అంతరీన్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతరీన్
దర్శకత్వంమృణాళ్ సేన్
రచనసాదత్ హసన్ మాంటో (కథ), మృణాళ్ సేన్ (స్క్రీన్ ప్లే)
నిర్మాతభారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్ధ, దూరదర్శన్[1]
తారాగణంఅంజన్ దత్, డింపుల్ కపాడియా
ఛాయాగ్రహణంశశి ఆనంద్
సంగీతంశశి ఆనంద్
విడుదల తేదీ
1993
సినిమా నిడివి
91 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ భాష

అంతరీన్ 1993లో మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన బెంగాళీ చలనచిత్రం. సాదత్ హసన్ మాంటో రచించిన బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో అంజన్ దత్, డింపుల్ కపాడియా నటించారు.[2][3] 1993 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ) విభాగంలో బహుమతిని అందుకుంది.[1] విక్రమ్ (1986-తమిళం) తరువాత డింపుత్ కపాడియా నటించిన రెండవ పరభాష చిత్రం ఇది.

కథ[మార్చు]

కలకత్తాలోని స్నేహితుని పాత భవనంలో ఒంటరిగా జీవిస్తున్న యువ రచయిత (అంజన్ దత్త)కు అనుకోకుండా ఒక రాత్రి ఫోన్లో ఒక వివాహితతో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ తమ జీవితాలను గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. అలా కొద్దిరోజుల్లోనే వారిమధ్య స్నేహం పెరుగుతుంది. అనుకోకుండా ఒకరోజు రైలు ప్రయాణంలో కలుస్తారు. అతను ఆమెను పలకరిస్తాడు. అతని మాటలద్వారా తాను రోజు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి అని ఆమె గుర్తిస్తుంది. అంతలో తాను దిగాల్సిన ఊరు రావడంతో రైలు దిగి వెళ్ళిపోతుంది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మృణాళ్ సేన్
  • నిర్మాత: భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్ధ, దూరదర్శన్
  • కథ: సాదత్ హసన్ మాంటో
  • సంగీతం, ఛాయాగ్రహణం: శశి ఆనంద్

అవార్డులు[మార్చు]

  • 1993 జాతీయ చలనచిత్ర అవార్డులు
  1. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం (బెంగాళీ)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 9 January 2019.
  2. "-". Gomolo.com. Archived from the original on 14 ఆగస్టు 2012. Retrieved 9 January 2019.
  3. Rajadhyaksha, Ashish; Willemen, Paul (1999). Encyclopaedia of Indian cinema. British Film Institute. Retrieved 9 January 2019.

ఇతర లంకెలు[మార్చు]