సచ్చిదానంద వత్సయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సచ్చిదానంద హీరానంద వాత్స్యాయన్ 'ఆజ్ఞేయ'
सच्‍चिदानन्‍द हीरानन्‍द वात्‍स्‍यायन 'अज्ञेय'
సచ్చిదానంద హీరానంద వాత్స్యాయన్ 'ఆజ్ఞేయ'
పుట్టిన తేదీ, స్థలం(1911-03-07)1911 మార్చి 7
కుషీనగర్ గ్రామం, దేవరియా జిల్లా, ఉత్తర్ ప్రదేశ్, బ్రిటిష్ రాజ్
మరణం1987 ఏప్రిల్ 4(1987-04-04) (వయసు 76)
కొత్త ఢిలీ
వృత్తివిప్లవాత్మక, రచయిత, నవలికుడు, విలేఖరి
జాతీయతభారతీయుడు
పురస్కారాలు1964: సాహిత్య అకాడమీ పురస్కారం
1978: జ్ఞానపీఠ పురస్కారం
1983:
భారతభారతి పురస్కారం
జీవిత భాగస్వామికపిలా వాత్స్యాయన్

సచ్చిదానంద హీరానంద వాత్స్యాయన్ అజ్ఞేయ ఆధునిక హిందీ కవిత్వంలో రచయిత, విమర్శకుడు, జర్నలిస్టు. అతడు అజ్ఞేయ అనే కలం పేరుతో కవిత్వం వ్రాసాడు. ఆధునిక హిందీ సాహిత్యం "నయీ కవిత" (కొత్త కవిత్వం), ప్రయోగ్ (ప్రయోగాలు) ఉద్యమాలలో అత్యంత ఘనత సాధించిన వారిలో ఒకడు.[1][2] అతడు సప్తకాస్ అనే సాహిత్య పత్రికకు సంపాదకుడు, "దినమణ్" హిందీ వారపత్రికకు వ్యవస్థాపకుడు.[3]

అతడు తన స్వంత పుస్తకాలను కూడా అనువాదం చేయడమే కాక ఇతర భారతీయ రచయితల రచనలను కూడా ఆంగ్లంలో అనువాదం చేసాడు. ప్రపంచ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను కూడా హిందీ లోనికి అనువాదం చేసాడు.

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

సచ్చిదానంద 1911 మార్చి 7 న ఉత్తర ప్రదేశ్ లోని కుషినగర జిల్లాలో కశ్య ప్రాంతంలో జన్మించాడు.[4] తండ్రి హీరానంద శాస్త్రి పురాతత్వ శాస్త్రజ్ఞుడు, సంస్కృత పండితుడు.[5] అతడి బాల్యం వివిధ ప్రాంతాలలో గడిచింది. లక్నో లోని గోరఖ్‌పూర్, (1911–15), నలంద (1919–25), మద్రాసులోని ఉడిపి, జమ్మూ లోని జలంధర్ (1915–19), శ్రీనగర్ లలో బాల్యం గడిచింది. అతడికి ఇంటివద్దనే హిందీ, ఆంగ్లం, పర్షియన్, బంగ్లా, చరిత్ర గూర్చి నేర్పించారు. ఉడిపిలో తమిళం, సంస్కృతం భాషలను నేర్చుకున్నాడు. అతడు ఊటీ లోని ఇంగ్లీషు పాఠశాలలో చేరి, పాఠశాలను వదలి మెట్రిక్యులేషన్ చేయడానికి పంజాబ్ లోని ఒక ప్రైవేటు పాఠశాలలో చేరి, 1925లో మెట్రిక్యులేషన్ చేసాడు. 1927లో గణితం, భౌతికశాస్త్రం, సంస్కృతం అంశాలతో ఇంటర్మీడియట్ ను మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో 1927 లో పూర్తి చేసాడు. 1929 లో పారిశ్రామిక విజ్ఞానం అంశంలో బి. యస్సీని లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాలలో చేసాడు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత అతడు పంజాబ్ విశ్వవిద్యాలయంలో కాశ్మీర్ వరకు సాగిన "కాస్మిక్ కిరణ అన్వేషణా యాత్ర"లో ప్రొఫెసర్ జేమ్స్ మార్టిన్ బాన్‌డ్ వద్ద పనిచేసాడు. అతడు ఎం. ఎ (ఆంగ్లం) లో చేరాడు కానీ భారత స్వాతంత్ర్యోద్యమంలో భగత్‌సింగ్, లాలా లజపతి రాయ్, చంద్రశేఖర్ అజాద్, సుఖ్‌దేవ్, యశ్‌పాల్‌ లతో కలసి పనిచేయడం వలన పూర్తి చేయలేకపోయాడు. అతడికి భగత్ సింగ్ను జైలు నుండి ఒక ట్రక్కు ద్వారా బయటకు తీసుకురావడమనే కార్యాన్ని చంద్రశేఖర్ అజాద్ అప్పగించాడు. కానీ ఆ పథకం భగవతి చరణ్ వోహ్రా లాహోర్ బాంబు ప్రేలుళ్ళలో మరణించడం మూలంగా ఆగిపోయింది. ఈ సంఘటన తరువాత, యశ్‌పాల్ "సైంటిస్ట్" అనే మారుపేరుతో అతడిని ఒక నెలరోజులపాటు పర్వతాలపై దాచాడు. దాని తరువాత అనేక ప్రదేశాలలో నకిలీ పేర్లతో దాక్కున్నాడు. 1930 నవంబరులో అతడిని అమృత్ సర్ లో "ముల్లా మొహమ్మద్ బక్స్" పేరుతో కల్పిత గుర్తింపు కలిగి ఉన్నందున అరెస్టు చేసారు. అతడిని లాహోర్లో ఒక నెలరోజులు ఉంచారు. తరువాత అతడిని "డిల్లీ కుట్ర కేసు"లో దోషిగా నిర్ధారించి మూడున్నర సంవత్సరాల (1930–33) పాటు ఢిల్లీ, పంజాబ్ జైళ్లలో ఉంచారు. తరువాత అతడిని ఫోర్టులో మిగిలిన రెండు నెలలు, ఇంటిలో రెండు సంవత్సరాలపాటు గృహ నిర్బంధంలోఉంచారు. అతడు రాసిన సంప్రదాయ నవల "శేఖర :ఏక్ జీవని" ఆ రోజులలో జరిగిన జైలు జీవితం గురించి రాసాడు. ఈ నవలలోని మూడవ భాగం జైలర్ సీజ్ చేసి మరల తిరిగి యివ్వకపోవడం వలన ప్రచురించబడలేదు.

ప్రారంభంలో అతడు పి. డబ్ల్యూ. ఎ (ప్రగతిశీల రచయితల సంఘం) తో సంబంధం కలిగి ఉన్నాడు. అతడు "ఏంటీ ఫాసిస్టు ఫ్రంట్"లో సభ్యునిగా ఉన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంకాలంలో జపనీయులచే దాడి జరిగే నేపథ్యంలో ఆయన భారత రక్షణ దళం (అలైడ్ ఫోర్స్ (ప్రపంచ యుద్ధం II) లో చేరి మూడు సంవత్సరాలు (1943–1946) శతృవులకు ఎదుర్కొని పోరాడుతున్న మొబిల్‌సింగ్ ప్రజలకు కెప్టెన్ గా వ్యవహరించాడు. యుద్ధం పూర్తయిన తరువాత అతడు రక్షణ దళాన్ని విడిచిపెట్టాడు.

జీవితం[మార్చు]

ఆగ్రా నుండి వెలువడిన "సైనిక్" (1936), కలకత్తా నుండి వెలువడిన "విశాల్ భారత్" (1936), అలహాబాదు నుండి ప్రచురితమైన "ప్రతీక్" (1947), న్యూఢిల్లీ నుండి ప్రచురితమైన "నయా ప్రతీక్" (1973) పత్రికలకు సంపాదకునిగా తన సేవలనందించాడు. అతడు ఆంగ్ల పత్రిక "వాక్" (1951) కు కూడా సంపాదకునిగా ఉన్నాడు.

అతడు 1943 లో భారత సైన్యంలో చేరక ముందు ఆల్ ఇండియా రేడియోలో కొద్ది కాలం పనిచేసాడు.

సచ్చిదానంద భారతదేశంతో పాటు ఇతర దేశాలను కూడా సందర్శించాడు. 1957-58 లలో జపాన్ వెళ్ళి అచట బెజ్ బౌద్ధమతం గూర్చి నేర్చుకున్నాడు. అది అతని రచనా శైలిపై ప్రభావం చూపింది. 1960లో మరల ఐరోపా దేశానికి ప్రయాణమయ్యాడు. అచట ప్రైర్-డీ-క్వార్ ఆశ్రమంలో ఉన్నాడు. 1961 నుండి 1964 మధ్య యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో విజిటింగ్ ప్రొఫెసర్ గా బాధ్యతలను నిర్వహించాడు.

1968లో భారతదేశానికి తిరిగి వచ్చి టైమ్స్ ఇండియా గ్రూపుకు చెందిన వారపత్రిక "దినమణ్"ను ప్రారంభించి దానికి సంపాదకునిగా సేవలనందించాడు. "ఆకలి తరం" (హంగ్రీ జెనరేషన్) లేదా భుక్తి పీర్తి ఉద్యమంలోని సభ్యులు. వ్యవస్థాపక వ్యతిరేక రచనలు చేసినందుకు గాను అరెస్టు కావించబడి ప్రాసిక్యూట్ చేయబడ్డారు. "దినమణ్" పత్రిక ద్వారా అజ్ఞేయ ఆ యువ సాహితీ గ్రూపుకు ఆ సమస్య తీరిపోయేంతవరకు మద్దతునిచ్చాడు.

బీహార్ లో ప్రసిద్ధ కరువుపై అతని నివేదికలు ప్రజక గూర్చి నివేదించిన మైలురాళ్ళుగా చెప్పుకోవచ్చు.

ఐరోపా పర్యటనకు ముందు, 1968 వరకు అతను భారతదేశంలోనే ఉన్నాడు. 1969లో ప్రొఫెసర్ గా బెర్కెలీకి వెళ్లి అచట జూన్ 1970 వరకు కొనసాగాడు. 1976లో హెడెల్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో 8 నెలలు పనిచేసాడు. తరువాత అతడు రాజస్థాన్ లోని జోథ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా, సమకాలీన సాహిత్య విభాగానికి అధిపతిగా కొనసాగాడు.

జయప్రకాష్ నారాయణ్ "ఎవిరిమ్యాన్" వారపత్రికకు సంపాదకునిగా 1973-74 మధ్య కాలంలో ఉన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు ద్వారా వెలువడిన "నవభారత టైమ్స్" హిందీ దినపత్రికకు 1977 నుండి 1980 వరకు ప్రధాన సంపాదకునిగా పనిచేసాడు.

సచ్చిదానంద 1987 ఏప్రిల్ 4 న న్యూఢిల్లీలో మరణించాడు.

సాహితీ సేవలు[మార్చు]

కవితలు:

  • భగ్నదూత్ (1933)
  • చింతా (1942)
  • ఇటైలమ్ (1946)
  • హరి ఘాస్ పర్ క్షణ్ భర్ (1949)
  • బావ్రా అహెరి (1954)
  • ఇంద్రధను రండే హు యె (1957)
  • అరి ఓ కరుణ ప్రభమయ (1959)
  • ఆంగన్ కె పార్ ద్వార్ (1961)
  • పూర్వ (1965)
  • సునహలె శైవాల్ (1965)
  • కిత్నీ నావోన్ మై కిత్నీ బార్ (1967)
  • క్యోకి మై యూజే జనతా హూ (1969)
  • సాగర్ - ముద్రా (1970)
  • పహలే మై సన్నబనతా హూ (1973)
  • మహావృక్ష కే నీచే (1977)
  • నదీకీ బ్యాంక్ పర్ చాయా (1982)
  • సదానిర -1 (1986)
  • సదానిర -2 (1986)
  • ఐసా కోయీ ఘర్ అప్నే దేఖా హై (1986)
  • మరుతాల్ (1995)
  • సర్జానా కె క్షణ్
  • తవుర్ ధికానే (చేతిరాత, జిరాక్స్ ద్వారా ప్రచురణ)
  • కారావాస్ కె దిన్ (ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ చే ఆంగ్లం నుండి అనువాదం)
  • కవిశ్రీ
  • ఆజ్ కె లోక్‌ప్రియ కవి
  • కావ్య-స్టబక్
  • సన్నతె కా చంద్
  • అజ్ఞేయ : సంకలిత్ కవితాయే

నవలలు:

  • శేఖర్: ఏక్ జీవని I (1941)
  • శేఖర్: ఏక్ జీవని II (1944)
  • శేఖర్: ఏక్ జీవని III (ప్రచురితం కాలేదు )
  • నదీ కే ద్వీప్ (1952)
  • అప్నే-అప్నే అజ్నబీ (1961)
  • బరహ్‌ఖంబ (సహ రచయిత, 1987)
  • ఛాయా మేఖల్ (అసంపూర్తి, 2000)
  • బీనూ భగత్ (అసంపూర్తి, 2000)

కథలు:

  • విపత్గా (1937)
  • పరంపర (1944)
  • కోత్రీకీ బాత్ (1945)
  • శరణార్థి (1948)
  • జైడోల్ (1951)
  • అమర్‌వల్లరి తతా అన్య కహానియా (1954)
  • కడియన్ తతా అన్య కహానియా (1957)
  • అచ్చుతే ఫూల్ తా అన్య కహానియా (1960)
  • యే తేరే ప్రతిరూప్ (1961)
  • జిజ్ఞాస తా అన్య కహానియా (1965)
  • మేరీ ప్రియ కహానియా (2004)
  • ఛోరా హ రస్తా (సంపూర్ణ కహానియా-1, 1975)
  • లట్టి పగ్డనియన్ (సంఫూర్ణ కహానియా-2, 1975)
  • సంపూర్ణ కహానియా (2005)
  • ఆడంకీ డైరీ ( 2002)

నాటకం:

  • ఉత్తర్ ప్రియదర్శి

యాత్రలు:

  • ఆర్ యయావార్ రహేంగే యాద్ (1953)
  • కిర్నన్ కీ ఖోజ్ మె (సెలక్షన్, 1955)
  • ఏక్ బూంద్ సాహస్ ఉఛ్లి (1960)

విమర్శలు:

  • త్రిశంకు
  • హిందీ సాహిత్య: ఏక్ ఆధునిక్ పరిదృశ్య
  • ఆత్మనేపాడ్
  • ఆత్మపరక్
  • ఆల్వాల్
  • కిఖీ కాగజ్ కోరే
  • జాగ్ లిఖీ
  • ఆద్యతన్
  • సాంవస్తార్
  • స్మృతి కె పరిదృశ్య
  • శ్రాత్ ఔర్ సేతు
  • వక్తి ఔర్ వ్యవస్థ
  • యుగ్-సంధియా పర్
  • ధర్ ఓఉర్ కినారే
  • భారతీయ కళా దృష్టి
  • స్మృతిచందా
  • కేంద్ర అపుర్ పరిధి
  • సృజన్: క్యో అవుర్ కైసే
  • కవి-నికాష్
  • కవి-దృష్టి
  • తవ్దవ్ (అశోక్ వాజ్‌పేయి చే ఎంపిక)
  • లహ్కా కా దాయిత్వ
  • ఖులే మె ఖడా పేడ్

చిన్న వ్యాసాలు:

  • సబ్ రంగ్
  • సబ్ రంగ్ ఔర్ కుచ్ రాగ్
  • కహన్ హై ద్వారక
  • ఛాయా కా జంగల్

డైరీ:

  • భవంతి
  • అనతర
  • శాశ్వతి
  • శేష
  • కవిమన్

జ్ఞాపకాలు:

  • స్మృతి లేఖ
  • స్మృతి కే గలియరాన్ సె

ఎడిటింగ్ చేసినవి:

  • తార్ సప్తక్
  • దూస్రా సప్తక్
  • తీస్రా సప్తక్
  • చౌతా సప్తక్
  • పుష్కరిణి
  • నయే ఏకాంకి
  • నెహ్రూ అభినందన్ గ్రంథ్ (సహ సంపాదకుడు)
  • రూపాంబర
  • హోంవతి స్మారక్ గ్రంథ్
  • సర్జన్ ఔర్ సంప్రేషన్
  • సాహిత్య కా పరివేష్
  • సహితీ ఔర్ సమాజ్ పరివర్తన్
  • సామాజిక్ యదార్థ్ ఔర్ కథా - భాషా
  • సంకలిన్ కవితా మె చంద్
  • భవిష్య ఔర్ సాహిత్య
  • ఇండియన్ పోయెటిక్ ట్రెడిషన్.

పరిచయాలు:

  • నయే సాహిత్య శ్రిష్ట -1 రఘువీర్ సహాయ్: సీధిహియో పర్ ధూప్ మె
  • నయే సాహిత్య శ్రిష్ట -2 సర్వేశ్వర్ దయాల్ సక్సేనా: కాథ్ కీ గ్రంథియాన్
  • నయే సాహిత్య శ్రిష్ట -3 అజిత్ కుమార్: అంకిత్ హాన్ డు
  • నయే సాహిత్య శ్రిష్ట -4 శాంతి మెహ్రోత్రా

సంభాషణలు:

  • అపరోక్ష్, రమేష్ చంద్ర షా, ఇతరులు
  • రచనా: కైయన్ ఔర్ కింకే బీచ్, శరద్ కుమార్, గీతి సేన్, ఇతరులు.
  • అజ్ఞేయ- అపనే బారే మె (ఆల్ ఇండియా రేడియో ఆర్చివ్స్), రఘువీర్ సహాయ్, గోపాల్ దాస్
  • అక్వి నాయక్ అజ్ఞేయ, ఇలా దాల్మియా, నీలిమా, మాధుర్

అజ్ఞేయ పై చిత్రాలు :

  • సర్వత్ వాన్ కా బావ్రా అహేరీ, దుర్గావతి సింగ్ నిర్మాత, దూరదర్శన్ న్యూఢిల్లీ
  • సన్నాటే కా చంద్, ప్రమోద్, నీలిమ (దర్శకత్వం), వట్సాల్ నిధి, న్యూఢిల్లీ.
  • దీప్ అకేలా, ప్రమోద్ మాథుర్ దర్శకత్వం, MGAHVV, వార్దా
  • కవి భారతి, భారత్ భవన్, భోపాల్

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

  • 1964లో అంగన్ కే పార్ ద్వార్ (కవిత) రచనకు సాహిత్య అకాడమీ పురస్కారం.
  • 1978 : జ్ఞాపపీఠ్ పురస్కారం : "కిత్నీ నావోం మె కిత్నీ బార్", ఆంధ్రాలజీ కవితలకు[6]
  • భారత భారతి పురస్కారం
  • గోల్డెన్ రెత్ పురస్కారం: 1983లో అతని కవిత్వానికి.[7]

మూలాలు[మార్చు]

  1. Historical Development of Hindi Archived 14 అక్టోబరు 2007 at the Wayback Machine University of Illinois at Urbana-Champaign.
  2. S.H. Vatsyayan Archived 2016-10-21 at the Wayback Machine Personalities of India.
  3. "Indian Poets Writing In Hindi". Archived from the original on 26 అక్టోబరు 2009. Retrieved 26 అక్టోబరు 2009.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. http://www.bharatdarshan.co.nz/author-profile/7/agyeya.html
  5. Kumar, Kuldeep (18 March 2016). "A rebel in life and work". The Hindu. Retrieved 15 April 2017.
  6. Jnanpith Laureates Archived 2012-02-18 at the Wayback Machine Bharatiya Jnanpith website.
  7. Golden Wreath Award

బయటి లింకులు[మార్చు]