హెలెన్ కెల్లర్

వికీపీడియా నుండి
హెలెన్ కెల్లర్
Helen Keller.jpg
అంధ మరియు బధిర అమెరికన్ రచయిత్రి, ఉద్యమకర్త మరియు ఉపన్యాసకురాలు.
జననం జూన్ 27 1880(1880-06-27)
టస్కంబియా, అలబామా, అమెరికా
మరణం జూన్ 1 1968 (వయసు: 87)
ఆర్కన్ రిడ్జ్, వెస్ట్‌పోర్ట్, కనెక్టికట్, అమెరికా

హెలెన్ ఆడమ్స్ కెల్లర్ (జూన్ 20, 1880 - జూన్ 1, 1968): అమెరికా దేశస్తురాలైన ఈమె రచయిత్రి, సామాజిక కార్యకర్త, అధ్యాపకురాలు. కళాశాలలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తొలి అంధురాలు ఈమె.

హెలెన్ కెల్లర్ యొక్క విశిష్ట ఉపాధ్యాయిని ఆన్నీ సల్లివన్, భాషాబుద్ధులు పూర్తిగా అభివృద్ధి చెందని ఒక బాలిక యొక్క ఒంటరితనాన్ని ఛేదించి, ఆ అమ్మాయి తన భావాలను ఇతరులతో పంచుకోగలిగేలా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన వైనము, ది మిరకిల్ వర్కర్ యొక్క రంగస్థల రూపకల్పనలతో ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధి చెందినది.

అయితే విద్యాభ్యాసము పూర్తిచేసుకున్న తర్వాత కెల్లర్ జీవితము గురించి అంతగా తెలియదు. మంచి రచయిత అయిన హెలెన్ కెల్లర్, విస్తృతమైన పర్యటనా అనుభవము కలిగి ఉండేది. ఈమె తన యుద్ధ వ్యతిరేకతను బాహాటంగా చాటుకొన్నది. మహిళా ఓటుహక్కులు, కార్మికుల హక్కులు మరియు సామ్యవాదము వంటి అనేక పురోగామి ఉద్యమాలకు పాటుపడినది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు