గణేష్ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గణేష్ ప్రసాద్
 
జననంనవంబరు 15 1876
మరణంమార్చి 9 1935
జాతీయతభారతీయులు
విద్యాసంస్థUniversity of Allahabad, University of Calcutta
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Establishing the culture of organised mathematical research in India
గుర్తించదగిన సేవలు
A Treatise on Spherical Harmonics and the Functions of Bessel and Lame
బిరుదుHardinge Professor of Mathematics

గణేష్ ప్రసాద్ (1876 – 1935) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, గొట్టిజెన్ విశ్వవిద్యాలయం లలో శిక్షణ పొందారు. ఆయన భారత దేశానికి తిరిగి వచ్చి దేశంలో గణిత పరిశోధనల సంస్కృతిని అభివృద్ధి చేసారు. భారత దేశంలోని గణిత శాస్త్ర సమాజం గణేష్ ప్రసాద్ ను "భారత దేశంలో గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడు"గా కొనియాడింది.[1] ఆయన భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రాథమిక విద్య యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేక ఆసక్తి కనవరచి కృషిచేశారు.

ప్రారంభ రోజులు[మార్చు]

గణేష్ ప్రసాద్ 1876 నవంబరు 15ఉత్తర ప్రదేశ్ లోని "బాలియా"లో జన్మించారు. మూయిర్ సెంట్రల్ కాలేజీ, అలహాబాద్ నుండి బి.ఎ డిగ్రీని పొందారు. అలహాబాద్ యూనివర్శిటీ, కలకత్తా విశ్వవిద్యాలయాల నుండి ఎం.ఎ పట్టాను పొందారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి డిగ్రీని పొందారు. తర్వాత ఆయన అలహాబాద్ నందలి కాయస్థ్ పాఠశాలలో విద్యా బోధనను ప్రారంభించారు. ఆయన అలహాబాదు లోని "మూయిర్ సెంట్రల్ కాలేజీ"లో కూడా విద్యను భోధించారు. ఆ తర్వాత ఆయన ఉన్నత విద్య, పరిశోధనల నిమిత్తం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆయనకు "ఇ.డబ్ల్యూ.హాబ్‌సన్", "ఆండ్రూ పోర్సైథ్" వంటి గణీత శాస్త్రవేత్తలలో కలసి పనిచేసే అవకాశం లభించింది.

ఆ తర్వాత ఆయన గొటిజెన్ ప్రాంతానికి వెళ్ళి అచట ప్రముఖ శాస్త్రవేత్తలైన "ఆర్నాల్డ్ సోమర్ ఫీల్డ్", "డెవిడ్ హిల్బెర్ట్", జార్జి కాంటర్ వంటి వారితో కలసి పనిచేశారు. గొట్టిజన్ లో ప్రసాద్ "ఆన్ ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ మేటర్ అండ్ ద అనలైటిక్ థీరీస్ ఆఫ్ హేట్" పై పరిశోధనా పత్రాన్ని ప్రచురించాడు.

గణిత శాస్త్ర రంగంలో[మార్చు]

1904 లో ప్రసాద్ యూరోప్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి అలహాబాదు లోని మూయిర్ సెంట్రల్ కాలేజీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా చేరారు. ఆయన నియమింపబడిన ఒక సంవత్సరం లోపునే కలకత్తా విశ్వవిద్యాలయం లోని గణిత శాస్త్ర విభాగాధిపతుల ఆహ్వానం మేరకు బనారస్ యందలి క్వీన్ కళాశాలకు పంపించబడ్డారు. అచత 1914 వరకు పనిచేశారు. గణేష్ కలకత్తా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రవిభాగాని రాస్‌బిహారీ ఘోష్ చైర్ గా ఉన్నారు. ఈ ఉన్నత మైన స్థానం పొందిన మొదటి వ్యక్తి ఆయన.[2] ఆయన ఈ విభాగంలో 1914 నుండి 1917 వరకు పనిచేశారు. అదే విశ్వవిద్యాలయంలో హార్డింజ్ ప్రొఫెసర్గా 1923 నుండి ఆయన మార్చి 9 1935 న మరణించే వరకు కొనసాగారు. ఈ రెండు నియామకాల మధ్య కాలంలో యాయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన బనారస్ లో ఉన్నప్పుదు బనారస్ గణిత సంఘానికి సహాయాన్ని అందించారు. 1924 లో గణేష్ ప్రసాద్ కలకత్తా గణిత సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఇండియన్ అసోషియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ కు ఉపాధ్యక్షులుగా ఎన్నికైనారు. ఆయన మరణించే వరకు ఈ పదవులలో కొనసాగారు. ఈయన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నారు. ఈయన 11 పుస్తకాలను రచించారు. గణిత శాస్త్రంలో 50 పరిశోధనా పత్రాలను వ్రాసారు.

ముఖ్యమైన శిష్యులు[మార్చు]

  • ఎ.ఎన్.సింగ్, బి.బి.దత్తా :[2] "హిందూ గణిత శాస్త్ర చరిత్ర" యొక్క రచయితలు.: మూలమైన పుస్తకం (2 ప్రతులు) [3]
  • గోరఖ్ ప్రసాద్ : అలహాబాద్ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్
  • ఆర్.ఎస్.వర్మ [1]
  • బి.ఎన్.ప్రసాద్ :[1] Founder of the Allahabad mathematical Society[4]
  • ఎన్.జి.షబ్డే [1]
  • ఆర్.డి. మిశ్రా [1]

ఇతర రంగాలలో కృషి[మార్చు]

Ganesh Prasad worked hard for the promotion of education in general in the rural areas of Uttar Pradesh. He was instrumental in the introduction of compulsory primary education in villages in Uttar Pradesh. He donated from his private savings an amount of Rs.22, 000 for the education of girls in Ballia. He also donated an amount of Rupees two hundred thousand for establishing prizes for the toppers at the M.A. and M.Sc. examinations of the Agra University. He donated large amounts of money to the Allahabad and Banaras Universities also.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Ganesh Prasad : (1876 – 1935)". Indian Mathematical Society. Archived from the original on 25 October 2018. Retrieved 19 June 2010.
  2. 2.0 2.1 Joseph Warren Dauben, Christoph J. Scriba (2002). Writing the history of mathematics: its historical development. Birkhäuser. p. 689. (see p.314)
  3. B. Datta, B. and A.N. Singh, History of Hindu Mathematics, a source book, Parts 1 and 2, (single volume). Bombay: Asia Publishing House, 1962.
  4. "Professor B. N. Prasad". Archived from the original on 1 April 2011. Retrieved 21 June 2010.

ఇతర పఠనాలు[మార్చు]

  • Singal, M.K. (1974). "Ganesh Prasad". Bulletin of the Mathematical Association of India. 6: 6–8.
  • Sen, S.N. (1992). "Factors in the development of scientific research in India during 1906 – 1930". Indian Journal of History of Science. 27 (4): 379 &ndash 388.
  • Dale Hoiberg, Indu Ramchandani (2000). Students' Britannica India: Select essays Volume 6. Popular Prakashan. p. 441. ISBN 978-0-85229-762-9. (see p. 333)