అడవిపాలెం

వికీపీడియా నుండి
(అడవిపాలెము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంసంతమాగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


లువా తప్పిదం: Coordinates not found on Wikidata అడవిపాలెం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

చరిత్ర ప్రకారం ఈ గ్రామం దాదాపుగా 200 సంవత్సరాలుగా విరజిల్లుతున్నది. అడవిపాలెం గ్రామ ప్రజలు ప్రకాశం జిల్లా లక్కవరం నుండి వలస వచ్చి నివాసం ఏర్పరుచుకోనిరి. మరియెక గ్రామం పేరు "గొపాపురం"గా ఉందెది. ఈ గ్రామం ఎల్చురు గ్రామం దగ్గరిగా ఉందెది. కాల క్రమేనంలో ఇది దొంగలబారిన పడింది, ఆ బాధలు తాళ లేక ఈ గ్రామ ప్రజలు అడవిపాలెం గ్రామం ప్రజలతో జీవనం కొనసాగించారు. అదే ఇప్పటి అడవిపాలెం గ్రామం. గ్రామం ఏర్పడినప్పుడు అక్కడ చిన్న పాటి చెట్ల సముదాయం వుండేది అందువల్ల ఈ గ్రామానికి "అడవిపాలెం" అని పేరు ఆనాటి గ్రామస్థుల వలన నిర్ణయం జరిగింది. మరియొక కథనం ప్రకారం ఈ గ్రామం పేరు "ఆనందపురం" అని కూడా పేరుగాంచింది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామం ఏర్పడినప్పుడు అక్కడ చిన్న పాటి చెట్ల సముదాయం వుండేది అందువల్ల ఈ గ్రామానికి "అడవిపాలెం" అని పేరు ఆనాటి గ్రామస్థుల వలన నిర్ణయం జరిగింది. మరియొక కథనం ప్రకారం ఈ గ్రామం పేరు ఆనందపురం అని కూడా పేరుగాంచింది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామం చుట్టూ ప్రక్కల గల గ్రామాలు ఏల్చూరు, కామేపల్లి, వెల్లాలచెరువు, గంటవారిపాలెం, మతుకుమల్లి, కారుమంచి గ్రామాలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి.

  • ఏల్చూరు నుండి మార్గం. ఇది సుమారుగా 4 కి.మీ దూరం, నేషనల్ హైవే - 45 కు సమీపముగా గలదు.
  • వెల్లాలచెరువు నుండి మార్గం. ఇది సుమారుగా 4 కి.మీ దూరం, స్టేట్ హైవే - 50 కు సమీపముగా గలదు.

ఈ ఊరు చేరుకొనుటకు ప్రైవేటు ఆటోలు ఉన్నాయి. లేదా దాదాపుగా ఊరివారందరకు వ్యక్తిగత వాహనములు (బైక్స్, మోటారు వాహనములు) ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  2. నాలుగు వందల మంది చుట్టుప్రక్కల గల రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్నారు.
  3. గ్రంథాలయం.

మౌలిక వసతులు[మార్చు]

  1. ప్రదాన రహదారులు
  2. మంచి నీటి పధకం
  3. పంచాయితి భవనం
  4. కమ్యూనిటి భవనం
  5. కళ్యాణ మండపం
  6. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
  7. పశువుల ఆసుపత్రి
  8. సొసైటి భవనం
  9. పొలములకు ప్రత్యెక రహదారులు

రాజకీయాలు[మార్చు]

రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలసి మెలసి ఉంటారు. రాజకీయాలలో ఈ ఊరు ఆదర్శ గ్రామంగా ఉంటుంది .

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కోలా గురవమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా ఒంగోలు వెంకటరావు ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

ప్రదానంగా రామాలయం, శ్రీ వేంకటేశ్వర ఆలయం, శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి ఆలయము, శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి ఆశ్రమం, అప్పిరెడ్డి స్వామి ఆలయం, పోలేరమ్మ తల్లి ఆలయం, అంకాలమ్మ ఆలయాలు గలవు. వీటిలో ప్రధానంగా ప్రతి రోజు పూజలు అందుకొనే ఆలయాలు ఉన్నాయి.

  • రామాలయం:- ఈ దేవాలయం గత 150 సంవత్సరాలుగా విరాజిల్లుతున్నది, ఇక్కడ శ్రీ రాముడు నిత్యం పూజలు అందుకుంటూ ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు.
  • శ్రీ వెంకటేశ్వర ఆలయం:- ఈ దేవాలయం గత 20 సంవత్సరాలుగా విరాజిల్లుతున్నది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడు నిత్యం పూజలు అందుకుంటూ ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు.
  • శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి ఆలయము:- ఈ దేవాలయం గత 10 సంవత్సరాలుగా విరాజిల్లుతున్నది, ఇక్కడ తిరుపతమ్మ తల్లి నిత్యం పూజలు అందుకుంటుంది.
  • శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి ఆశ్రమం:- ఈ ఆశ్రమం గత 5 సంవత్సరాలుగా విరజిల్లుతున్నది, ఇక్కడ తిరుపతమ్మ తల్లి నిత్యం పూజలు అందుకుంటుంది.

ఆధ్యాత్మిక విశేషాలు[మార్చు]

ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రజలందరూ అత్యంత విభోవోపేతముగా భక్తీగా జరుపుకొనే సంబరాలు, ఊత్చవాలు, వేడుకలు, పండుగలు:- 1. సంక్రాంతి సంబరాలు 2. మహా శివరాత్రి జాగరణ 3. ఉగాది వేడుకలు 4. శ్రీరామా నవమి 5. వినాయక చవితి పూజలు, ఊత్చవాలు, ఊరేగింపులు 6. దసరా సంబరం7. శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి కళ్యాణం 8. అప్పిరెడ్డి తాత తిరునాళ్ళ 9. బొడ్డు రాయి పూజ 10. గ్రామ దేవతల పూజలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]