Jump to content

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య

వికీపీడియా నుండి
సమాఖ్య చిహ్నం

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (ఆంగ్లం International Astronomical Union-IAU), ప్రపంచంలోని వివిధ జాతీయ ఖగోళ సంఘాల సమాఖ్య. ఇది అంతర్జాతీయ సైన్సు కౌన్సిల్ సభ్యత కలిగినది. ఇది అంతర్జాతీయంగా అధికారికంగా గుర్తింపబడింది. దీని కేంద్రము ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో ఉంది. దీని పని, విశ్వంలోని శరీరాలైన నక్షత్రాలను, గ్రహాలను, ఆస్టెరాయిడ్ లను అధ్యయనం చేయడం. వీటికి సరైన పేర్లు పెట్టడం.

చరిత్ర

[మార్చు]

అ.ఖ.స. (IAU) 1919లో యేర్పడినది.

సమాఖ్య

[మార్చు]

అ.ఖ.స. (IAU) లో 9,785 వ్యక్తిగత సభ్యులు గలరు. వీరందరూ పి.హెచ్.డి డాక్టరేట్లు కలిగి ఉన్నారు. ఉద్యోగరీత్యా ఖగోళశాస్త్రజ్ఞులు. వీరేగాక 63 జాతీయ సభ్యులు, వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారున్నారు. 87% వ్యక్తిగత సభ్యులు పురుషులు, 13% స్త్రీలు. ఈ సమాఖ్యకు ప్రస్తుత ఛైర్మన్ క్యాథరిన్ జె.సెరాస్కీ

సాధారణ సభలు

[మార్చు]

అ.ఖ.స. (IAU), ప్రతి మూడేండ్లకొకసారి సమావేశమౌతుంది. (రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ఇది సమావేశం కాలేదు.)

క్రితం సమావేశాల పట్టిక :

సమావేశం సంవత్సరం ప్రదేశం
26వ అ.ఖ.స. సాధారణ సభ 2006 ప్రేగ్, చెక్ రిపబ్లిక్
25వ అ.ఖ.స. సాధారణ సభ 2003 సిడ్నీ, ఆస్ట్రేలియా
24వ అ.ఖ.స. సాధారణ సభ 2000 మాంచెస్టర్, యునైటెడ్ కింగ్ డం
23వ అ.ఖ.స. సాధారణ సభ 1997 క్యోటో, జపాన్
22వ అ.ఖ.స. సాధారణ సభ 1994 హేగ్, నెదర్లాండ్
21వ అ.ఖ.స. సాధారణ సభ 1991 బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
20వ అ.ఖ.స. సాధారణ సభ 1988 బాల్టిమోర్, మేరీల్యాండ్, అమెరికా
19వ అ.ఖ.స. సాధారణ సభ 1985 న్యూఢిల్లీ, భారతదేశం
18వ అ.ఖ.స. సాధారణ సభ 1982 పత్రాస్, గ్రీసు
17వ అ.ఖ.స. సాధారణ సభ 1979 మాంట్రియల్, క్యుబెక్, కెనడా
16వ అ.ఖ.స. సాధారణ సభ 1976 గ్రినోబుల్, ఫ్రాన్స్
ప్రత్యేక సభ, అ.ఖ.స. సాధారణ సభ 1973
500వ జయంతి
నికోలస్ కోపర్నికస్ [1]
వార్సా, పోలండు
15వ అ.ఖ.స. సాధారణ సభ 1973 సిడ్నీ, ఆస్ట్రేలియా
14వ అ.ఖ.స. సాధారణ సభ 1970 బ్రైటన్, యునైటెడ్ కింగ్ డం
13వ అ.ఖ.స. సాధారణ సభ 1967 ప్రేగ్, చెకోస్లోవేకియా
12వ అ.ఖ.స. సాధారణ సభ 1964 హాంబర్గ్, పశ్చిమ జర్మనీ
11వ అ.ఖ.స. సాధారణ సభ 1961 బర్కిలీ, కాలిఫోర్నియా, అమెరికా
10వ అ.ఖ.స. సాధారణ సభ 1958 మాస్కో, సోవియట్ యూనియన్
9వ అ.ఖ.స. సాధారణ సభ 1955 డబ్లిన్, ఐర్లాండు
8వ అ.ఖ.స. సాధారణ సభ 1952 రోమ్, ఇటలీ
7వ అ.ఖ.స. సాధారణ సభ 1948 జ్యూరిచ్, స్విట్జర్లాండ్
6వ అ.ఖ.స. సాధారణ సభ 1938 స్టాక్ హోమ్, స్వీడెన్
5వ అ.ఖ.స. సాధారణ సభ 1935 పారిస్, ఫ్రాన్స్
4వ అ.ఖ.స. సాధారణ సభ 1932 కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, అమెరికా
3వ అ.ఖ.స. సాధారణ సభ 1928 లీడెన్, నెదర్లాండ్
2వ అ.ఖ.స. సాధారణ సభ 1925 కేంబ్రిడ్జ్, యునైటెడ్ కింగ్ డం
మొదటి వ అ.ఖ.స. సాధారణ సభ 1922 రోమ్, ఇటలీ

26వ సాధారణ సభ , 'గ్రహం' నిర్వచనము

[మార్చు]

26వ సాధారణ సభ 2006 ఆగస్టు 14 నుండి ఆగస్టు 25 వరకు చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్లో సమావేశమైనది. ఈ సమావేశములలో గ్రహం నిర్వచనాన్ని రూపొందించారు. ప్లూటో గ్రహాన్ని దాని హోదానుండి తొలగించారు. మరుగుజ్జు గ్రహాల గూర్చి చర్చించి, ఇవి 3 కలవని నిర్ధారించారు. అవి సెరిస్, ప్లూటో, ఎరిస్.[1] అ.ఖ.స. పని విధానాలను రూపొందించారు.[2] ఈ సమావేశం 12 రోజులు జరిగింది. ఇందులో 2412 మది పాల్గొన్నారు,[3]

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Statutes of the IAU, VII: General Assembly, ss. 13-15
  1. "IAU's Statutes". Archived from the original on 2007-11-10. Retrieved 2008-04-05.
  2. "IAU's Working Rules". Archived from the original on 2007-11-10. Retrieved 2008-04-05.
  3. "IAU General Assembly Welcome page". Archived from the original on 2003-04-10. Retrieved 2008-04-05.