హిడ్నొకార్పిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హిడ్నొకార్పిక్ ఆమ్లం
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [459-67-6]
పబ్ కెమ్ 110680
SMILES O=C(O)CCCCCCCCCCC1\C=C/CC1
ధర్మములు
రసాయన ఫార్ములా C16H28O2
మోలార్ ద్రవ్యరాశి 252.39
ద్రవీభవన స్థానం

59-60°C

 YesY (verify) (what is: YesY/N?)
Except where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa)
Infobox references
హిడ్నొకార్పిక్ ఆమ్లం

హిడ్నొకార్పిక్ ఆమ్లం(hydnocarpic acid) అనునది ఒక కొవ్వు ఆమ్లం.ఒక ద్వింబంధాన్ని కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.అయితే ఈ ఆమ్లం యొక్క హైడ్రోకార్బన్ శృంఖలం మిగతా అమ్లంలలో వున్నట్లుగా సరళంగా కాకుండగా చక్రీయత లేదా వృత్తస్థిత(cyclic) రూపంను కల్గివున్నది.అందుచే దీనిని భిన్నమైన సౌష్టవమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం అందురు.

అమ్లనిర్మాణ సౌష్టవము-గుణగణాలు[మార్చు]

ఉనికి గుర్తింపు :హిడ్రోకార్పిక్ ఆమ్లంను కలిగి వున్నచౌల్‌ముగ్రా నూనెను 1899 నాటికే కుష్టురోగ నివారణకై వాడుచున్నప్పటికి,ఈ ఆమ్లం గురించిన పరిశోధనలు 1916 నాటికి కాని ఊపందుకోలేదు.హోల్మాన్ మరియు డీన్(Hollman &Dean)లు ఈ ఆమ్లం యొక్క మిథైల్ ఏస్టరులను రోగనివారణలో ఉపయోగించి పలితాలు పొందారు.రీజరు ఆ ఆమ్లంయొక్క సోడియం లవణాలను వాడటంగురించి పత్రం విడుదల చేశాడు[1]

హిడ్నొకార్పిక్ ఆమ్లంలో మిగతా కొవ్వు ఆమ్లాలవలె హైడ్రోకార్బన్ శృంఖలం ఒక చివర కార్బోక్సిల్(COOH)సమూహం సనుసంధానింపబడి వుండగా,రెండో అంచు చివర మైథైల్(CH3)సమూహం నకు బదులుగా పంచభుజి(pentagonal)హైడ్రోకార్బన్ అనుసంధానింపబడివుండును.ఆ పంచభుజిలోనే ఒక ద్విబంధం ఏర్పడివుండును.హిడ్రోకార్పిక్ ఆమ్లం యొక్క అణు సంకేత సూత్రం C15H27COOH.ఈ ఆమ్లం యొక్క శాస్త్రీయ పేరు 11-(సైక్లొపెంటైల్)అన్‌డెకనోయిక్ ఆసిడ్[11-(2-cyclopenten-1-yl)undecanoic acid].

హిడ్నోకాప్రిక్ ఆమ్లంలోని మూలకాల సమ్మేళన భార నిష్పత్తి కార్బన్=76.14%,హైడ్రోజన్:11.18,ఆక్సిజన్:12.68

గుణగణాల పట్టిక [2]

గుణము విలువల మితి
అణు సంకేత సూత్రం C16H28O2
అణు భారం 252.39
ద్రవీభవన ఉష్ణోగ్రత 59-60°C

లభ్యత[మార్చు]

ఉపయోగాలు[మార్చు]

  • కుష్టురోగ నివారణలో ఉపయోగిస్తారు[4]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటిలింకులు[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "THE STRUCTURE OF CHAULMOOGRIC AND HYDNOCARPIC ACIDS". pubs.acs.org/. సంగ్రహించిన తేదీ 2013-12-1. 
  2. "Hydnocarpic Acid". www.drugfuture.com/. సంగ్రహించిన తేదీ 2013-12-1. 
  3. "hydnocarpic acid". www.merriam-webster.com/. సంగ్రహించిన తేదీ 2013-12-01. 
  4. "hyd'no•car'pic ac'id". dictionary.infoplease.com/. సంగ్రహించిన తేదీ 2013-12-1.