26/11 ముంబై పై దాడి
వికీపీడియా నుండి
2008లో ముంబై పై ఇస్లామిక్ తీవ్రవాద దాడులు బాగా శిక్షణ పొందిన దాదాపు పది మంది జీహాదీలు నగరమంతా కాల్పులు మరియు బాంబు దాడులు చేశారు. [1][2] 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. చత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్,[3] తాజ్‌మహల్ ప్యాలెస్ మరియు టవర్,[3] లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్,[3] యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్,[4] మెట్రో సినిమా హాల్,[5] టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి.[3] ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో మరియు విలే పార్లే లో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.[6]
మూలాలు [మార్చు]
- ↑ Friedman, Thomas. "No Way, No How, Not Here", 2009-02-17. Retrieved on 2010-05-17.
- ↑ Indian Muslims hailed for not burying 26/11 attackers, Sify News, 2009-02-19, http://sify.com/news/indian-muslims-hailed-for-not-burying-26-11-attackers-news-international-jegsNXehjhc.html
- ↑ 3.0 3.1 3.2 3.3 "Wave of Terror Attacks Strikes India's Mumbai, Killing at Least 182", Fox News, 2008-11-27. Retrieved on 2008-12-03.
- ↑ Kahn, Jeremy. "Jews of Mumbai, a Tiny and Eclectic Group, Suddenly Reconsider Their Serene Existence", 'New York Times', 2008-12-02. Retrieved on 2008-12-03.
- ↑ Magnier, Mark. "Mumbai police officers describe nightmare of attack", 'Los Angeles Times', 2008-12-03. Retrieved on 2008-12-03.
- ↑ "Tracing the terror route", 'Indian Express', 2008-12-10. Retrieved on 2008-12-09.