హృతిక్ రోషన్

వికీపీడియా నుండి
(హ్రితిక్ రోషన్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హృతిక్ రోషన్
Hrithik Rado.jpg
2013 నవంబరులో ముంబాయిలో హృతిక్ రోషన్
జన్మ నామం హృతిక్ రోషన్
జననం (1974-01-10) జనవరి 10, 1974 (వయస్సు: 40  సంవత్సరాలు)
ముంబయి, మహారాష్ట్ర, భారత్
క్రియాశీలక సంవత్సరాలు 1980–1986, 2000–ఇప్పటి వరకు
భార్య/భర్త సుజానే ఖాన్ (2000–2013)

హ్రితిక్ రోషన్ (హిందీ;: ऋतिक रोशन[ˈrɪtɪk ˈroːʃən]; జననం జనవరి 10,1974)[1] బాలివుడ్ లో పనిచేస్తున్నఒక భారతీయ నటుడు.

అతడు తన చిన్నతనములో బాల నటుడుగా 1980ల లో నటించాడు. తదుపరి కహొ నా ...ప్యార్ హై (2000) అనే ఒక హిందీ చిత్రములో మొదటిసారి ప్రధాన పాత్రలో నటించాడు.ఆ చిత్రం విజయవంతమయి రోషన్ తన నటనా సామర్ధ్యమునకు ఉత్తమ నటుడు మరియు ఉత్తమ క్రొత్త నటుడుగాఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. కోయి....మిల్ గయా (2003), క్రిష్ష్ (2006), ధూం 2 (2006) మరియు జోధా అక్బర్ (2008) లాంటి చిత్రాల్లో అతని యొక్క నటనా కౌశల్యము చెప్పుకోదగినది.ఈ చలనచిత్రాలు అతనికి అత్యుత్తమ ఆర్ధిక విజయాలేకాక వాటి ద్వారా రోషన్ ఎన్నో ఉత్తమ నటుడు పురస్కారాలు పొందాడు.[2]

2008 సంవత్సరములో రోషన్ రష్యాలోని కజాన్లో జరిగిన గోల్దేన్ మిన్బార్ అంతర్జాతీయ చిత్రోత్సవములో జోధా అక్బర్ చిత్రములో తన నటనకి మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ పరస్కరాము కైవశం చేసుకున్నాడు.[3] రోషన్ ఈ విధంగా భారతదేశపు ముఖ్యమైన నటులలో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు.[4][5]

వృత్తి[మార్చు]

వృత్తిలో తొలిదశ 1999 వరకు[మార్చు]

1980లొ విడుదలైన ఆషా అనే చిత్రంలో రోషన్ తన ఆరేళ్ళ వయసులో మొదటిసారిగా బాలనటుడిగా ఒక పాట సన్నివేశములో అదనపు నటుడిగా చిన్న పాత్ర పోషించాడు.ఆపై రోషన్ తన తండ్రి ప్రధాన పాత్రలు పోషించిన ఆప్ కె దీవానే (1980) మరియు భగవాన్ దాదా (1986) చిత్రాలలో చిన్న పాత్రలలో నటించాడు.తరువాత అతని తండ్రి నిర్మించిన కరణ్ అర్జున్ (1995), కోయ్ల (1997) చిత్రాలకు సహాయ ధర్శకుడుగా వ్యవహిరించి చిత్ర నిర్మాణములో సహాయపడ్డాడు.

వృత్తిలో గొప్ప మలుపు, 2000-2002[మార్చు]

2000లో, రోషన్ కహొ నా ... ప్యార్ హై అనే చిత్రములో మొట్టమొదటిసారిగా కథానాయకుడి పాత్రలో నటించాడు.ఆ చిత్రములో రోషన్ తో నటించిన కథానాయిక అమీషా పటేల్ అనే నూతన నటి.తన తండ్రి దర్శకత్వము వహించిన ఆ సినిమాలో రోషన్ రెండు ప్రధాన పాత్రలలో నటించాడు. ఆ చిత్రం అత్యుత్తమ వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శింపబడింది.అత్యుత్తమ చిత్రముగా ఫిలింఫేర్ పురస్కర్రము అందుకోవటమేకాక 2000లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రముగా నిలిచింది.[6] దానితో రోషన్ యొక్క నటనా కౌశలము అందరిచేత కొనియాడబడి రాత్రికిరాత్రే అతను ఒక గొప్ప సినిమా తారగా అవతరించాడు.[7][8][9] తద్వారా ఈ పాత్రకి ఫిలింఫేర్ ఉత్తమ క్రొత్త నటుడు మరియు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారములు రోషన్ అందుకున్నాడు. ఈ చిత్రం 2003లో 102 పురస్కారాలు సంపాదించి అత్యుతమ సంఖ్యలో పురస్కారాలు సాధించిన బాలివుడ్ చిత్రముగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లలో నమోదు అయింది.[10]

తరువాత అదే సంవత్సరంలో రోషన్ఖలీద్ మొహమ్మద్ యొక్క ఫిజా చిత్రంలో నటించాడు. ఆ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ అందులో రోషన్ యొక్క నటన ప్రశంసలు అందుకుని ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారానికి ప్రతిపాదించబడింది.ఇండియాFM కి చెందిన తరణ్ ఆదర్శ్ హ్రితిక్ రోషన్ యొక్క నటనయే ఆ చిత్రానికి మూలస్తంభమని చెప్పారు. రోషన్ యొక్క శారీరక భాష, వచనము, ఆకృతి మరియు అతని పూర్తి వ్యక్తిత్వము ప్రశంసించదగినది.ఈ చిత్రంతో రోషన్ తను కేవలం ఒక మిల్స్ అండ్ బూన్ కథలలోని ప్రేమకుడిగా, రోషము కలిగిన ఒక శృంగార చిహ్నంగా కాకుండా అంతకంటే ఎక్కువ విలువగలిగిన నటుడిగా తనకి సామర్ధ్యం ఉందని నిరూపించాడు. ఆ చిత్రంలో రోషన్ నటనా కౌశల్యం అనేక దృశ్యాలలో బహిర్గతం అవుతుంది.ముఖ్యంగా కరిష్మాతో చేసిన దృశ్యాలలో అది బహిర్గతమౌతుంది.. మొత్తంమీద హ్రితిక్ నటన మాత్రమే చాలావరకు ఫిజా చిత్రాన్ని రక్షించిందని చెప్పవచ్చును. నిస్సందేహంగా అధ్బుతమైన నటనా ప్రదర్శన!"[11]

అ సంవత్సరంలో చివరిగా విడుదలయిన రోషన్ నటించిన మిషన్ కాశ్మీర్ అనే చిత్రం అ సంవత్సరములో ఎక్కువ వసూళ్లు నమోదు చేసిన చిత్రాలలో మూడవదానిగా నిలిచింది.[6] మరోసారి హ్రితిక్ నటన కొనియాడబడింది. ఒక విమర్శకుడు ప్రశంసిస్తూ, ఉగ్రవాదంలోకి లాక్కు వెళ్ళబడిన ఒక యువకుడి పాత్రని అతి అధ్బుతంగా హ్రితిక్ ప్రదర్శించాడని కితాబిచ్చారు. చిత్రం మొదటి భాగంలో హ్రితిక్ ఒక ప్రభుత్వ వ్యతిరేక పాత్రని పోషించాడు. అప్పుడే ఉన్నతిలోకి వస్తున్న తారకు గాని ఆరితేరిన నటునకు గాని ఇది ఏంతో సాహసముతో కూడిన పాత్ర." ఇటువంటి ఆనేక సాదనల వలనే అతను సినిమా పరిశ్రమలో అతి పెద్ద తారలలో ఒకడిగా ఎదిగాడు.[12]

సుభాష్ ఘాయ్ యొక్క యాదే అనే చిత్రం 2001 సంవత్సరములో రోషన్ నటించి విడుదలైన చిత్రాల్లో మొదటిది.దాని తరువాత కరణ్ జోహార్ భావపూరిత చిత్రమైన కభి కుషే కభి గం బాగా విజయవంతమయింది.2001 సంవత్సరంలో ఎక్కువ వసూళ్లు నమోదు చేసిన రెండవ చిత్రముగా మరియు విదేశాలలో అతి పెద్ద విజయం సాధించిన చిత్రముగాను చరిత్రకెక్కింది.[13][14] రోషన్ యొక్క నటనా చాతుర్యానికి మెచ్చి అనేక చిత్రోత్సవాలలో ఉత్తమ సహాయ నటునిగా పురస్కారానికి ప్రతిపాదించారు.

2002 సంవత్సరములో రోషన్ యొక్క మూడు చిత్రాలు అనగా ముజ్సే దోస్తీ కరోగే , నా తుం జానో నా హమ్ మరియు ఆప్ ముఝే అచ్చా లగ్నే లగే వసూళ్లు నమోదు చేయటంలో విఫలమయి,ఓటమి పాలయినట్లు భావించబడ్డాయి.[15]

విజయపరంపర, 2003 నుండి ఇప్పటి వరకు[మార్చు]

2003 సంవత్సరములో వైజ్ఞానిక కథాంశము కలిగిన కోయి... మిల్గయా చిత్రముతో రోషన్ మరల పునరాగమనం చేసాడు.కోయి మిల్ గయా చిత్రములో రోషన్ ఒక మనోవైకల్యం కలిగిన యువకునిగా నటించాడు.[9] ఆ చిత్రం ఏన్నో పురస్కారాలు పొంది, ఆ సంవత్సరపు అత్యంత అధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రముగా నిలిచింది. రోషన్కు కూడా అతని తొలి ఫిలింఫేర్ (విమర్శకుల) ఉత్తమ నటుడు పురస్కారము మరియు రెండవఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారము లభ్యమయ్యాయి.[16]తరణ్ ఆదర్శ్ చెప్పారు, "రోషన్ చాల శక్తిమంతమైన ప్రదర్శన చూపించి చిత్రములో తన ఆధిపత్యాన్ని కనబరచాడు.మానసిక వికలాంగుడి పాత్ర పోషించటం అంత సులువు కాదు కాని నీటిలో చేపవలే ఏంతో స్వేచ్చగా అ పాత్రను రోషన్ పోషించాడు.ఏమి చేతగాని వాడి స్థాయి నుండి గొప్ప వీరుడైన కథానాయకుడి స్థాయికి ఎదిగే పాత్రని అతను అతి అధ్బుతంగా పోషించ కలిగాడు. ఒక నటుడిగా హ్రితిక్ తన నటనా ప్రావీణ్యంతో శిఖరానికి ఎదిగాడు.[17]

ఫర్హాన్ అఖ్తర్ యొక్క లక్ష్య చిత్రమే 2004 సంవత్సరములో హ్రితిక్ నటించి విడుదల అయిన ఏకైక చిత్రం. అ చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు.[18] కాని హ్రితిక్ రోషన్ నటనా ప్రదర్శన మాత్రము విమర్శకులుచే కొనియాడబడింది.[19]

రెండు సంవత్సరాలు విరామం అనంతరం రోషన్ జూన్, 2006 సంవత్సరము లో విడుదల అయిన కోయి...మిల్ గయా యొక్క తదుపరి కథ అయిన క్రిష్ష్ లో ఒక అధ్బుత సాహస కథానాయకుని పాత్రను పోషించాడు.అ చిత్రము బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది, 2006లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రముగా నిలిచింది.[20] అందులో రోషన్ పోషించిన సాహస కథానాయక పాత్రకు చాల ప్రశంసలు వచ్చి, స్టార్ స్క్రీన్ మరియు అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర సంస్థ వంటి ఎన్నో ఉత్సవాలలో ఉత్తమ నటుడు పురస్కారాలు అతను అందుకున్నాడు.[2]ఇండియాFM ప్రకారం, "హ్రిత్తిక్ క్రిష్ష్ చిత్రానికి ఆత్మ వంటి వాడు అనటం అతిశయోక్తి కాదు.కోయి...మిల్ గయా లో ముఖ్యమైన పురస్కారాలను చేజిక్కించుకున్న రోషన్ క్రిష్ష్ తో దాన్నే మరోమారు పునరుక్తి చేస్తాడు.మరే ఏ నటుడు కూడా అద్భుత శక్తులున్న కుర్రవాడి పాత్రని ఇంత అద్బుతముగా నటించగలరని ఊహించలేము.అతను ముసుగు, నిలువుటంగీ వేసుకుని నటించే దృశ్యం అతి అధ్బుతంగా ఉంటె, వృద్ధుడైన తండ్రి పాత్రలో హ్రితిక్ నడక, హావభావాలు వ్యక్త పరిచే విధానము చూసినవారు, అతను ప్రస్తుతం భారతీయ వెండితెరలో ఉన్న ఉత్తమ నటులలో ఒకరు అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. క్రిష్ష్ హ్రితిక్ యొక్క అధ్బుతమైన కళా ఖండాల లోనీ మరియొక ఉత్తమ చిత్రము.[21]

అ సంవత్సరములో విడుదలయిన అతని తరువాత చిత్రం ధూమ్ 2 , 2004 ధూమ్ యొక్క తరువాయి బాగాం. ఐశ్వర్య రాయి బచ్చన్తో కలిసి రోషన్ చేసిన నటన అతనికి విస్తృతంగా విమర్శకుల ప్రశంసలని సంపాదించింది.[2][22] మరియు అతను మూడవ ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారాని అందుకున్నాడు. ఈ చిత్రం 2006 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రముగా నిలిచి, బాలివుడ్లోనే మహావిజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా పేరు గాంచింది.[20][23]

2008లో రోషన్ ఐశ్వర్య రాయి బచ్చన్తో కలిసి అశుతోష్ గోవరికేర్ యొక్క జోధా అక్బర్ అనే చిత్రంలో నటించాడు. అతను చారిత్రాత్మిక అక్బర్ ది గ్రేట్ పాత్రని పోషించాడు. ఈ చిత్రం భారతదేశములోను విధేశాలలోను వ్యాపారపరంగా అతి గొప్ప విజయాన్ని సాదించింది.[14][24] ఈ చలనచిత్రంలో అతని నటనా ప్రదర్శన విస్తృతంగా విమర్శకుల ప్రశంసని పొంది[2] అతనికి నాలుగో ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. అంతే కాకుండా రష్యాలోని కజాన్లో జరిగిన గోల్డెన్ మిన్బార్ అంతర్జాతీయ చిత్రోత్సవములో అతనికి ఉత్తమ నటుడిగా మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ పురస్కారం లభించింది.[3]

రోషన్ ఇటీవల జోయా అఖ్తర్ యొక్క లక్ బై ఛాన్స్ (2009) అనే చిత్రంలో ఒక విశేష పాత్రలో కనిపించాడు. ప్రస్తుతము హ్రితిక్ అనురాగ్ బసు యొక్క కైట్స్ చిత్రంలో మెక్సికో దేశపు నటి బార్బరా మొరి మరియు కంగనా రానౌథ్ తోనూ కలసి నటిస్తున్నాడు. ఇటీవలనే అతను సంజయ్ లీల భన్సాలి చిత్రమైన గుజారీష్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో కలసి నటించడానికి అంగీకరించాడు.[25]

వ్యక్తిగత జీవితం[మార్చు]

హ్రితిక్ రోషన్ ముంబాయిలో ఒక పంజాబీ-హిందూ చిత్రకళాకారుల కుటుంబములో జన్మించారు. అతని తండ్రైన సినిమా దర్శకుడు రాకేశ్ రోషన్, సంగీత దర్శకుడు రోషన్ యొక్క కుమారుడు. అతని తల్లైన పింకీ, నిర్మాత మరియు దర్శకుడైన జె.ఓం ప్రకాష్ యొక్క కుమార్తె. అతని మామయ్య రాజేష్ రోషన్ ఒక ప్రసిద్ధ సంగీత దర్శకుడు

బాల్యములో రోషన్ బొంబాయి స్కాట్టిష్ పాఠశాలలో చదివాడు.[26] తరువాత, అతను సైడెన్హాం కాలేజీలో B.Com చదివాడు.[27]

రోషన్ సంజయ్ ఖాన్ కూతరైన సుజాన్ ఖాన్ని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. హ్రేహాన్ 2006లో జన్మించాడు, హ్రిదాన్ 2008లో జన్మించాడు.[28][29]

విడాకులు[మార్చు]

హృతిక్ రోషన్, సుజానే.. తమ 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. ‘‘నాతో విడిపోవడానికి సుజానే నిర్ణయించుకోవడంతో మా 17 సంవత్సరాల అనుబంధానికి తెరపడింది’’ అని హృతిక్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి ఇది జీర్ణించుకోలేని విషయమని, తమ ప్రైవసీకి భంగం కలిగించకూడదని హృతిక్ మీడియాకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హృతిక్, సుజానేలకు ఇద్దరు కొడుకులు. రెహాన్ (7), హ్రిదాన్ (5) ఉన్నారు.[30] 2014 నవంబరు 1 వతేదీన బాంద్రా న్యాయస్థానం హృతిక్, సుసాన్నె�లకు విడాకులు మంజూరు చేసింది. హృతిక్ న్యాయవాది దీపేష్ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు[31].

పురస్కారాలు[మార్చు]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
1980 ఆషాఆషా బాల నటుడు
ఆప్ కే దీవానే బాల నటుడు
1986 భగవాన్ దాదా గోవిందా (బాల నటుడు)
2000 కహొ నా... ప్యార్ హై రోహిత్/రాజ్ చోప్రా రెండు-బహుమతులు , ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం &
ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడి పురస్కారం
ఫిజా అమాన ఇక్రముల్లా ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు.
మిషన్ కాశ్మీర్ అల్తాఫ్ ఖాన్
2001 యాదే రోనిత్ మల్హోత్రా
కభి ఖుషి కభీ గం రోహన్ రాయ్చంద్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడుగా ప్రతిపాదించబడ్డాడు
2002 ఆప్ ముజ్హే అచ్చే లగ్నే లగే రోహిత్
నా తుం జానో నా హమ్ రాహుల్ శర్మ
ముజ్సే దోస్తీ కరోగే! రాజ్ మల్హోత్రా
2003 మై ప్రేం కి దివానీ హూ ప్రేం కిషన్ మాధుర్
కోయి... మిల్ గయా రోహిత్ మెహ్రా రెండు-బహుమతులు , ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం &
ఉత్తమ ప్రదర్శనకి ఫిలింఫేర్ యొక్క విమర్శకుల పురస్కారం
2004 లక్ష్య కరణ్ షెర్గిల్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారానికి, ప్రతిపాదించబడ్డాడు.
2006 క్ర్రిష్ కృష్ణ మెహ్రా (క్ర్రిష్)/
రోహిత్ మెహ్రా
ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు.
ధూమ్ 2 ఆర్యన్/Mr.ఏ విజేత , ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం
ఐ సీ యు సుబహ్ సుబహ్ పాటలో ప్రత్యేక పాత్ర
2007 ఓం శాంతి ఓం తనలాగే ప్రత్యేక పాత్ర
2008 జోధా అక్బర్ జలాలుద్దీన్ మొహమ్మద్
అక్బర్
విజేత , గోల్డెన్ మిన్బార్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి పురస్కారం &
విజేత , ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం
క్రేజీ 4 ప్రధాన పాటలో విశేష పాత్ర
2009 లక్ బై ఛాన్స్ జఫ్ఫర్ ఖాన్ ప్రత్యేక పాత్ర
కైట్స్ జే నిర్మాణం-అనంతరం
2010 గుజారీష్ చిత్రీకరించబడుతున్నది

ఇవి కూడా చూడండి[మార్చు]

అన్వయములు[మార్చు]

 1. "Hrithik Roshan overview and filmography". IMDb. సంగ్రహించిన తేదీ 2009-04-20. 
 2. 2.0 2.1 2.2 2.3 "Hrithik the super hero…". Indiatimes Movies. March 3, 2009. సంగ్రహించిన తేదీ 2009-08-15. 
 3. 3.0 3.1 "Jodhaa Akbar, Hrithik win awards at Golden Minbar Film Festival in Russia". Bollywood Hungama. October 23, 2008.  Text "2009-01-31" ignored (సహాయం)
 4. N, Patcy (December 19, 2006). "Mr Talented". Rediff.com. సంగ్రహించిన తేదీ 2009-05-08. 
 5. Marsh, Jenni (April 16, 2009). "Hrithik Roshan unveils new look". Digital Spy. సంగ్రహించిన తేదీ 2009-05-07. 
 6. 6.0 6.1 "Box Office 2000". Archived from the original on 2012-07-07. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 7. Rajendran, Girija (August 18, 2000). "A perfect professional has come to stay". The Hindu. సంగ్రహించిన తేదీ 2009-05-08. 
 8. Mitlal, Madhur (January 7, 2001). "A year of surprises and shocks". The Tribune. సంగ్రహించిన తేదీ 2009-08-15. 
 9. 9.0 9.1 Verma, Sukanya (December 15, 2003). "Bollywood's top 5, 2003: Hrithik Roshan". Rediff.com. సంగ్రహించిన తేదీ 2009-05-08. 
 10. "2003 tidbits". సంగ్రహించిన తేదీ 2007-02-13. 
 11. "Fiza: Movie Review". సంగ్రహించిన తేదీ 2000-12-15. 
 12. "Top Actors". Archived from the original on 2012-07-07. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 13. "Box Office 2001". Archived from the original on 2012-07-12. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 14. 14.0 14.1 "Overseas Earnings (Figures in Ind Rs)". Archived from the original on 2012-12-04. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 15. "Box Office 2002". Archived from the original on 2012-07-08. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 16. "Box Office 2003". Archived from the original on 2012-07-09. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 17. "Koi... Mil Gaya: Movie Review". సంగ్రహించిన తేదీ 2003-08-08. 
 18. "Box Office 2004". Archived from the original on 2012-05-24. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 19. "Lakshya: Movie Review". సంగ్రహించిన తేదీ 2004-06-18. 
 20. 20.0 20.1 "Box Office 2006". Archived from the original on 2012-06-30. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 21. "Krrish: Movie Review". సంగ్రహించిన తేదీ 2006-06-22. 
 22. "Dhoom 2: Movie Review". సంగ్రహించిన తేదీ 2006-11-24. 
 23. "All Time Earners Inflation Adjusted". Archived from the original on 2012-07-07. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 24. "Box Office 2008". Archived from the original on 2012-05-25. సంగ్రహించిన తేదీ 2009-03-04. 
 25. ""Roshan Raahein"". 2008-11-20. 
 26. "www.rediff.com/chat/hritchat.htm". 
 27. "www.sydenham.edu/prominent_alumni.html". 
 28. "Another son for Hrithik and Suzanne". Rediff.com. సంగ్రహించిన తేదీ May 1.  Unknown parameter |accessyear= ignored (సహాయం);
 29. "Hrithik's son to be named Hridhaan". IANS, DNA News. సంగ్రహించిన తేదీ March 23.  Unknown parameter |accessyear= ignored (సహాయం);
 30. http://zeenews.india.com/entertainment/sex-and-relationships/hrithik-roshan-and-sussanne-separate_147700.html
 31. http://timesofindia.indiatimes.com/city/mumbai/Hrithik-Roshan-and-Sussanne-Khan-granted-divorce-by-family-court/articleshow/45003091.cms

వెలుపటి వలయము[మార్చు]

మూస:FilmfareBestActorAward

pnb:ہریتھک روشن