అండమాన్ అమ్మాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అండమాన్ అమ్మాయి
(1979 తెలుగు సినిమా)
Andaman Ammai.jpg
దర్శకత్వం వి. మధుసూదన రావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వీనస్ కంబైన్స్
భాష తెలుగు

{{}}

కథ[మార్చు]

పోర్ట్ బ్లెయిర్‌లో పనిచేసే శేఖర్, పడవ నడిపే చంద్ర ప్రేమించుకుంటారు. గాంధర్వ వివాహం చేసుకుంటారు. అనుకోని పరిస్థితి ఏర్పడటంతో శేఖర్ మెయిన్ లాండ్‌కి ఓడలో పారిపోతాడు. దారిలో ఓడ ప్రమాదానికి గురి అయినపుడు శేఖర్ ఒక కోటీశ్వరుడి ప్రాణాలు కాపాడతాడు. ఆ కోటీశ్వరుడి మరణానంతరం కోటీశ్వరుడి ఆస్తికి, ఆయన ఏకైక కుమార్తె కవితకు సంరక్షకుడౌతాడు. కవిత పట్టుబట్టడంతో శేఖర్ కవితతో బాటు అండమాన్ దీవికి వెడతాడు. అక్కడ ప్రఖ్యాత శిల్పి మదన్‌ను వారి కలుసుకుంటారు. కవిత మదన్‌ను ప్రేమిస్తుంది. శేఖర్ చంద్రకోసం అన్వేషణ మొదలు పెడతాడు. తన తండ్రిని వెదికి తెచ్చినట్లైతేనే కవితను చేసుకుంటానంటాడు మదన్. తన తండ్రి కనిపిస్తే ఆయనను శిలావిగ్రహంగా చేసి వూరేగిస్తానంటాడు మదన్. అనుకోకుండా చంద్ర శేఖర్‌లు కలుసుకుంటారు. మదన్ తన కొడుకే అని శేఖర్ తెలుసుకుంటాడు. శేఖర్ గారే నీ తండ్రి అని మదన్‌కు చెప్పడానికి చంద్ర అంగీకరించదు. చెబితే మదన్, అతని తాత ఏమి అఘాయిత్యం చేస్తారో అని ఆమె భయం[1].

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది రా దీవి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. ఎందుదాగినావురా నంద కిశోరా నవనీతచోరా - పి.సుశీల
  3. చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోతబొమ్మ మెత్త మెత్తగా వచ్చి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. వేస్తాను పొడుపు కథ వేస్తాను చూస్త్గాను విప్పుకో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  5. హే లల్లి పప్పి లిల్లి మల్లి లల్లి పప్పి లిల్లి రారండి పువ్వులు ఉన్నవి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం

మూలాలు[మార్చు]

  1. వి.ఆర్. (21 June 1979). "చిత్రసమీక్ష - అండమాన్ అమ్మాయి". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 66 సంచిక 80). Retrieved 24 December 2017.[permanent dead link]

బయటిలింకులు[మార్చు]