అంజు చధా
Appearance
అంజు చధా | |
---|---|
జననం | అహ్మద్ నగర్, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
రంగములు | రసాయన శాస్త్రం (జీవ రసాయన శాస్త్రం) |
వృత్తిసంస్థలు | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ |
చదువుకున్న సంస్థలు | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ |
అంజు చధా, భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యురాలుగా పనిచేసింది.[1]
జననం
[మార్చు]అంజు చధా అహ్మద్ నగర్‌లో 1955, మే 4వ తేదీన జన్మించింది.[2]
విద్యార్హతలు
[మార్చు]- 1972 - 1975లో నౌరోస్జీ వాడియా కళాశాల, పూణే విశ్వవిద్యాలయంలో బియస్సీ కెమిస్ట్రీ చదివింది.[3]
- 1975 - 1977లో పూణే విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివింది.
- 1979 - 1984లో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో బయోఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్.డి పూర్తిచేసింది.[4]
గౌరవాలు , అవార్డులు
[మార్చు]- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2011 మార్చి 8న సైన్స్ రంగంలో పనిచేసినందుకు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు లభించింది.
- 1992-1993లో జర్మనీవారి అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫెలోషిప్ లభించింది.[4]
- 1985-1988లో NIH, యుఎస్ఏ వారి ఫగర్టీ అట్ అంతర్జాతీయ ఫెలోషిప్ లభించింది.[4]
- 1985లో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూర్ వారిచే సైన్స్ ఫ్యాకల్టీలో ఉత్తమ థీసిస్ కోసం శ్రీమతి హనుమంతరావు మెడల్ లభించింది.[3]
- 1975-1977లో మహారాష్ట్ర ప్రభుత్వంవరారి స్కాలర్ షిప్ లభించింది.
- 1975లో నౌరోస్జీ వాడియా కళాశాల, పూణేలో కెమిస్ట్రీ విభాగంలో కాలేజ్ లో మొదటి బహుమతి లభించింది.[3]
- 1972లో సెంట్రల్ పాఠశాల, దేహు రోడ్ ఉత్తమ విద్యార్థి, కెమిస్ట్రీ బహుమతి లభించాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Anju Chadha". Retrieved 22 December 2020.
- ↑ "Science – a joyous playing field" (PDF). Retrieved 22 December 2020.
- ↑ 3.0 3.1 3.2 "Anju Chadha". Archived from the original on 27 May 2009. Retrieved 22 December 2020.
- ↑ 4.0 4.1 4.2 "Anju Chadha". Retrieved 22 December 2020.