హ్యూ జాక్‌మన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Hugh Jackman
HughJackmanApr09.jpg
Jackman at the X-Men Origins: Wolverine premiere in April 2009
జననం Hugh Michael Jackman
(1968-10-12) 12 అక్టోబరు 1968 (వయస్సు: 45  సంవత్సరాలు)
Sydney, New South Wales, Australia
వృత్తి Actor
క్రియాశీలక కాలం 1994–present
జీవిత భాగస్వామి(లు): Deborra-Lee Furness (1996-present)

హ్యూ మైఖేల్ జాక్‌మన్ (12 అక్టోబరు 1968న జననం) ఒక ఆస్ట్రేలియా నటుడు మరియు నిర్మాత. అతను చలనచిత్రం, సంగీత రంగం మరియు బుల్లితెర కార్యక్రమాల ద్వారా సుపరిచితుడు.

భారీ చిత్రాల్లో చేసిన పాత్రలు ప్రత్యేకించి యాక్షన్/సూపర్‌హీరో, పీరియడ్ మరియు శృంగార పాత్రలు జాక్‌మన్‌‌కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాయి. కేట్ & లియోపోల్డ్ , వ్యాన్ హెల్‌సింగ్ , ది ప్రెస్టిజ్ మరియు ఆస్ట్రేలియా చిత్రాల్లో ప్రధాన పాత్రలతో పాటు X-మెన్ చిత్రాల్లో వోల్వరైన్ పాత్ర ద్వారా అతనికి చక్కటి గుర్తింపు లభించింది. జాక్‌మన్ ఒక గాయకుడు, నర్తకుడు మరియు రంగస్థల యక్షగాన (సంగీత నాటకం) నటుడు. ది బాయ్ ఫ్రమ్ Oz లో పాత్రకు గాను అతను టోనీ అవార్డును గెలుచుకున్నాడు.

నవంబరు, 2008లో హ్యూ జాక్‌మన్‌ను సెక్సియస్ట్ మ్యాన్ అలైవ్‌గా ఓపెన్ సలోన్ పేర్కొంది.[1] అదే నెల తర్వాత పీపుల్ సంచిక కూడా జాక్‌మన్‌ను "సెక్సియస్ట్ మ్యాన్ అలైవ్"గా పేర్కొంది.[2]

టోనీ అవార్డులకు మూడు పర్యాయాల అతిధేయుడైన అతను అందులో ఒకానొక ఆతిథ్యానికి గాను ఎమ్మీ అవార్డును గెలుచుకున్నాడు. అంతేకాక 22 ఫిబ్రవరి 2009న జరిగిన 81వ అకాడమీ అవార్డుల ఉత్సవానికి కూడా అతను ఆతిథ్యం వహించాడు.[3]

బాల్యం[మార్చు]

హ్యూ జాక్‌మన్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌లో ఉన్న సిడ్నీలో జన్మించాడు. ఆంగ్లేయ దంపతులు క్రిస్ జాక్‌మన్ మరియు గ్రేస్ వాట్సన్‌లకు పుట్టిన ఐదుగురు సంతానంలో అతను ఆఖరివాడు. అంతేకాక ఆస్ట్రేలియాలో జన్మించిన తన తోబుట్టువుల్లో అతను రెండోవాడు(అతనికి ఒక సోదరి కూడా ఉంది).[4][5] అతనికి ఎనిమిదేళ్లున్నప్పుడు అతని తల్లి కుటుంబాన్ని విడిచిపెట్టింది. దాంతో అతను వృత్తిరీత్యా గుమస్తాయైన తన తండ్రి మరియు తోబుట్టువులతోనే ఉండేవాడు.[6]

హ్యు తొలుత పింబుల్ పబ్లిక్ స్కూల్‌లోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవాడు. అనంతరం అఖిల బాలుర నాక్స్ గ్రామర్ స్కూల్‌లో చేరాడు. 1985లో అక్కడ రూపొందించిన మై ఫెయిర్ లేడీ లో జాక్‌మన్ నటించాడు. తద్వారా 1986లో అదే పాఠశాలకు నాయకుడయ్యాడు.[7] గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, ఇంగ్లాండ్‌లోని ఉప్పింగ్‌హామ్ స్కూల్‌లో పనిచేస్తూ విరామ ఏడాదిని గడిపాడు. ఆస్ట్రేలియాకు తిరిగొచ్చిన అనంతరం అతను సిడ్నీలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. 1991లో కమ్యూనికేషన్స్ విభాగంలో BA పూర్తి చేశాడు.[8] BA పూర్తయ్యాక జాక్‌మన్ సిడ్నీలోని యాక్టర్స్ సెంటర్‌లో ఏడాది పాటు "ది జర్నీ" కోర్సు చేయడానికి 1991లో అక్కడకు వెళ్లాడు.[4]

దానిని పూర్తి చేశాక అత్యంత ప్రజాదరణ పొందిన నైబర్స్ అనే ధారావాహికంలో నటించే అవకాశం అతనికి లభించింది. అయితే వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉన్న ఎడిత్ కోవన్ యూనివర్శిటీకి చెందిన వెస్ట్రర్న్ ఆస్ట్రేలియన్ అకడెమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ తరగతులకు హాజరుకావడానికి అందివచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు.[9] అదే యూనివర్శిటీ నుంచి అతను 1994లో డిగ్రీ పుచ్చుకున్నాడు.[10]

జీవనం[మార్చు]

ప్రాథమిక రంగస్థల, చలనచిత్ర మరియు బుల్లితెర కార్యకలాపాలు[మార్చు]

స్థానిక వాల్ట్ డిస్నీ నిర్మాణంలో రూపొందిన బ్యూటీ అండ్ ది బీస్ట్ చిత్రంలో మెల్బోర్న్ వేదికపై జాక్‌మన్ గాస్టన్ పాత్రను పోషించాడు. సన్‌సెట్ బౌలివార్డ్ చిత్రంలో జో గిల్స్ నటించాడు. మెల్బోర్న్‌లో రంగస్థల యక్షగాన కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు 1998లో మిడ్‌సుమ్మా (స్వలింగ సంపర్కుల వార్షికోత్సవం) ఉత్సవం సందర్భంగా రూపొందించిన సుమ్మా కేబరెట్ చిత్రంలోనూ అతను నటించాడు. అలాగే మెల్బోర్న్‌లోని కార్లోస్ బై కేండిల్‌లైట్ మరియు సిడ్నీలోని కార్లోస్ ఇన్ ది డొమైన్ కార్యక్రమాలకు కూడా అతను ఆతిథ్యం వహించాడు.

జాక్‌మన్ తొలుత ఎర్స్‌కినివిల్లే కింగ్స్ మరియు పేపర్‌బ్యాక్ హీరో (1999) చిత్రాలు, కరిల్లి (ABC ఛానల్‌లో ప్రసారమైన 10 ఘట్టాల నాటకం. అది వృత్తిపరంగా జాక్‌మన్ చేసిన మొట్టమొదటి ప్రాజెక్టు. దానిని ఆస్ట్రేలియా నటి డినైస్ రాబర్ట్స్ రూపొందించింది. అందులో తనకు కాబోయే భార్యను డెబోరా-లీ ఫర్నెస్‌ కూడా జాక్‌మన్ కలుసుకున్నాడు), లా ఆఫ్ ది ల్యాండ్ , హాలిఫాక్స్ f.p , బ్లూ హీలర్స్ మరియు బాంజో పీటర్సన్స్ ది మ్యాన్ ఫ్రమ్ స్నోవీ రివర్‌ వంటి బుల్లితెర కార్యక్రమాల్లోనూ అతను నటించాడు.

అంతర్జాతీయ కీర్తి[మార్చు]

====ఓక్లహోమా!==== లండన్‌లోని వెస్ట్‌‍‌ఎండ్‌లో ఉన్న రాయల్ నేషనల్ థియేటర్‌లో ప్రశంసలందుకున్న రంగస్థల నాటకం ఓక్లహోమా! లో ప్రధాన పాత్రను పోషించడం ద్వారా జాక్‌మన్ కీర్తి 1998లో తొలిసారిగా ఆస్ట్రేలియా ఎల్లలు దాటింది. అందులో ఉత్తమ ప్రదర్శనకు గాను అతను రంగస్థల నాటక ఉత్తమ నటుడుగా ఆలివియర్ అవార్డుకు ఎంపికయ్యాడు. అంతేకాక 1999లో చలనచిత్రంగా రూపొందించిన అదే రంగస్థల నాటికలోనూ నటించాడు. దానిని పలు దేశాల్లో ప్రదర్శించారు.

X-మెన్[మార్చు]

2000లో బ్రియాన్ సింగర్ యొక్క X-మెన్ చిత్రంలో వోల్వరైన్ పాత్రను డౌగ్రే స్కాట్ స్థానంలో జాక్‌మన్ పోషించాడు. అతని సహనటులుగా ప్యాట్రిక్ స్టివార్ట్, జేమ్స్ మార్స్‌డెన్, ఫంకీ జాన్సీన్ మరియు ఇయాన్ మెక్‌కెల్లెన్ నటించారు. నవంబరు, 2006లో CBS నిర్వహించిన ఒక ఇంటర్వూ ప్రకారం, ఆ పాత్రను చేయొద్దని జాక్‌మన్ భార్య డెబోరా-లీ ఫర్నెస్ అతనికి సూచించింది. తన మాటను అతను ఉపేక్షించినందుకు సంతోషంగా ఉండానని తర్వాత ఆమె అతనితో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

వాస్తవిక హాస్యప్రధాన పుస్తకంలో వోల్వరైన్ ఎత్తు 5' 3"గా పేర్కొనబడింది. అయితే 6'2 1/2 (1.83 m)[11] ఎత్తున్న జాక్‌మన్ దాని పొడవు కంటే అడుగు ఎక్కువ.[12] అందువల్ల జాక్‌మన్‌ను తరచూ అసాధారణ కోణాల్లో దర్శకులు చిత్రీకరించాల్సి వచ్చేది లేదా అతని వాస్తవ ఎత్తు కంటే తక్కువగా చూపించడానికి నడుం పైభాగం నుంచి మాత్రమే షూట్ చేసేవారు. అతని సహనటులు సమతలమైన చెప్పు అడుగట్టలు ధరించేవారు. ఆ పాత్ర కోసం జాక్‌మన్ కండరాలు పెంచాల్సి వచ్చింది. వరుసగా నాలుగో చిత్రానికి సన్నద్ధమవడంలో భాగంగా అతను సుమారు 300 పౌండ్లకు పైగా బరువును ఎత్తాడు.[13] ఈ చిత్రానికి ముఖ్యమైన నటుడైన జాక్‌మన్ 2003లో విడుదలయిన X-మెన్ 2 , 2006 వెర్షన్X-Men: The Last Stand మరియు 1 మే 2009న విడుదలయిన X-మెన్ 4X-Men Origins: Wolverine కు సంబంధించిన తన పాత్రను మళ్లీ చేశాడు.

2001[మార్చు]

2001లో విడుదలయిన శృంగార హాస్యకథా చిత్రం కేట్ & లియోపోల్డ్ ‌లో జాక్‌మన్ లియోపోల్డ్‌ పాత్రను పోషించాడు. అతని సరనస మెగ్ రియాన్ నటించింది. బెస్ట్ యాక్టర్ మోషన్ పిక్చర్ మ్యూజికల్ ఆర్ కామెడీకి గాను అతను గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికయ్యాడు. విక్టోరియా ఆంగ్లేయ రాజప్రతినిధి పాత్రను పోషించిన జాక్‌మన్ అనుకోకుండా 21వ శతాబ్దపు మన్‌హట్టన్‌కు వెళతాడు. అక్కడ సిగ్గుమాలిన అడ్వర్టైజింగ్ ప్రతినిధి కేట్‌ను కలుసుకుంటాడు.

2001లో జాన్ ట్రావోల్టా మరియు హల్లే బెర్రీలతో కలిసి స్వార్డ్‌ఫిష్ అనే యాక్షన్/డ్రామాలో కూడా జాక్‌మన్ నటించాడు. బెర్రీతో నటించడం జాక్‌మన్‌కు అది రెండోసారి. అంతేకాక పలు X-మెన్ చిత్రాల్లో వారిద్దరూ కలిసి పనిచేశారు. 2000 నుంచి 2006 వరకు విడుదలయిన మొత్తం నాలుగు X-మెన్ చిత్రాల్లోనూ జాక్‌మన్ మరియు బెర్రీ నటించారు. అంతేకాక 2001లో "శాటర్‌డే నైట్ లైవ్" కార్యక్రమం యొక్క ఒక ఎపిసోడ్‌కు అతను ఆతిథ్యం వహించాడు.[14]

2002–2009 మధ్య రంగస్థల కార్యక్రమాలు[మార్చు]

2002లో కార్నిజీ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి సందర్భంగా కరౌసెల్ అనే యక్షగాన కార్యక్రమం (సంగీత నాటకం)లో బిల్లీ బిజీలో పాత్రను సెయింట్ లూక్స్ వాద్యబృందంతో కలిసి జాక్‌మన్ ఆలపించాడు.

విజయవంతమైన యక్షగాన కార్యక్రమం (సంగీత నాటకం) ది బాయ్ ఫ్రమ్ Oz కు సంబంధించి ఆస్ట్రేలియా పాటల రచయిత మరియు నటుడు పీటర్ అలెన్‌కు సంబంధించిన అతని 2003-2004 బ్రాడ్‌వే చిత్రీకరణకు గాను యక్షగానంలో అత్యుత్తమ నటుడుగా జాక్‌మన్ 2004లో టోనీ అవార్డు మరియు డ్రామా డెస్క్ అవార్డును గెలుచుకున్నాడు. 2006లో ఆస్ట్రేలియాలో జరిగిన అదే కార్యక్రమంలోనూ అతను నటించాడు.

దానికి తోడు 2003, 2004 మరియు 2005ల్లో నిర్వహించిన టోనీ అవార్డుల కార్యక్రమానికి జాక్‌మన్ ఆతిథ్యం వహించాడు. అది సానుకూల సమీక్షలకు దోహదపడింది. 2004 టోనీ అవార్డులకు ఆతిథ్యం వహించడం ద్వారా 2005లో వైవిధ్య, యక్షగాన లేదా హాస్య కార్యక్రమానికి సంబంధించి విశిష్ట వ్యక్తిగత నటుడుగా అతను ఎమ్మీ అవార్డును గెలుచుకున్నాడు.

ఎ స్టెడీ రెయిన్ చిత్రం కోసం బ్రాడ్‌వేలో ఉన్న షోయెన్‌ఫెల్డ్ థియేటర్‌లో డేనియల్ క్రెయిగ్‌తో కలిసి జాక్‌మన్ పరిమిత పాత్రను పోషించాడు. ఈ చిత్రం యొక్క ప్రదర్శనలు 10 సెప్టెంబరు 2009న మొదలై 6 డిసెంబరు 2009తో ముగిశాయి.[15]

2003–2008 మధ్య చలనచిత్రాలు[మార్చు]

2003లో విడుదలయిన X2: X-మెన్ యునైటెడ్ తర్వాత 2004లో వ్యాన్ హెల్‌సింగ్ చిత్రంలోని గాబ్రియెల్ వ్యాన్ హెల్‌సింగ్ పేరు కలిగిన రాక్షసిని హతమార్చే ప్రధాన పాత్రను పోషించాడు. బ్రూస్ A. మెక్‌క్లెల్లాండ్ రాసిన "స్లేయర్స్ అండ్ దెయిర్ వేంపైర్స్ : ఎ కల్చరల్ హిస్టరీ ఆఫ్ కిల్లింగ్ ది డెడ్" పుస్తకంలోని సరికొత్త వ్యాన్ హెల్‍‌సింగ్ పాత్రలో అతను కనిపించాడు.

అంతేకాక 2005లో జేమ్స్ బాండ్ మరియు 2006లో క్యాసినో రాయల్ చిత్రాలకు జాక్‌మన్‌ ఒకానొక ఎంపికగా ఉన్నాడు. అయితే చివరకు అవకాశం డేనియల్ క్రెయిగ్‌ను వరించింది.[16]

2006లో క్రిస్టోఫర్ నోలాన్ రూపొందించిన ది ప్రెస్టిజ్ అనే చిత్రంలో జాక్‌మన్ నటించాడు. అందులో క్రిస్టియన్ బాలే, మైఖేల్ కెయిన్ మరియు స్కార్లెట్ జోహన్సన్ ఇతర పాత్రధారులు. రాబర్ట్ ఏంజియర్ మాదిరిగా జాక్‌మన్ ఒక ఇంద్రజాలికుడుగా నటించాడు. మాయా విద్యలో ఒకరిపై మరొకరు 'పైచేయి' సాధించే ప్రయత్నంలో భాగంగా సమకాలీకుడు అల్ఫ్రెడ్ బోర్డన్‌తో అతను వైరం పెంచుకున్నాడు. ది ప్రెస్టిజ్ చిత్రాన్ని చేయడానికి ప్రధాన కారణం శాస్త్రవేత్త నికోలా టెస్లా పాత్రను పోషించిన స్వరకర్త బౌతో పనిచేయడం కోసమేనని జాక్‌మన్ చెప్పాడు.

డారెన్ అరోనాఫ్‌స్కై రూపొందించిన శాస్త్రీయ కాల్పనిక చిత్రం ది ఫౌంటెయిన్‌ లో జాక్‌మన్ మూడు పాత్రలు పోషించాడు. మెదడు వాపు వ్యాధితో మరణంతో పోరాడే తన భార్య ఇజ్జి (రేచెల్ వీజ్) మరియు ఆమెకు నయం చేయడానికి తీవ్రంగా పరిశ్రమించడం మధ్య నలిగిపోయే న్యూరోసైంటిస్ట్ (మెదడుపై అధ్యయనం చేసే శాస్త్రవేత్త) టామీ క్రియోగా, 1532లో సెవిల్లాలో స్పెయిన్ సాహసి కెప్టెన్ థామస్ క్రియోగా మరియు జీవావరణ-అంతరిక్ష వాహనంలో నభో మండలంలోకి ప్రయాణించే భవిష్యత్ వ్యోమగామిగా మరియు తన భార్యను తిరిగి చేరుకోవాలని ఎదురుచూసే టామ్ పాత్రలోనూ కన్పించాడు. భౌతికపరమైన మరియు ఉద్వేగభరితమైన అంశాలు ఎక్కువగా ఉన్నందున తాను నటించిన చిత్రాల్లో ది ఫౌంటెయిన్ అత్యంత కష్టమైనదని జాక్‌మన్ పేర్కొన్నాడు.

2006లో వుడీ అలెన్ రూపొందించిన స్కూప్ చిత్రంలో జాక్‌మన్ నటించాడు. అందులో అతని సరసన స్కార్లెట్ జోహన్సన్ నటించింది. రెండు యానిమేటెడ్ చిత్రాల ద్వారా అతను 2006 ఏడాదిని ముగించాడు. అందులో జార్జ్ మిల్లర్ రూపొందించిన హ్యాపీ ఫీట్ చిత్రంలో చక్రవర్తి సముద్రపు కాకి మెంఫిస్ పాత్రకు అతను గాత్రదానం చేశాడు. అలాగే ఫ్లష్డ్ అవే అనే మరో చిత్రంలో రోడీ పేరు కలిగిన ఎలుకకు గాత్రం అరువిచ్చాడు. ఇంట్లో ఉండే టాయిలెట్‌లో పడి లండన్‌లోని పారిశుధ్య వ్యవస్థలోకి కొట్టుకుపోవడం ద్వారా అది తనువు చాలిస్తుంది. ఫ్లష్డ్ అవే చిత్రంలో కేట్ విన్స్‌లెట్ మరియు ఇయాన్ మెక్‌కెల్లెన్ (జాక్‌మన్‌తో అతనికిది నాలుగో చిత్రం)కలిసి నటించారు.

2007లో జాక్‌మన్ నిర్మించి, అతిథి పాత్రలో కన్పించిన బుల్లితెర యక్షగాన-హాస్యప్రధాన నాటకం వివా లాఫ్‌లిన్‌ రెండు ఘట్టాలు పూర్తి చేసుకున్న అనంతరం CBS దానిని రద్దు చేసింది. రద్దు సందర్భంగా అప్పటికే చిత్రీకరించిన మిగిలిన ఘట్టాల (ఎపిసోడ్లు)పై నిర్ణయాన్ని ఇప్పటి వరకు తీసుకోలేదు.

2008లో డిసెప్షన్ (ఈ చిత్రంలో జాక్‌మన్ నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు), అంకుల్ జానీ మరియు ఆస్ట్రేలియా చిత్రాల్లో జాక్‌మన్ నటించాడు.

ఆస్ట్రేలియా[మార్చు]

2008లో దర్శకుడు బజ్ లహ్రమన్ ఎక్కువగా ప్రచారం చేసిన పౌరాణిక చిత్రం ఆస్ట్రేలియా కోసం రస్సెల్ క్రో స్థానంలో జాక్‌మన్‌కు ప్రధాన పాత్రధారుడిగా అవకాశం కల్పించాడు. అతని సరసన నికోలే కిడ్‌మన్ నటించింది. ఈ చిత్రం ఆస్ట్రేలియా మరియు U.S లో నవంబరు, 2008 ఆఖర్లో విడుదలయింది.

క్లిష్టమైన, స్వతంత్ర పశువుల కాపరిగా నటించిన జాక్‌మన్ స్త్రీలోలుడైన తన భర్తకు చెందిన ఆస్ట్రేలియా పశువుల కేంద్రం మరియు అక్కడ తనకు కనిపించిన సంకరజాతి ఆదిమ శిశువును కాపాడేందుకు తపనపడే ఒక ఆంగ్లేయ సంపన్నురాలికి అయిష్టంగా సాయపడుతుంటాడు.

ఈ చిత్రానికి సంబంధించి జాక్‌మన్ ఇలా చెప్పాడు, "సన్నివేశం పూర్తిగా నాకు నేనుగా బాగా ఇబ్బంది పడిన పాత్రల్లో ఇదొకటి. నాకు ఒక భారీ బడ్జెట్‌ చిత్రానికి అవకాశం వచ్చింది. అయితే సిగ్గులేకుండా నా స్వదేశ చరిత్రలోనే ఒకానొక అత్యంత అశాంతి పరిస్థితిపై పురాతన శృంగార కావ్యాన్ని తీయాల్సి వచ్చింది. మరోవైపు అదే సమయంలో దేశం యొక్క సహజ అందం, దాని ప్రజలు, దాని సంస్కృతులు సంబంరంగా నడుస్తున్నాయి.... నా CV ద్వారా ఈ చిత్రాన్ని పొందానని తెలుసుకుని ఒక సంతోషకరమైన వ్యక్తిగా నేను మరణిస్తాను"[17]

భవిష్యత్ ప్రాజెక్టులు[మార్చు]

  • జాక్‌మన్ నటిస్తున్న యాక్షన్ డ్రామా డ్రైవ్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.[18]
  • 2010లో విడుదల చేయాలనుకుంటున్న కరౌసెల్ పునర్నిర్మాణంలోనూ నటించాలని జాక్‌మన్ అనుకుంటున్నాడు. ఇందులో అతను బిల్లీ బిజీలో పాత్రను పోషించనున్నాడు.[19][20]
  • చలనచిత్రంగా తీయనున్న ఆండ్రూ లాయిడ్ వెబ్బర్ యక్షగానం సన్‌సెట్ బౌలివా‌ర్డ్‌ కు సంబంధించి జో గిల్స్ పాత్రను తిరిగి చేయడానికి ఇవాన్ మెక్‌గ్రెగార్‌తో పాటు జాక్‌మన్‌ పేరును పరిశీలిస్తున్నారు.[21]
  • U.S. ప్రచురణ సంస్థ వర్జిన్ కామిక్స్‌ మరియు రచయిత మార్క్ గుగ్గెన్‌హీమ్‌తో కలిసి నౌహియర్ మ్యాన్ అనే సరికొత్త హాస్య పుస్తక మాలను రూపొందించడంపై కూడా జాక్‌మన్ ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడు. అదే పుస్తకం సాయంతో ఒక చలనచిత్రాన్ని తీయాలని కూడా అతను భావిస్తున్నాడు.[22]
  • అన్‌బౌండ్ కేపిటివ్స్ పేరుతో 2010లో విడుదలకానున్న చిత్రంలోనూ జాక్‌మన్ నటించనున్నాడు. అందులో అతని సరసన గతంలో నటించిన రేచెల్ వీజ్ మరియు రాబర్ట్ ప్యాటిన్సన్ కూడా నటించనున్నారు.[23]
  • P.T. బార్నమ్ జీవితచరిత్ర ఆధారంగా రూపొందనున్న సమకాలీన యక్షగానం (సంగీత నాటకం) ది గ్రేటెస్ట్ అమెరికన్ షోమ్యాన్‌ లోనూ జాక్‌మన్ నటించనున్నాడు. అందులోని నటి యొక్క ప్రేమాభిరుచికి సంబంధించిన భాగాన్ని అన్నె హాత్‌వేను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నారు.[24]
  • అలాగే జపాన్‌లో చిత్రీకరణ జరుపుకోనున్న వోల్వరైన్ 2 చిత్రంలోనూ జాక్‌మన్ నటించనున్నాడు.
  • రియల్ స్టీల్ (2011) అనే ఒక డ్రీమ్‌వర్క్స్ శాస్త్రీయ కాల్పనిక చిత్రంలోనూ నటించనున్నాడు.[25][26]

నిర్మాణ సంస్థ[మార్చు]

సీడ్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పడానికి జాక్‌మన్ తన సుదీర్ఘకాల సహాయకుడు జాన్ పలెర్మోతో 2005లో చేతులు కలిపాడు. దాని నుంచి 2007లో తొలుత వివా లాఫ్‌లిన్ విడుదలయింది. ఈ సంస్థ కార్యకలాపాల్లో జాక్‌మన్ భార్య, నటి డెబోరా-లీ ఫర్నెస్ కూడా పాలుపంచుకుంది. "ఐకమత్యం" అనే అర్థమొచ్చే విధంగా రాసిన మూడు ఉంగరాలను తనతో పాటు ఫర్నెస్‌ మరియు జాక్‌మన్‌లకు తయారు చేయించాడు.[27] తమ త్రయం యొక్క సహకారం గురించి జాక్‌మన్ ఇలా అన్నాడు. "డెబోరా మరియు జాన్ పలెర్మోలు నాకు భాగస్వాములుగా దొరకడం మరియు వారితో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఇది తప్పక ఫలిస్తుంది. మాకు ఒక్కోక్కరికి ఒక్కో రకమైన బలాలు ఉన్నాయి. దానిని నేను ఇష్టపడుతున్నాను. అది చాలా ఉద్వేగాన్ని కలిగిస్తోంది."[28]

కార్యనిర్వాహకులు అమందా ష్వీట్జర్, కత్రిన్ టంబ్లిన్, అలాన్ మండెల్‌ బౌమ్ మరియు జో మరినోలను చేర్చుకోవడం ద్వారా ఫాక్స్‌కు చెందిన సీడ్ లేబుల్ పరిమాణం పెరిగింది. సిడ్నీలోని నిర్మాణ సంస్థ కార్యాలయ నిర్వహణ బాధ్యతలను అలానా ఫ్రీ చేపట్టాడు. జాక్‌‌మన్ స్వదేశంలోని స్థానికుల ప్రతిభను వెలికి తీసి, వారితో నిరాడంబర చిత్రాలు చేయాలన్నది అతని లక్ష్యం.

ఇతర అభిరుచులు[మార్చు]

సేవా కార్యక్రమాలు[మార్చు]

పరోపకారిగా జాక్‌మన్ సూక్ష్మరుణ సుదీర్ఘకాల ప్రతిపాదకుడు. అంటే అభివృద్ధి చెందని దేశాల్లోని పేదరికంలో ఉన్న భావి పారిశ్రామికవేత్తలకు చిరు రుణాలను మరింతగా అందించడం. 2006లో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్న సూక్ష్మరుణ వైతాళికుడు మహ్మద్ యూనస్‌కు అతను బహిరంగంగా గట్టి మద్దతిచ్చేవాడు.[29][30][31]

గ్లోబల్ పావర్టీ ప్రాజెక్టుకు అంతర్జాతీయ సలహాదారుడైన జాక్‌మన్ దాని కోసం ఒక డాక్యుమెంటరీ[32] ని తయారు చేశాడు. దానికోసం అతను మరియు ప్రాజెక్టు వ్యవస్థాపకుడు హ్యూ ఎవాన్స్ కలిసి UNను సందర్శించారు.[33]. గ్లోబల్ పావర్టీ ప్రాజెక్టు తాలూకూ నమూనా యొక్క ప్రత్యేక ప్రదర్శనను డొన్నా కర్రన్‌, లిసా ఫాక్స్ మరియు తన భార్య డెబోరా-లీతో కలిసి జాక్‌మన్ న్యూయార్క్‌లో ప్రదర్శించాడు.[34] అంతేకాక అతను వరల్డ్ విజన్ యొక్క ప్రచారకర్త కూడా. 21 సెప్టెంబరు 2009న జరిగిన NYC పర్యావరణ వారోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు.[35][36]

ది ఆర్ట్ ఆఫ్ ఎలీసియం[37] మరియు MPTV ఫండ్ ఫౌండేషన్‌[38] కు జాక్‌మన్ తన వంతు సాయం చేస్తున్నాడు. అలాగే అతను మరియు అతని భార్య డెబోరా-లీ ఫర్నెస్ ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాలోని బోన్ మారో ఇన్‌స్టిట్యూట్ యొక్క ప్రధాన పోషకులు.[39] ది బర్నింగ్ సీజన్ పేరుతో జాక్‌మన్ భూతాపంపై 2008లో ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందించాడు.[40]

సేవా సంస్థ కోసం జాక్‌మన్ తన ట్విట్టర్ ఖాతాను కూడా వినియోగిస్తున్నాడు. 14 ఏప్రిల్ 2009న లాభాపేక్ష లేని ఒక వ్యక్తిగత సంస్థకు తాను $100,000 విరాళం అందజేస్తున్నట్లు జాక్‌మన్ తన ట్విట్టర్ పేజీలో వెల్లడించాడు.[41] 21 ఏప్రిల్ 2009న చారిటీ:వాటర్‌కు $50,000 మరియు ఆపరేషన్ ఆఫ్ హోప్‌కు $50,000 విరాళం అందజేస్తున్న విషయాన్ని జాక్‌మన్ బహిర్గతం చేశాడు.[42][43]

బ్రాడ్‌వే కేర్స్/ఈక్విటీ ఫైట్స్ AIDS నిధుల సమీకరణ చరిత్రలో హ్యూ జాక్‌మన్ మరియు డేనియల్ క్రెయిగ్ ఇద్దరూ తమ కంటూ విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. దానిని 8 డిసెంబరు 2009న ప్రకటించిన తర్వాత వారిద్దరూ 21వ వార్షిక జిప్సీ ఆఫ్ ది ఇయర్ పోటీ ద్వారా $1,549,953 సమీకరించారు. విజయవంతమైన తమ బ్రాడ్‌వే నాటకం ఎ స్టెడీ రెయిన్‌ ‌లో సుమారు ఆరు వారాల పాటు పదే పదే విజ్ఞప్తులు చేయడం ద్వారా వారు అంత మొత్తాన్ని సమీకరించారు.[44]

క్రీడలు[మార్చు]

వివిధ క్రీడల పట్ల జాక్‌మన్ ఆసక్తిని కనబరిచేవాడు. హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు అతను రగ్బీ మరియు క్రికెట్ ఆడేవాడు. అంతేకాక హై జంప్‌ఇంగ్‌లో పాల్గొనడంతో పాటు స్విమ్మింగ్ జట్టు సభ్యుడు కూడా.[45] అలాగే అతను బాస్కెట్‌బాల్ మరియు కయాకింగ్ కూడా ఆడేవాడు.[46] ఫుట్‌బాల్‌పై కూడా ఆసక్తిని కనబరిచిన అతను నార్విచ్ సిటీ FCకి తన వంతు సాయమందించాడు.

ఉత్తర సిడ్నీలోని ఒక NRL క్లబ్‌ మ్యాన్లీ వారింగా సీ ఈగల్స్‌కు జాక్‌మన్ దీర్ఘకాల అభిమాని మరియు మద్దతుదారుడు.[47] 1999 NRL గ్రాండ్ ఫైనల్లో అతను జాతీయగీతం కూడా ఆలపించాడు.[48] స్కై స్పోర్ట్స్ సాకర్ AM సందర్భంగా తాను నార్విచ్ సిటీ F.C అభిమాని అని హ్యూ వెల్లడించాడు.[49]

జాక్‌మన్ పియానో[50] ను కూడా వాయించగలడు. రోజూ[51] యోగా చేసే అతను స్కూల్ ఆఫ్ ప్రాక్టికల్ ఫిలాసఫీలో 1992 నుంచి సభ్యుడు కూడా.[52]

వ్యక్తిగత జీవితం[మార్చు]

జాక్‌మన్ 11 ఏప్రిల్ 1996న డెబోరా-లీ ఫర్నెస్‌ను వివాహం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బుల్లితెర ధారావాహికం కరిల్లి సందర్భంగా వారిద్దరూ ఒకరినొకరు కలిశారు. నిశ్చితార్థానికి ఫర్నెస్ కోసం జాక్‌మన్ వ్యక్తిగతంగా ఒక బంగారు ఉంగరాన్ని తయారు చేయించాడు. అంతేకాక తమ పెళ్లి ఉంగరాలపై "ఓం పరామర్ మైనమార్," అనే సంస్కృత అక్షరాలను రాయించాడు. "మా కలయికను ఒక గొప్ప మూలం కోసం అంకితం చేస్తాం" అని దానర్థం.[53] ప్రస్తుతం వారు తమ సమయాన్ని సిడ్నీ మరియు న్యూయార్క్ సిటీ మధ్య తిరగడానికి కేటాయించుకుంటున్నారు.[54]

ఫర్నెస్‌కు రెండు పర్యాయాలు గర్భస్రావం అయింది. అందువల్ల ఆమె మరియు జాక్‌మన్ ఆస్కార్ మేగ్జిమిలియన్ (15 మే 2000న జననం) మరియు అవా ఎలియట్ (10 జులై 2005న జననం) అనే ఇద్దరు పిల్లల్ని దత్తత చేసుకున్నారు.[55]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం చలనచిత్రం పాత్ర సూచనలు
1994 లా ఆఫ్ ది ల్యాండ్ చార్లెస్ మెక్‌క్రే ఒక ఘట్టం
1995 కరిల్లి కెవిన్ జోన్స్ ప్రధాన పాత్ర
బ్లూ హీలర్స్ బ్రాడీ జాక్సన్ ఒక ఘట్టం
1996 Snowy River: The McGregor Saga డంకన్ జోన్స్ ఐదు ఘట్టాలు
1999 ఎర్స్‌కినివిల్లే కింగ్స్ వేస్ ఉత్తమ నటుడుగా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు
ఆస్ట్రేలియన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్కు ఎంపిక
పేపర్‌బ్యాక్ హీరో జాక్ విల్లిస్
2000 X-మెన్ లోగాన్ / వోల్వరైన్ శాటర్న్ అవార్డ్
2001 కేట్ & లియోపోల్డ్ లియోపోల్డ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్-మోషన్ పిక్చర్ మ్యూజికల్ ఆర్ కామెడీకు ఎంపిక
సమ్‌వన్ లైక్ యు ఎడ్డీ
స్వార్డ్‌ఫిష్ స్టాన్లీ జాబ్‌సన్
2003 X2 లోగాన్ / వోల్వరైన్ ఎంపైర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్కు ఎంపిక
2004 వ్యాన్ హెల్‌సింగ్ గాబ్రియెల్ వ్యాన్ హెల్‌సింగ్
Van Helsing: The London Assignment గాబ్రియెల్ వ్యాన్ హెల్‌సింగ్ (గాత్రం)
2005 స్టోరీస్ ఆఫ్ లాస్ట్ సోల్స్ రోజర్ "స్టాండింగ్ రూమ్ ఓన్లీ" భాగం
2006 హ్యాపీ ఫీట్ మెంఫిస్ (గాత్రం)
ఫ్లష్డ్ అవే రోడీ (గాత్రం
ది ప్రెస్టిజ్ రాబర్ట్ ఏంజియర్ ఆస్ట్రేలియన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్కు ఎంపిక
ది ఫౌంటెయిన్ థామస్/టామీ/టామ్ క్రియో శాటిలైట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్-మోషన్ పిక్చర్ డ్రామాకు ఎంపిక
స్కూప్ పీటర్ లిమ్యాన్
X-Men: The Last Stand లోగాన్ / వోల్వరైన్
2008 డిసిప్షన్ వ్యాట్ బోస్ నిర్మాత
అంకుల్ జానీ అంకుల్ రస్సెల్ ట్రాప్‌ఫెస్ట్ 2008 ఫైనలిస్ట్ ఫిల్మ్[56]
ఆస్ట్రేలియా ది డ్రోవర్
ది బర్నింగ్ సీజన్ కథకుడు డాక్యుమెంటరీ (లఘు చిత్రం)
2009 X-Men Origins: Wolverine లోగాన్ / వోల్వరైన్ నిర్మాత
2011 X-Men Origins 2: Wolverine లోగాన్ / వోల్వరైన్ నిర్మాత

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

ప్రతిపాదనలు[మార్చు]

ప్రజా సంస్కృతిలో ప్రస్తావనలు[మార్చు]

  • సెక్సియస్ట్ మ్యాన్ అలైవ్-2008గా జాక్‌మన్‌ను పీపుల్ సంచిక పేర్కొంది.[2]
  • ABC ఛానల్‌లో ప్రసారమైన హాస్య నాటకం స్క్రబ్స్‌ లో జాక్‌మన్‌ యొక్క అకారణమైన ద్వేషాన్ని Dr. కాక్స్ అతినీచంగా దుర్భాషలాడాడు. అదంతా కేవలం J.D. కోసం హ్యూ జాక్‌మన్ పోషించిన వోల్వరైన్‌పై గుసగుసలాడేందుకే అలా చేశాడు.

! అతను వెళ్లిన వెంటనే, అతినికెంత ధైర్యం' అని అన్నాడు.

  • పంక్డ్ కార్యక్రమం యొక్క 7వ సీజన్ పంక్డ్ - "ఫైర్ ఇన్ ది హోల్" సందర్భంగా దర్శకుడు బ్రెట్ రాట్నర్ ఇంటిని తాను ప్రమాదవశాత్తు తగులబెట్టిన విషయాన్ని అతను విశ్వసించాల్సి వచ్చింది.[58]
  • 6వ సీజన్‌లో, 10 ఫిబ్రవరి 2004న ప్రసారమైన విల్ & గ్రేస్ 13వ ఘట్టం సందర్భంగా, హ్యూ జాక్‌మన్‌ను చూడటానికి తాను వేచి ఉండలేనందు వల్ల తాను ది బాయ్ ఫ్రమ్ Ozను వీక్షించాలని అనుకుంటున్నట్లు జాక్ పాత్రధారుడు (సీయాన్ హేస్) తెలిపాడు.[59] తన చిత్రాలు కొన్నింటిని దొంగిలించినందు వల్ల హ్యూ జాక్‌మన్‌/ది బాయ్ ఫ్రమ్ Ozపై దావా వేసే విషయాన్ని తాను పరిశీలిస్తున్నట్లు అతను ఆ తర్వాత వెల్లడించాడు.

సూచనలు[మార్చు]

  1. http://open.salon.com/blog/kaysong/2008/11/10/my_sexiest_men_living
  2. 2.0 2.1 http://www.people.com/people/article/0,,20241213,00.html
  3. గాన్స్, ఆండ్రూ."టోనీ విన్నర్ జాక్‌మన్ టు హాస్ట్ అకడెమీ అవార్డ్స్," playbill.com, 12 డిసెంబరు 2008
  4. 4.0 4.1 "Hugh Jackman". Inside the Actors Studio. episode 11. season 10. 7 March 2004. Bravo. http://www.imdb.com/title/tt0611206/.
  5. "మ్యాట్నీ ఐడల్." ది ఇండిపెండెంట్. 1 మే 2004.
  6. "Hugh Jackman relishes performing - More news and other features - MSNBC.com". Retrieved 2009-05-27. 
  7. హ్యూ జాక్‌మన్: X అపీల్
  8. "Alumnus Hugh Jackman honoured at UTS 20-year celebration". Retrieved 2009-05-27. 
  9. "home and away". Retrieved 2009-05-27. 
  10. "Jackman back as boy from Waapa". Retrieved 2009-05-27. 
  11. "Hugh Jackman". imdb.com. Retrieved 18 December 2008.  Unknown parameter |dateformat= ignored (help)
  12. మార్వల్ యూనివర్స్: వోల్వరైన్ (జేమ్స్ హౌలెట్) Marvel.com
  13. Fleming, Michael (December 2008). "Playboy Interview: Hugh Jackman". Playboy: 62. 
  14. "శాటర్‌డే నైట్ లైవ్" imdb.com
  15. గాన్స్, ఆండ్రూ.[1]"ఎ స్టెడీ రెయిన్, విత్ క్రెయిగ్ అండ్ జాక్‌మన్, టు ప్లే బ్రాడ్‌వేస్ షోయెన్‌ఫెల్డ్" playbill.com, జులై 9, 2009
  16. "Call him Bland, James Bland - MSNBC". 
  17. http://www.herald.ie/entertainment/hq/big-down-under-1570944.html
  18. http://www.imdb.com/title/tt0780504/
  19. 81వ అకడెమీ అవార్డులకు హ్యూ జాక్‌మన్ ఆతిథ్యం
  20. http://www.imdb.com/title/tt0837787/
  21. http://www.telegraph.co.uk/news/worldnews/1559524/Meryl-Streep-competes-for-Sunset-Boulevard.html
  22. జాక్‌మన్, గగ్గెన్‌హీమ్ గో 'నోవేర్' - ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్, ఫిల్మ్ న్యూస్, మీడియా - వెరైటీ
  23. Trio bound to Stow's 'captives'
  24. Adam Bryant (04 August 2009). "Hugh Jackman Signs on for Circus Musical". TVGuide.com. Retrieved 2009-08-04. 
  25. "హ్యూ జాక్‌మన్ రియల్ స్టీల్ లో నటించనున్నాడు."
  26. ఇంటర్నెట్ మూవీ డాటాబేస్‌లో రియల్ స్టీల్
  27. మూవీస్ ఆన్‌లైన్
  28. మూవీ న్యూస్
  29. హ్యూ జాక్‌మన్ కంగ్రాట్చులేట్స్ ప్రొఫెసర్ యూనస్ (వీడియో)
  30. "బుక్స్ దట్ మేడ్ ఎ డిఫెరెన్స్ టు హ్యూ జాక్‌మన్." Oprah.com
  31. "హ్యూ జాక్‌మన్స్ బుక్‌షెల్ఫ్: బ్యాంకర్ టు ది పూర్ , బై మహ్మద్ యూనస్." Oprah.com
  32. గ్లోబల్ పావర్టీ ప్రాజెక్ట్ నెరేటెడ్ బై హ్యూ జాక్‌మన్
  33. హ్యూ జాక్‌మన్ గోస్ టు UN
  34. [2]
  35. హ్యూ జాక్‌మన్ స్టీల్స్ లీడ్ రోల్ ఆన్ క్లయిమేట్
  36. వరల్డ్ విజన్ అంబాసిడర్ హ్యూ జాక్‌మన్ స్పీక్స్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్
  37. ది ఆర్ట్ ఆఫ్ ఎలీసియం
  38. MPTV ఫండ్ ఫౌండేషన్
  39. బోన్ మారో డోనార్ ఇన్‌స్టిట్యూట్
  40. ది బర్నింగ్ సీజన్
  41. చారిటీ ట్వీట్
  42. జాక్‌మన్ రివీల్స్ చారిటీ డొనేషన్
  43. ఆపరేషన్ ఆఫ్ హోప్
  44. బ్రాడ్‌వే కేర్స్
  45. ఇన్‌సైడ్ ది యాక్టర్స్ స్టూడియో
  46. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ - కయాకింగ్
  47. ManlySeaEagles.com.au
  48. https://archive.is/20121211051141/www.monstersandcritics.com/people/archive/peoplearchive.php/Hugh_Jackman/biography/
  49. స్కై స్పోర్ట్స్ ఇంటర్వూ
  50. హ్యూ జాక్‌మన్ టేక్స్ అప్ పియానో లెసన్స్
  51. పీపుల్ మేగజైన్- యోగా
  52. స్కూల్ ఆఫ్ ప్రాక్టికల్ ఫిలాసఫీ
  53. ఎనఫ్ రోప్ విత్ ఆండ్రూ డెంటన్
  54. జాక్‌మన్ బైస్ అపార్ట్‌మెంట్ ఇన్ మన్‌హట్టన్
  55. ఫ్యూరెస్ ఆన్ ఎనఫ్ రోప్-అడాప్షన్
  56. అంకుల్ జానీ - ninemsn వీడియో
  57. హ్యూ జాక్‌మన్స్ ప్రింట్స్ రికార్డెడ్ ఇన్ సిమెంట్
  58. హ్యూ జాక్‌మన్ గెట్స్ సీరియస్‌లీ
  59. http://www.imdb.com/title/tt0748812/plotsummary

బాహ్య వలయాలు[మార్చు]

హ్యూ జాక్‌మన్ ఎ స్టెడీ రెయిన్ ఆన్ బ్రాడ్‌వే - ఓపెనింగ్ నైట్ Broadway.tv Blog

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Preceded by
Matt Damon
People's Sexiest Man Alive
2008
Succeeded by
Johnny Depp

మూస:Oscars hosts 2001-2020 మూస:EmmyAward VarietyPerformance 2001-2025 మూస:TonyAward MusicalLeadActor 2001-2025