అంజలి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంజలి
Anjali at 60th South Filmfare Awards 2013.jpg
జననం (1986-09-11) 1986 సెప్టెంబరు 11 (వయస్సు: 33  సంవత్సరాలు)
మొగలికుదురు
మామిడికుదురు మండలం
తూర్పుగోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము.
వృత్తినటీమణి, మోడల్.
క్రియాశీలక సంవత్సరాలు2006–ఇప్పటి వరకు

అంజలి (ఆంగ్లము: Anjali) తమిళ సినిమాలలో నటిస్తున్న ఒక భారతదేశ నటీమణి మరియు మోడల్.

నేపధ్యము[మార్చు]

అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది.[1]

సినీ ప్రస్థానం[మార్చు]

  • మ్యాథ్స్‌లో డిగ్రీ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించేది. అవే సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా మారాయి. అలా తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అదే తెలుగులో వచ్చిన 'డేర్'.
  • తర్వాత 2006లో 'ఫొటో' సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 2007లో 'ప్రేమలేఖ రాశా'.. సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన 'షాపింగ్‌మాల్' సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ 'జర్నీ'లో అవకాశం ఇచ్చారు.
  • 2011లో విడుదలైన 'జర్నీ' సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్‌తో అందరికీ గుర్తుండిపోయింది.
  • 2013లో మళ్లీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు.
  • తర్వాత 'బలుపు' సినిమాలో శృతిహాసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని, రవితేజతో ఆడిపాడింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. సింగం-2 తమిళ వెర్షన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి.
  • ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా ముందుకు సాగిపోతోంది.
  • తమిళచిత్రం 'ఎంగేయం ఎప్పోదం' (తెలుగులో జర్నీ)లో తన అద్భుతమైన నటనకు గాను 'సౌత్ ఫిల్మ్‌ఫేర్-2012', 'విజయ్' అవార్డులు సొంతం చేసుకుంది.

ఈమె నటించిన పాత్రల్లో రెండు చిన్న తెలుగు సినిమాలో నటించిన సమయంలో 2007 సంవత్సరంలో కట్రదు తమిళ్ అనే తమిళ సినిమాతో పరిచయమైయ్యారు. ఆనంది అనే పాత్రలో చాలా అద్భుతంగా నటించడంతో ఉత్తమ నూతన నటిగా దక్షిణ ప్రాంత ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2010లో అంగాడితెరు అనే సినిమాలో కనిగా నటించి ఆ సంవత్సరంలోని ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల తరువాత అత్యుత్తమ యువ నటిగా తమిళ సినిమా ప్రపంచంలో గుర్తింపు పొందారు.[2] మరియు ప్రదర్శన ఆధారిత పాత్రలలో నటిస్తు ప్రసిద్ధి చెందుతున్నారు.[3][4][5]

వివాదాలు[మార్చు]

2013, ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఉంటున్న హోటల్ నుంచి ఉన్నట్టుండి మాయమవడంతో కాస్త అలజడి సృష్టించింది అంజలి. తర్వాత పోలీసుల ముందు ప్రత్యక్షం కావడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. పిన్ని భారతీదేవి, దర్శకుడు కలాంజియం కలిసి తనను హింసిస్తున్నారంటూ మీడియాకు తెలిపింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

పురస్కారాలు[మార్చు]

దక్షిణ భారత ఫిలింఫేర్ పురస్కారాలు[మార్చు]

విజయ్ పురస్కారాలు[మార్చు]

  • 2008: ఉత్తమ నూతన నటీమణి - కట్రదు తమిళ్ [6]
  • 2011: ఉత్తమ నటీమణి - అంగాడితెరు

ఇతర పురస్కారాలు[మార్చు]

  • 2011: ఉత్తమ నటిగా విగడన్ పురస్కారం- అంగాడితెరు
  • 2011: ఉత్తమ నటిగా తమిళ సినిమా ప్రెస్ పురస్కారం- గాడితెరు

మూలాలు[మార్చు]

  1. http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/apr/10/main/10main5&more=2013/apr/10/main/main&date=4/10/2013#.UWUAyFereB4
  2. "Anjali eyeing mass films?". Sify.com. Retrieved 2011-09-21. Cite web requires |website= (help)
  3. "Anjali wants to do commercial cinema - Times of India". Articles.timesofindia.indiatimes.com. 2011-01-17. Retrieved 2011-09-21. Cite web requires |website= (help)
  4. "I want people to say there's no one like me". Rediff.com. 2011-09-15. Retrieved 2011-09-21. Cite web requires |website= (help)
  5. "Image makeover for Anjali - Times of India". Articles.timesofindia.indiatimes.com. Retrieved 2011-09-21. Cite web requires |website= (help)
  6. "Reliance Mobile Vijay Awards - The Awards Ceremony". Star Vijay. Retrieved 2009-03-27. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]