అంగద్ ప్రతాప్
అంగద్ ప్రతాప్ | |
|---|---|
2024లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేత సత్కరించబడుతున్న ప్రతాప్ | |
| జననం | 1982 జులై 17 ప్రయాగరాజ్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
| పాఠశాల/కళాశాలలు | |
| వృత్తి | |
| అంతరిక్ష జీవితం | |
| ఇస్రో వ్యోమగామి | |
| ఎంపిక | మొదటి గగనయాత్రి బృందం (2019) |
| Military career | |
| రాజభక్తి | భారతదేశం |
| సేవలు/శాఖ | |
| సేవా కాలం | 2004–ప్రస్తుతం |
| ర్యాంకు | గ్రూప్ క్యాప్టెన్ |
అంగద్ ప్రతాప్ (జననం 17 జూలై 1982) భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్, టెస్ట్ పైలట్, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు చెందిన వ్యోమగామి. 2019లో ఇస్రో చేపట్టిన భారతీయ మానవ అంతరిక్ష యాత్రలో భాగంగా గగన్‌యాన్ మిషన్ కోసం శిక్షణకు ఎంపికైన నలుగురిలో ఈయన ఒకరు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ప్రతాప్ ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జన్మించారు.[1] స్ప్రింగ్‌డేల్స్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తరువాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి పట్టభద్రుడై, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చేరారు.[2]
రక్షణ రంగ వృత్తి
[మార్చు]ప్రతాప్ 2004 డిసెంబర్ 18న భారత వైమానిక దళంలోని ఫైటర్ విభాగంలో చేరారు. As of 2025[update], ఈయన భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్నారు. ఈయనకు ఆంటోనోవ్ ఎన్-32, డోర్నియర్ డూ 228, మిగ్యోన్-గురేవిచ్ మిగ్-21, మిగ్యోన్ మిగ్-29, సుఖోయ్ సు-30 MKI వంటి విమానాలలో 2,900 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఉంది. టెస్ట్ పైలట్‌గా అర్హత సాధించడానికి ముందు ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు.[2][3][4] మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి ఎంపిక కావడానికి ముందు ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, టెస్ట్ పైలట్‌గా సేవలు అందించారు.[5]
వ్యోమగామిగా ప్రస్థానం
[మార్చు]
2019లో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ కార్యక్రమం కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ద్వారా ప్రతాప్ షార్ట్‌లిస్ట్ అయ్యారు. భారతీయ మానవ అంతరిక్ష యాత్రలో భాగంగా శిక్షణ కోసం ఎంపికైన నలుగురు అభ్యర్థులలో ఈయన ఒకరు.[6][7][8] 2020 నుండి 2021 వరకు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందారు.[9] తరువాత బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణా కేంద్రంలో మిషన్-నిర్దిష్ట శిక్షణ పొందారు.[10] భారతదేశం ప్రణాళిక చేసిన మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం వ్యోమగామి బృంద సభ్యుడిగా ప్రతాప్‌ను 2024 ఫిబ్రవరి 27న ఇస్రో అధికారికంగా పరిచయం చేసింది.[11] As of 2025[update], ఈయన గగన్‌యాన్ సిబ్బందిలో భాగంగా శిక్షణ కొనసాగిస్తున్నారు. మొదటి సిబ్బంది మిషన్ 2027లో జరుగుతుందని అంచనా.[12][13]
మూలాలు
[మార్చు]- ↑ "Prayagraj Boy To IAF Pilot: Meet Group Captain Angad Prathap". Times Now. 27 February 2024.
- ↑ 2.0 2.1 "Angad Pratap – Biography". Britannica. Retrieved 1 June 2025.
- ↑ "All you need to know about the Gaganyaan astronauts". NDTV. Retrieved 1 June 2025.
- ↑ "Gaganyaan astronaut completes mountaineering course". The Times of India. 16 November 2024.
- ↑ "Who Are The Four Astronauts Selected For India's Crewed Space Mission Gaganyaan?". News18. Retrieved 1 June 2025.
- ↑ Pandey, Geeta (27 February 2024). "Gaganyaan: India names astronauts for maiden space flight". BBC News. Retrieved 27 February 2024.
- ↑ Rajwi, Tiki (27 February 2024). "ISRO's Gaganyaan mission: PM Modi announces Indian astronaut designates". The Hindu. Retrieved 3 December 2025.
- ↑ "గగన్‌యాన్ నలుగురు వ్యోమగాములు వీరే.. పేర్లు ప్రకటించిన మోదీ". ఈనాడు. 27 February 2024. Retrieved 3 December 2025.
- ↑ "ISRO's astronaut trainees return after completing training in Russia". The Hindustan Times. 14 March 2021. Retrieved 1 June 2025.[permanent dead link]
- ↑ Kumar, Chethan. "Nair, Prathap, Krishnan and Chauhan listed for Gaganyaan mission". The Times of India. Retrieved 27 February 2024.
- ↑ "PM announces Gaganyaan astronauts". BBC News. 27 February 2024. Retrieved 1 June 2025.
- ↑ Koshy, Jacob (6 May 2025). "Gaganyaan mission moved to first quarter of 2027". The Hindu. Retrieved 3 December 2025.
- ↑ "Gaganyaan: India names astronauts for maiden space flight". BBC News. 27 February 2024. Retrieved 3 December 2025.