అంజలీ ఇళా మీనన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంజలీ ఇళా మీనన్
జననం (1940-07-17) 1940 జూలై 17 (వయసు 84)
బర్న్‌పూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ
జాతీయతభారతీయురాలు
చేసిన పనులుయాత్ర, లుకింగ్ ఔట్ ఆఫ్ ఎ విండో, ఎకోలైట్, పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ యంగ్ యాక్టర్, ది మెజీషియన్ స్టోరీ
అవార్డులుదృశ్య కళలకు గాను పద్మశ్రీ (2000)
కాళిదాస్ సమ్మాన్

అంజలీ ఇళా మీనన్ (జననం 1940 జూలై 17) భారతదేశంలోని ప్రముఖ కళాకారులలో ఒకరు. ఆమె చిత్రాలు NGMA, చండీగఢ్ మ్యూజియం, పీబోడీ ఎసెక్స్ మ్యూజియంతో సహా అనేక ప్రధాన ప్రదర్శనలలో ఉన్నాయి.[1] 2006 లో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఏషియన్ ఆర్ట్ మ్యూజియం ఆమె ట్రిప్టిక్[2] చిత్రం "యాత్ర"ని కొనుగోలు చేసింది. ఇతర కృతులు కూడా గ్రూప్ ఎగ్జిబిషన్‌లలో భాగంగా ఉన్నాయి. 2009 లో లండన్ లోని ఐకాన్ గ్యాలరీలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) సమర్పించిన 'కల్పన: ఫిగ్రేటివ్ ఆర్ట్ ఇన్ ఇండియా' వాటిలో ఒకటి. మురానో గ్లాస్, కంప్యూటర్ గ్రాఫిక్స్, వాటర్ కలర్ వంటి ఇతర మాధ్యమాలతో కూడా ఆమె పనిచేసినప్పటికీ, ఆమె ఇష్టపడే మాధ్యమం మాత్రం, ఆయిల్ ఆన్ మసోనైట్.[3] ఆమె సుప్రసిద్ధ కుడ్యచిత్రకారురాలు. 2000 లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. [4] ఆమె న్యూఢిల్లీలో నివసిస్తోంది.[5]

ప్రారంభ జీవితం

[మార్చు]

అంజలీ ఇళా మీనన్ బెంగాల్‌లోని బర్న్‌పూర్‌లో (ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లో) 1940 జూలై 17 న జన్మించింది. ఆమె బెంగాలీ, అమెరికన్ తల్లిదండ్రులకు జన్మించింది.[6] కృష్ణ గోవింద గుప్తా, సోవాబజార్ రాజ్ కుటుంబం ఆమెకు పూర్వీకులు.[7]

ఆమె తమిళనాడులోని నీలగిరి హిల్స్‌లోని లవ్‌డేల్‌లోని లారెన్స్ పాఠశాలలో చదువుకుంది. 15 సంవత్సరాల వయస్సులో, పాఠశాల చదువు అయ్యేటప్పటికే, ఆమె కొన్ని పెయింటింగ్‌లను విక్రయించింది. ఆ తర్వాత, ఆమె ముంబైలోని సర్ JJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్‌లో కొద్దికాలం పాటు చదువుకుంది. తరువాత ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మిరాండా హౌస్ అనే మహిళా కళాశాలలో చదువుకుని ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందింది. ఈ సమయంలో, ఆమె మోడిగ్లియాని, భారతీయ చిత్రకారులైన MF హుస్సేన్, అమృతా షెర్గిల్ ల కృతుల పట్ల ఆకర్షితురాలైంది. 18 ఏళ్ళ వయసులో, ఆమె వివిధ శైలులలో యాభై మూడు పెయింటింగ్‌లతో సోలో ఎగ్జిబిషన్‌ నిర్వహించింది. ఆమె 1959 నుండి 1961 వరకు పారిస్‌లోని ఎకోల్ డెస్ బ్యూక్స్-ఆర్ట్స్‌లో చదువుకోవడానికి ఫ్రెంచ్ ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను పొందింది.[3] ఆమె రోమనెస్క్, బైజాంటైన్ కళలను అధ్యయనం చేస్తూ యూరప్ లోను, పశ్చిమాసియాలోనూ విస్తృతంగా పర్యటించింది.[5] 1980-81 సమయంలో, ఫ్రాన్స్, UK, US ప్రభుత్వాలు ఆమెను తదుపరి చదువులు కొనసాగించమని ఆహ్వానించాయి.[8]

కృషి

[మార్చు]

అంజలీ ఇళా మీనన్ ఇష్టపడే మాధ్యమం మసోనైట్ మీద ఆయిల్. ఆమె అపారదర్శక రంగులు, సన్నని వాష్‌ల శ్రేణిని ఉపయోగించడం ద్వారా ఈ రంగులు వేసేది. ఆయిల్ పెయింటింగ్స్, కుడ్యచిత్రాలతో పాటు, ఆమె కంప్యూటర్ గ్రాఫిక్స్, మురానో గ్లాస్‌తో సహా అనేక ఇతర మాధ్యమాలతో పనిచేసింది. ఆమె మతపరమైన-నేపథ్యంగల కృతులు, పోర్ట్రెయిట్‌లు, నగ్న చిత్రాలకు ప్రసిద్ది చెందింది. వీటిలో ఆమె శక్తివంతమైన రంగులను వాడుతూ, క్యూబిజం నుండి యూరోపియన్ పునరుజ్జీవనోద్యమం వరకూ చెందిన కళాకారులను గుర్తుచేసే పద్ధతుల వరకు వివిధ శైలులలో ప్రదర్శించింది. 1997 లో ఆమె మొదటిసారిగా బౌద్ధ సారాంశాలతో అమూర్త చిత్రణను ప్రదర్శించింది. ఆమె పారిస్, అల్జీర్స్, సావో పాలో, బైయెన్నియేల్‌లు, న్యూ ఢిల్లీలోని మూడు ట్రైయెన్నియేల్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[9]

సుప్రసిద్ధ కుడ్యచిత్రకారిణి అయిన అంజలీ ఇళా మీనన్ భారతదేశంలోను, విదేశాలలోనూ 35కి పైగా సోలో షోలు, అనేక గ్రూప్ షోలూ చేసింది. 1968, 1972, 1975 లలో ఆమె లలిత్ కళా అకాడమీ ద్వారా I, II, III ఇంటర్నేషనల్ ట్రైయెన్నియేల్‌తో పాటు 1980లో ఫ్రాన్స్‌లోని ప్యారిస్ బైయెన్నియేల్, 1980లో న్యూయార్క్, వాషింగ్టన్ DC [10] లలోనూ ప్రదర్శించింది.

2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం, అంజలీ ఇళా మీనన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. [4] అదే సంవత్సరంలో, ఆమె ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA) ట్రస్టీల బోర్డుకు నామినేటయింది — అప్పటి వరకు ఈ నామినేషను పొందిన ఏకైక దృశ్య కళాకారిణి ఆమె. [11] 2002 లో ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో వదేహ్రా ఆర్ట్ గ్యాలరీ నిర్వహించిన ప్రధాన ప్రదర్శనలో ఆమె రచన 'ఫోర్ డికేడ్స్' ప్రదర్శించబడింది. ఈ సేకరణ చివరికి కర్ణాటక చిత్రకళా పరిషత్, బెంగళూరుతో సహా ప్రధాన భారతీయ నగరాల్లోని ఇతర ప్రముఖ గ్యాలరీలను సందర్శించింది.[12] ఆమె జీవితం గురించి, ఆమె కృషి గురించి CNN, దూరదర్శన్ ఛానెల్‌ల కోసం రూపొందించబడిన అనేక చిత్రాలలో ప్రదర్శించారు.[8]

తరువాత జీవితం

[మార్చు]

అంజలీ తన చిన్ననాటి స్నేహితుడు, రియర్ అడ్మిరల్ (రిటైర్డ్.) రాజా మీనన్‌ను పెళ్ళి చేసుకుంది.[13] అతను భారతీయ నౌకాదళ అధికారి, వ్యూహాత్మక విశ్లేషకుడు, రచయిత. వారికి ఇద్దరు కుమారులు, నలుగురు మనుమలు ఉన్నారు. పెళ్ళైనప్పటి నుండి, ఆమె భారతదేశం, US, యూరోప్, జపాన్, పూర్వపు USSR లో నివసించింది. ఆమె అప్రితా సింగ్, రిని దుమాల్, FN సౌజా, జామినీ రాయ్, రామ్ కుమార్, KG సుబ్రమణ్యం వంటి ఇతర కళాకారుల కృతులను సేకరిస్తుంది.[14]

అవార్డులు

[మార్చు]

ప్రదర్శనకు

[మార్చు]

అంజలీ ఇళా మీనన్ బ్లాక్ హీత్ గ్యాలరీ-లండన్, గ్యాలరీ రాడికే-బాన్, విన్‌స్టన్ గ్యాలరీ-వాషింగ్టన్, దోమా ఖుడోజిన్‌కోవ్-USSR, రవీంద్ర భవనంద్ శ్రీధరాణి గ్యాలరీ-న్యూఢిల్లీ, కలకత్తా అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌, మద్రాస్, జహంగీర్ గ్యాలరీ, కెమోల్డ్ గ్యాలరీ, తాజ్ గ్యాలరీ, బాంబే, మాయా గ్యాలరీ మ్యూజియం అనెక్స్, హాంకాంగ్ లలోముప్పైకి పైగా సోలో షోలు ప్రదర్శించింది. 1988లో బొంబాయిలో రెట్రోస్పెక్టివ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఆమె ఫ్రాన్స్, జపాన్, రష్యా, USAలలో అనేక అంతర్జాతీయ ప్రదర్శనలలో పాల్గొంది.[6] ప్రైవేట్, కార్పొరేట్ సేకరణలలోని పెయింటింగ్‌లతో పాటు, ఆమె కృతులు భారతదేశం లోను, విదేశాలలోనూ మ్యూజియంలు సేకరించాయి.

ప్రచురణలు

[మార్చు]
  • అంజలీ ఇళా మీనన్: పెయింటింగ్స్ ఇన్ ప్రైవేట్ కలెక్షన్స్ హార్డ్ కవర్ – 15 నవంబర్ 1995 ఇసానా మూర్తి (రచయిత), ఇందిరా దయాల్ (కంపైలర్), అంజలీ ఇళా మీనన్ (ఇలస్ట్రేటర్)
  • ఇసానా మూర్తి రచించిన "అంజలీ ఇళా మీనన్: త్రూ ది పాటినా," వధేరా ఆర్ట్ గ్యాలరీ ప్రచురించింది.

మూలాలు

[మార్చు]
  1. "Anjolie Ela Menon". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Retrieved 2021-03-14.
  2. పక్కపక్కనే వేలాడదీసిన మూడు వేరువేరు చిత్రాలు. మూడింటినీ కలిపి చూసినపుడు అవి సంపూర్ణ చిత్రంగా ఉంటాయి
  3. 3.0 3.1 "Anjolie Ela Menon | Indian painter". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-03-14. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "britannica.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 4.2 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Padma Awards" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. 5.0 5.1 "Anjolie Ela Menon - Artists - Aicon Gallery". www.aicongallery.com. Retrieved 2021-03-14. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "aicongallery.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. 6.0 6.1 "Anjolie Ela Menon". www.contemporaryindianart.com. Archived from the original on 12 October 2017. Retrieved 2017-09-29.
  7. "Mauled mural up for repair". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-12-29.
  8. 8.0 8.1 "Artists;- Anjolie Ela Menon". www.artalivegallery.com. Retrieved 2019-03-12. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "artalivegallery.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  9. "Anjolie Ela Menon | Indian painter". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2017-09-29.
  10. "Anjolie Ela Menon - Artists". www.artalivegallery.com. Retrieved 2021-03-14.
  11. Begum, Rehana. “Works and Style of Arpana Caur and Anjolie Ela Menon: A Comparative Study,” 2009.
  12. Archive, Asia Art. "Anjolie Ela Menon: Four Decades". aaa.org.hk (in ఇంగ్లీష్). Retrieved 2021-03-14.
  13. "Raja Menon | Manohar Parrikar Institute for Defence Studies and Analyses". idsa.in. Retrieved 2021-03-14.
  14. "'A Neo Romantic Necrophiliac'". www.outlookindia.com/. Retrieved 2021-03-14.
  15. "7 Indians honoured at Limca Book of Records". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-03-14.
  16. "Lifetime achievement award for Rashid Khan, Anjolie Ela Menon". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-08-09. Retrieved 2021-03-14.
  17. "Artist Anjolie Ela Menon conferred the Kalidas Award". 1 July 2018. Retrieved 2 January 2019.