హింగ్లాజ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హింగ్లాజ్ (ఇంగ్లీషు: Hinglaj, సంస్కృతం: हिङ्ग्लाज, హిందీ: हिंगलाज) అనునది పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరియు శక్తిపీఠం. హింగ్లాజ్ లేదా హింగుళ దేవి భారతదేశంలోని చాలామంది క్షత్రియులకు, ఇతర తెగలకూ కులదేవత. ఇది బెలూచిస్తాన్ రాష్ట్రంలో కరాచీ నుడి 250 కి.మీ దూరంలో ఉన్నది.

స్థల పురాణం[మార్చు]

దాక్షాయణి శరీరాన్ని మోసుకెళుతున్న శివుడు - 17వ శతాబ్దపు కాంగ్రా శైలి చిత్రం

సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది. సతీ దేవి బ్రహ్మరంధ్రం ఇక్కడ పడినట్టు చెప్పుకుంటారు. ఇక్కడ భైరవుడు భీమలోచనుడనే పేర పిలువబడుతున్నాడు.


రామాయణం ప్రకారం, రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మహత్యదోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడు.


హింగుళా దేవికి చెందిన ఈ మంత్రం దధీచీవిరచితంగా భావిస్తారు.


ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి

మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా


హింగ్లాజ్ యాత్ర[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=హింగ్లాజ్&oldid=815990" నుండి వెలికితీశారు