హైకోర్టు
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానము (ఆంగ్లం: High Court) అనగా భారతదేశంలో రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతీ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ఒక్కో హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు.హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆరవ భాగము, ఐదవ అధ్యాయము, 214 వ నిభంధననుసరించి ఏర్పాటు చేయడం జరిగింది.
హైకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర గవర్నర్ సలహాపై, భారత రాష్ట్రపతి నియమిస్తాడు.
మొత్తం భారతదేశంలో 21 హైకోర్టులు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టులో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి. రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసుల పై న్యాయ విచారణ కోసం హైకోర్ట్‌ను సంప్రదించవచ్చు.
హైకోర్టు న్యాయ మూర్తి పదవీ అర్హతలు:
- భారత దేశ పౌరుడై ఉండాలి.
- కనీసం 10 సంవత్సరాలు పాటు దిగువ కోర్ట్‌లో న్యాయమూర్తిగా లేదా హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా, లేదా న్యాయ శాస్త్రవేత్తగా ఉండాలి.
విషయ సూచిక |
[మార్చు] హైకోర్టులు
భారతదేశం లో గల, క్రింది ఇరవైన్నొక్క (21) హైకోర్టుల జాబితాను చూడండి.
అత్యధిక న్యాయమూర్తులు అహ్మదాబాద్ హైకొర్ట్ కు ఉన్నారు.
- ↑ ప్రారంభంగా ఆగ్రా లో స్థాపించారు. 1875 లో అలహాబాదుకు మార్చారు.
- ↑ లాహోర్ హైకోర్టు 1919-03-21 లో స్థాపించారు. పరిధి, అవిభాజ్య పంజాబ్ మరియు ఢిల్లీ. 1947-08-11 లో ఒక ప్రత్యేక హైకోర్టు ఆఫ్ పంజాబ్ స్థాపించబడినది, భారతీయ స్వాతంత్ర్య ఆక్టు 1947, ప్రకారం సిమ్లా లో ఒక సీటును ఏర్పాటు చేశారు. 1966 లో పంజాబ్ గుర్తింపబడిన తరువాత, పంజాబ్ హర్యానాల కొరకు ఒక హైకోర్టును స్థాపించారు. ఢిల్లీ హైకోర్టు, 1966-10-31 లో, సిమ్లాలో ఒక సీటుతో స్థాపించారు.
- ↑ మూలంగా ఇది అస్సాం మరియు నాగాల్యాండ్ కొరకు స్థాపింపబడింది. 1971 లో దీనికి గౌహతి హైకోర్టు ఈశాన్యభారత రీ-ఆర్గనైజేషన్ ఆక్టు, 1971, ప్రకారం పేరు పెట్టారు.
- ↑ వేసవిలో రాజధాని శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ.
- ↑ మూలంగా దీనిని మైసూరు హైకోర్టు అనేవారు, తరువాత కర్నాటక హైకోర్టు అని పేరు 1973.
- ↑ ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టు, ఎర్నాకుళంలో 1949 లో జూలై 7 న ఉద్ఘాటన చేశారు. కేరళ్ రాష్ట్రం, రాష్ట్రాల రీ ఆర్గనైజేషన్ ఆక్ట్ 1956 ప్రకారం ఏర్పడింది. ఈ ఆక్టు ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టును అబాలిష్ చేసి కేరళ హైకోర్టును సృష్టించింది. దీని పరిధి, లక్షద్వీప్ వరకు గలదు.
- ↑ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు, 1935, లెటర్ పేటెంట్ ద్వారా 2-1-1936 న ఒక హైకోర్టు నాగపూర్ నందు స్థాపించబదింది. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జబల్ పూర్ కు మార్చబడింది, 1956.
- ↑ మూలంగా పంజాబ్ హైకోర్టు, తరువాత పంజాబ్ & హర్యానా హైకోర్టు గా మారింది, 1966
[మార్చు] హైకోర్టులు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా
[మార్చు] హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్
రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా రిజిస్ట్రార్ జనరల్‌గా పి.మస్తానమ్మ 31.1.2012 న నియమితులయ్యారు.
[మార్చు] మూలాలు
- Jurisdiction and Seats of Indian High Courts. Eastern Book Company. తీసుకొన్న తేదీ: September 2, 2005.
- Judge strength in High Courts increased. Press Information Bureau – Govt. of India. తీసుకొన్న తేదీ: September 2, 2005.
- Judiciary. Supreme Court of India. తీసుకొన్న తేదీ: September 2, 2005.
- Constitution of India. Wikisource. తీసుకొన్న తేదీ: December 31, 2005.