హీలియం
|
|||||||||||||||||||||||||
| సాధారణ లక్షణాలు | |||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పేరు, సంకేతము, పరమాణు సంఖ్య | హీలియం, He, 2 | ||||||||||||||||||||||||
| రసాయన సిరీస్ | జడ వాయువులు | ||||||||||||||||||||||||
| గ్రూపు, పీరియడ్, బ్లాక్ | 18, 1, s | ||||||||||||||||||||||||
| స్వరూపం | colorless |
||||||||||||||||||||||||
| ప్రామాణిక పరమాణు భారం | 4.002602(2) g·mol−1 | ||||||||||||||||||||||||
| ఎలక్ట్రాన్ విన్యాసం | 1s2 | ||||||||||||||||||||||||
| Electrons per shell | 2 | ||||||||||||||||||||||||
| భౌతిక లక్షణాలు | |||||||||||||||||||||||||
| స్థితి | gas | ||||||||||||||||||||||||
| సాంద్రత | (0 °C, 101.325 kPa) 0.1786 g/L |
||||||||||||||||||||||||
| ద్రవీభవన స్థానం | (at 2.5 MPa) 0.95 K (−272.2 °C, −458.0 °F) |
||||||||||||||||||||||||
| Boiling point | 4.22 K (−268.93 °C, −452.07 °F) |
||||||||||||||||||||||||
| Critical point | 5.19 K, 0.227 MPa | ||||||||||||||||||||||||
| Heat of fusion | 0.0138 kJ·mol−1 | ||||||||||||||||||||||||
| Heat of vaporization | 0.0829 kJ·mol−1 | ||||||||||||||||||||||||
| Heat capacity | (25 °C) 20.786 J·mol−1·K−1 | ||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||
| Atomic properties | |||||||||||||||||||||||||
| Crystal structure | hexagonal close-packed | ||||||||||||||||||||||||
| Electronegativity | no data (Pauling scale) | ||||||||||||||||||||||||
| Ionization energies | 1st: 2372.3 kJ/mol | ||||||||||||||||||||||||
| 2nd: 5250.5 kJ/mol | |||||||||||||||||||||||||
| Atomic radius (calc.) | 31 pm | ||||||||||||||||||||||||
| Covalent radius | 32 pm | ||||||||||||||||||||||||
| Van der Waals radius | 140 pm | ||||||||||||||||||||||||
| ఇతరత్రా | |||||||||||||||||||||||||
| Thermal conductivity | (300 K) 151.3 m W·m−1·K−1 | ||||||||||||||||||||||||
| CAS registry number | 7440-59-7 | ||||||||||||||||||||||||
| ముఖ్యమైన ఐసోటోప్‌లు | |||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||
| మూలాలు | |||||||||||||||||||||||||
హీలియం (Helium) ( సంకేతం He) ఒక రంగు, రుచి, వాసన లేని, హానికరం గాని (non-toxic), తటస్థమైన (inert) ఒకే అణువు కలిగిన (monatomic రసాయన మూలకము. ఇది ఆవర్తన పట్టికలో ఉత్కృష్ట వాయువుల జాబితాలో ప్రధమంగా వస్తుంది. దీని పరమాణు సంఖ్య 2. దీని మరిగే ఉష్ణోగ్రత మరియు ద్రవీకరణ ఉష్ణోగ్రత అన్ని మూలకాలలో అతి తక్కువ. ఇది దాదాపు అన్ని పరిస్థితులలోను వాయువుగానే ఉంటుంది.
1868లో పియర్ జాన్సన్ అనే ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక సూర్య గ్రహణం పరిశోధన సమయంలో ఒక క్రొత్త పసుపు రంగు స్పెక్ట్రల్ లైన్ కనుగొన్నాడు. ఇది హీలియం మూలకం సూచించే స్పెక్ట్రల్ లైను. నార్మన్ లాక్యర్ అనే మరో శాస్త్రవేత్త ఇదే గ్రహణాన్ని పరిశీలిస్తూ "హీలియం" అనే క్రొత్త మూలకం పేరు ప్రతిపాదించాడు. వీరిద్దరూ హీలియంను కనుగొన్నవారిగా గుర్తింపు పొందారు.
1903లో అమెరికా సహజ వాయువు నిల్వలలో పెద్ద మోతాదులో హీలియం కూడా ఉన్నట్లు గుర్తించారు. హీలియంను అధికంగా క్రయోజెనిక్స్ (cryogenics) సాంకేతికతలోను, సముద్రపు లోతులలో శ్వాసపీల్చడానికి వినియోగించే పరికరాలలోను (deep-sea breathing systems), అతివాహక అయస్కాంతాలను కూలింగ్ చేయడానికి, హీలియం డేటింగ్ ప్రక్రియలోను, బెలూన్లను ఉబ్బించడానికి, ఎయిర్ షిప్ (airships)లను తేలికగా చేయడానికి వాడుతారు. ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాలున్నాయి. ఉదా: ఆర్క్ వెల్డింగ్ (arc welding), సిలికాన్ వేఫర్స్ (silicon wafers) తయారీ వంటివి.
కొద్ది మోతాదులో హీలియం నాయువును పీల్చినట్లయితే మనిషి మాటలోని గరుకుదనంలో (timbre and quality) కొంత తాత్కాలికమైన మార్పు వస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్ అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు హీలియం ద్రవరూపపు (liquid helium-4's two fluid phases, helium I and helium II) లక్షణాలు చాలా ఉపయోగకరమైనవి. ముఖ్యంగా సూపర్ ఫ్లూయిడిటీ (superfluidity) అధ్యయనంలోను, యాబ్సల్యూట్ జీరో (absolute zero) వద్ద పదార్ధపు లక్షణాలను అధ్యయనం చేసే అతివాహకత (superconductivity) పరిశోధనలలోను.
అన్ని మూలకాలలోను హీలియం రెండ అతి తేలికైన మూలకం. మరియు విశ్వంలో అత్యధికంగా లభించే రెండవ పదార్ధం. నిశ్వంలో హీలియం అధికంగా మహా విస్ఫోటనం (Big Bang) సమయంలో ఏర్పడింది. అంతే గాకుండా నక్షత్రాలలో హైడ్రోజెన్ మూలకం న్యూక్లియర్ ఫ్యూషన్ (en:nuclear fusion) కారణంగా హీలియంగా మారుతుంటుంది. భూమిమీద మాత్రం హీలియం పరిమాణం చాలా తక్కువ. భూమి మీది హీలియం కొన్ని మూలకాల రేడియో యాక్టివ్ డికే (radioactive decay) కారణంగా తయారౌతున్నది. ఇలా తయారైన హీలియం సహజ వాయువులో కలిసి ఉంటుంది. దానిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ (fractional distillation) ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు..
|
|||||