హ్యారీ పాటర్ చలనచిత్ర సిరీస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Harry Potter films
దస్త్రం:Harry Potter 1-6.jpg
2009 DVD Box Set for the first 6 films
దర్శకత్వం Philosopher's Stone &
Chamber of Secrets:

Chris Columbus
Prisoner of Azkaban:
Alfonso Cuarón
Goblet of Fire:
Mike Newell
Order of the Phoenix,
Half-Blood Prince &
Deathly Hallows:

David Yates
నిర్మాత David Heyman
PS & DH:
J. K. Rowling [1][2]
POA:
Chris Columbus &
Mark Radcliffe
GOF, OOTP, HBP & DH:
David Barron
రచన PS, COS, POA, GOF, HBP & DH Screenplays:
Steve Kloves
OOTP Screenplay:
Michael Goldenberg
కథ J. K. Rowling
తారాగణం Daniel Radcliffe
Rupert Grint
Emma Watson
Helena Bonham Carter
Robbie Coltrane
Ralph Fiennes
Brendan Gleeson
Michael Gambon
Richard Harris
Robert Hardy
John Hurt
Jason Isaacs
Gary Oldman
Alan Rickman
Maggie Smith
Imelda Staunton
David Thewlis
Julie Walters
Mark Williams
సంగీతం PS, COS & POA:
John Williams
GOF:
Patrick Doyle
OOTP & HBP:
Nicholas Hooper
DH Part I:
Alexandre Desplat [3]
PS, COS, POA & DH Part I Orchestrator:
Conrad Pope
స్టూడియో Heyday Films
పంపిణీదారు Warner Bros.
విడుదలైన తేదీ PS:
4 నవంబరు 2001 (2001-11-04)
COS:
3 నవంబరు 2002 (2002-11-03)
POA:
31 మే 2004 (2004-05-31)
GOF:
18 నవంబరు 2005 (2005-11-18)
OOTP:
11 జూలై 2007 (2007-07-11)
HBP:
15 జూలై 2009 (2009-07-15)
DH Part I:
19 నవంబరు 2010 (2010-11-19)
DH Part II:
15 జూలై 2011 (2011-07-15)
నిడివి Total (6 films):
903 minutes
దేశం United Kingdom,
United States
భాష English
పెట్టుబడి Total (6 films):
$905,000,000
వసూళ్లు Total (6 films):
$5,412,504,276

బ్రిటన్ రచయిత్రి జె.కె. రౌలింగ్ రాసిన ఏడు హ్యారీ పాటర్ నవలల ఆధారంగా హ్యారీ పాటర్ చలనచిత్రాలు వెలువడ్డాయి. ఇవి ఏడు ఊహాజనిత సాహస చిత్రాలు, ఇందులో చివరి భాగం రెండుగా విభజింపబడినది. డేనియల్ ర్యాడ్ క్లిఫ్, రూపర్ట్ గ్రింట్ మరియు ఎమ్మా వాట్సన్ ఈ సినిమాల్లో ప్రధాన పాత్రలైన హ్యారీ పాటర్, రాన్ వెస్లీ మరియు హెర్మియన్ గ్రాంగెర్‌గా నటించారు.

ఇక ఏడొవది, చివరది కూడా అయిన హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాల్లోస్ నవల ఆధారంగా తీస్తున్న చలనచిత్రం జూన్ 12, 2010 శనివారం రోజున ముఖ్యమైన ఫోటోగ్రఫీ చివరి దశని పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది.[4] చివరి పుస్తకం రెండు చలనచిత్ర సంబంధ భాగాలుగా విభజించబడింది: [5]నవంబర్ 19, 2010న హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాల్లోస్ మొదటి భాగం విడుదలవుతోంది మరియు హ్యారీ పాటర్ అండ్ డెత్లీ హాల్లోస్ రెండవ భాగం జులై 15, 2011న విడుదల కానుంది.[6] హ్యారీ పాటర్ అండ్ డెత్లీ హాల్లోస్ ‌ను ఒకే సినిమాగా పరిగణిస్తున్నామని, అయితే దాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని నిర్మాత డేవిడ్ హేమ్యాన్ ఒక ముఖాముఖిలో తెలిపారు.[7] రెండు భాగాలు కూడా వాటి విడుదల తేదీల్లో 3D మరియు 2Dలో విడుదలకానున్నాయి.[8]

ద్రవ్యోల్బణంతో సవరణ చేయకపోతే ప్రపంచవ్యాప్తంగా 5.4 బిలియన్ డాలర్ల వసూళ్లతో హ్యారీ పాటర్ చిత్రం అత్యధిక మొత్తాన్ని రాబట్టిన చలనచిత్రాల సీరీస్ . ప్రస్తుతం ఈ క్రమంలో ఆరు చలన చిత్రాలు ఉన్నాయి. అన్నీ (ద్రవ్యోల్బణం కొరకు సవరణ చేయబడలేదు) ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తం వసూళ్లు చేసిన తొలి 30 సినిమాల జాబితాలో చోటుచేసుకున్నాయి. మొదటి మరియు ఐదవ సినిమాలు మొదటి పదింటిలో స్థానం పొందాయి.[9] ఇటీవలి భాగం హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్ బ్లడ్ ప్రిన్స్ జులై 15, 2009న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[10]

మూలాలు[మార్చు]

1997 చివరలో చిత్ర నిర్మాత డేవిడ్ హేమ్యాన్ యొక్క లండన్ కార్యాలయాలు రౌలింగ్ రాసిన ఏడు హ్యారీ పాటర్ నవలల క్రమంగా ఉండే తొలి పుస్తకం ప్రచురణను అందుకున్నాయి. హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ పుస్తకం తక్కువ ప్రాధాన్యత ఉన్న పుస్తకాల అలమరలో ఉంచబడింది, అయితే దీనిని ఒక కార్యదర్శి వెలికితీసి, చదివి దాని గురించి సానుకూలమైన అభిప్రాయంతో హేమ్యాన్‌కు ఇచ్చారు. అందులోని విధివిహిత నటన హేమ్యాన్‌కు బాగా నచ్చింది. నిజానికి అతను పుస్తకం చదవడానికి ముందు దాని పేరునే ఇష్టపడలేదు. రౌలింగ్ రచనకు ముగ్ధుడైన హేమ్యాన్ తన పని ప్రారంభించారు. అదే సినీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సినిమా ఫ్రాంచైజీ రూపకల్పనకు దారితీసింది.[11]

హేమ్యాన్ ఉత్సాహం వల్ల 1999లో రౌలింగ్ మొదటి నాలుగు హ్యారీ పాటర్ పుస్తకాల హక్కులు వార్నర్ బ్రదర్స్ సంస్థకు ఒక మిలియన్ పౌండ్లకు (20లక్షల అమెరికా డాలర్లు) అమ్ముడుపోయాయి.[12] ప్రధాన తారాగణంగా బ్రిటీష్ వారినే కొనసాగించాలని రౌలింగ్ షరతు విధించారు. అనేక ఐరిష్ నటులు, డంబుల్ డోర్ పాత్రలో నటించిన కీర్తిశేషులు రిచర్డ్ హారిస్ వంటివారిని తీసుకోవటానికి మరియు పుస్తకంలో పేర్కొనిన విధంగా ఫ్రెంచ్ మరియు తూర్పు ఐరోపా నటులను హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్‌ లో నటించటానికి అనుమతించారు.[13] హక్కులను అమ్మటానికి రౌలింగ్ సందేహించారు, ఎందుకంటే పాత్రలకు హక్కులను అమ్మడం ద్వారా ఆమె "వారికి కథ మీద పూర్తి నియంత్రణను ఇవ్వాలను కోలేదు". అలా చేసుంటే రచయితకు సంబంధంలేని కథలతో వార్నర్ బ్రదర్స్ కు సినిమాలు తీసే అవకాశం చిక్కేది.[14]

తొలి సినిమాకు దర్శకత్వం వహించడానికి మొదట స్టీవెన్ స్పీల్ బర్గ్ ను సంప్రదించినప్పటికీ ఆయన దాన్ని తిరస్కరించారు.[15] దాన్ని యానిమేషన్ సినిమాగా మలచాలని, అమెరికన్ నటుడు హాలీ జోయెల్ ఓస్మెంట్ తో హ్యారీ పాటర్ పాత్రకు మాటలు చెప్పించాలని స్పీల్ బర్గ్ అనుకున్నాడు.[16] "సినిమా నిర్మాణంలో లాభాల కోసం ఎన్నో అంచనాలుంటాయి, డబ్బాలోని బాతులను కాల్చడం వంటిదే డబ్బు సంపాదించడం అని స్పిల్ బర్గ్ చెప్పాడు. ఇది ఒక స్లామ్ డంక్ వంటిది. వందకోట్ల డాలర్లను విత్డ్రా చేసుకుని నీ వ్యక్తిగత బ్యాంకు అకౌంటులోకి వేసుకోవడం వంటింది. అక్కడ ఎలాంటి సవాలు లేదు." అని స్పీల్ బర్గ్ అభిప్రాయపడ్డారు.[17] సినిమాల దర్శకుల ఎంపికతో తనకెలాంటి సంబంధం లేదని రౌలింగ్ తన వెబ్ సైట్లో పేర్కొన్నారు. "స్పీల్ బర్గ్ ను తాను వద్దన్నట్టు ఎవరైనా అనుకుంటే వారి నుంచి త్వరిత స్పందన కోరుతున్నా" అని రౌలింగ్ అన్నారు.[18] స్పీల్బర్గ్ తరువాత క్రిస్ కొలంబస్, టెర్రీ గిల్లియం, జొనాథన్ డెమ్మి, మైక్ నెవెల్, అలన్ పార్కర్, ఊల్ఫ్గ్యాంగ్ పీటర్సన్, రాబ్ రీనెర్, టిమ్ రాబిన్స్, బ్రాడ్ సిల్బర్లింగ్ మరియు పీటర్ వెయిర్ వంటి దర్శకులతో చర్చలు జరిగాయి.[19] మార్చ్ 2000 సంవత్సరంలో పీటర్సన్, రీనెర్ ను జాబితా నుంచి తొలగించారు.[20] తర్వాత ఈ జాబితాను సిల్బర్లింగ్, కొలంబస్, పార్కర్ మరియు గిల్లియంలకు కుదించారు.[21] టెర్రీ గిలియంను రౌలింగ్ మొదట ఎంపిక చేశారు.[22] ఏదిఏమైనా మార్చ్ 28, 2000 తేదీన సినిమా దర్శకునిగా కౌలంబస్ ను వార్నర్ బ్రదర్స్ నియమించుకుంది. హోమ్ ఎలోన్ మరియు మిసెస్ డౌట్ ఫైర్ వంటి కుటుంబ కథా చిత్రాల్లో కొలంబస్ పనితీరు తమ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని ఆ సంస్థ తెలిపింది.[23]

"జీవితకాలంలో ఒకసారి వచ్చే కాలాతీత సాహిత్య సంపద హ్యారీ పాటర్. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకాలకు ఎంతో ఆదరణ లభించినందువల్ల పిల్లలు, మ్యాజిక్ అనుబంధం ఉన్న దర్శకున్ని గుర్తించడం మాకు చాలా ముఖ్యమైన అంశం. ఈ పని కోసం క్రిస్ కొలంబస్ కంటే తగిన వ్యక్తి గురించి నేను ఆలోచించలేను.

- వార్నర్ బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ లొరెంజొ డి బొనవెంతుర[23]

మొదటి సినిమాకు స్క్రీన్ ప్లే రాయడానికి స్టీవ్ క్లోవ్స్ ను ఎంచుకున్నారు. పుస్తకాన్ని సినిమాగా మలచడం చాలా క్లిష్టమైన పని ఎందుకంటే తర్వాతి రెండు పుస్తకాల మాదిరే తొలి పుస్తకాన్ని కూడా అనుకరించలేం. సినిమాగా మలచడానికి అనువైన కొన్ని పుస్తకాల సారాంశాన్ని క్లోవ్స్ కు ప్రతిపాదించారు. అందులో హ్యారీ పాటర్ ఒక్కటే ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆయన ఆ పుస్తకాన్ని కొనుకున్నాడు, అంతే అప్పటి నుంచే అభిమానిగా మారిపోయాడు. వార్నర్ బ్రదర్స్ తో మాట్లాడుతూ ఈ సినిమా బ్రిటీషరలది మరియు పాత్రలకు ప్రాణం పోయాలి అని అన్నారు.[24] చిత్ర నిర్మాతగా డేవిడ్ హేమ్యాన్ ను ఎంపిక చేశారు.[23] ఈ సినిమాకు సృజనాత్మక జోడించడానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు అప్పగించి రౌలింగ్ కు ప్రాధాన్యతనిచ్చారు. కొలంబస్ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పలేదు.[25]

తొలి సినిమాను వార్నర్ బ్రదర్స్ జులై 4, 2001లో విడుదల చేయాలనుకుంది. అయితే ఇంత తక్కువ సమయంలో నిర్మాణం చేయలేమని ప్రతిపాదిత దర్శకుల్లోని కొందరు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. తర్వాత సమయాభావం వల్ల ఈ తేదీని నవంబర్ 16, 2001గా మార్చారు.[26]

హ్యారీ, రాన్‌, హెర్మియోన్‌ల పాత్రధారణ[మార్చు]

డానియల్ రాడ్క్లిఫ్, రుపెర్ట్ గ్రింట్, మరియు ఏమ్మా వాట్సన్

2000లో దాదాపు ఏడు నెలల అన్వేషణ తర్వాత ప్రధాన పాత్రధారి డేనియల్‌ రాడ్‌క్లిఫ్‌ను హెయ్మన్ , క్లోవ్స్‌ వెదికి పట్టుకోగలిగారు. ఓ థియేటర్‌లో అతను వారికి సరిగ్గా వెనక సీట్లోనే కూర్చుని ఉండగా తొలిసారి అతన్ని చూశారు. దీని గురించి హెయ్మన్ మాటల్లోనే చెప్పాలంటే 'అక్కడ నా వెనకాలే పెద్ద పెద్ద నీలి కళ్లతో ఓ పిల్లాడు కూచుని ఉన్నాడు .అతనే డాన్‌ రాడ్‌క్లిఫ్‌. అతని పై నా తొలి అభిప్రాయం ఇదీ: అతను చాలా ఉత్సుకతతో, గమ్మత్తుగా, శక్తిమంతంగా కన్పించాడు. అతనిలో మంచి ఔదార్యం కూడా కొట్టచ్చినట్టు కన్పించింది. అలాగే మంచితనం కూడా ఉంది. అదే సమయంలో అంతులేని జ్ఞానార్తితో అతను రగిలిపోతున్నట్టు కూడా స్పష్టంగా తోచింది. ఎలాంటి తరహా జ్ఞానాన్నయినా ఒడిసి పట్టాలనే తపనను అతనిలో మేం చూడగలిగాం.'

రాడ్‌క్లిఫ్‌ 1999లోనే నటునిగా తెరంగేట్రం చేశాడు. BBC టీవీ నిర్మించిన డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్‌ ‌లో నటించాడు. అందులో కాపర్‌ఫీల్డ్‌ చిన్ననాటి పాత్రగా నటించాడు. రాడ్‌క్లిఫ్‌ను హ్యారీ పాటర్ కోసం ఆడిషన్‌కు పంపేలా అతని తల్లిదండ్రులను హెయ్మన్ ఒప్పించాడు. (దీని గురించి L.A. టైమ్స్ ఇంటర్వ్యూలో హెయ్మన్ ఇలా చెప్పాడు: ఇకముందు వచ్చే హ్యారీ పాటర్ డీవీడీలతో పాటు కానుకగా రాడ్‌క్లిఫ్‌ చరిత్రాత్మక ఆడిషన్‌ను కూడా అందజేస్తాం)[11]. రాడ్‌క్లిఫ్‌ ఫిల్మ్‌ టెస్ట్‌ను చూసిన తర్వాత రౌలింగ్‌ కూడా ఉత్సాహంగా కన్పించింది. హ్యారీ పాటర్కు అతనే సరైన ఎంపిక అని చెప్పారు.[11][27]

ఇక 2000లో కూడా పెద్దగా బయటికి తెలియని బ్రిటిష్‌ నటులు ఎమ్మా వాట్సన్‌, రూపర్ట్‌ గ్రింట్‌లను హెర్మియోన్‌ గ్రాంగర్‌, రాన్‌ వెస్లీ పాత్రల కోసం కొన్ని వేలమంది పిల్లలను ఆడిషన్‌ చేసిన తర్వాత ఎంచుకున్నారు. వారి ఎంపికకు ముందు వారికి ఉన్న అనుభవమల్లా కేవలం పాఠశాలలో నాటకాల్లో నటించడం మాత్రమే! అప్పటికి గ్రింట్‌కు 11 ఏళ్లు, వాట్సన్‌కు 10ఏళ్లు.[28]

పైన చెప్పిన హెయ్మన్ ఇంటర్వ్యూను చేసిన లాస్‌ఏంజెలెస్‌ విలేకరి జెఫ్‌ బౌచర్‌ కొన్ని విషయాలు చెప్పారు. మూడు ప్రధాన పాత్రల నటీనటులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. వారు ముగ్గురి ఎంపిక నిస్సందేహంగా గత దశాబ్దిలోకెల్లా అత్యుత్తమ షో బిజినెస్‌ నిర్ణయం. వారిలో మంచి హూందాతనం, స్థిరత్వం ఉన్నాయి. యుక్త వయస్సులోనే అలాంటివి చాలా అరుదు.[27][11]

నిర్మాణం[మార్చు]

తొలి రెండు సినిమాలు హ్యారీ పాటర్ అండ్‌ ద ఫిలాసఫర్స్‌ స్టోన్‌ , హ్యారీ పాటర్ అండ్‌ ద చాంబర్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌ కు క్రిస్‌ కొలంబస్‌ దర్శకత్వం వహించాడు. మూడో సినిమా హ్యారీ పాటర్ అండ్‌ ద ప్రిజనర్‌ ఆఫ్‌ అజ్కబన్‌ కు అల్ఫోన్సో కుయరన్‌ దర్శకుడు. నాలుగో సినిమా హ్యారీ పాటర్ అండ్‌ ద గాబ్లెట్‌ ఆఫ్‌ ఫైర్‌ దర్శకుడు మైక్‌ నెవెల్‌. ఇక ఐదో సినిమా హ్యారీ పాటర్ అండ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద ఫీనిక్స్‌ కు డేవిడ్‌ యేట్స్‌ దర్శకత్వం వహించాడు. ఈ సీరీస్ ‌లోని ఆరో సినిమా హ్యారీ పాటర్ అండ్‌ ద హాఫ్‌-బ్లడ్‌ ప్రిన్స్‌ కు కూడా ఆయనే దర్శకుడు. దాంతోపాటు ఏడోది, చివరిదీ అయిన హ్యారీ పాటర్ అండ్‌ ద డెత్‌లీ హాలోస్‌ కు కూడా ఆయనదే దర్శకత్వం.[6][29] ఈ సీరీస్ ‌లోని అన్ని సినిమాలనూ డేవిడ్‌ హెయ్మన్ నిర్మించాడు. చాంబర్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌ కు డేవిడ్‌ బారోన్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా పని చేశాడు. ఆ తర్వాత చివరి నాలుగు సినిమాలకు అతనే నిర్మాతగా వ్యవహరించాడు. తొలి మూడు సినిమాలకు కొలంబస్‌ నిర్మాత. ఫిలాసఫర్స్‌ స్టోన్‌ కు జేకే రౌలింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరించింది. తర్వాత డెత్‌లీ హాలోస్‌ కు నిర్మాతగా కూడా ఉన్నది. [30]

హాగ్వార్ట్స్ ఎక్ష్ప్రెస్స్ హ్యారీ పాటర్ లో మరియు ఫిలోసఫర్స్ స్టోన్.

దర్శకునిగా రౌలింగ్‌ తొలి ఎంపిక సహజంగానే టెర్రీ గిలియమ్‌ అయ్యాడు. కానీ కొలంబస్‌ 1985లో యంగ్‌ షర్లాక్‌ హోమ్స్‌ సినిమాకు స్క్రీన్‌ రచయితగా పని చేసిన తీరు వార్నర్‌ బ్రదర్స్‌కు బాగా నచ్చాడు. దాంతో అతన్నే దర్శకునిగా ఎంచుకున్నారు. హ్యారీ పాటర్ సీరీస్ ‌కు ఇది నిజానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే హ్యారీ, రాన్‌, హెర్మోయిన్‌లను రౌలింగ్‌ వర్ణించిన తీరు (డూడ్లీ నుంచి డ్రాకో మాల్ఫోయ్‌గా ఒక పాత్రకు పేరు మారినట్టుగా)ను ఇది గుర్తుకు తెస్తుంది. ఓ గోథిక్‌ బోర్డింగ్‌ స్కూల్లో ఒక మానవాతీత రహస్యాన్ని వారు అన్వేషిస్తుంటారు. అక్కడి సిబ్బంది (ప్రొఫెసర్‌ ఫ్లిట్విక్‌లా కన్పించే వాక్స్‌ఫ్లాటర్‌తో సహా), సినిస్టర్‌ రాథ్‌ కూడా గమ్మత్తుగా వ్యవహరిస్తుంటారు. ఆ సినిమాలోని దృశ్యాల్లో కొన్నింటిని హ్యారీ పాటర్ సీరీస్ ‌లో తొలి సినిమాకు వాడుకున్నారు.[31]

ఈ మూడు ప్రధాన పాత్రలతో పాటు పాటర్‌ సినిమాల్లో మరికొన్ని చిరస్మరణీయమైన పాత్రల్లో రాబీ కోల్ట్రేన్‌ (రూబెస్‌ హాగ్రిడ్‌ పాత్ర), అలన్‌ రిక్‌మాన్‌ (సెవెరస్‌ స్నేప్‌ పాత్ర), టామ్‌ ఫెల్టన్‌ (డ్రాకో మల్ఫోయ్‌ పాత్ర), మ్యాగీ స్మిత్‌ (మినెర్వా మెక్‌గొనాగల్‌ పాత్ర), రిచర్డ్‌ హ్యారిస్‌, మైఖేల్‌ గాంబోన్‌ (ఆల్బస్‌ డంబుల్డోర్‌ పాత్ర. ఈ పాత్రను హ్యారిస్‌ మరణానంతరం మూడో సినిమా నుంచి గాంబోస్‌ ధరిస్తూ వచ్చాడు)లను చెప్పుకోవచ్చు. ఈ సీరీస్ ‌లో మాటిమాటికీ కన్పించే ప్రముఖ పాత్రలుగా జాసన్‌ ఇసాక్‌ (లూయీస్‌ మల్ఫోయ్‌గా), గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ (సిరియస్‌ బ్లాక్‌గా), రాల్ఫ్‌ ఫినెస్‌ (లార్డ్‌ వోల్డెమార్ట్‌గా) ఉన్నారు.

స్టీవ్‌ క్లోవ్స్‌ ఒక్క ఐదో సినిమా తప్ప మిగతా అన్నింటికీ స్క్రీన్‌ ప్లేలు రాశాడు. అతనికి రౌలింగ్‌ నేరుగా సహకరించింది. అయితే క్లోవ్స్‌ను అతను అభివర్ణించినట్టు 'ట్రెమండస్‌ ఎల్బో రూమ్‌'కు ఆమె పూర్తిగా అనుమతించింది. ఒకసారి మాత్రం అతన్ని పుస్తకాల్లోని కథకు వీలైనంత దగ్గరగా ఉండాల్సిందిగా ఆమె కోరింది. అప్పుడే పుస్తకంలోని కథ, సినిమా కథనాలు ఒక్కతీరుగా ఉంటాయని చెప్పింది. సమయాభావం, బడ్జెట్‌ పరిమితుల కారణంగా, సినీ ఫక్కీ తదితరాల కోసం కొన్ని చిన్నచిన్న మార్పులు మినహా మిగతావన్నీ అలాగే తీశారు.[32] రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా సమ్మె కారణంగా క్లోవ్స్‌ అందుబాటులో లేకపోవడంతో మైఖేల్‌ గోల్డెన్‌బర్గ్‌ ఐదో సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు.

ఐదో సినిమా హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్‌ ఆఫ్‌ ద ఫీనిక్స్‌ ను 2007 జూలై 11న వార్నర్‌ బ్రదర్స్‌ విడుదల చేసింది. ఇంగ్లండ్‌, ఐర్లండ్‌ మినహా మిగతా ఇంగ్లిష్‌ మాట్లాడే దేశాల్లో 12న విడుదలైంది.[33] ఆరో సినిమా హ్యారీ పాటర్ అండ్‌ ద హాఫ్‌-బ్లడ్‌ ప్రిన్స్‌ మొత్తం సీరీస్ లో అత్యధిక వ్యయంతో తీసిన సినిమా. అది 2009 జూలై 15న విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా చూరగొంది. 2009లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో రెండో స్థానం సాధించింది!

ఇక 2010 జూన్‌ 12 శనివారం రోజున ఈ సీరీస్ లో చివరి వాయిదా నిర్మాణం పూర్తయింది. నటుడు వార్విక్‌ డేవిస్‌ తన ట్విట్టర్‌లో ఇలా చెప్పాడు. 'ఒక శకం ముగిసింది. ఈ రోజు అధికారికంగా హారీపాటర్‌ సీరీస్ ‌చిత్రీకరణకు చివరి రోజు. చిట్టచివరి ఘడియ దాకా దర్శకుని హోదాలో కట్‌లు చెబుతూ అక్కడే ఉండటం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తాను. హ్యారీ మరియు హాగ్‌వార్ట్స్‌! మీకిదే వీడ్కోలు. ఇది నిజంగా గారడీ మాదిరిగా సాగిపోయింది'. [34]

సౌండ్‌ట్రాక్‌లు[మార్చు]

జాన్ విల్లియమ్స్.

ఇప్పటిదాకా హ్యారీ పాటర్ కు నలుగురు సంగీత దర్శకులు పని చేశారు. ఈ సీరీస్ కు తొలి సంగీత దర్శకునిగా జాన్‌ విలియమ్స్‌ వచ్చాడు. హెడ్‌వింగ్‌ నేపధ్యం లో ప్రధానమైన మెలడీలన్నీ సమకూర్చాడు. ప్రతి సినిమాకూ ముందుగా ఇదే సంగీతం ఇప్పటికీ విన్పిస్తుంది. దాంతోపాటు ప్రతి సినిమాలోనూ కథ పొడవునా అది విన్పిస్తుంది. తొలి మూడు పాటర్‌ సినిమాలు ఫిలాసఫర్స్‌ స్టోన్‌ , చాంబర్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌ , ప్రిజనర్‌ ఆఫ్‌ అజ్కబన్‌ లకు విలియమ్స్‌ సంగీతం సమకూర్చాడు. అయితే విలియమ్స్‌ ఇతర సినిమాలతో ఊపిరి సలపకుండా ఉండటంతో రెండో సినిమాకు విలియమ్‌ రోస్‌ కూడా పని చేశాడు.

విలియమ్స్‌ వీడ్కోలు పలికిన తర్వాత ప్యాట్రిక్‌ డోయల్‌ నాలుగో సినిమా గోబ్లెట్‌ ఆఫ్‌ ఫైర్‌ కు పని చేశాడు. 2006లో నికోలస్‌ హూపర్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద ఫీనిక్స్‌ కు పని చేయడం మొదలు పెట్టాడు. హాఫ్‌-బ్లడ్‌ ప్రిన్స్‌ కు సౌండ్‌ట్రాక్‌ కూడా ఆయనే సమకూర్చాడు. ఈ ఇద్దరు సంగీత దర్శకులూ తమవైన సొంత నేపధ్యాలను ప్రవేశపెట్టారు. జాన్‌ విలియమ్స్‌ సెమినల్‌ మెలడీలను మాత్రం అలాగే కొనసాగిస్తూ వచ్చారు.

2010 జనవరిలో అలెగ్జాండర్‌ డెస్‌ప్లాట్‌ హ్యారీ పాటర్ అండ్‌ ద డెత్‌లీ హ్యాలోస్‌ మొదటి భాగానికి సంగీత నిర్మాతగా కుదురుకున్నాడు.[35] ఈ సినిమా పనులు వేసవిలో మొదలయ్యాయి. కోనార్డ్‌ పోప్‌ (తొలి మూడు పాటర్ సినిమాలకు ఆర్కెస్ట్రాటర్‌) డెస్‌ప్లాట్‌తో చేయి కలిపాడు. సంగీతం ఎగ్టైజింగ్‌గా, దమ్ముతో కూడినదిగా ఉందని పోప్‌ వ్యాఖ్యానించాడు. ప్రేమ గీతాలు, సత్సంబంధాలు, భావోద్వేగాల వంటివి అందరినీ అలరిస్తాయన్నాడు. ఇవన్నీ పాత రోజులను గుర్తుకు తేవడం ఖాయమని చెప్పాడు. [36]

హ్యారీ పాటర్ అండ్‌ ద డెత్‌లీ హ్యాలోస్‌ రెండవ భాగానికి సంగీతం సమకూర్చేందుకు జాన్‌ విలియమ్స్‌ తిరిగి వస్తున్నట్టు 2010 రెండో సగంలో వార్నర్‌ బ్రదర్స్‌ బ్రెజిల్‌ ప్రకటించారు. [37]కానీ ఆ సమాచారం సరికాదని ఆ తర్వాత ప్రకటన వెలువడింది. రెండవ భాగం కోసం సంగీత దర్శకుని ఎంపిక ఇంకా జరగలేదని ప్రకటన వచ్చింది. [38]

కథాంశం[మార్చు]

గ్రేట్ హాల్ చిత్రం సెట్, హాగ్వార్ట్స్

హ్యారీ పాటర్ అండ్ ది ఫిలోసోపర్స్ స్టోన్ (2001)[మార్చు]

Known in the United States and India as Harry Potter and the Sorcerer's Stone

హ్యారీ పాటర్ ఓ అనాథ పిల్లాడు. విపరీత స్వభావులైన తన అత్తామామల దగ్గర పెరుగుతాడు. 11 ఏళ్ల వయసులో రూబెస్‌ హాగ్రిడ్ అనే ఓ సగం రాక్షసుడు హ్యారీ పాటర్ కు, అతను వాస్తవానికి ఓ మాంతికుడన్న వార్తను మోసుకొచ్చి విన్పిస్తాడు. అతని తల్లిదండ్రులు ఓ అథో జగత్తు మాంత్రికుడు లార్డ్‌ వోల్డ్‌మార్ట్‌ చేతిలో చనిపోయారని చెబుతాడు. అప్పట్లో ఏడాది పిల్లాడైన హ్యారీని కూడా చంపేందుకు అతను ప్రయత్నించినా అతని హత్యా శాపం వాల్డ్‌మార్ట్‌కే బెడిసికొట్టి, అతన్ని శక్తిహీనునిగా, నిస్సహాయ రూపునిగా మార్చేసింది. హ్యారీ చాలా ప్రఖ్యాతి పొందిన మాంత్రికుడు. ఎందుకంటే మాంత్రిక జగత్తులో అతని అద్భుత ప్రదర్శనలు, సాహసాలకు హాగ్రిడ్‌ సాయమూ ఉంది. అక్కడ హోగ్‌వార్ట్స్‌ స్కూల్‌ ఆఫ్‌ విచ్ క్రాఫ్ట్ అండ్ విజార్డీలో తొలి ఏడాది చదువును హ్యారీ మొదలు పెడతాడు. అక్కడ ఇంద్రజాలంతో పాటుగా రాన్‌ వెస్లీ, హెర్మోయిన్‌ గ్రాంగర్‌ అనే ఇద్దరు మంచి మిత్రులను కూడా పొందుతాడు. ఈ ముగ్గురూ కలిసి ఫిలాసఫర్స్‌ స్టోన్‌ రహస్యాన్ని ఛేదించేందుకు పూనుకుంటారు. అది ఆ పాఠశాలలోనే ఉంటుంది.

హ్యారీ పాటర్ అండ్ ది ఛాంబర్ అఫ్ సీక్రెట్స్ (2002)[మార్చు]

హ్యారీ, రాన్‌, హెర్మోయిన్‌ ముగ్గురూ హోగ్‌వార్ట్స్‌ స్కూల్లో రెండో ఏడాది చదువు కోసం తిరిగి వస్తారు. అది తొలి ఏడాది కంటే కూడా అది సవాళ్లమయంగా వారికి తోస్తుంది. ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్ ను తెరుస్తారు. విద్యార్థులను, దెయ్యాలను కూడా ఓ రాక్షసి అంతులేని భయానికి గురి చేస్తూ ఉంటుంది. మరోవైపు సలాజర్‌ స్లైథెరిన్‌ (చాంబర్‌ వ్యవస్థాపకుడు)కు తానే అసలైన వారసుడిని చాటుకునేందుకు పలు పరీక్షలకు హ్యారీ సిద్ధపడాల్సి ఉంటుంది. తనకు పార్సెల్టంగ్‌ కూడా వచ్చని ఇంతలో హ్యారీకి తెలిసి వస్తుంది. దాని ద్వారా ఓ రహస్య డైరీలోని విషయాలను అతను తెలుసుకుంటాడు. తాను చాంబర్స్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌ లోపల చిక్కిపోయానని మాత్రమే దాని ద్వారా అతనికి అర్థమవుతుంది.

హ్యారీ పాటర్ అండ్ ది ప్రిజనర్ అఫ్ అజకబాన్ (2004)[మార్చు]

ఇక పాఠశాలలో మూడో సంవత్సరంలో హ్యారీ పాటర్ పిల్ల మాంత్రికునిగా అవతారమెత్తుతాడు. తన మిత్రులతో కలిసి మరోసారి హోగ్వార్ట్స్‌ పాఠశాలకు వెళ్తాడు. అక్కడ ప్రొఫెసర్‌ ఆర్‌జే లూపిన్‌ చీకటి విద్యలు ప్రదర్శించే టీచర్‌ నుంచి కాపాడేందుకు సిబ్బందిలో ఒకరిగా నియమితుడవుతాడు. అదే సమయంలో నేర నిర్ధారణ జరిగిన హంతకుడు సిరియస్‌ బ్లాక్‌ అజ్కబన్‌ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఈ దుర్మార్గుల బారి నుంచి హోగ్‌వార్ట్స్‌ పాఠశాల ను కాపాడే బాధ్యతను మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాజిక్‌ డిమెంటర్స్‌ ఆఫ్‌ అజ్కబన్‌కు అప్పగిస్తుంది. హ్యారీకి తన గతం గురించి మరింత సమాచారం తెలుస్తుంది. దాంతోపాటే తప్పించుకున్న ఖైదీతో తన సంబంధం గురించి కూడా తెలుస్తుంది.

హ్యారీ పాటర్ అండ్ ది గొబ్లేట్ అఫ్ ఫైర్ (2005)[మార్చు]

ఇంగ్లాండ్ ఆక్ష్ఫోర్డ్, క్రిస్ట్ చర్చ యొక్క హాలు, హాగ్వార్ట్స్ ప్రధాన హాలు లో చిత్రం చిత్రించిన స్ఫూర్తిదాయకమైన స్టూడియో.[39]

హ్యారీకి పాఠశాలలో నాలుగో సంవత్సరం సందర్భంగా ఆకాశంలో నల్లని మచ్చ కన్పిస్తుంది. క్విడిచ్‌ ప్రపంచ కప్‌ పై డెత్‌ ఈటర్‌ దాడి తర్వాత ఇది జరుగుతుంది. ట్రైవిజార్డ్‌ టోర్నమెంట్‌గా పిలిచే ఈ పౌరాణిక సన్నివేశానికి హోగ్‌వార్ట్స్‌ ఆతిథ్యమిస్తుంది. కొత్త DADA ప్రొఫెసర్‌ ఆల్‌స్టర్‌ మూడీ వచ్చి చేరతాడు. ఏడాది పొడవునా హ్యారీని పీడకలలు వేధిస్తుంటాయి. ఈ టోర్నమెంట్‌లో మూడు యూరప్‌ పాఠశాలలు కూడా పాల్గంటాయి. ప్రతి పాఠశాల నుంచీ ఒక్కో చాంపియన్‌ ప్రాతినిధ్యం వహిస్తాడు. వారంతా ప్రాణాంతక పనులు చేయాల్సి ఉంటుంది. ఫ్లూయర్‌ డెలాకోర్‌, విక్టర్‌ క్రుమ్‌, సెడ్రిక్‌ డిగొరీ పరస్పరం తలపడాలని గోబ్లెట్‌ ఆఫ్‌ ఫైర్‌ ఎంపిక చేస్తుంది. అయితే ఆసక్తికరంగా హ్యారీ పేరును కూడా గోబ్లెట్‌ వెలువరిస్తుంది. అలా ఈ పోటీల్లో పాల్గనే నాలుగో చాంపియన్‌ హ్యారీ అవుతాడు. ఇది భయానక పోటీకి దారి తీస్తుంది.

హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ అఫ్ ది ఫీనిక్స్ (2007)[మార్చు]

పాఠశాలలో హ్యారీ ఐదో ఏడాది, అతని పై లిటిల్‌ వింగింగ్‌ వద్ద పిశాచాల దాడితోనే మొదలవుతుంది. అయితే లార్డ్‌ వాల్డ్‌మార్ట్‌ తిరిగి వచ్చిన విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాజిక్‌ నిర్ధారించేందుకు తిరస్కరించిందని హ్యారీకి ఆ తర్వాత తెలిసి వస్తుంది. చికాకు పరిచే వాస్తవిక పీడ కలలతో హ్యారీ అప్పటికే విసుగెత్తి ఉంటాడు. అప్పుడు ప్రొఫెసర్‌ ఉంబ్రిడ్జ్‌ అనే మినిస్టర్‌ ఆఫ్‌ మ్యాజిక్‌ కోర్నేలియస్‌ ఫుడ్జ్‌ ప్రతినిధి డార్క్‌ ఆర్ట్స్‌ టీచర్‌ బారి నుంచి కాపాడేందుకు నూతన రక్షకునిగా నియమితుడవుతాడు. దాంతో హోగ్‌వార్ట్స్‌ విద్యార్థులు, సీక్రెట్‌ ఆర్గనైజేషన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద ఫీనిక్స్‌, మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాజిక్‌ అండ్‌ ద డెత్‌ ఈటర్స్‌ మధ్య పరస్పర పోరాటాలు మొదలవుతాయి.

హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్ (2009)[మార్చు]

హోగ్‌వార్ట్స్‌ స్కూల్‌ ఆఫ్‌ విచ్‌క్రాఫ్ట్‌ అండ్‌ విజార్డీలో హ్యారీకిది ఆరో ఏడాది. లార్డ్‌ వోల్డ్‌మార్ట్‌, అతని డెత్‌ ఈటర్లు కలిసి మాంత్రిక, మగుల్‌ ప్రపంచాల్లో భయాందోళనల్ని రేకెత్తిస్తుంటారు. పాఠశాలలో ఒక ఖాళీ ఉండటంతో దాన్ని పూరించేందుకు రావాల్సిందిగా తన మిత్రుడు, సహోద్యోగి అయిన హోరెస్‌ స్లగ్‌హోర్న్‌ను పాఠశాల ప్రిన్సిపల్‌ అల్బుస్‌ డంబుల్డోర్‌ ఒప్పిస్తాడు. అయితే స్లగ్‌హార్న్‌ పునరాగమనం వెనక అంతకంటే ప్రధాన కారణమే ఉంటుంది. ఒక పోషన్స్‌ పాఠంలో భాగంగా హ్యారీ పాటర్ కొత్తగా కన్పించే ఓ పాఠశాల పాఠ్య పుస్తకాన్ని సంపాదిస్తాడు. ఇది హాఫ్‌-బ్లడ్‌ ప్రిన్స్‌ సంపద అని దాని పై రాసి ఉంటుంది. అందులో అచ్చెరువొందించే సమాచారం ఉంటుంది. అదే సమయంలో డంబుల్డోర్‌, హ్యారీ రహస్యంగా కలిసి పని చేస్తూ వోల్డ్‌మార్ట్‌ను శాశ్వతంగా రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కోట గోడల గుండా ఏడాది పొడవునా రొమాన్స్‌, హార్మోన్సు నక్కి చూస్తుండటంతో చీకటి ప్రభువు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు డ్రాకో మల్ఫోయ్‌ నానా కష్టాలూ పడుతుంటాడు.

హ్యారీ పాటర్ అండ్‌ ద డెత్‌లీ హాలోస్‌ (2010/2011)[మార్చు]

గతేడాది చివర్లో చోటుచేసుకున్న కొన్ని అనూహ్య ఘటన నేపథ్యంలో హ్యారీ, రాన్‌, హెర్మోయిన్‌లకు లార్డ్‌ వోల్డ్‌మోర్ట్‌ అమరత్వపు రహస్యమైన ద హోర్‌క్రక్సెస్‌ను కనిపెట్టి అతన్ని మట్టుబెట్టే బాధ్యతను అప్పగిస్తారు. హోగ్‌వార్ట్స్‌లో అదే వారికి చివరి ఏడాది అని చెబుతారు. కానీ మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాజిక్‌ కుప్పకూలి, వోల్డ్‌మార్ట్‌ అధికారంలోకి రావడంతో పాఠశాలలో వారు తరగతులకు హాజరవడం సాధ్యపడదు. ఈ ముగ్గురూ ఓ పెద్ద సాహసానికి పూనుకుంటారు. కానీ దారి పొడవునా వారికి పలు అడ్డంకులు వస్తుంటాయి. డెత్‌ ఈటర్స్‌, స్నాచర్స్‌, ద మిస్టీరియస్‌ డెత్‌లీ హాలోస్‌ వంటివన్నీ అడ్డు తగులుతుంటాయి. ఇక చీకటి ప్రభువు మనసుతో హ్యారీకి అనుసంధానం మరింతగా బలపడుతుంది.

ఈ సినిమాను రెండు భాగాలు చేస్తున్నారు. తొలి భాగం 2010 నవంబర్‌ 19న విడుదల కావాల్సి ఉంది. రెండో భాగాన్ని 2011 జూలై 11న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తారాగణం[మార్చు]

ఆదరణ[మార్చు]

ఈ సీరీస్ ‌లోని సినిమాలన్నీ బ్రహ్మాండమైన విజయాలే సాధించాయి. స్టార్‌వార్స్‌ , జేమ్స్‌బాండ్‌ , ఇండియానా జోన్స్‌ , ద టెర్మినేటర్‌ , బ్యాట్‌మాన్‌ , జురాసిక్‌ పార్క్‌ , ద మ్యాట్రిక్స్‌ , ష్రెక్‌ , ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌ , స్పైడర్‌మ్యాన్‌ , పైరేట్స్‌ ఆఫ్‌ ద కరేబియన్‌ తరహాలో ఈ ఫ్రాంచైజీని కూడా హాలీవుడ్‌లోని అతి పెద్ద టెంట్‌ పోల్స్‌లో ఒకటిగా నిలబెట్టాయి.

అయితే ఈ సినిమాల పై హ్యారీ పాటర్ పుస్తక ప్రియుల అభిప్రాయాలు మొదటి నుంచీ పలు రకాలుగా ఉన్నాయి. తొలి రెండు సినిమాల్లో కథను వీలైనంతగా అనుసరించారని ఒక వర్గం భావించింది. మరో వర్గం మాత్రం తర్వాతి సినిమాల్లో శైలిని అనుసరించి జరిపిన చిత్రీకరణలకు ఓటేసింది.

దర్శకుల మార్పు కారణంగా సినిమాకు అనుసంధానాలు తెగిన తరహా భావన వచ్చిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. దాంతోపాటు డంబుల్డోర్‌ పై గాంబోన్‌ వ్యాఖ్యానం రిచర్డ్‌ హ్యారిస్‌ వ్యాఖ్యానానికి దూరంగా ఉందన్న వ్యాఖ్యలూ వచ్చాయి.

ఇక క్రిస్‌ కొలంబస్‌ తీరు మూల కథనానికి వీలైనంత సన్నిహితంగా ఉంది. వీలైనంత వరకూ పుస్తకాన్నే సినిమాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారాయన. కాకపోతే తొలి రెండు సినిమాల్లోనూ యాక్షన్‌ పరిమితి బాగా ఎక్కువై, భావోద్వేగాలకు పెద్దగా చోటే లేకుండా పోయిందని, సంభాషణల మోత కూడా మితిమీరిందని విమర్శలు బాగా వచ్చాయి. పాత్రలను బాగా ప్రదర్శించలేదని కూడా కొందరు పెదవి విరిచారు. పుస్తకాన్ని ఇలా యథాతథంగా చిత్రీకరించడంతో సినిమా కథనం బాగా నెమ్మదించిందని, ఫలితంగా సినిమా నిడివి చాలా పెరిగిందని విమర్శ వచ్చింది.

ఇక అల్ఫోన్సో క్యూరన్‌ మాత్రం మరింత నాటకీయత, కళాత్మక రీతితో కూడిన సినిమాలను నిర్మించాడు. రంగులను గాఢంగా వాడాడు.హాండ్‌హెల్డ్‌ లాంగ్‌ టేకులు తీశాడు. కొలంబస్‌ మాదిరిగా కాకుండా మరాడర్స్‌ సోర్టీ వంటి వాటిలో పని చేసిన అనుభవాన్ని ఇక్కడ అతను అన్వయించాడు. దాంతో అతని తీరును కూడా అభిమానులు విమర్శించడం మొదలైంది. విషయం కంటే కూడా నాటకీయతకే పెద్దపీట వేశారంటూ వారు పెదవి విరిచారు. హోగ్‌వార్ట్స్‌ పాఠశాలను, విద్యార్థులు కనిపించే విధానాన్ని ఆయన పూర్తిగా మార్చేయడంతో సినిమాల కథనం మధ్య సంబంధం కూడా దెబ్బ తిన్నదని చాలా మంది అభిప్రాయపడ్డారు. కాకపోతే అతని చిత్రణే మూల కథకు సమీపంగా ఉందని భావించిన వారూ లేకపోలేదు. పైగా కథను అతను శరవేగంగా నడిపే తీరు సినిమా నిడివిని బాగా తగ్గించింది. ఏదేమైనా సీరీస్ ‌ మొత్తంలో ఇదే అత్యుత్తమ సినిమా అని అటు విమర్శకులు, ఇటు అభిమానులూ భావించడం మాత్రం వాస్తవం.

ఇక మైక్‌ వెనెల్‌ తరహా ప్రధానంగా పుస్తకంలోని యాక్షన్‌ సన్నివేశాల పై దృష్టిని కేంద్రీకరించింది. దాంతోపాటు సినిమాకు థ్రిల్లర్‌ తరహా లుక్‌ తెచ్చేందుకు కాస్త చీకటిమయమైన నేపథ్యాల్లో షూటింగ్‌ జరిపారు. విద్యార్థుల మధ్య సమాగమాలు, వారి సంబంధాలను కూడా సినిమాలో చేర్చాడాయన. తద్వారా దానికి ఒక పాఠశాల అనే భావనను తీసుకొచ్చాడు. ఇక విమర్శల విషయానికి వస్తే, ఎంతసేపూ ప్రత్యేక ఎఫెక్టులు, పోరాట సన్నివేశాల పైనే వెనెల్‌ బాగా దృష్టి పెట్టాడని, ఫలితంగా సినిమాకు ప్రాణాధారమైన స్లాప్‌స్టిక్‌, పిల్లల తరహా సరదా సన్నివేశాలు తగ్గిపోయి కొనసాగింపు బాగా దెబ్బ తిన్నదని చాలామంది వ్యాఖ్యానించారు. కాకపోతే కథనం విషయంలో మాత్రం చీకటి సన్నివేశాలకు, సస్పెన్సుకు పెద్దపీట వేసిన తీరు విమర్శకుల ప్రశంసలు పొందింది. కథను తెరపై బాగా పండించారన్న పేరు కూడా వచ్చింది.

ఇక డేవిడ్‌ యేట్స్‌ తన తొలి హ్యారీ పాటర్ సినిమా ఆర్డర్‌ ఆఫ్‌ ద ఫీనిక్స్‌ కు పూర్తిగా భిన్న తరహాలో దర్శకత్వం వహించాడు. పుస్తకంలోని తీరుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు. తద్వారా ఈ సినిమా దాని ముందు సినిమాకు ఏ మాత్రమూ తీసిపోని రీతిలో చీకటిమయంగా మారేలా చూశాడు. ఇది యేట్స్‌కు తొలి అతి పెద్ద బాధ్యత. ఎందుకంటే అతను టీవీ సినిమాలు మాత్రమే అప్పటిదాకా చేస్తూ వచ్చాడు. పైగా అతను సినిమాగా రూపొందించిన పుస్తకం అప్పటిదాకా వచ్చిన అన్ని హ్యారీ పాటర్ పుస్తకాల్లోనూ అతి పెద్దది. మరోవైపు ఈ సినిమాయేమో ఇప్పటిదాకా వచ్చిన హ్యారీపాటర్‌ సీరీస్ ‌ సినిమాలన్నింట్లోనూ అతి చిన్నది! అందుకే దీన్ని చాలామంది పుస్తక ప్రియులు పెద్దగా నచ్చలేదు. పుస్తకంలోని పలు ఎత్తుగడలు, సన్నివేశాలు సినిమాలో మాయమయ్యాయన్నది వారి ప్రధాన ఆరోపణ. దాంతోపాటే ముందు సినిమాల్లోని అద్భుతమైన ఇంద్రజాలాలు, మనసును రంజింపజేసే సన్నివేశాలు కూడా లోపించాయని చెప్పుకొచ్చారు. అయితే యేట్స్‌ నిజానికి మొదల మూడు గంటల సినిమా తీశాడని చెబుతారు. కానీ వార్నర్‌ బ్రదర్స్‌ పెట్టిన సమయ పరిమితుల కారణంగా అందులోంచి దాదాపు 45 నిమిషాల నిడివిని కత్తిరించాల్సి వచ్చిందట. [40]ఈ సినిమా కథను మైఖేల్‌ గోల్డెన్‌బర్గ్‌ రాశాడు. ముందు సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన వాతావరణాన్ని అతను సృష్టించాడు. పాత సినిమాలన్నింటినీ స్టీవ్‌ క్లోస్‌ రాశాడు. పైగా ఈ సీరీస్ ‌ మొత్తంలో ఫీనిక్స్‌ ను అత్యంత భయానక, పెద్దల సినిమాగా చెబుతారు.

ఆరో సినిమా హాఫ్‌-బ్లడ్‌ ప్రిన్స్‌ కు కూడా యేట్సే దర్శకత్వం వహించాడు. ఇది 2009లోకెల్లా అత్యుత్తమ సినిమాల్లో ఒకటని చాలా మంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. అలాగే పాటర్‌ సీరీస్ ‌ సినిమాల్లోకెల్లా ఇదే హాస్యపూరిత సినిమా అని కూడా పరిగణించారు. పుస్తకంలోని మూల కథను యథాతథంగా ఉంచుతూనే పూర్తి భిన్నమైన వాతావరణాన్ని సినిమాలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. ఈ సినిమాలో హాస్యానికి పెద్దపీట వేయాలని అతను ముందే నిర్ణయించుకున్నాడు. దాంతోపాటే చీకటి కోణాలను అందులో మేళవించాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని ఈ సీరీస్ ‌లోకెల్లా కళాత్మకమైన సినిమాగా పరిగణిస్తారు. ఇది 82వ అకాడెమీ అవార్డులకు అత్యుత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో నామినేట్‌ అయింది. కానీ సినిమాలో హాస్యం, శృంగారం పాళ్లు మరీ ఎక్కువయ్యాయని ప్రేక్షకులు భావించారు. దాంతో ఉండాల్సినంతగా అధో జగత్తు చిత్రణ లేకుండా పోయిందన్న అభిప్రాయాలు కూడా బాగానే విన్పించాయి. ఇందులో తొలగించిన, కొత్తగా జోడించిన పలు సన్నివేశాల పట్ల పుస్తక ప్రియులు కూడా పెదవి విరిచారు. కాకపోతే సినిమాలో కథనం అనన్య సామాన్యంగా ఉందని ఇతరులు చాలావరకు అభిప్రాయపడ్డారు. ఇక సన్నివేశాల తొలగింపు, చేర్పులు సినిమా వాతావరణాన్ని తెచ్చే క్రమంలో తప్పనిసరి అని కూడా వారన్నారు. మొత్తానికి హాస్యం, శృంగారం, చీకటి కోణాల మేళవింపు ఈ సినిమా విజయానికి కారణంగా నిలిచింది. ఐదో సినిమాతో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా, బాగా ఉందని కూడా చాలామంది వ్యాఖ్యానించారు. సీరీస్ లోని మూడో సినిమా ప్రిజనర్‌ ఆఫ్‌ అజ్కబన్‌ తో దీన్ని చాలా మంది పోల్చి చెప్పారు కూడా. హ్యారీ పాటర్ సినిమాల సీరీస్ లో అత్యుత్తమ సినిమాగా పోటీపడే సత్తా దీని సొంతమని తేల్చారు.[41]

సీరీస్ లోని సినిమాలన్నింటికీ రౌలింగ్‌ నిత్యం సహాయపడుతూనే ఉన్నారు.[42][43][44] సీరీస్ ‌ మొత్తంలో హాఫ్‌-బ్లడ్‌ ప్రిన్స్‌ ను తనకెంతో ఇష్టమైనదిగా చెప్పారామె. [45]పుస్తకము నుండి చిత్రంగా రూపాంతరం చెందే సమయంలో జరిగే మార్పుల గురించి ఆమె తన వెబ్ సైట్ లో ఇలా రాసుకున్నారు," నాలుగు గంటల నిడివిగా చిత్రంలో కథలోని ప్రతి అంశాన్ని చొప్పించటం అసాధ్యం. నిజానికి చిత్రాలకు కాలము మరియు డబ్బు అనే కట్టుబాట్లు ఉన్నాయి కాని నవలలకు లేవు,నేను కేవలం నా యొక్క మరియు నా పాఠకుల ఊహ శక్తుల సంకర్షణ పైన నమ్మకముంచి కళ్ళు చెదరే ఫలితాలను సృష్టించగలను".[46]

బాక్స్ ఆఫీస్[మార్చు]

2010 వరకు, హ్యారీ పాటర్ అత్యధికంగా 6 చిత్రాలు విడుదల చిత్రాలు విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా $5.4 బిలియన్లు వాసాలు చేసిన అతి పెద్ద సంస్థ. ద్రవ్యోల్భం ప్రకారంగా కాడుండా, ఇధి 22 జేమ్స్ బాండ్ ఫిల్మ్స్ చిత్రాలు మరియు స్టార్ వార్స్ యొక్క ఆరు చిత్రాల సంస్థ కన్నా ఏక్కువ.[47] ఐనప్పటికీ, ద్రవ్యోల్భం ను పరిగణిస్తే స్టార్ వార్స్ సంస్థ యొక్క గ్రాస్స్ ఏక్కువుగా ఉంటుంది.[48]

సూచికల జాబితా

 • (A) అనేది ప్రస్తుత టిక్కెట్ ధరలను బట్టి సవరించిన మొత్తాలను సూచిస్తుంది. (బాక్స్ ఆఫీస్ మోజో చే లెక్కించబడినది)
చలనచిత్రం విడుదల తేదీలు రాబడి ర్యాంకు బడ్జెట్ వివరణ
సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ బయట ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్ మొత్తంలో ప్రపంచ వ్యాప్తంగా
హ్యారీ పాటర్ అండ్ ది ఫిలోసోఫేర్స్ స్టోన్ 16 నవంబరు 2001 (2001-11-16) $317,575,550 $657,158,000 $974,733,550 #23
#67(A)
#7 $125,000,000 [49][50]
హ్యారీ పోట్టర్ అండ్ ది ఛాంబర్ అఫ్ సీక్రెట్స్ 15 నవంబరు 2002 (2002-11-15) $261,988,482 $616,655,000 $878,643,482 #43
#114(A)
#18 $100,000,000 [51][52]
హరి పాటర్ అండ్ ది ప్రిసోనేర్ ఆఫ్ అజకబాన్ 4 జూన్ 2004 (2004-06-04) $249,541,069 $546,093,000 $795,634,069 #53
#147(A)
#26 $130,000,000 [53]
హరి పాటర్ అండ్ ది గొబ్లేట్ అఫ్ ఫైర్ 18 నవంబరు 2005 (2005-11-18) $290,013,036 $605,908,000 $895,921,036 #37
#111(A)
#15 $150,000,000 [54][55]
హరి పాటర్ అండ్ ది ఆర్డర్ అఫ్ ది ఫోనిక్ష్ 11 జూలై 2007 (2007-07-11) $292,004,738 $646,208,000 $938,468,864 #34
#130(A)
#9 $150,000,000 [56][57]
హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్- బ్లడ్ ప్రిన్స్ 15 జూలై 2009 (2009-07-15) $301,959,197 $627,400,204 $929,359,401 #31
#135(A)
#10 $250,000,000 [58][59]
మొత్తం $1,713,074,705 $3,699,422,204 $5,412,496,909 $905,000,000

విమర్శకుల స్వీకృతి[మార్చు]

చలనచిత్రం రోటేన్ టమేతోస్ మెటా క్రిటిక్ యాహూ! మూవీస్
మొత్తం టాప్ క్రిటిక్స్
హ్యారీ పాటర్ అండ్ ది ఫిలోసోఫేర్స్ స్టోన్ 78% (182 రివ్యూస్)[60] 74% (39 రివ్యూస్)[61] 64 (35 రివ్యూస్)[62] B (12 రివ్యూస్)[63]
హ్యారీ పోట్టర్ అండ్ ది ఛాంబర్ అఫ్ సీక్రెట్స్ 82% (198 రివ్యూస్)[64] 70% (37 రివ్యూస్)[65] 63 (35 రివ్యూస్)[66] B (14 రివ్యూస్)[67]
హరి పాటర్ అండ్ ది ప్రిసోనేర్ ఆఫ్ అజకబాన్ 90% (225 రివ్యూస్)[68] 90% (40 రివ్యూస్)[69] 81 (40 రివ్యూస్)[70] B+ (15 రివ్యూస్)[71]
హరి పాటర్ అండ్ ది గొబ్లేట్ అఫ్ ఫైర్ 88% (214 రివ్యూస్)[72] 89% (35 రివ్యూస్)[73] 81 (38 రివ్యూస్)[74] B+ (15 రివ్యూస్)[75]
హరి పాటర్ అండ్ ది ఆర్డర్ అఫ్ ది ఫోనిక్ష్ 78% (230 రివ్యూస్)[76] 69% (39 రివ్యూస్)[77] 71 (37 రివ్యూస్)[78] B (14 రివ్యూస్)[79]
హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్- బ్లడ్ ప్రిన్స్ 83% (244 రివ్యూస్)[80] 88% (38 రివ్యూస్)[81] 78 (36 రివ్యూస్)[82] B+ (14 రివ్యూస్)[83]
సగటు రేటింగులు 83% 80% 73 వర్తించదు

వీటిని కూడా పరిశీలించండి[మార్చు]

inline

inline


సూచనలు[మార్చు]

 1. Columbus Talks Potter
 2. Business Wire - Warner Bros. Pictures mentions J. K. Rowling as Producer
 3. Confirmed - Desplat DH P1
 4. 2010 జూన్ 12న పూర్తిచేయబడినది
 5. "Daniel Radcliffe, Rupert Grint and Emma Watson to Reprise Roles in the Final Two Instalments of Warner Bros. Pictures' Harry Potter Film Franchise". Warner Bros. 2007-03-23. సంగ్రహించిన తేదీ 2007-03-23. 
 6. 6.0 6.1 "WB Name Drops Big Titles". erc BoxOffice. 2009-02-23. సంగ్రహించిన తేదీ 2009-03-03. 
 7. Richards, Olly (14 March 2008). "Potter Producer Talks Deathly Hallows". Empire. సంగ్రహించిన తేదీ 14 March 2008. 
 8. 3D మరియు 2D లో DH పార్ట్ I మరియు II
 9. "All Time Worldwide Box Office Grosses". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 14 September 2009. 
 10. "Harry Potter and the Half-Blood Prince". సంగ్రహించిన తేదీ 16 July 2009. 
 11. 11.0 11.1 11.2 11.3 "Hero Complex". Los Angeles Times. 2009-07-20. సంగ్రహించిన తేదీ 2010-05-04. 
 12. "WiGBPd About Harry". Australian Financial Review. 2000-07-19. సంగ్రహించిన తేదీ 2007-05-26. 
 13. "Harry Potter and the Philosopher's Stone". London: Guardian Unlimited. 2001-11-16. సంగ్రహించిన తేదీ 2007-05-26. 
 14. Ross, Jonathan, J. K. Rowling (6 July 2007). [[Friday Night with Jonathan Ross]]. BBC One. సంగ్రహించిన తేదీ 2007-07-31.  Wikilink embedded in URL title (సహాయం)
 15. Linder, Brian (2000-02-23). "No "Harry Potter" for Spielberg". IGN. సంగ్రహించిన తేదీ 2007-07-08. 
 16. Jensen, Jeff (2000-03-17). "Potter's Field". Entertainment Weekly. సంగ్రహించిన తేదీ 2007-05-26. 
 17. "For Spielberg, making a Harry Potter movie would have been no challenge". Hollywood.com. 2001-09-05. Archived from the original on 2012-06-29. సంగ్రహించిన తేదీ 2007-05-26. 
 18. Rowling, J.K. "Rubbish Bin: J. K. Rowling "veto-ed" Steven Spielberg". JKRowling.com. సంగ్రహించిన తేదీ 2007-07-20. 
 19. Schmitz, Greg Dean. "Harry Potter and the Sorcerer's Stone (2001)". Yahoo!. సంగ్రహించిన తేదీ 2007-05-30. 
 20. Linder, Brian (2000-03-07). "Two Potential "Harry Potter" Director's Back Out". IGN. సంగ్రహించిన తేదీ 2007-07-08. 
 21. Davidson, Paul (2000-03-15). "Harry Potter Director Narrowed Down". IGN. సంగ్రహించిన తేదీ 2007-07-08. 
 22. "Terry Gilliam bitter about Potter". Wizard News. 2005-08-29. సంగ్రహించిన తేదీ 2007-07-08. 
 23. 23.0 23.1 23.2 Linder, Bran (2000-03-28). "Chris Columbus to Direct Harry Potter". IGN. సంగ్రహించిన తేదీ 2007-07-08. 
 24. Sragow, Michael (2000-02-24). "A Wizard of Hollywood". Salon. సంగ్రహించిన తేదీ 2007-07-08. 
 25. Linder, Brian (2000-03-30). "Chris Columbus Talks Potter". IGN. సంగ్రహించిన తేదీ 2007-07-08. 
 26. Brian Linder (2000-05-17). "Bewitched Warner Bros. Delays Potter". IGN. సంగ్రహించిన తేదీ 2007-07-08. 
 27. 27.0 27.1 "Young Daniel gets Potter part". BBC News. 21 August 2000. 
 28. "Daniel Radcliffe, Rupert Grint and Emma Watson bring Harry, Ron and Hermione to life for Warner Bros. Pictures' "Harry Potter and the Sorcerer's Stone"". Warner Brothers. 21 August 2000. Archived from the original on 14 April 2002. సంగ్రహించిన తేదీ 26 August 2010. 
 29. "David Yates to Direct Harry Potter and the Order of the Phoenix for Warner Bros. Pictures". Time Warner. 2005-01-19. 
 30. బిజినెస్ వైర్ - వార్నర్ బ్రోస్. పిక్చర్ మెన్షన్స్ J. K. రౌలింగ్ యాస్ ప్రొడ్యుసర్ .
 31. "IGN: Trouble Brewing with Potter Casting?". IGN. సంగ్రహించిన తేదీ 2006-07-01. 
 32. "Mzimba, Lizo, moderator. Interview with Steve Kloves and J.K. Rowling". Quick Quotes Quill. February 2003. 
 33. హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ అఫ్ ది ఫొనిక్ష్ (2007) - విడుదల తేదీలు
 34. జూన్ 2010న చిత్రం పూర్తిచేయబడినది
 35. కొంఫర్మ్ద్ - డెస్ప్లాట్ ఫర్ DH
 36. పోప్ ఆన్ డెస్ప్లాట్స్ HP7 Pt.1 స్కోర్
 37. విల్లియమ్స్ ఫర్ పార్ట్ II
 38. డెస్ప్లాట్ ఫర్ పార్ట్ II
 39. [75]
 40. [http://www.the-leaky-cauldron.org/2006/10/27/ootp-director-david-yates-i-ve-shot-a-movie-that-s-probably-over-three-hours Yates 3 Hour OOTP0
 41. HBP రేవ్యుస్ అండ్ ఇన్ఫర్మేషన్
 42. "JK "loves" Goblet Of Fire movie". BBC Newsround. 2005-11-07. సంగ్రహించిన తేదీ 2007-05-31. 
 43. Puig, Claudia (2004-05-27). "New Potter movie sneaks in spoilers for upcoming books". USA Today. సంగ్రహించిన తేదీ 2007-05-31. 
 44. "Potter Power!". Time For Kids. సంగ్రహించిన తేదీ 2007-05-31. 
 45. హాఫ్-బ్లడ్ ప్రిన్స్ ఇంటర్వ్యూ విత్ Dir. డేవిడ్ యేట్స్
 46. Rowling, J. K. "How did you feel about the POA filmmakers leaving the Marauder's Map's background out of the story? (A Mugglenet/Lexicon question)". J. K. Rowling Official Site. సంగ్రహించిన తేదీ 2007-10-08. 
 47. "Harry Potter becomes highest-grossing film franchise". London: The Guardian. 2007-11-11. సంగ్రహించిన తేదీ 2007-11-17. 
 48. "All Time Box Office Adjusted for Ticket Price Inflation". Washington, United States: Box Office Mojo. 2010-07-04. సంగ్రహించిన తేదీ 2010-07-04. 
 49. "Harry Potter and the Philosopher's Stone (2001)". Box Office Mojo. 
 50. "Harry Potter and the Philosopher's Stone - Foreign Box Office Data". The-Numbers. 
 51. "Harry Potter and the Chamber of Secrets (2002)". Box Office Mojo. 
 52. "Harry Potter and the Chamber of Secrets -Foreign Box Office Data". The-Numbers. 
 53. "Harry Potter and the Prisoner of Azkaban (2004)". Box Office Mojo. 
 54. "Harry Potter and the Goblet of Fire (2005)". Box Office Mojo. 
 55. "Harry Potter and the Goblet of Fire -Foreign Box Office Data". The-Numbers. 
 56. "Harry Potter and the Order of the Phoenix (2007)". Box Office Mojo. 
 57. "Harry Potter and the Order of the Phoenix -Foreign Box Office Data". The-Numbers. 
 58. "Harry Potter and the Half-Blood Prince (2009)". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2009-12-01. 
 59. "Harry Potter and the Half-Blood Prince - Box Office Data". The-Numbers. సంగ్రహించిన తేదీ 2009-12-11. 
 60. "Harry Potter and the Sorcerer's Stone". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 61. "Harry Potter and the Sorcerer's Stone (Top Critics)". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 62. "Harry Potter and the Sorcerer's Stone (2001): Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 63. "Harry Potter and the Sorcerer's Stone - Critics Reviews". Yahoo! Movies. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 64. "Harry Potter and the Chamber of Secrets". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 65. "Harry Potter and the Chamber of Secrets (Top Critics)". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 66. "Harry Potter and the Chamber of Secrets (2002): Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 67. "Harry Potter and the Chamber of Secrets - Critics Reviews". Yahoo! Movies. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 68. "Harry Potter and the Prisoner of Azkaban". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-07-19. 
 69. "Harry Potter and the Prisoner of Azkaban (Top Critics)". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 70. "Harry Potter and the Prisoner of Azkaban (2004): Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 71. "Harry Potter and the Prisoner of Azkaban - Critics Reviews". Yahoo! Movies. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 72. "Harry Potter and the Goblet of Fire". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-12-01. 
 73. "Harry Potter and the Goblet of Fire (Top Critics)". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 74. "Harry Potter and the Goblet of Fire (2005): Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 75. "Harry Potter and the Goblet of Fire - Critics Reviews". Yahoo! Movies. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 76. "Harry Potter and the Order of the Phoenix". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-12-01. 
 77. "Harry Potter and the Order of the Phoenix (Top Critics)". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 78. "Harry Potter and the Order of the Phoenix (2007): Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 79. "Harry Potter and the Order of the Phoenix - Critics Reviews". Yahoo! Movies. సంగ్రహించిన తేదీ 2009-06-29. 
 80. "Harry Potter and the Half Blood Prince". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-12-01. 
 81. "Harry Potter and the Half Blood Prince (Top Critics)". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-12-01. 
 82. "Harry Potter and the Half-Blood Prince (2009): Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2009-07-17. 
 83. "Harry Potter and the Half-Blood Prince - Critics Reviews". Yahoo! Movies. సంగ్రహించిన తేదీ 2009-07-17. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Harry Potter