వాడుకరి:Jaichad

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదలవాడ జై కిషన్
జననం
చదలవాడ జై కిషన్

జాతీయతభారతీయుడు

నా పేరు చదలవాడ జై కిషన్. వయసు 19 సంవత్సరములు. భారతదేశ పౌరుడను. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం. తండ్రిగారి ఊరు బెజవాడ. తల్లిగారిది భీమవరం. నా బాల్యం ఎక్కువగా భీమవరం లో గడవడం తో అదే నా జన్మస్థానంగా చెప్పుకున్నాను. ప్రస్థుతానికి అమెరికా లోని కన్సాస్ రాష్ట్రం లో నివసిస్థున్నాను. నేను ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని. చరిత్ర, భౌగోళిక శాస్త్రం, రాజకీయాలు, జనరల్ సైన్స్, వంటి విషయాల మీద అధ్యయనం చేయుట నాకు చాలా ఇష్టం. సంగీతమన్నా, ఛాయాచిత్రకళన్నా ప్రాణం. నేను 7 వ తరగతిలో(2007 లో) ఉండగా నా మొదటి వికీపీడియా వ్యాసాన్ని సవరించాను. కొన్ని కారణాల వలన నేను నా మొదటి ఖాతా యొక్క గుర్తింపు అక్షరాలు గుర్తుంచుకోలేదు. కావున నవ్య నూతన శక్తితో ఒక కొత్త ఖాతా తెరిచాను. నేను ఈ అద్భుతమైన పేజీ కి వీలయినంత సేవ చేయాలని భావిస్తున్నాను. ఇంతగా తెలుగు లో టైపు చయడం నా జీవితం లో ఇదే మొదటిసారి. పెద్ద కష్టంగా కూడా లేదు. వాడేకొద్దీ మరింత సులభమౌతదేమోలే. నా కొరకు ఎటువంటి సలహాలుగాని, సూచనలు గాని మీ వద్ద ఉన్నట్లయితే దయచేసి ఇక్కడ వ్రాయండి. నేను తప్పక వీలయినంత త్వరగా స్పందిస్తాను. ధన్యవాదాలు.