంపైర్ బంతిని అవుట్ అని చెప్పాడు, కాని మిఖాయిన్ యూజినీ ఈ నిర్ణయాన్ని సవాలు చేయడంతో హాక్ ఐ 3 మిల్లీమీటర్ల తేడాతే బంతి లోపలే పడిందని చూపించింది.[9] బంతి పడిన చోటు వైడ్‌గా ఉండొచ్చని తాను కూడా భావించాను కాని ఇలాంటి టెక్నాలజీ లోపాన్ని లైన్‌మెన్, అంపైర్లు కూడా సులభంగా చేయగలరని తర్వాత యూజినీ చెప్పాడు. నాదల్ నిరాశ చెందాడు, ఈ సిస్టమ్ క్లే గ్రౌండ్‌పై ఉన్నట్లయితే బంతి పడిన చోటును హాక్ ఐ తప్పనిసరిగా తప్పుగా చూపించేదని చెప్పాడు.[10] హార్డ్ కోర్ట్‌పై పడిన బంతి వదిలిన గుర్తు మొత్తం ప్రాంతానికి చెందిన సబ్ సెట్. కాబట్టి బంతి కోర్టుతో కాంటాక్టులో ఉంది. (మార్క్‌ను రూపొందించడానికి కొంత పరిమాణంలో ఒత్తిడి అవసరమైంది) [citation needed].

2007 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ కూడా సెంటర్ కోర్టు మరియు కోర్ట్ 1లో అధికారిక సహాయకారిగా హాక్ ఐ సిస్టమ్‌ను అమలుచేసింది. ఒక సెట్‌లో మూడు తప్పు నిర్ణయాలను సవాలు చేయడానికి ప్రతి ప్లేయర్‌కి అవకాశం కలిగించారు. సెట్ టైబ్రేకర్ అయినట్లయితే, ప్రతి ప్లేయర్ కూడా అదనపు సవాలును చేయవచ్చు. అదనంగా, ఫైనల్ సెట్ సందర్భంగా, (మహిళల మిక్సెడ్ మ్యాచ్‌లలో మూడో సెట్, పురుషుల మ్యాచుల్లో ఐదో సెట్) టై బ్రేక్ లేనప్పుడు, గేమ్ స్కోర్ 6-6, మరియు తిరిగి 12-12 అయిన సందర్భంలో ప్రతి ప్లేయర్ సవాలు చేసే సంఖ్యను మూడుకు పెంచారు. రోజర్ ఫెదరర్‌పై తన తొలి రౌండ్ మ్యాచ్‌లో టేమురుజ్ గబాష్ విల్లీ సెంటర్ కోర్టులో మొట్టమొదటి హాక్ ఐ ఛాలెంజ్‌ని విసిరాడు. అదనంగా, రాఫెల్ నాదల్‌పై పైనల్లో ఫెదరర్‌తో తలపడిన సందర్భంగా, అవుట్ అని నిర్ణయించిన షాట్‌ని నాదల్ సవాలు చేశాడు. హాక్ ఐ ఆ బంతిని లోపలే పడిందని లైన్‌ని కాస్త స్వల్పంగా తాకిందని చెప్పింది. నిర్ణయం వెనక్కు తీసుకోవడంతో మిగిలిన మ్యాచ్‌లో హాక్ ఐ టెక్నాలజీని అంపైర్ నిలిపివేయవలసిందని ఫెదరర్ అభ్యర్థించాడు (ఇది ఫలించలేదు) [11]

2009 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రోజర్ ఫెదరర్ మరియు టోమస్ బెర్డిక్ మధ్య జరిగిన నాలుగో రౌండ్ పోటీలో అక అవుట్ కాల్‌ని బెర్డిక్ సవాల్ చేశాడు. హాక్ ఐ సిస్టమ్ తను సవాలు చేసినప్పుడు లభ్యం కాలేదు ఎందుకంటే సరిగ్గా ఆ సమయంలో కోర్టులో ఛాయ ఏర్పడింది. దీని ఫలితంగా, ఒరిజనల్ కాల్ అమలయింది.[12]

2009లో ఇవాన్ జుబిసిక్ మరియు ఆండీ ముర్రే మధ్య జరిగిన ఇండియన్ వెల్స్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో, ముర్రే ఒక అవుట్ కాల్‌ని సవాలు చేశాడు. తక్షణ రీప్లే చిత్రాలు ఎలా చూపినప్పటికీ, లైన్ మధ్యలో పడిన బంతి స్పష్టంగా అవుట్ అని హాక్ ఐ సిస్టమ్ సూచించింది. అయితే తర్వాత హాక్ ఐ సిస్టమ్ బంతి తొలి బౌన్స్‌కు బదులుగా, లైన్ మీద ఉన్న రెండో బౌన్స్‌ని తప్పుగా ఎంచుకుందని నిర్ధారించబడింది.[13] మ్యాచ్ ముగిసిన వెంటనే, కాల్ సవాలు చేసినందుకుగాను ముర్రే, జుబిసిక్‌కు క్షమాపణ చెప్పి, బంతి పడిన పాయింట్ అవుటని తెలిపాడు.

హాక్ ఐ సిస్టమ్ మొదట టీవీ బ్రాడ్‌కాస్ట్ కవరేజ్ కోసం రిప్లై సిస్టమ్ లాగా అభివృద్ధి చేయబడింది. అందుకనే అది ప్రారంభంలో బంతి ఇన్ మరియు అవుట్‌లను లైవ్‌లో చూపలేకపోయింది, ఇన్‌స్టంట్ లైన్ కాలింగ్‌ కోసం రూపొందించబడిన ఆటో రిఫరల్ సిస్టమ్ మాత్రమే లైవ్ ఇన్/అవుట్ కాల్స్‌ని అందించగలిగింది. రెండు సిస్టమ్‌లూ రీప్లేలను అందించగలవు.

సిస్టమ్ సగటున 3.6 మి.మీ లోపంతో పనిచేస్తుందని హాక్ ఐ ఇన్నోవేషన్స్ వెబ్‌సైట్[14] తెలిపింది. ప్రామాణిక టెన్నిస్ బంతి వ్యాసము 67మి.మీ, ఇది బంతి వ్యాసానికి 5% లోపంతో కూడి ఉంటుంది. ఇది దాదాపుగా బంతి బొచ్చుకు సరిసమానంగా ఉంటుంది.

నిబంధనల ఏకీకరణ[మార్చు]

2008 మార్చ్ వరకు, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ITF), టెన్నిస్ ప్రొఫెషనల్స్ సమితి (ATP), మహిళా టెన్నిస్ సమాఖ్య (WTA), గ్రాండ్‌స్లామ్ కమిటీ మరియు పలు వ్యక్తిగత టోర్నమెంట్లు హాక్ ఐని ఎలా ఉపయోగించాలి అనే అంశంపై నిబంధనల విషయంలో విభేదిస్తుండేవి. దీనిపై ముఖ్య ఉదాహరణ ఒక సెట్‌కు ప్లేయర్‌కు అనుమతించబడిన సవాళ్ల సంఖ్య, ఇది వివిధ టోర్నమెంట్లలో వేరు వేరుగా అమలయ్యేది.[15] కొన్ని టోర్న మెంట్లు ప్లేయర్లకు గరిష్ట సంఖ్యలో తప్పులను అనుమతించేవి. మ్యాచ్ క్రమంలో అపరిమిత సంఖ్యలో సవాళ్లను ప్లేయర్లకు అనుమతించేవారు.[15] ఇతర టోర్నమెంట్లలో ప్లేయర్లు సెట్‌కి రెండు లేదా మూడు సవాళ్లను మాత్రమే అనుమతించబడేవారు.[15] 2008 మార్చ్ 19న పైన చెప్పిన నిర్వాహక కమిటీలు నిబంధనల విషయంలో ఏకరూప వ్యవస్థను ప్రకటించాయి. ఒక సెట్‌కు మూడు సవాళ్లను మాత్రమే అనుమతించారు, సెట్ టై బ్రేక్ అయిన పక్షంలో అదనంగా మరో సవాలును అనుమతిస్తారు. పురుషుల, మహిళల పర్యటనలో తదుపరి షెడ్యూల్ ఈవెంట్‌ 2008 సోనీ ఎరిక్‌సన్ ఓపెన్ ఈ కొత్త, ప్రామాణీకరించబడిన నిబంధనలను అమలు చేసిన తొలి ఈవెంటుగా నిలిచిపోయింది.[16]

అసోసియేషన్ ఫుట్‌బాల్[మార్చు]

అసోసియేషన్ ఫుట్‌బాల్‌లో హాక్ ఐ‌ని ఉపయోగించాలని ప్రతిపాదించబడింది కాని ఇది ఫుట్‌బాల్ క్రీడలోని ప్రముఖ నిర్వాహక సంస్థల సాధారణ ఆమోదాన్ని పొందలేకపోయింది. ఇంగ్లండ్ గవర్నింగ్ బాడీ ది ఫుట్‌బాల్ అసోసియేషన్ ఈ వ్యవస్థను "FIFA ద్వారా తనిఖీకి సిద్ధం చేసినట్లు" ప్రకటించింది, పరీక్షల తర్వాత గోల్ లైన్ ఘటన ఫలితాలను మ్యాచ్ రిఫరీకి అర సెకను లోపే తెలియజేయాలని సూచించింది (ఆట నియమాలను నిర్దేశించే పాలక సంస్థ IFAB గోల్స్‌ని తక్షణమే అంటే అయిదు సెకనులలోపే సూచించాలని పట్టుపట్టింది).[17]

FIFA ప్రధాన కార్యదర్శి జెరోమ్ వాల్కేక్, సిస్టమ్‌ డెవలపర్లు వంద శాతం విజయాల రేటుపై హామీ ఇచ్చిన పక్షంలో హాక్ ఐ గోల్ లైన్ టెక్నాలజీని అనుమతించడంపై ఆలోచిస్తామని అంగీకరించాడు. పిచ్ వివాదాలను పరిష్కరించడంలో వీడియో టెక్నాలజీని ఉపయోగించడం పట్ల ఫుట్‌బాల్ పాలనాధికార సంస్థ గతంలో వ్యతిరేకతతో ఉండేది. ఫుట్‌బాల్‌లో హాక్ ఐని ప్రవేశపెట్టడాన్ని పరీక్షించడం కొనసాగుతుందని భావించబడుతోంది మరియు ప్రీమియం లీగ్‌లో దీని ట్రయల్ రన్‌ని ప్రవేశపెడతారని ఈ సిస్టమ్‌ను కనుగొన్న డాక్టర్ పాల్ హాకిన్స్ చెప్పారు. "వచ్చే వారం లేదా తర్వాత ఈ విషయంపై FIFAతో మాట్లాడతామని, సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నామని," హాకిన్స్ చెప్పాడు.[18]

స్నూకర్[మార్చు]

ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ 2007లో, BBC ప్లేయర్ అభిప్రాయాలను ప్రత్యేకించి మేటి స్నూకర్ల అభిప్రాయాలను చూపడానికి తన టెలివిజన్ కవరేజ్‌‍లో మొదటిసారిగా హాక్ ఐని ఉపయోగించింది.[19] వాస్తవ షాట్ తప్పుదోవ పట్టినప్పుడు ప్లేయర్లు ఉద్దేశించిన షాట్లను ప్రదర్శించడానికి కూడా ఈ సిస్టమ్ ఉపయోగించబడుతూ వచ్చింది. ఇది ఇప్పుడు ప్రతి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ, ఇతర ప్రముఖ టోర్నమెంట్లలోనూ BBCచే ఉపయోగించబడుతోంది. BBC ఈ సిస్టమ్‌ను క్రమానుగతంగా ఉపయోగిస్తోంది, ఉదాహరణకు 2009లో వెంబ్లేలో జరిగిన మాస్టర్స్ పోటీలో హాక్ ఐని ఫ్రేమ్‌కి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించారు. టెన్నిస్‌తో పోలిస్తే, హాక్ఐని రెఫరీ నిర్ణయాలలో సాయపడేందుకు స్నూకర్‌లో ఎన్నడూ ఉపయోగించలేదు.

గేలిక్ గేమ్స్[మార్చు]

ఐర్లండ్‌లో, గేలిక్ ఫుట్‌బాల్ మరియు హర్లింగ్ -హాకీని పోలిన ఆట-లో హాక్ ఐని ఉపయోగించాలని గేలిక్ అథ్లెటిక్ అసోసియేషన్ భావిస్తోంది. 2011 ఏప్రిల్ 2న డబ్లిన్‌లోని క్రోక్ పార్క్‌లో నమూనా పరీక్షను నిర్వహించారు. డబ్లిన్ మరియు డౌన్‌ మధ్య ఫుట్‌బాల్లో, డబ్లిన్ మరియు కిల్‌కెన్నీ మధ్య హర్లింగ్‌ క్రీడలో డబుల్ హెడర్‌ను ప్రవేశపెట్టారు.[20]

సందేహాలు[మార్చు]

క్రికెట్ మరియు టెన్నిస్‌ వంటి క్రీడలలో ఇది తీసుకు వచ్చిన అభిప్రాయాల కారణంగా హాక్ ఐ ప్రపంచమంతటా క్రీడాభిమానులకు సుపరిచితమైంది. ఈ కొత్త టెక్నాలజీ చాలావరకు ఆమోదించబడినప్పటికీ ఇటీవల దీన్ని కొందరు విమర్శించారు, ప్రత్యేకించి అత్యున్నత స్థానాలలోని వారు దీనిపై విమర్శలు గుప్పించారు[citation needed]. ఆండ్రూ సైమండ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనిల్ కుంబ్లే ఎల్‌బిడబ్ల్యూకి అప్పీల్ చేసినప్పుడు, క్రికెట్‌లో ఆస్ట్రేలియన్ మీడియా దీనిపై ప్రత్యేకించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హాక్ ఐ సూచించినట్లుగా బంతి వికెట్లమీద బౌన్స్ అయింది కాని మానవ నేత్రానికి ఇది పూర్తిగా అవుట్‌ అనిపించింది[21] 2008లో వింబుల్డన్‌ టోర్నీలో నాదల్-ఫెదరర్ మధ్య జరిగిన ఫైనల్లో, ఔట్‌గా కనిపించిన బంతి 1 మిల్లీమీటర్‌గా నమోదయింది, ఇది గరిష్టలోపంగా ప్రకటించిన దూరం పరిధిలోనే ఉండింది.[22] సిస్టమ్ లోపాన్ని 3.6 మిల్లీమీటర్ల వరకు లోపంగా పరిగణించడం చాలా పెద్దదని కొంతమంది వ్యాఖ్యాతలు విమర్శించారు.[23] 3.6 మిల్లీమీటర్ల కొలత అసాధారణంగా కచ్చితమైనదని కొందరు గుర్తించారు, ఈ గరిష్ట లోపం బంతి గమ్యాన్ని పసిగట్టడానికే ఉద్దేశించబడింది. బంతి గమనం బ్యాట్స్‌మన్‌ని తాకలేదనే విషయం అనిశ్చితంగా ఉన్నప్పుడు అంచనా వేయడానికి దీన్ని బ్రాడ్‌కాస్ట్‌లలో ఉపయోగిస్తుంటారు. పిచ్ టర్ఫ్ పరిస్థితులు దాని భవిష్యత్ గమ్యాన్ని ప్రభావితం చేసే ప్రత్యేక సందర్భాల్లో ఇది మరీ వర్తిస్తుంది. ఉదాహరణకు, బంతి మైదానంలో ఎక్కడికి పోతోంది లేదా బ్యాట్స్‌మన్‌ని తాకే ముందు చిన్న గంతు వేసిందా అనే విషయాలను ఇది అంచనావేస్తుంది.[24] ప్రస్తుతం, ఈ సిస్టమ్ టెలివిజన్ ప్రసారాలలో విశ్లేషణల సందర్భంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, అలాంటి సందర్భాలలో దీన్ని అధికారికంగా ఉపయోగించడం లేదు.

2008లో, నిష్పాక్షపాత సమీక్షలు చేసే పత్రికలో[25] వచ్చిన ఒక కథనం ఈ సందేహాలలో చాలావాటిని ప్రస్తావించింది. ఈ కథనం రచయితలు సిస్టమ్ విలువను గుర్తించారు కాని, ఇది బహుశా లోపభూయిష్టంగాగ ఉందని పేర్కొన్నారు, లోపం యొక్క గరిష్టతను కనుగొనడంలో దాని వైఫల్యం ఘటనలకు సంబంధించి మరింత నిర్దిష్టమైన శోధనకు అవకాశమిస్తుందని అభిప్రాయపడ్డారు. నిర్దిష్టత యొక్క సంభావ్య పరిమితులను ప్లేయర్లు, అధికారులు, వ్యాఖ్యాతలు లేదా ప్రేక్షకులు గుర్తించలేరని, వీరు దీన్ని సవాలు చేయదగని సత్యంగా పరిగణిస్తారని ఆ కథనం రచయితలు వాదించారు. ఉదాహరణకు, వంపును నిర్దిష్టంగా గుర్తించడానికి అవసరమైన మూడు ఫ్రేములను (కనీసంగా అయినా) రూపొందించడానికి బాల్ బౌన్స్ అవడం మరియు బ్యాట్స్‌మన్ బంతిని కొట్టడానికి మధ్య ఉన్న సమయాన్ని కనుగొనడంలో, బౌన్సింగ్ తర్వాత క్రికెట్ బంతి గమ్య వంపును అంచనా వేయడంలో హాక్ ఐ బాగా ఘర్షించవచ్చని వీరు వాదించారు. టెన్నిస్‌లో లైన్ నిర్ణయాలను హాక్ ఐ కనుగొనేటప్పుడు బౌన్సింగ్ సమయంలో బంతి రూపు మాసిపోవడం, కోర్టులోని లైన్లు గీయబడిన రీతి తక్కువ నాణ్యతతో ఉండటం వంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తుందని ఈ కథనం వాదించింది. హాక్ ఐ రూపకర్తలు ఈ విమర్శలలో చాలావాటిని ఎదుర్కొన్నారు కాని, ఈ కథన రచయితలు వాటిని ఉపసంహరించుకోలేదు.

కంప్యూటర్ గేమ్స్‌లో ఉపయోగం[మార్చు]

దస్త్రం:BLIC-2005-Hawkeye.jpg
గేమ్‌లో హాక్-ఐ

హాక్ ఐ బ్రాండ్ మరియు సిమ్యులేషన్ని ఉపయోగించడంపై కోడ్‌మాస్టర్స్‌కి లైసెన్స్ ఇచ్చారు. బ్రియన్ లారా ఇంటర్నేషనల్ క్రికెట్ 2005 వీడియో గేమ్‌లో ఉపయోగించడానికి, ఈ ఆటకు మరింత టెలివిజన్ కవరేజ్ వచ్చేలా చేసేందుకు ఈ లైసెన్స్ ఇచ్చారు. అలాగే బ్రియన్ లారా ఇంటర్నేషనల్ క్రికెట్ 2007, యాషెస్ క్రికెట్ 2009 మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ 2010 వంటి ఆటలలో ఉపయోగించడానికి కూడా దీనికి లైసెన్స్ ఇచ్చారు. Xbox 360 యొక్క స్మాష్ కోర్ట్ టెన్నిస్ 3 వెర్షన్‌లో కూడా ఈ సిస్టమ్ యొక్క అదే వెర్షన్‌ను చొప్పించారు అయితే హాక్ ఐ ఫీచర్ ఉపయోగించని సాధారణ బాల్ ఛాలెంజ్‌ ఫీచర్‌ని కలిగి ఉన్నప్పటికీ ఇది PSP వెర్షన్ గేమ్‌లో కనిపించదు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • MacCAM

సూచనలు[మార్చు]

 1. టూ బ్రిటిష్ సైంటిస్ట్స్ కాల్ ఇంటూ క్వశ్చన్ హాక్-ఐ'స్ ఆక్యురసీ - టెన్నిస్ - ESPN. Sports.espn.go.com (2008-06-19). 2010-08-15న పొందబడినది
 2. 2.0 2.1 2.2 వీడియో ప్రాసెసర్ సిస్టమ్స్ ఫర్ బాల్ ట్రాకింగ్ ఇన్ బాల్ గేమ్స్ esp@cenet పేటెంట్ డాక్యుమెంట్, 2001-06-14
 3. 3.0 3.1 "Hawk-Eye ball-tracking firm bought by Sony". BBC News. 7 March, 2011. సంగ్రహించిన తేదీ 2011-03-07. 
 4. "Cricinfo - Hawk-Eye bought by Wisden Group". Content-usa.cricinfo.com. సంగ్రహించిన తేదీ 2009-06-01. 
 5. "About ICC - Rules and Regulations". Icc-cricket.yahoo.com. 2009-01-01. సంగ్రహించిన తేదీ 2009-06-01. 
 6. "Nine admits Hawk-Eye not foolproof » The Roar - Your Sports Opinion". The Roar. 2008-01-24. సంగ్రహించిన తేదీ 2009-06-01. 
 7. కెన్ కెమెరాస్ అండ్ సాఫ్ట్‌వేర్ రీప్లేస్ రిఫరీస్? - పాపులర్ మెకానిక్స్. PopularMechanics.com (2010-05-12). 2010-09-03న పొందబడింది.
 8. [1][dead link]
 9. 12:00PM Friday Mar 02, 2007 By Barry Wood (2007-03-02). "Tennis: Nadal blames line calling system for losing - 02 Mar 2007 - nzherald: Sports news - New Zealand and International Sport news and results". nzherald. సంగ్రహించిన తేదీ 2009-06-01. 
 10. "Gulfnews: Hawk-Eye leaves Nadal and Federer at wits' end". Archive.gulfnews.com. 2007-03-03. సంగ్రహించిన తేదీ 2009-06-01. 
 11. Pavia, Will (2007-07-10). "HawkEye creator defends his system after Federers volley". The Times (London). సంగ్రహించిన తేదీ 2010-05-04. 
 12. "Berdych joins Federer in anti-Hawk-Eye club". 2009-01-27. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 13. హాక్-ఐ వెబ్‌సైట్
 14. http://www.hawkeyeinnovations.co.uk/?page_id=1011
 15. 15.0 15.1 15.2 Newman, Paul (2007-06-23). "Hawk-Eye makes history thanks to rare British success story at Wimbledon". The Independent. సంగ్రహించిన తేదీ 2010-12-03. 
 16. "Hawk-Eye challenge rules unified". BBC News. 2008-03-19. సంగ్రహించిన తేదీ 2008-08-22. 
 17. ఉపయోగాలు ఫుట్‌బాల్ (సాకర్)లో: TimesOnline వెబ్‌సైట్.
 18. GOAL.com, fifa-open-to-hawk-eye-goal-line-technology మార్చ్ 14, 2011.
 19. "Press Office - BBC Sport to feature Hawk-eye in World Snooker Championship coverage". BBC. సంగ్రహించిన తేదీ 2009-06-01. 
 20. ఉపయోగాలు గేలిక్ ఫుట్‌బాల్ మరియు హర్లింగ్. ది ఐరిష్ టైమ్స్.
 21. ఆస్ట్రేలియన్ మీడియాకి చెందిన కొన్ని సెక్షన్లు, ఆండ్రూ సైమండ్స్‌పై అనిల్ కుంబ్లే ప్రతిపాదించగా అంపైర్ స్టీవ్ బక్నర్ తిరస్కరించిన ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్‌పై హాక్-ఐ విశ్లేషణ తప్పు పట్టాయి. (PDF) 2010-08-15న పొందబడినది
 22. IEEE స్పెక్ట్రమ్: హాక్-ఐ ఇన్ ది క్రాస్‌హైర్స్ అట్ వింబుల్డన్ ఎగైన్. Spectrum.ieee.org. 2010-08-15న పొందబడినది
 23. పెద్ద చర్చ: రోజర్ ఫెదరర్ హాక్-ఐని విమర్శించడం సరైందేనా? స్పోర్ట్ ది గార్డియన్. 2010-08-15న పొందబడినది
 24. హాక్-ఐ క్రికెట్ సిస్టమ్. Topendsports.com (2001-04-21). 20010-08-15న పొందబడినది
 25. కాలిన్స్, H. అండ్ ఇవాన్స్, R. 2008. "యు కెనాట్ బి సీరియస్! హాక్ ఐతో ప్రత్యేక సంబంధమున్న టెక్నాలజీపై ప్రజల అవగాహన'". సైన్స్ పట్ల ప్రజల అవగాహన 17:3

బాహ్య లింకులు[మార్చు]

మూస:Cricket equipment మూస:Tennis box

"http://te.wikipedia.org/w/index.php?title=హాక్_ఐ&oldid=1220628" నుండి వెలికితీశారు