హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
జననంహెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
1914
హోస్పిట కర్ణాటక
మరణంసెప్టెంబర్ 14 1970
ఇతర పేర్లు"హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రి"
వృత్తిహార్మోనియం వాద్యకారులు, రంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు

హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి అలనాటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన సెప్టంబర్ 1914 వ సంవత్సరాన, కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట అనే ఊరిలో జన్మించారు. ఈయన పూర్తి పేరు "హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రి". తొలుత ఈయన ఒక హార్మోనియం వాద్యకారుడు, రంగస్థల సంగీతదర్శకుడు. ఆయన మొట్టమొదటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. తెలుగులో మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాద (1931)కు ఈయనే సంగీతదర్శకుడు. తెలుగే కాక ఇతర దక్షిణభారతీయ భాషా చిత్రాలకు కూడా ఈయన పనిచేశారు. కన్నడ రంగస్థల, చలనచిత్ర నటుడు ఆర్.నాగేంద్రరావు తొలి కన్నడ టాకీ సతీ సులోచన (1934) కి పద్మనాభశాస్త్రిని సంగీతం సమకూర్చడానికి కుదుర్చుకున్నారు, కానీ తర్వాత నాగేంద్రరావే ఆ పనిని చేశాడు, పద్మనాభశాస్త్రి అయనకు సహాయకునిగా పనిచేశాడు. మన తెలుగు సినిమా సంగీతానికి పునాది రాయి వేసిన వ్యక్తి హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి. ఈయన పూర్వీకులు పదహారణాల తెలుగువారు. అయితే తాత ముత్తాత లంతా హోస్పేటలో స్థిరపడిపోయారు. తమిళ చిత్రం కంకణమ్ (1947) తో గాయని పి.లీలను చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. శ్రీకృష్ణ తులాభారం (1955) చిత్రంలో సత్యభామ వేషం ధరించిన నటగాయని ఎస్.వరలక్ష్మి ఈయన సంగీతదర్శకత్వంలో స్థానం నరసింహరావు రచించిన సుప్రసిద్ధమైన మీరజాలగలడా నాయానతి పాట ఆలపించింది. 1970 వ సంవత్సరం వరకు కూడా ఈయన సంగీత విభాగంలోనే పనిచేసారు. కె.వి.మహదేవన్ కొన్నాళ్లపాటు పద్మనాభ శాస్త్రిని తన దగ్గరే పెట్టుకున్నారు. ఎంతో మంది సంగీత దర్శకులకు, సంగీత కళాకారులకు శిక్షణ ఇచ్చిన తొలితరం సంగీత దర్శకుడీయన. ఈయన సెప్టెంబర్ 14, 1970 వ సంవత్సరంలో కన్నుమూశారు.

చిత్రసమాహారం[మార్చు]

  1. భక్త ప్రహ్లాద (1931)
  2. చిత్రనళీయం (1938)
  3. తెనాలి రామకృష్ణ (1941)
  4. ఘరానా దొంగ (1942)
  5. సుమతి (ఎన్.బి.దినకర రావుతో) (1942)
  6. [[::kn:ರಾಧಾರಮಣ|రాధా రమణ]] (కన్నడం) (1942)
  7. తాసిల్దార్ (1944)
  8. కంకణం (తమిళం) (1946)
  9. బిల్హణ (తమిళం) (1946)
  10. రక్షరేఖ (1949)
  11. నిర్దోషి (1951)
  12. పేద రైతు (1952)
  13. మంజరి (1953)
  14. శ్రీకృష్ణ తులాభారం (బాబు రావుతో) (1955)
  15. నాగపంచమి (ఎస్.వి.వెంకట్రామన్ తో) (1956)
  16. ప్రేమే దైవం (విజయభాస్కర్ తో) (1957)
  17. [[::kn:ಪ್ರೇಮದ ಪುತ್ರಿ (ಚಲನಚಿತ್ರ)|ప్రేమద పుత్రి]] (కన్నడం) (1957)
  18. అన్బే దైవం
  19. సతీ సావిత్రి (మరో ఏడుగురు సంగీత దర్శకులతో) (1957)
  20. భక్త రామదాసు (నాగయ్య, ఓగిరాల, అశ్వత్థామతో) (1964)

బయటి లింకులు[మార్చు]