సి. అంజిరెడ్డి
అంజిరెడ్డి చిన్నమైల్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 మార్చి 30 | |||
ముందు | టి.జీవన్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 18 జూన్ 1966 సాయినగర్ కాలనీ, రామచంద్రపురం, సంగారెడ్డి జిల్లా తెలంగాణ | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | సి.రాజిరెడ్డి | ||
జీవిత భాగస్వామి | గోదావరి | ||
సంతానం | హనీశ్, అశ్విత | ||
నివాసం | సాయినగర్ కాలనీ, బిహెచ్ఇఎల్ బస్ డిపో, రామచంద్రపురం, సంగారెడ్డి జిల్లా తెలంగాణ | ||
వృత్తి | పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు |
చిన్నమైల్ అంజిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు. అతను 2025 తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
జననం విద్యాభ్యాసం
[మార్చు]అంజిరెడ్డి తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురంలోని సాయినగర్ కాలనిలో ఒక సాధారణ రైతు కుటుంబంలో 18 జూన్ 1966లో చిన్నమైల్ రాజిరెడ్డి దంపతులకు జన్మించాడు. అతను 1982లో ఆర్.సి పురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి, 1987లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అంజిరెడ్డి చిన్నమైల్ 1978లో తొలి సారిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరాడు, ఆ తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ)లో చేరి విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. అతను 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అంజిరెడ్డి ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పని చేసి 2018 ఏప్రిల్ 25న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతను 2020 నవంబర్ 18న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో సమావేశమైన తరువాత నవంబర్ 19న బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరాడు.[4]
అంజిరెడ్డి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2025 తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పై 5,106 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
మొదటి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్‌పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా పోటీలో ఉన్న 54 మంది ఎలిమినేట్ అయినా కోటా ఓట్లు ఎవరికి లభించలేదు. దీంతో ఆ ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటించారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత అంజి రెడ్డి 98,637 ఓట్లతో ప్రథమ స్థానం పొందగా, నరేందర్ రెడ్డి 93,531 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా అంజిరెడ్డికి అదనంగా 22,962 ఓట్లు రాగా, నరేందర్‌రెడ్డికి 22,966 ఓట్లు వచ్చాయి.[5]
అంజిరెడ్డి చిన్నమైల్ 2025 ఏప్రిల్ 7న శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[6][7]
సేవా కార్యక్రమాలు
[మార్చు]సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అంజిరెడ్డి. 1993లో ఎస్సార్ ఇండస్ట్రీని స్థాపించారు. ఎస్సార్ ట్రస్టు పేరిట విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ బడులు, కళాశాలల్లో తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు ఆర్థికంగా సేవలందించారు.[8] అంజిరెడ్డి సతీమణి గోదావరి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "బీజేపీకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ". Sakshi. 6 March 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ "Backed by BJP, Anji Reddy 'wins' Karimnagar Graduates' seat" (in Indian English). The Hindu. 6 March 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ "తుది వరకు ఉత్కంఠ". Eenadu. 6 March 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ Telugu, ntv (2025-02-07). "Chinnamail Anji Reddy: బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 'పట్టభద్రుల సంకల్ప యాత్ర'." NTV Telugu. Retrieved 2025-03-05.
- ↑ "భాజపాకే పట్టాభిషేకం". 6 March 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ "ఏడుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Eenadu. 8 April 2025. Archived from the original on 8 April 2025. Retrieved 8 April 2025.
- ↑ "అధ్యక్షా..!". Andhrajyothy. 8 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "అంజిరెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం | - | Sakshi". Sakshi. 11 January 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.