హుమాయూన్ సమాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుమాయూన్ సమాధి.

హుమాయూన్ సమాధి (Humayun's tomb) మొఘల్ నిర్మాణాల సమూహం. ఢిల్లీ లోని తూర్పు నిజాముద్దీన్ లో ఉంది. దీనిని హుమాయూన్ మరణాంతరం, ఇతని భార్య హమీదా బాను బేగం, ఆదేశాన నిర్మాణం జరిగింది. 1562 లో నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. దీని ఆర్కిటెక్ట్ సయ్యద్ ముహమ్మద్ ఇబ్న్ మిరాక్ గియాసుద్దీన్ , తండ్రి మీరక్ గియాసుద్దీన్. వీరిని 'హిరాత్' నుండి రప్పించారు. దీనిని నిర్మించుటకు 8 సంవత్సరాల కాలం పట్టింది. తాజ్ మహల్ నిర్మాణానికి పూర్వం దీనిని భారత్ లోనే అత్యంత సుందరమైన కట్టడంగా పరిగణించేవారు. దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

మూలాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]


బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.