హిమాలయాలు
హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమి ని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి వున్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.[1]
ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.[2]
ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు. వీటి పరివాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా వున్నది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి వున్నాయి.
విషయ సూచిక |
హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు [మార్చు]
| శిఖరం పేరు | ఇతర పేర్లు మరియు అర్థం | ఎత్తు (మీటర్లు) | ఎత్తు (అడుగులు) | మొదటి అధిరోహణ | నోట్స్ |
|---|---|---|---|---|---|
| ఎవరెస్టు శిఖరం | సాగర్ మాతా, "ఆకాశ నుదురు", చోమోలాంగ్మా, "విశ్వమాత" |
8,848 | 29,029 | 1953 | ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు. |
| కే-2 | చోగో గాంగ్రి | 8,611 | 28,251 | 1954 | ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్ మరియు చైనాలోని జింజియాంగ్ లో గలదు. |
| కాంచనగంగ | కాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" | 8,586 | 28,169 | 1955 | ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్) మరియు నేపాల్ లో గలదు. |
| లోట్‌సే | "దక్షిణ శిఖరం" | 8,516 | 27,940 | 1956 | ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్ మరియు టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు. |
| మకాలూ | "మహా నల్లనిది (The Great Black)" | 8,462 | 27,765 | 1955 | ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
| చో ఓయు | ఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత" | 8,201 | 26,905 | 1954 | ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
| ధవళగిరి | "తెల్లని పర్వతం" | 8,167 | 26,764 | 1960 | ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
| మానస్లూ | కుటాంగ్, "ఆత్మ పర్వతం" | 8,156 | 26,758 | 1956 | ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు. |
| నంగా పర్వతం | దయామీర్, "నగ్న పర్వతం" | 8,126 | 26,660 | 1953 | ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు. |
| అన్నపూర్ణ | "పంటల దేవత" | 8,091 | 26,545 | 1950 | ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు. |
| గాషెర్‌బ్రమ్ I | "అందమైన పర్వతం" | 8,080 | 26,509 | 1958 | ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| విశాల శిఖరం | ఫైచాన్ కాంగ్రి | 8,047 | 26,401 | 1957 | ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| గాషెర్‌బ్రమ్ II | - | 8,035 | 26,362 | 1956 | ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| షిషాపాంగ్మా | జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" | 8,013 | 26,289 | 1964 | ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు. |
| గాషెర్‌బ్రమ్ IV | - | 7,925 | 26,001 | 1958 | ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనా లో గలదు. |
| మాషెర్‌బ్రమ్ | -తెలీదు- | 7,821 | 25,660 | 1960 | ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| నందా దేవి | "ఆశీర్వదించు-దేవత" | 7,817 | 25,645 | 1936 | ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్ లో గలదు. |
| రాకాపోషి | "మెరిసే కుడ్యము" | 7,788 | 25,551 | 1958 | శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| గాంగ్‌ఖర్ పుయెన్సుమ్ | గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" | 7,570 | 24,836 | అధిరోహించలేదు | ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్ లో గలదు. |
| అమా దబ్లామ్ | "తల్లి మరియు ఆమె నెక్లేస్" | 6,848 | 22,467 | 1961 | ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూ లో గలదు. |
ధార్మిక స్థానాలు [మార్చు]
హిమాలయాలలో హిందూ మరియు బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.
- హరిద్వార్, గంగానది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం.
- బద్రీనాథ్, వైష్ణవాలయం.
- కేదార్నాథ్, 12 జ్యోతిర్లింగాలు గల ప్రదేశం.
- గౌముఖ్, భగీరథి జన్మస్థానం.
- దేవ్‌ప్రయాగ్, ఇచట అలక్‌నంద మరియు భగీరథి నదులు కలసి గంగా నది గా ఏర్పడుచున్నవి.
- రిషీకేష్, లో లక్ష్మణ దేవాలయం వున్నది.
- కైలాశ పర్వతం, 6,638 మీటర్ల ఎత్తులో గల శిఖరం, ఇది శివపార్వతుల నివాస స్థలి. ఈ పర్వత అడుగుభాగానే మానస సరోవరం వున్నది, ఇది బ్రహ్మపుత్ర జన్మస్థానం.
- అమరనాథ్, ఇక్కడ శివలింగం వున్నది.
- వైష్ణోదేవి, ఈ దేవాలయం, దుర్గాదేవి భక్తులకు కేంద్రబిందువు.
- హిమాలయాలలో టిబెట్ కు చెందిన ఎన్నో ధార్మిక ప్రదేశాలు గలవు. దలైలామా నివాస స్థలం కూడా ఈ హిమాలయాలలోనే గలదు.
- యతి అనే ప్రసిద్ధ జీవి, జీవించినట్లు ప్రజల విశ్వాసం.
- షంభాలా బౌద్ధ ధర్మంలో ప్రముఖ నగరం. భౌతికంగా ఈ నగరం లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికం గా బౌద్ధులు చేరే నగరం.
- హేమ్‌కుండ్ సాహెబ్ - గురు గోబింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంలో గల గురుద్వార.
ఇవీ చూడండి [మార్చు]
- భారతదేశ భౌగోళికం
- కారాకోరం (పర్వత పంక్తి)
- లదఖ్
- ఎత్తైన శిఖరాల జాబితా - 7,200 మీటర్ల ఎత్తుకు మించినవి.
నోట్స్ [మార్చు]
- ↑ Oracle Education Foundation: Indian Himalayas
- ↑ "Himalayan Mountain System". Retrieved 2007-08-07.
మూలాలు [మార్చు]
The Himalayan Journal published by Himalayan Club
ఇతర పఠనాలు [మార్చు]
- Michael Palin, Himalaya, Weidenfeld Nicolson Illustrated (2004) ISBN 0-297-84371-0
- John Hunt, Ascent of Everest, Hodder & Stoughton (1956) ISBN 0-89886-361-9
- Everest, the IMAX movie (1998), ISBN 0-7888-1493-1
బయటి లింకులు [మార్చు]
- A German language page with comprehensive information about the mountains of the Himalaya. Has links to good images.
- Maps, pictures and travelogues from various regions of the Himalayas
- The making of the Himalaya and major tectonic subdivisions
- Geology of the Himalayan mountains
- Birth of the Himalaya
- Some notes on the formation of the Himalaya
- Guide to the 8000 m peaks
- Pictures from a trek in Annapurna (film by Ori Liber)