Coordinates: 17°32′18″N 78°23′06″E / 17.5384240°N 78.3850000°E / 17.5384240; 78.3850000

విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల (హైదరాబాదు)
వి.యన్.ఆర్. కళాశాల ముఖద్వారం
నినాదంతమసోమా జ్యోతిర్గమయా (Sanskrit) ( చీకటి నుండి, నన్ను వెలుగులోకి నడిపించండి )
రకంప్రైవేటు–పరిశోధన
స్థాపితం1995 (1995)
అనుబంధ సంస్థజె.ఎన్.టి.యు. (హైదరాబాదు)
ప్రధానాధ్యాపకుడుచల్లా ధనుంజయ్ నాయుడు
డైరక్టరుడి.యన్ నాగేశ్వర్రావు
ప్రధాన కార్యదర్శిహరిశ్చంద్ర ప్రసాద్
విద్యాసంబంధ సిబ్బంది
342
విద్యార్థులు6,300
అండర్ గ్రాడ్యుయేట్లు4,320
పోస్టు గ్రాడ్యుయేట్లు540
ఇతర విద్యార్థులు
1,440a
స్థానంహైదరాబాద్, తెలంగాణ
17°32′18″N 78°23′06″E / 17.5384240°N 78.3850000°E / 17.5384240; 78.3850000
కాంపస్పట్టణ
21 acres (8.5 ha)(Total campus)
భాషఆంగ్లం
AlumniVNRAlums
విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల is located in Telangana
విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల
Location in Telangana

వల్లూరుపల్లి నాగేశ్వర్రావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ( వి.యన్.ఆర్. కళాశాల, విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల, VNRVJIET) హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (యూజీసీ) నుండి స్వయం ప్రతిపత్తి హోదా పొందిన ఇంజనీరింగ్ కళాశాల. ఇది అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) చే గుర్తించబడింది. ఇది జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.[1]

2020 ఎన్‌ఐఆర్‌ఎఫ్ (NIRF) ర్యాంకింగ్స్ ప్రకారం, ఇంజనీరింగ్ విభాగంలో ఈ కళాశాల 127 వ స్థానంలో నిలిచింది.[2] నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) అక్రెడిటేషన్ రెండవ చక్రంలో ఈ కళాశాల NAAC 3.73 / 4 గ్రేడింగ్ ను పొందింది.

ఈ కళాశాలలోని డిగ్రీ కోర్సులు IT నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) న్యూఢిల్లీ ద్వారా 2008 నుంచి గుర్తింపు పొందాయి. [3]

చరిత్ర[మార్చు]

ఇది 1995 లో "విజ్ఞాన జ్యోతి"ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించబడింది. ఈ కళాశాల ప్రాధమికంగా బి.టెక్ కళాశాలగా ప్రారంభమైంది. 2003 నుండి ఈ సంస్థ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ( M.Tech ) డిగ్రీ కోర్సులు ప్రారంభించింది.

విభాగాలు[మార్చు]

ఆటోమొబైల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాలున్నాయి.

ప్రవేశాలు[మార్చు]

డిప్లొమా[మార్చు]

ఈ సంస్థ 2009 సంవత్సరం నుండి రెండవ షిఫ్ట్ ప్రాతిపదికన తన 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులను ప్రారంభించింది. విద్యార్థులు పాలిసెట్ (POLYCET) ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం పొందుతారు.

డిగ్రీ[మార్చు]

బి.టెక్ ప్రవేశాలు రెండు కేటగిరీలుగా అందించబడతాయి. కేటగిరీ ఎ సీట్లను రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష (TS EAMCET) ఫలితాల ఆధారంగా భర్తీ చేస్తారు. కేటగిరీ బి సీట్లను ఎన్ ఆర్ ఐ కోటా ద్వారా లేదా ఇతర రాష్ట్ర లేదా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల (జేఈఈ మెయిన్స్) ఆధారంగా భర్తీ చేస్తారు. డిప్లొమా చదివిన వారు, సమాంతర చేరిక పథకం (లేటరల్ ఎంట్రీ స్కీం) కింద ఈసెట్ (TS ECET) ఫలితాల ఆధారంగా బి. టెక్ కోర్సు రెండో సంవత్సరంలో చేరవచ్చు.

పర్యావరణం[మార్చు]

కళాశాల క్యాంపస్‌లో పర్యావరణ పరిరక్షణ వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఎకోవానీ వేస్ట్ మేనేజ్‌మెంట్ తో ఒప్పందం ఉన్నది.[4]

మూలాలు[మార్చు]

  1. "Affiliated Colleges for the Academic Year 2019-20". jntuhaac.in. Retrieved 2021-02-21.
  2. "MHRD, National Institute Ranking Framework (NIRF)". www.nirfindia.org. Retrieved 2021-02-21.
  3. "Colleges". ugc.ac.in. Retrieved 2021-02-21.
  4. Correspondent, D. C. (2024-02-01). "Campus Collaboration for Sustainable Waste Management". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-05-31.