మౌలానా వహీదుద్దీన్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌలానా వహీదుద్దీన్ ఖాన్

జననం: 1 జనవరి 1925
వృత్తి: ఇస్లామీయ ఆధ్యాత్మిక నాయకుడు, వక్త, రచయిత
శైలి:ఇస్లామీయ సాహిత్యం,
వెబ్‌సైటు:http://www.wkhan.net/

మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (ఆంగ్లం : Maulana Wahiduddin Khan), సాధారణంగా ఇతను "ప్రపంచానికి ఇస్లామీయ ఆధ్యాత్మిక దౌత్యవేత్త" అని గుర్తింపబడుతాడు.[1] ఇతడు అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామీయ ఆధ్యాత్మిక గురువుగానూ, ఇస్లాం శాంతివచనాల దౌత్యవేత్తగాను, ప్రపంచశాంతిని కోరే శాంతిదూతగానూ పరిగణింపబడుతాడు.[2] ఇతడి ఉపన్యాసాలు ప్రపంచంలో పలుచోట్ల జరుగుతూనేవుంటాయి. ఉపన్యాసకుడిగా, రచయితగా, విశ్లేషకుడిగా అపార అనుభవము గలదు. అనేకసార్లు, భారతప్రభుత్వమూ ఇతడి సలహాలను కోరుతూ వుంటుంది. 2021 లో భారత ప్రభుత్వం దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందజేసింది.[3]

అల్ రిసాలా ఉద్యమం[మార్చు]

ఇతను "అల్ రిసాలా" అనే పత్రికను స్థాపించి, ఇస్లామీయ ఆధ్యాత్మిక విధానాన్ని, ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమానికి భుజాన వేసుకున్నాడు.[4]

ఇతని మిషన్[మార్చు]

ఇతని మిషన్ "పీస్ మిషన్" లేదా "శాంతి ఉద్యమం" అని పిలువబడుతుంది.

ఇతని దృక్కోణం[మార్చు]

మౌలానా వహీదుద్దీన్ ఖాన్ శాంతియుత ప్రపంచాన్ని కోరుకునేవారిలో ఒకడు. ప్రపంచపు నలుమూలలా, ప్రతి ఇంటిలోనూ ఆధ్యాత్మిక శాంతి నెలకొల్పాలనే ఆశయం. అందుకే ప్రపంచమంతటా తిరుగుతూ శాంతిని బోధిస్తూ, ఇస్లామీయ ధార్మిక ప్రచారం చేపట్టాడు.

అందరితో శాంతి[మార్చు]

ఇస్లాం ఒక సంపూర్ణ శాంతిమార్గము, ఆధ్యాత్మిక మార్గమనీ ప్రచారం చేయడము, అన్ని మతాలపట్ల సమాన గౌరవాభిమానాలను ప్రకటించడము. “ధనాత్మకమైన ప్రకృతిని పొందాలంటే కేవలం శాంతిద్వారా మాత్రమే పొందగలమని, ఇతని ప్రగాఢ విశ్వాసం. ఈ విషయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు పరచాలని అభిలషిస్తాడు".

“సమస్యలను మరచిపోండి, అవకాశాలను సద్వినియోగపరచుకోండి.”

నిజమైన జిహాద్ శాంతిని సాధించడమే.[5] [6].

బాబ్రీ మస్జిద్ వివాద సందర్భంగా ఇతని వకాల్తా[మార్చు]

బాబ్రీమస్జిద్ కూల్చివేత జరిగిన సమయంలో 1992లో మౌలానా, ప్రజలకు శాంతి పిలుపునిచ్చాడు. పరస్పర అవగాహనా సదస్సులలో పాల్గొన్నాడు. శాంతిని నెలకొల్పుటకు 15 రోజుల శాంతియాత్రను చేపట్టాడు.

ఖురాన్ తర్జుమాలు[మార్చు]

ఖురాన్ యొక్క తర్జుమా, ఉపన్యాసాల ఆవశ్యకతలను దృష్టిలో వుంచుకొని మౌలానా, ఖురాన్, హదీసు సంకలనాలను ఉర్దూ భాషలో రచించాడు. దీనిని 1983లో "తజ్‌కిరుల్ ఖురాన్" అనే పేరుతో ముద్రించారు. ఇటీవలి కాలంలో హిందీ, అరబ్బీ భాషలలోనూ ముద్రించారు.

రచనలు[మార్చు]

మౌలానా వహీదుద్దీన్ ఖాన్ దాదాపు 200 పుస్తకాలు, గ్రంథాలు రచించాడు. వాటిలో కొన్ని;

  • ది ఖురాన్ (ఆంగ్లంలో ఖురాన్ తర్జుమా, కామెంటరీతో సహా)
  • గాడ్ అరైజెస్
  • ఐడియాలజీ ఆఫ్ పీస్
  • ముహమ్మద్: ద ప్రాఫెట్ ఫార్ ఆల్ హ్యుమానిటీ
  • మోరల్ విజన్
  • సింపుల్ విజ్‌డం
  • ఇంట్రడ్యూసింగ్ ఇస్లాం
  • ద కాల్ ఆఫ్ ది ఖురాన్
  • ట్రూ జిహాద్
  • మ్యాన్ నో దైసెల్ఫ్
  • ఇస్లాం రిడిస్కవర్డ్
  • యాన్ ఇస్లామిక్ ట్రెజరీ ఆఫ్ వర్చ్యూస్
  • ఇస్లాం: క్రియేటర్ ఆఫ్ ది మాడర్న్ ఏజ్
  • ఇండియన్ ముస్లిమ్స్: నీడ్ ఫార్ అ పాజిటివ్ ఔట్‌లుక్
  • అల్-ఇస్లాం యతహద్ద
  • తజ్‌కిరుల్ ఖురాన్
  • పైగంబర్-ఎ-ఇంకిలాబ్

అవార్డులు, పురస్కారాలు[మార్చు]

  • డెమిర్గస్ శాంతి అంతర్జాతీయ అవార్డు, సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ పేట్రొనేజ్ లో.
  • పద్మభూషణ్ పురస్కారం
  • జాతీయ సమైక్యతా అవార్డు
  • కమ్యూనల్ హార్మొనీ అవార్డు
  • ద దివాలిబెన్ మోహన్‌లాల్ మెహతా అవార్డు. రాష్ట్రపతిచే ప్రదానం చేయబడింది.
  • నేషనల్ అమిటీ అవార్డు, భారతప్రధానిచే ప్రదానం చేయబడింది.
  • ఢిల్లీ గౌరవ్ అవార్డు, ఢిల్లీ ముఖ్యమంత్రిచే ప్రదానం చేయబడింది.
  • FIE ఫౌండేషన్ అవార్డు
  • ఉర్దూ అకాడెమీ అవార్డు
  • అరుణా అసఫ్ అలీ సద్భావనా అవార్డు
  • నేషనల్ సిటిజన్స్ అవార్డు (మదర్ థెరెసా చే ప్రదానం చేయబడినది)
  • సీరత్ ఇంటర్నేషనల్ అవార్డు

ఇతరములు[మార్చు]

అనేక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇతనిపై పరిశోధనలు చేశారు. ఉదాహరణకు, మదనపల్లె పట్టణానికి చెందిన మొహియుద్దీన్ బాషా, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయపు విద్యార్థి, మౌలానా వహీదుద్దీన్ ఖాన్ యొక్క సాహితీసేవలపై పి.హెచ్.డి. చేశాడు.

మూలాలు[మార్చు]

  1. Maulana Wahiduddin Khan Archived 2008-12-30 at the Wayback Machine, CPS Television.
  2. In January 2000. Tamara Sonn & Mary Williamsburg, (2004), A Brief History of Islam, Blackwell. ISBN 1-4051-0902-5.
  3. "పద్మ అవార్డు గ్రహీతలు 2021". భారత ప్రభుత్వం.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Analysis of the writings of Maulana Wahiduddin Khan By Yoginder Sikand". Retrieved 2008-07-20.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-15. Retrieved 2012-07-15.
  6. http://islampeaceandjustice.blogspot.com/2008/10/maulana-wahiduddin-khan-ijtihad-freedom.html[permanent dead link]

గ్రంధాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]