హాలోవీన్

వికీపీడియా నుండి

మూస:Otheruses1

Halloween
Halloween
Jack-o'-lantern
ఇలా కూడా అంటారు All Hallows’ Eve
All Saints’ Eve
జరుపుకునే వాళ్ళు Numerous Western countries (see article)
రకం Secular with roots in Christianity and paganism
తేదీ October 31
సంబరాలు Varies by region but includes trick-or-treating, wearing costumes, ghost tours, apple bobbing, costume parties, carving jack-o'-lanterns
సంబంధం Samhain, All Saints’ Day


హాలోవీన్ (Hallowe'en గా కూడా వ్రాస్తారు) అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం.


సాంహైన్ అనే సెల్టిక్ పండుగ మరియు క్రైస్తవ పవిత్ర దినం ఆల్ సెయింట్స్ డే‌లలో దీనికి మూలాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా మతాతీతమైన వేడుకగా జరుపుకుంటున్నప్పటికీ, కొందరు దీనికి మత గర్భితార్థాలను కూడా జోడించారు.[1][2][3] 1846 తీవ్ర కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వెళ్లిన ఐర్లాండ్ వలసదారులుసంప్రదాయాన్ని అక్కడకు తీసుకెళ్లారు.[4]


నారింజ, నలుపు వర్ణాలు, జాక్-ఒ-లాంతర్ (గుమ్మడికాయ లేదా దాని ఆకారంలో తయారు చేసిన లాంతరు) వంటి గుర్తులతో ఈ రోజుకున్న అనుబంధం విడదీయరానిది. రాత్రిపూట ఇంటింటికి వెళ్లి మిఠాయిలు తీసుకోవడం, వికృత వేషధారణ, దయ్యపు యాత్రలు, భోగి మంటలు, విచిత్ర వేషధారణ వేడుకలు, భయానక ప్రదర్శన కేంద్రాలను సందర్శించడం, జాక్-ఒ-లాంతర్‌ల తయారీ, ప్రజల వద్ద జిత్తులు ప్రదర్శించడం, భయపెట్టే కథలు చదవడం, భయానక చలనచిత్రాలు చూడటం మొదలైనవన్నీ హాలోవీన్ కార్యక్రమాల్లో భాగమే.


విషయ సూచిక

[మార్చు] చరిత్ర

డేనియల్ మాక్లిస్ రూపొందించిన స్నాప్ప్-ఆపిల్ నైట్ ఐర్లాండ్, బ్లార్నేలో 1832లో జరిగిన ఒక హాలోవీన్ వేడుకను చూపిస్తుంది. ఆపిల్ పండ్ల కోసం చిన్న పిల్లల అల్లరిస్నాప్-ఆపిల్ వేడుకలో భాగంగా తాడుతో వేలాడదీసిన ఆపిల్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఒక జంట.వేడుకలో భవిష్యవాణి ఆటలు ఆడుతున్న జంటలు.ఈరోజుకు కూడా ఐర్లాండ్ హాలోవీన్ వేడుకల్లో ఈ ఆటలు కనిపిస్తుంటాయి.


పురాతన [[కెల్ట్‌లు (రోమన్ పాలనకు ముందు బ్రిటన్, స్పెయిన్, గాల్ ప్రాంతాలను ఆక్రమించిన యూరోపియన్ పౌరులను కెల్ట్‌లు అంటారు)|సెల్టిక్]] సంస్కృతిలో భాగమైన సాంహైన్ [sow- wenగా పిలుస్తారు] (మూస:IPA-ga; ఇది ప్రాచీన ఐరిష్ సంస్కృతి నుండి వచ్చింది samhain, possibly derived from Gaulish samonios) పండుగలో హాలోవీన్ మూలాలు ఉన్నాయి.[5] గెలిక్ సంస్కృతిలో పంటకోతల కాలం ముగింపు సందర్భంగా సాంహైన్ పండుగ జరుపుకుంటారు, కొన్నిసార్లు[6] "సెల్టిక్ కొత్త సంవత్సరం"గా కూడా ఈ వేడుక పరిగణించబడింది.[7] సంప్రదాయబద్ధంగా, శీతాకాల గిడ్డంగుల కోసం ఆహారాన్ని నిల్వచేసేందుకు, పశువుల వధకు ఈ పండుగ సమయం సరైనదని సెల్టిక్ బహుదేవతారాధకులు భావించేవారు. ఇప్పుడు హాలోవీన్‌గా తెలిసిన అక్టోబరు 31వ తేదీన, జీవించివున్నవారికి మరియు మరణించినవారికి మధ్య సరిహద్దు తొలిగించబడుతుందని పురాతన సెల్ట్‌లు విశ్వసించేవారు, మరణించినవారు ప్రమాదకరంగా పరిణమించి రోగాలతో లేదా పంటలు నాశనం చేయడం ద్వారా బతికున్నవారికి సమస్యలు తెచ్చిపెడతారని నమ్మేవారు. ఈ పండుగలు తరచుగా భోగిమంటలతో జరుగుతుంటాయి, ఈ మంటల్లో వధించిన పశువుల ఎముకలను కాల్చుతారు. చెడు ఆత్మలను అనుకరించేందుకు లేదా వాటిని ప్రసన్నం చేసుకునేందుకు హాలోవీన్ సందర్భంగా ధరించే దుస్తులు మరియు ముసుగులు కూడా సెల్టిక్ సంప్రదాయాలకు చెందినవే, ఉదాహరణకు స్కాట్లాండ్‌లో యువకులు మరణించినవారి వలె ముసుగులు ధరించి లేదా నలుపు రంగు పూసుకున్న ముఖాలతో, తెల్లటి దుస్తులు ధరించి పండుగలో పాల్గొంటారు.[8][9]


[మార్చు] పేరుకు మూలం

మొదట Hallowe’en గా కూడా వ్రాసే హాలోవీన్ అనే పదాన్ని ఆల్ హాలోస్' ఈవెన్ ("ఆల్ హాలోస్' ఈవ్") [ వ్ అనేది ఈవెన్ యొక్క సంక్షిప్తీకరణ, ఈవినింగ్‌ కు ఇది పురాతన పదం. even స్థానంలో e'en ను ఇమడ్చడంతో Halloween పదానికి -een చేరింది], పురాతన ఆంగ్ల పదం eallra hālgena ǣfen అర్థం "ఆల్ హాలో ఈవెనింగ్" నుంచి క్లుప్తీకరించబడింది, "ఆల్ హాలోస్ డే" పండుగను[10] ఇప్పుడు ఆల్ సెయింట్స్' డేగా కూడా పిలుస్తున్నారు. మే- 13న జరిగే ఆల్ సెయింట్స్ డే యొక్క పురాతన క్రైస్తవ విందును గ్రెగోరి III, గ్రెగోరి IV పోప్‌లు నవంబరు 1కి (ఈ రోజు లెమురెస్ విందుగా పిలువబడే ఒక అన్యమత సెలవుదినం) మార్చే వరకు ఉత్తర ఐరోపాకు చెందిన వివిధ అన్యమత సాంప్రదాయాల్లో,[11] హాలోవీన్ సందర్భంగా మతపరమైన వేడుకలు జరిగేవి. 9వ శతాబ్దంలో, ఫ్లోరెంటైన్ క్యాలెండర్‌కు అనుగుణంగా సూర్యాస్తమయం వద్ద ప్రారంభమయ్యే రోజుగా చర్చి దీనిని పరిగణించింది. ఆల్ సెయింట్స్ డే ఇప్పుడు హాలోవీన్ తరువాతి రోజున వస్తుందని పరిగణిస్తున్నప్పటికీ, ఈ సమయంలో రెండు సెలవు దినాలు ఉండటంతో, ఒకే రోజు రెండింటిని జరుపుకుంటున్నారు.

[మార్చు] చిహ్నాలు

20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఐర్లాండ్‌లోని కౌంట్రీ లైఫ్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న సంప్రదాయ ఐరిష్ హాలోవీన్ జాక్-ఒ-లాంతరు.


ఆల్ హాలోస్ పండుగ రోజున పురాతన కెల్ట్‌లు చనిపోయినవారికి సంకేతంగా కిటికీ వద్ద అస్థిపంజరం ఏర్పాటు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా ఉపయోగించే లాంతర్లను మొదట తెల్లటి వోక దుంపలు లేదా రుటబాగా అనే దుంపలతో తయారు చేసేవారు, ఈ సంప్రదాయం యూరప్‌లో మొదలైంది. శరీరంలో తల భాగాన్ని అత్యంత శక్తివంతమైనదిగా, ఆత్మ మరియు విజ్ఞానం ఇక్కడే ఉంటాయని భావించే కెల్ట్‌లు కూరగాయలతో చేసిన "తల" భాగాన్ని అతీంద్రియ శక్తులను భయపెట్టేందుకు ఉపయోగించేవారు.[12] వెల్ష్, ఐరిష్, బ్రిటీష్ పురాణ గాథలు పూర్తిగా ఇత్తడి తలలున్న ప్రసిద్థ వ్యక్తులతో నిండివుంటాయి, ఇవి పురాతన, ప్రసిద్ధ సెల్టిక్ తలవేట సంప్రదాయానికి సంబంధించిన జానపద జ్ఞాపకాలలోనూ ఉన్నాయి- దీని ఫలితంగా తలుపు అడ్డదూలానికి మేకుల కొట్టి కీర్తిగాంచిన వ్యక్తుల ఇత్తడి తలలను ఉంచడం లేదా వారి గొప్పతనం గురించి మాట్లాడుకునేందుకు వీటిని పండుగ రోజున మంటల వద్దకు తీసుకొచ్చే సంప్రదాయం మొదలైంది. అత్యాశ, జూదం, తాగుడు తదితర అవలక్షణాలున్న పేరుమోసిన స్టింజీ జాక్,[13] అనే ముసలి రైతుకు గుర్తుగా జాక్-ఒ-లాంతర్ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అతను జిత్తులతో దయ్యంను చెట్టు ఎక్కించి, ఆ చెట్టును సిలువ ఆకారంగా మలిచి బంధించాడు. దీనికి ప్రతీకారంగా అతని వద్ద ఉన్న ఒక్క దీపంతోనే ఎప్పటికీ రాత్రిపూట భూమిపై సంచరించమని దయ్యం జాక్‌కు శాపం ఇచ్చింది: జాక్ వద్ద ఆ సమయంలో తెల్లని వోక దుంపలో కొవ్వొత్తి ఉంచిన లాంతరు మాత్రమే ఉంది. దక్షిణ అమెరికాలో వోక దుంపలతో కంటే సులభంగా చెక్కడానికి పుష్కలంగా మరియు పెద్ద పరిమాణాల్లో ఉండే గుమ్మిడికాయలు లభించడం వలన హాలోవీన్ సందర్భంగా గుమ్మిడికాయల లాంతర్లను ఎక్కువగా తయారు చేస్తారు.[14] హాలోవీన్ జరుపుకునే అనేక కుటుంబాలు గుమ్మడికాయతో భయపెట్టే లేదా నవ్వుతెప్పించే తలలుగా తయారు చేసిన లాంతర్లను చీకటిపడిన తరువాత గుమ్మాల వద్ద ఉంచుతాయి. అమెరికాలో గుమ్మడికాయలను మలిచే సంప్రదాయం తీవ్ర కరువు కారణంగా వలసవచ్చిన ఐర్లాండ్ పౌరులతో మొదలైంది[15][16][17][18][19], ఇక్కడ ఈ సంప్రదాయం 19వ శతాబ్దం మధ్యకాలం వరకు హాలోవీన్ కంటే పంటకోతల సమయానికి సూచనగా ఉండేది.[20][21][22]


హాలోవీన్ రుతువు సమ్మేళనం, గోథిక్ కల్పనలు, భయానక సాహిత్యం, ఫ్రాంకెన్‌స్టెయిన్‌కు సంబంధించిన కొన్ని నవలలు, డ్రాకులా, అమెరికా చలనచిత్ర నిర్మాతలు సుమారు శతాబ్దంపాటు జరిపిన కృషి, గ్రాఫిక్ నిపుణులు,[23] బ్రిటీష్ హమ్మర్ హార్రర్ ఉత్పాదనల్లో, చీకటి మరియు మర్మమైన అంశాల్లో హాలోవీన్ చుట్టూ జరిగిన చిత్రీకరణలను ఎక్కువగా చూడవచ్చు. హాలోవీన్ చిత్రీకరణలు మరణం, చెడు, క్షుద్ర, మంత్రవిద్య లేదా పౌరాణిక ప్రేతాత్మలతో ముడిపడి ఉంటాయి. దీనికి సంబంధించిన సంప్రదాయ పాత్రల్లో దయ్యం, పెద్ద కొడవలి ధరించివున్న అస్థిపంజరం, దయ్యాలు, పిశాచాలు, భూతాలు, మంత్రగత్తెలు, గుమ్మడికాయ- మనిషి, చిన్న దయ్యాలు, రక్త పిశాచాలు, తోడేలుగా రూపాంతరం చెందగల రాక్షసులు, గ్రహాంతరవాసులు, మృతజీవులు, మమ్మీలు, సముద్రపు దొంగలు, అస్థిపంజరాలు, నల్ల పిల్లులు, సాలీడులు, గబ్బిలాలు, గుడ్లగూబలు, కాకులు, రాబందులు ఉంటాయి.[24]


ముఖ్యంగా అమెరికాలో, పాత భయానక చలనచిత్రాల (ఉదాహరణకు ఫ్రాంకెన్‌స్టెయిన్ సృష్టించిన పిశాచి మరియు మమ్మీ వంటి కాల్పనిక పాత్రలు) నుంచి కూడా హాలోవీన్ ప్రతిమలు స్ఫూర్తి పొందాయి. గుమ్మడికాయలు, మొక్కజొన్న ఊకలు, దిష్టిబొమ్మల వంటి శరదృతువు (పండ్ల కాలము లేదా ఆకురాలే కాలం)కు సంబంధించిన అంశాలు కూడా చలామణిలో ఉన్నాయి. హాలోవీన్‌కు సంబంధించిన ఈ గుర్తులతో ఇళ్లను తరచుగా ముస్తాబు చేస్తుంటాయి.


నారింజ, నలుపు హాలోవీన్‌తో అనుబంధం ఉన్న రెండు ప్రధాన వర్ణాలు.[25]


[మార్చు] ట్రిక్-ఆర్-ట్రీటింగ్ మరియు వేషధారణ

ప్రధాన వ్యాసం: Trick-or-treating
దస్త్రం:IMG 145w.jpg
ఐర్లాండ్, డుబ్లిన్‌లో విలక్షణమైన హాలోవీన్ దృశ్యం.


ట్రిక్ ఆర్ ట్రీటింగ్ అనేది హాలోవీన్ రోజున బాలలు విచిత్ర వేషధారణతో జరుపుకునే వేడుక. ఈ వేడుకలో విచిత్ర లేదా వికృత వేషధారణలో బాలలు ఇంటింటికి వెళతారు, సదరు ఇంటి యజమానులను "ట్రిక్ ఆర్ ట్రీట్?" అనే ప్రశ్నతో మిఠాయి లేదా కొన్నిసార్లు డబ్బులు కోరతారు. ఇక్కడ "ట్రిక్" అనే పదం, బహుమతి ఇవ్వకపోతే ఇంటి యజమానులపై లేదా వారి ఆస్తులపై ఆకతాయితనాన్ని ప్రదర్శిస్తామని బెదిరింపును తెలుపుతుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్‌లలోని కొన్ని ప్రదేశాల్లో పిల్లలు ఇప్పటికీ విచిత్ర వేషధారణలో తమ ప్రయోజనాల కోసం యజమానులకు కాలక్షేపాన్ని అందించే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ దుస్తుల్లో పిల్లలు వారు ఆశించిన ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు పాట పాడటం లేదా దయ్యం కథ చెప్పడం వంటి ప్రదర్శనలు ఇస్తారు.


[మార్చు] దుస్తులు

ప్రధాన వ్యాసం: Halloween costume

హాలోవీన్ సందర్భంగా దయ్యాలు, అస్థిపంజరాలు, మంత్రగత్తెలు మరియు భూతాల రూపంలో ఉండే దుస్తులు ధరించడం సంప్రదాయంగా వస్తోంది. వీటిని భూతాలను భయపెట్టేందుకు ఉపయోగిస్తుంటారని చెబుతారు. సంప్రదాయ భయానక రూపాలతోపాటు, టెలివిజన్ కార్యక్రమాలు, చలనచిత్రాలు, ఇతర పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన రూపాలతోనూ దస్తులు తయారు చేస్తుంటారు.


[మార్చు] దుస్తుల అమ్మకాలు

అమెరికాలో నేషనల్ రీటైల్ ఫెడరేషన్ కోసం BIGresearch సర్వే నిర్వహించింది, 2005 హాలోవీన్ సందర్భంగా 53.3% వినియోగదారులు దుస్తులు కొనేందుకు ఆసక్తి చూపినట్లు, ఈ దుస్తుల కొనుగోలుకు సగటున $38.11 ఖర్చు చేస్తున్నట్లు గుర్తించారు (ఏడాది క్రితంతో పోలిస్తే ఈ సగటు $10 పెరిగింది). అంతేకాకుండా 2006లో ఈ దుస్తులపై $4.96 బిలియన్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. దీనికి ముందు ఏడాది ఈ దుస్తుల వ్యాపార విలువ $3.3 బిలియన్ల వద్దే ఉంది.[26]


[మార్చు] UNICEF

ప్రధాన వ్యాసం: Trick-or-Treat for UNICEF

ఉత్తర అమెరికాలో "UNICEFకు ట్రిక్ ఆర్ ట్రీట్‌" విరాళాల సేకరణకు ఉపయోగపడుతుంది. 1950లో ఫిలడెల్ఫియా శివారుల్లో స్థానిక కార్యక్రమంగా మొదలైన ఈ వేడుక 1952కు దేశవ్యాప్తంగా విస్తరించింది. ట్రిక్ ఆర్ ట్రీట్‌లో పాల్గొనే వారికి పాఠశాలలు చిన్న డబ్బాలను అందజేస్తాయి (ఇప్పటి రోజుల్లో, హాల్‌మార్క్ వంటి కార్పొరేట్ స్పాన్సర్లు వాటి ఆధీకృత కేంద్రాల్లో ఈ డబ్బాలను ఇస్తున్నాయి), వీటితో బాలలు ఇంటింటికి వెళ్లి చిన్నమొత్తంలో విరాళాలు సేకరించవచ్చు. ఈ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి UNICEF కోసం బాలలు $118 మిలియన్ల (US) విరాళాలు సేకరించినట్లు అంచనా. 2006లో, UNICEF ప్రపంచంలోని కొన్ని భాగాల్లో భద్రత, పరిపాలనాపరమైన ఆందోళనల కారణంగా హాలోవీన్ సందర్భంగా విరాళాలు సేకరించడాన్ని విరమించింది.[27]


[మార్చు] ఆటలు మరియు ఇతర కార్యకలాపాలు

మూస:Citations missing

1904 నుంచి ఈ హాలోవీన్ గ్రీటింగ్ కార్డులో భవిష్యవాణిని చిత్రిస్తున్నారు: యుక్తవయస్సులోని మహిళలు చీకటి గదిలో అద్దంలోకి చూస్తూ తన భవిష్యత్ జీవిత భాగస్వామి ముఖాన్ని ఈషద్దర్శనము చేసుకోవాలనుకుంటారు.


సంప్రదాయబద్ధంగా హాలోవీన్ వేడుకలతో ముడిపడి అనేక ఆటలు ఉన్నాయి. వీటిలో సాధారణమైన ఆట ఏమిటంటే డంకింగ్ లేదా ఆపిల్ బాబింగ్, ఆ ఆటలో పాల్గొనేవారు నీళ్లు పోసివున్న ఒక తొట్టి లేదా పెద్ద గిన్నెలో తేలుతున్న ఆపిల్ పండ్లను దంతాలు మాత్రమే ఉపయోగించి బయటకు తీయాలి.[28] మరొక డంకింగ్ ఆటలో కుర్చీపై మోకాళ్లపై నిలబడి, దంతాల మధ్య పళ్శ చెంచాను ఉంచుకొని దానిని ఆపిల్‌కు గ్రుచ్చేందుకు ప్రయత్నించాలి[29]. మరో సాధారణ ఆటలో దారాలతో వ్రేలాడుతున్న బెల్లపు అచ్చుతో చేసిన పదార్ధం లేదా డోనట్స్‌లను చేతులను ఉపయోగించకుండా తినాలి, ఈ ఆటలో తినుబండారాలు తగిలి ముఖం బాగా జిడ్డుగా తయారవుతుంది.


హాలోవీన్ సందర్భంగా ఆడే కొన్ని సంప్రదాయ ఆటలు భవిష్యవాణి రూపాలుగా ఉంటాయి. ఐర్లాండ్‌లో ఆడే Puicíní ("పూచీని" అని పిలుస్తారు) అనే ఆటలో అనేక పళ్ళాలు ఉంచిన బల్లకు ఎదురుగా కండ్లకు గంత కట్టిన వ్యక్తి కూర్చుంటాడు. బల్లపై ఉన్న పళ్ళాలను మార్చిన తరువాత గంత కట్టుకున్న వ్యక్తి ఒక దానిని తాకుతాడు; తాకిన పళ్లానికి సంబంధించిన సమాచారం అతని రాబోయే ఏడాది జీవనం గురించి వివరిస్తుంది. ఐర్లాండ్‌లో 19వ శతాబ్దంలో, యుక్త వయస్సులో ఉన్న మహిళలు పిండి చల్లిన పళ్ళాల్లో మగ తేనటీగలను ఉంచేవారు.[30][31] ఐరిష్ మరియు స్కాట్లాండ్ సంప్రదాయ రూపంలో ఒకరి భవిష్యత్ భాగస్వామిని తెలుసుకునేందుకు ఒక ఆపిల్‌ను తీసుకొని దానినుంచి పొడవైన ఆపిల్ తోలు ముక్కను సేకరించి దానిని భుజం మీదగా పైకెగరవేస్తారు. ఆపిల్ తోలు కిందపడినప్పుడు కనిపించే ఆకారం సంబంధిత మహిళ యొక్క భవిష్యత్తు భాగస్వామి పేరులోని మొదటి అక్షరం అవుతుందని విశ్వసించేవారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఐర్లాండ్, స్కాట్లాండ్ వలసదారులు ఇప్పటికీ ఈ విశ్వాసాన్ని అనుసరిస్తున్నారు.[ఆధారం కోరబడినది]


హాలోవీన్ రాత్రిన చీకటి గదిలో కూర్చుని అద్దంలోకి చూస్తుంటే, వారి భవిష్యత్తు జీవిత భాగస్వామి ముఖం అద్దంలో కనబడుతుందని పెండ్లి కాని మహిళలకు చెప్పేవారు[ఎవరు?]. ఇదిలా ఉంటే, పెళ్లికి ముందే మరణిస్తారని నిర్ణయించి ఉంటే, అటువంటి వారికి అద్దంలో ఒక పుర్రె కనిపిస్తుందని భావించేవారు. 19వ శతాబ్దం చివరి భాగం, 20వ శతాబ్దం ప్రారంభం నుంచి గ్రీటింగ్ కార్డుల సంస్కృతి బాగా విస్తరించింది.


హాలోవీన్ పార్టీల్లో దయ్యం కథలు చెప్పడం, భయపెట్టే సినిమాలు చూడటం సాధారణమయ్యాయి. సెలువుదినం రోజున లేదా ముందురోజు హాలోవీన్ రూపకాలతో సాధారణంగా TV నాటికలు, ప్రత్యేక కార్యక్రమాలు (ప్రధానంగా బాలలను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాలు) ప్రసారం అవుతుంటాయి, ఇదిలా ఉంటే పండుగ వాతావరణాన్ని సద్వినియోగపరుచుకునేందుకు కొత్త భయానక చలనచిత్రాలను కూడా దీనికి ముందురోజు విడుదల చేస్తుంటారు.


[మార్చు] భయానక ప్రదర్శన కేంద్రాలు

ప్రధాన వ్యాసం: Haunted attraction

అభిమానులను భయపెట్టేందుకు మరియు వారికి వింత అనుభూతి కలిగించేందుకు ప్రత్యేక ప్రదర్శన కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ భయానక ప్రదర్శన కేంద్రాలు ఎక్కువగా హాలోవీన్ సందర్భంగానే కొలువుతీరతాయి. డబ్బు చెల్లించి భయపడేందుకు వెళ్లే కేంద్రాలకు మూలాలు కనుగొనడం కష్టం, అయితే ఇటువంటి కేంద్రాలను ముందుగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జైసీస్) నిధుల సేకరణ కోసం ఉపయోగించినట్లు చెబుతారు.[32] భయానక ప్రదర్శన కేంద్రాలు, మొక్కజొన్న చిట్టడవులు, ఎండుగడ్డి వాహనంలో ప్రయాణాలు వీటిలో ఉంటాయి[33], దీనికి సంబంధించిన ఆడంబరాలు పరిశ్రమతోపాటే పెరిగాయి. అమెరికాలో భయపెట్టే ప్రదర్శన కేంద్రాలు ద్వారా ప్రతి ఏటా $300–500 ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు అంచనా, వీటిని 400,000 మంది సందర్శిస్తున్నారు, 2005లో వీటిని ఇంకా ఎక్కువ మంది సందర్శించవచ్చని అంచనాలు చెబుతున్నాయి[32]. ఈ కేంద్రాల సందర్శనకు ఆసక్తి పెరుగుతుండటంతో వీటికి హాలీవుడ్ చలనచిత్రాలు స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పోకడలు, వేషధారణలు తోడయ్యాయి.[34]


[మార్చు] ఆహార పదార్థాలు

ఆపిల్ మిఠాయి

ప్రతి ఏటా ఆపిల్ పంట వచ్చే కాలంలో ఈ పండుగ వస్తుండటంతో, కాండీ ఆపిల్‌లు (ఉత్తర అమెరికా బయట టాఫీ ఆపిల్‌గా తెలుసు), చక్కరపాకం పట్టిన లేదా టఫీ ఆపిల్‌లు సాధారణంగా హాలోవీన్ విందుల్లో కనిపిస్తుంటాయి. ఆపిల్ పండ్లను చక్కర ముదురుపాకంలో ముంచి, కొన్నిసార్లు తరువాత వీటికి గింజలను కూడా జోడించి ఈ మిఠాయిలు తయారు చేస్తారు.


ఒక సమయంలో, ఆపిల్ మిఠాయిలను సాధారణంగా పిల్లలకు ఇచ్చేందుకు తయారు చేసేవారు. అయితే కొంత మంది సూదులు, బ్లేడ్లను ఆపిల్ పండ్లలో ఉంచి వీటిని తయారు చేస్తున్నట్లు పుకార్లు బాగా వ్యాపించడంతో ఈ సంప్రదాయం వేగంగా క్షీణించింది.[35] ఇటువంటి సంఘటనలు జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ,[36] అవి చాలా అరుదుగా జరిగాయి, అంతేకాకుండా ఎన్నడూ తీవ్ర పరిణామాలకు దారితీయలేదు. ఏదేమన్నప్పటికీ, ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇటువంటి దుశ్చర్యలను తీవ్రంగా పరిగణించారు. ఈ భయం తారాస్థాయికి చేరుకున్న సమయంలో, కొన్ని ఆస్పత్రులు హాలోవీన్ వేడుకల్లో పాల్గొనే పిల్లలకు మిఠాయిలపై దుష్ప్రయోగాలు జరిగాయో లేదో తెలుసుకునేందుకు ఉచిత ఎక్స్-రే పరీక్షలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. ఆపిల్ మిఠాయిలపై విషప్రయోగం జరిగిన కొన్ని సంఘటనల్లో తల్లిదండ్రులు వారి సొంత బిడ్డలు తిన్నవాటిలోనే విషం కలిపినట్లు బయటపడింది, కొన్నిసార్లు పిల్లలే వారితోటివారు తినే మిఠాయిల్లో సూదులు పెట్టిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.మూస:Facts


ఐర్లాండ్‌లో ఆధునిక రోజుల్లోనూ పండ్ల రొట్టె తయారుచేసే (ఈ రోజుల్లో తరచుగా వీటిని కొనుగోలు చేస్తున్నారు) సంప్రదాయ పద్ధతి ఒకటి అమల్లో ఉంది (ఐర్లాండ్ బాషలో ఈ పండ్లకేకును "báirín breac" అని పిలుస్తారు), ఈ పద్ధతిలో వండేముందుగానే ఉంగరం, నాణెం లేదా ఇతర ఆకర్షణీయ వస్తువులనుపెట్టి తేలికైన పండ్లకేకును తయారు చేస్తారు. ఇలా చేసిన కేకుల్లో ఉంగరం వచ్చినవారు రాబోయే ఏడాదిలో వారి నిజమైన ప్రేమికులను కలుసుకుంటారని చెప్పేవారు. ఇది ఎఫిఫానీ పండుగ సందర్భంగా పాటించే కింగ్ కేకు సంప్రదాయం మాదిరిగానే ఉంటుంది.


ఈ పండుగకు సంబంధించిన ఇతర ఆహార పదార్థాలు:


[మార్చు] ప్రపంచవ్యాప్తంగా

ప్రధాన వ్యాసం: Halloween around the world


సెల్టిక్ సంస్కృతుల్లో మూలాలు ఉండటంతో, హాలోవీన్ పండుగ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, ప్రాంతాల్లో జరుపుకోవడం లేదు, కొన్ని దేశాలు ఈ సంప్రదాయాలకు మరియు వేడుకల ప్రాముఖ్యతకు బాగా విలువనిస్తున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరిగే వేడుకలు ఇతర దేశాల్లో ఈ పండుగ జరిగే విధానాన్ని బాగా ప్రభావితం చేశాయి.అంతేకాకుండా ప్రస్తుతం ఈ పండుగ జరుగుతున్న విధానం కూడా ఈ దేశంలో హాలోవీన్ సంప్రదాయాల నుంచే ఉద్భవించింది...


[మార్చు] మతపరమైన దృక్కోణాలు

చూడండి: All Saints

ఉత్తర అమెరికాలో, హాలోవీన్‌పట్ల క్రైస్తవుల వైఖరి భిన్నంగా ఉంటుంది. ఆంగ్లికన్ చర్చిలో, కొన్ని బిషప్ ప్రాదేశిక పరిధిల్లో ఈ రోజున ఆల్ సెయింట్స్' డే యొక్క క్రైస్తవ సంప్రదాయాలను పాటించాలని,[37][38] ఇదిలా ఉంటే ప్రొటెస్టంట్‌లు మత సంస్కరణ దినంగా ఈ పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు.[39] అనేక పురాతన సెల్టిక్ పద్ధతులు కొత్త క్రైస్తవ మత సంప్రదాయాలకు భిన్నంగా ఉన్నాయనే విశ్వాసంతో సెల్టిక్ క్రైస్తవ మతస్థులు సాంస్కృతిక సారూప్యత ఉండే సాంహైన్ పండుగ కార్యక్రమాలపై దృష్టి పెట్టేవారు. సెల్టిక్ కుటుంబ భావాలను, వర్గాన్ని, ప్రజలందరి మధ్య బంధాన్ని మరియు మరణించినవారిని గౌరవించడం తదితర అంశాలను క్రైస్తవ మతం స్వీకరించింది. అన్ని శతాబ్దాల్లోనూ, అక్టోబరు 31 నుంచి నవంబరు 5 వరకు జరిగే సంకర (సంకరం) వేడుకల్లో అన్యమత, క్రైస్తవ విశ్వాసాలు ముడిపడివుంటాయి, అన్నింటిలోనూ చీకటి ప్రాబల్యాన్ని సవాలు చేయడం మరియు దాని రహస్యాన్ని చేధించడమనే రెండు ప్రధాన ఉద్దేశాలుగా కనిపిస్తాయి."[40]


అనేక మంది క్రైస్తవులు హాలోవీన్‌కు ఎటువంటి వ్యతిరేకార్థాలను ఆపాదించలేదు, దీనిని పూర్తిగా మిఠాయిలు పంచిపెట్టడం, దయ్యాల వంటి "కాల్పనిక వ్యక్తుల"కు సంబంధించి జరుపుకునే మతాతీమైన పండుగగానే భావించారు. ఉత్తర అమెరికావ్యాప్తంగా, ఐర్లాండ్‌లో రోమన్ కాథలిక్ చర్చి పాఠశాలల్లో సాధారణంగా హాలోవీన్ వేడుకలు జరుగుతున్నాయి. వాస్తవానికి, రోమన్ కాథలిక్ చర్చలు హాలోవీన్‌కు క్రైస్తవ మతంతో సంబంధం ఉన్నట్లు పరిగణిస్తాయి.[41] ఇంగ్లాండ్, అమెరికాలకు చెందిన బాలలు ఏడాదికొకసారి మంత్రగత్తెలు, దయ్యాలు మాదిరిగా వేషాలు ధరించాలనుకుంటే, అది సమస్య కాదని రోమ్‌లోని వాటికన్ చర్చి నియమించిన భూత వైద్యుడు ఫాదర్ గాబ్రియేల్ అమోర్త్ పేర్కొన్నారు. ఇది ఆట మాత్రమే అయితే, అందులో ప్రమాదమేమీ లేదన్నారు."[1] ఈ సంప్రదాయ మూలంలో లేదా ఆచరణలో "పైశాచికత్వం" లేదని, బాలల ఆధ్యాత్మిక జీవనానికి దీని వలన ఎటువంటి ముప్పు లేదనే ఈ అభిప్రాయంతో ఎక్కువ మంది క్రైస్తవులు ఏకీభవించారు: మరణం, మృత్యువు, జీవన మార్గాల గురించి సెల్టిక్ పూర్వీకులు అందించిన విషయాలను విలువైన జీవిత పాఠాలుగా స్వీకరించేందుకు, వారి వారసత్వంలో భాగమయ్యేందుకు ముందుకొచ్చారు.[40] సనాతనవాదులుగా ఉన్న ఇతర క్రైస్తవులు హాలోవీన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ, దానిని తిరస్కరించారు, ఈ పండుగ తాంత్రిక శక్తిని అప్రధానం చేస్తుందని (తాంత్రిక శక్తులకు సంబంధించిన వేడుకగా) భావించేవారు, దీనిని వారు చెడుగా అవగతం చేసుకున్నారు.[2] ఇటీవల సంవత్సరాల్లో కొందరు సనాతనవాదులు నరకకూపాలు లేదా ఇతివృత్త కరపత్రాలను (జాక్ T.చిక్ వంటి వ్యక్తులు) ఉపయోగిస్తూ హాలోవీన్ పండుగను క్రైస్తవ మత ప్రచారానికి అవకాశంగా ఉపయోగిస్తున్నారు.[42] అన్యమత "మృతుల పండుగ"లో మూలాలు ఉన్న కారణంగా హాలోవీన్ పూర్తిగా క్రైస్తవ విశ్వాసాల[43]కు విరుద్ధమని మరికొందరు పరిగణించారు. ఇటీవలి సంవత్సరాల్లో బోస్టన్‌లోని రోమన్ కాథలిక్ ఆర్క్‌బిషప్ (ఉన్నతస్థానంలో ఉన్న క్రైస్తవ మతపెద్ద) ప్రాదేశిక పరిధిలో ఈ పండుగ రోజున "సెయింట్ ఫెస్ట్" నిర్వహించారు.[42] అనేక సమకాలీన ప్రొటెస్టంట్ చర్చిలు హాలోవీన్ పండుగను బాలల వినోద కార్యక్రమంగా పరిగణిస్తున్నాయి, వారి చర్చిల్లో ఈ పండుగ రోజున పిల్లలు, వారి తల్లిదండ్రులు విచిత్ర వేషధారణలతో ఆటలు ఆడటం, మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది.


క్రైస్తవేతర మతాలు కూడా హాలోవీన్‌పై భిన్నాభిప్రాయాలు కలిగివున్నాయి. హాలోవీన్ సంప్రదాయం "చెడ్డ మంత్రగత్తె"ల మూస వ్యంగ్య చిత్రాలు ప్రోత్సహిస్తుండటం నిజమైన మంత్రగత్తెలకు ప్రమాదకరమని కొందరు విక్కా మతస్థులు భావించేవారు.[3]


అది చెప్పాలంటే. హాలోవీన్ మంత్రగత్తె


ప్రతి ఏటా సంప్రదాయంలో భాగంగా... హాలోవీన్ మంత్రగత్తె ఊరేగింపు నిర్వహిస్తారు.


పచ్చని ముఖంతో అసహ్యకరమైన రూపం, పీచులు మాదిరిగా ఉండే జట్టు, వికారమైన ముక్కు కింద దంతాలులేని నోరు. కురూపి లక్షణాలు, గుబురైన గోళ్లతో మెలితిరిగిన వేళ్లు, వంగిపోయిన రూపం, వణుకుతున్న కాళ్లను ఆధారంగా చేసుకొని ఉన్న మెలితిరిగిన శరీరం.


ఎక్కువ మంది దీనిని కేవలం హాలోవీన్ వ్యంగ్య రూపంగానే కాకుండా, దురభిప్రాయ బుద్ధితో సృష్టించిన వికృత రూపంగా భావించారు.


దీనితో నేను విభేదిస్తున్నాను. వాస్తవానికి మంత్రగత్తెలను ఇలాగే చూపించాలని నేను కూడా భావిస్తాను.


ఎక్కువ మంది మంత్రగత్తెలు: మహిళలు, వీరిని రాత్రి సమయంలో అపహరించి, చీకటి ముసుగులో వారిని నేలమాళిగలు లేదా కారాగారాలకు తరలిస్తుంటారు, వారిని పగటిపూట మంత్రగత్తెగా చిత్రీకరిస్తుంటారు.


సాధారణంగా కనిపించే మహిళను చీకటి గదిలోకి లాగుతుండటం చూసి భయపడిన కొద్ది మందిని కూడా హింసలకు గురి చేసేవారు. మోపబడిన ఆరోపణలకు అంగీకరించే వరకు, సంబంధిత పేర్లు బయటపెట్టడం లేదా ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరికే వరకు ఆమెను ప్రశ్నించేవారు. ఆమెను స్వయం ప్రకటిత మంత్రగత్తెగా చిత్రీకరించి, ప్రపంచం ముందుంచిన అసాధారణ నిందను మాత్రమే ప్రజలు చూసేవారు.


మంత్రగత్తెను పట్టణంలో ఊరేగిస్తున్నప్పుడు, ఆమెను మార్గమధ్యంలో కాల్చడం, ఉరితీయడం, నీటిలో ముంచడం, ఆమెపై రాళ్లు విసరడం లేదా చెడిపోయిన శరీరం నుంచి ఆత్మను విడిపించేందుకు మరియు రక్షించేందుకు సృష్టించబడిన... ఇతర క్రైస్తవ పద్ధతుల్లో చిత్రహింసలకు గురిచేసేవారు. గంటలకొద్ది జరిగే ఈ చిత్రహింసల ఫలితాలను పరిహసించే ప్రజలు చూస్తారు. ఆ ముఖం లెక్కలేనన్ని దెబ్బలతో చితికిపోయి, పగిలి, రంధ్రాలు పడి పచ్చగా మారిపోతుంది. ముఖంలో ఒక్కసారి చిరునవ్వు పోతుంది. వికృతంగా మారిన ముక్కు కింద పగిలిపోయిన పళ్లు మరియు చినిగిన పంటి చిగుళ్లను చూసినప్పుడు దాని స్థానంలో వికారమైన నవ్వు ఏర్పడుతుంది. కిరాతకమైన హస్తాలు వెంట్రుకలు పీకేయడంతో రక్తం కారుతున్న ప్రదేశాలను దాచిపెడుతున్న అస్తవ్యస్తమైన జట్టు. ఆసరా కోసం వాహనానికి మెలితిప్పి కట్టిన చేతులు. ఛిద్రమైన శరీరాన్ని నిలబెట్టేందుకు పగిలిన వేలి గోళ్లను పెనేవేసి కట్టేస్తారు. మానవ రూపమంతా తుడిచిపెట్టుక పోతుంది. ఆమె ఇప్పుడు నిజంగానే ఒక భూతం, సాతాన్ పంపిన వధువు, ప్రకటిత మంత్రగత్తెగా కనబడుతుంది.


నేను ఈ హాలోవీన్ ముదుసలిని పూజిస్తాను మరియు అందరికంటే పవిత్రమైన వ్యక్తిగా పరిగణిస్తాను. నేను ఆమె ధైర్యాన్ని గౌరవించడంతోపాటు, మానవత్వపు చీకటి కోణానికి ఆమె చేసిన హెచ్చరికలను వింటాను.


ఆమె అనుభవించిన బాధలను గౌరవిస్తూ ప్రతి ఏటా కన్నీళ్లు పెట్టుకుంటాను.


గుర్తు తెలియని రచయిత


ఈ పండుగను జరుపుకునే అరబ్ దేశాల్లో, సెయింట్ బార్బరాను పూజిస్తారు.


[మార్చు] ఇవి కూడా చూడండి

మూస:Portal box



[మార్చు] సూచనలు

  1. 1.0 1.1 గేల్స్ బ్రాండ్రెత్, "ది డెవిల్ ఈజ్ గెయినింగ్ గ్రౌండ్" ది సండే టెలిగ్రాఫ్ (London), మార్చి 11, 2000.
  2. 2.0 2.1 హాలోవీన్: శాటాన్స్ న్యూ ఇయర్ (2006) రచన బిల్లే డైమల్లీ, హాలోవీన్: కౌంటర్‌ఫెయిట్ హోలీ డే (2005) రచన కెలే గెర్షోమ్, మరియు హాలోవీన్: వాట్ ఈజ్ ఎ క్రిస్టియన్ టు డు? (1998) రచన స్టీవ్ రుస్సో. లింట్ హాచెర్ రాసిన ది మ్యాజిక్ ఎయిట్‌బాల్ టెస్ట్: ఎ క్రిస్టియన్ డిఫెన్స్ ఆఫ్ హాలోవీన్ అండ్ ఆల్ థింగ్స్ స్పూకీ (2006)లో ఒక భిన్నాభిప్రాయం గుర్తించబడింది.
  3. 3.0 3.1 Reece, Kevin. "School District Bans Halloween", KOMO News, 2004-10-24. Retrieved on 2006-09-14.
  4. Halloween Comes to America. A&E Television Networks. తీసుకొన్న తేదీ: 2008-11-12.
  5. నికోలస్ రోజెర్స్, "సాంహైన్ అండ్ ది సెల్టిక్ ఆరిజన్స్ ఆఫ్ హాలోవీన్," హాలోవీన్: ఫ్రమ్ పాగాన్ రిచువల్ టు పార్టీ నైట్ (న్యూయార్క్: ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 2002), 11-21.
  6. హటన్, రోనాల్డ్ (1996) స్టేషన్స్ ఆఫ్ ది సన్: ఎ హిస్టరీ ఆఫ్ ది రిచువల్ ఇయర్ ఇన్ బ్రిటన్ . ఆక్స్‌ఫోర్డ్, ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ISBN 0-19-288045-4
  7. డానాహెర్, కెవిన్ (1972) ది ఇయర్ ఇన్ ఐర్లాండ్: ఐరిష్ క్యాలెండర్ కస్టమ్స్ డుబ్లిన్, మెర్సియెర్. ISBN 1-85635-093-2 pp.190–232
  8. క్యాంబెల్, జాన్ గ్రెగోర్సన్ (1900, 1902, 2005) ది గాలిక్ అదర్‌వరల్డ్ . కూర్పు రోనాల్డ్ బ్లాక్.బిర్లిన్ లిమిటెడ్. ISBN 1-84158-207-7 pp.559-62
  9. Arnold, Bettina (2001-10-31). Halloween Customs in the Celtic World. University of Wisconsin-Milwaukee. తీసుకొన్న తేదీ: 2007-10-16.
  10. Simpson, John; Weiner, Edmund (1989). Oxford English Dictionary, second, London: Oxford University Press. ISBN 0-19-861186-2. OCLC 17648714. 
  11. డానాహెర్, కెవిన్ (1972) ది ఇయర్ ఇన్ ఐర్లాండ్: ఐరిష్ క్యాలెండర్ కస్టమ్స్ డుబ్లిన్, మెర్సియెర్. ISBN 1-85635-093-2 pp.190–232
  12. Halloween and the jack-o-lantern. Witchway.net. తీసుకొన్న తేదీ: 2008-10-31.
  13. హిస్టరీ ఆఫ్ ది జాక్ ఒ'లాంతర్, పంప్కిన్ నూక్
  14. స్కాల్, డేవిడ్ జె. (2002డెత్ మేక్స్ ఎ హాలిడే: ఎ కల్చరల్ హిస్టరీ ఆఫ్ హాలోవీన్. న్యూయార్క్: బ్లూమ్స్‌బరీ, 34.ISBN 1-58234-230-X.
  15. ఫ్యామిలీ డేస్ అవుట్ - ఫ్యామిలీ డేస్ అవుట్
  16. Wallcoo.net
  17. Kakvo.org మూస:Bg icon
  18. హాలోవీన్ ఫ్రైట్
  19. Guet.edu.cn
  20. ఫ్యామిలీ డేస్ అవుట్ - ఫ్యామిలీ డేస్ అవుట్
  21. Wallcoo.net
  22. Kakvo.org మూస:Bg icon
  23. నికోలస్ రోజెర్స్, "హాలోవీన్ గోస్ టు హాలీవుడ్," హాలోవీన్: ఫ్రమ్ పాగాన్ రిచువల్ టు పార్టీ నైట్ (న్యూయార్క్: ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 2002), 103-124.
  24. హాల్ సీమెర్, స్పూకీ హాలోవీన్: ఎ సెలెబ్రేషన్ ఆఫ్ ది డార్క్., QuestMagazine.com.
  25. స్టీవెన్ హెల్లెర్. హాలోవీన్: వింటేజ్ హాలిడే గ్రాఫిక్స్ . టాస్‌చెన్. 2005
  26. Grannis, Kathy; Scott Krugman (September 20, 2006). As Halloween Shifts to Seasonal Celebration, Retailers Not Spooked by Surge in Spending (HTML). National Retail Federation. తీసుకొన్న తేదీ: 31 October 2006.
  27. Beauchemin, Genevieve, CTV.ca News Staff. "UNICEF to end Halloween 'orange box' program", CTV, 2006-05-31. Retrieved on 2006-10-29.
  28. Kids-Fun-And-Games.com
  29. "హాలోవీన్ పార్టీ గేమ్ ఐడియాస్" Kidzworld.com. 2009-03-17న పునస్సంపాదించబడింది.
  30. Economicexpert.com
  31. ఎవ్విరిథింగ్ ప్రీస్కూల్ - ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ మేడ్ ఈజీ
  32. 32.0 32.1 Associated Press (2005-10-30). Haunted house business getting frightfully hard. MSNBC.com. MSNBC. తీసుకొన్న తేదీ: 2008-11-18.
  33. Greg Ryan (2008-09-17). A Model of Mayhem. Hudson Valley Magazine. తీసుకొన్న తేదీ: 2008-10-06.
  34. Wilson, Craig (2006-10-12). Haunted houses get really scary. USAToday.com.
  35. నికోలస్ రోజెర్స్, "రేజర్ ఇన్ ది ఆపిల్: స్ట్రగుల్ ఫర్ సేఫ్ అండ్ సేన్ హాలోవీన్, సి. 1920-1990," హాలోవీన్: ఫ్రమ్ పాగాన్ రిచువల్ టు పార్టీ నైట్ (న్యూయార్క్: ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 2002), 78-102.
  36. Urban Legends Reference Pages: Pins and Needles in Halloween Candy. Snopes.com. తీసుకొన్న తేదీ: 2008-10-31.
  37. Bishop challenges supermarkets to lighten up Halloween (HTML). www.manchester.anglican.org (n.d.). తీసుకొన్న తేదీ: 2006-10-22.
  38. Halloween and All Saints Day (HTML). newadvent.org (n.d.). తీసుకొన్న తేదీ: 2006-10-22.
  39. Reformation Day: What, Why, and Resources for Worship (HTML). The General Board of Discipleship of The United Methodist Church (2005-10-21). తీసుకొన్న తేదీ: 2006-10-22.
  40. 40.0 40.1 Feast of Samhain/Celtic New Year/Celebration of All Celtic Saints November 1 (HTML). All Saints Parish (n.d.). తీసుకొన్న తేదీ: 2006-11-22.
  41. హాలోవీన్స్ క్రిస్టియన్ రూట్స్ AmericanCatholic.org. October 24, 2007న పునస్సంపాదించబడింది.
  42. 42.0 42.1 Salem 'Saint Fest' restores Christian message to Halloween (HTML). www.rcab.org (n.d.). తీసుకొన్న తేదీ: 2006-10-22.
  43. "Trick?" or "Treat?"—Unmasking Halloween (HTML). The Restored Church of God (n.d.). తీసుకొన్న తేదీ: 2007-09-21.


[మార్చు] మరింత చదవడానికి

  • డైనే C. ఆర్కిన్స్, హాలోవీన్: రొమాంటిక్ ఆర్ట్ అండ్ కస్టమ్స్ ఆఫ్ యెస్టర్‌యియర్ , పెలికాన్ పబ్లిషింగ్ కంపనీ (2000). 96 పేజీలు. ISBN 1-56554-712-8
  • డైనే C. ఆర్కిన్స్, హాలోవీన్ మెర్రీమేకింగ్: ఎన్ ఇల్ల్యుస్ట్రేటెడ్ సెలెబ్రేషన్ ఆఫ్ ఫన్, ఫుడ్, అండ్ ఫ్రోలిక్స్ ఫ్రమ్ హాలోవీన్స్ పాస్ట్ , పెలికాన్ పబ్లిషింగ్ కంపెనీ (2004). 112 పేజీలు. ISBN 1-58980-113-X
  • లెస్లే బన్నాటైనే, హాలోవీన్: ఎన్ అమెరికన్ హాలిడే, ఎన్ అమెరికన్ హిస్టరీ , ఫాక్ట్స్ ఆన్ ఫైల్ (1990, పెలికాన్ పబ్లిషింగ్ కంపెనీ, 1998). 180 పేజీలు. ISBN 1-56554-346-7
  • లెస్లే బన్నాటైనే, ఎ హాలోవీన్ రీడర్. స్టోరీస్, పోయమ్స్ అండ్ ప్లేస్ ఫ్రమ్ హాలోవీన్ పాస్ట్ , పెలికాన్ పబ్లిషింగ్ కంపెనీ (2004). 272 పేజీలు. ISBN 1-58980-176-8
  • ఫిల్లిస్ గాలెంబో, డ్రెస్సెడ్ ఫర్ థ్రిల్స్: 100 ఇయర్స్ ఆఫ్ హాలోవీన్ కాస్ట్యూమ్స్ అండ్ మాస్‌క్వెరేడ్ , హారీ ఎన్. అబ్రామ్స్, ఇంక్. (2002). 128 పేజీలు. ISBN 0-8109-3291-1
  • లింట్ హాట్చెర్, ది మ్యాజిక్ ఎయిట్‌బాల్ టెస్ట్: ఎ క్రిస్టియన్ డిఫెన్స్ ఆఫ్ హాలోవీన్ అండ్ ఆల్ థింగ్స్ స్పూకీ , Lulu.com (2006). ISBN 978-1-84728-756-4
  • రొనాల్డ్ హటన్, స్టేషన్స్ ఆఫ్ ది సన్: ఎ హిస్టరీ ఆఫ్ ది రిచువల్ ఇయర్ ఇన్ బ్రిటన్ , ఆక్స్‌ఫోర్డ్ పేపర్‌బాక్స్ (2001). 560 పేజీలు. ISBN 0-19-285448-8
  • జీన్ మార్కేల్, ది పాగాన్ మిస్టరీస్ ఆఫ్ హాలోవీన్: సెలెబ్రేటింగ్ ది డార్క్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ (ట్రాన్స్‌లేషన్ ఆఫ్ హాలోవీన్, హిస్టరీ ఎట్ ట్రెడిషన్స్ ), ఇన్నర్ ట్రెడిషన్స్ (2001). 160 పేజీలు. ISBN 0-89281-900-6
  • లిసా మోర్టాన్, ది హాలోవీన్ ఎన్‌సైక్లోపీడియా , మెక్‌ఫార్లాండ్ అండ్ కంపెనీ (2003). 240 పేజీలు. ISBN 0-7864-1524-X
  • నికోలస్ రోజెర్స్, హాలోవీన్: ఫ్రమ్ పాగాన్ రిచువల్ టు పార్టీ నైట్ , ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (2002). 198 పేజీలు. ISBN 0-19-514691-3
  • జాక్ శాంటినో (ed.), హాలోవీన్ అండ్ అదర్ ఫెస్టివల్స్ ఆఫ్ డెత్ అండ్ లైఫ్ , యూనివర్శిటీ ఆఫ్ టెన్నెస్సీ ప్రెస్ (1994). 280 పేజీలు. ISBN 0-87049-813-4
  • డేవిడ్ జె. స్కాల్, డెత్ మేక్స్ ఎ హాలిడే: ఎ కల్చరల్ హిస్టరీ ఆఫ్ హాలోవీన్ , బ్లూమ్స్‌బరీ USA (2003). 224 పేజీలు. ISBN 1-58234-305-5
  • బెన్ ట్రూవే, ది హాలోవీన్ కాటలాగ్ కలెక్షన్ . పోర్ట్‌లాండ్, ఓరెగాన్: టాకీ టినా ప్రెస్ (2003) ISBN 0-9703448-5-6.


[మార్చు] బాహ్య లింకులు

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-en.png [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
Wikisource-logo.svg [[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి



మూస:Halloween మూస:US Holidays

"http://te.wikipedia.org/w/index.php?title=హాలోవీన్&oldid=716271" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు