అంతర్జాతీయ బీరు దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం లోగో
రకంవేడుకలు
ఉత్సవాలుబీరు తాగడం
ఆవృత్తివార్షికం

అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది.[1][2][3][4] బీరు తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రారంభం

[మార్చు]

20017లో అమెరికా కాలిఫోర్నియాలోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు.[5] చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం 6 ఖండాలలోని 80 దేశాలకు చెందిన దాదాపు 207 నగరాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.[6]

లక్ష్యాలు

[మార్చు]
  1. స్నేహితులంతా కలసి బీరును తాగడం.
  2. బీరు తయారీకి, సేవలను అందించినవారికి కృతజ్ఞతలు తెలపడం
  3. అన్ని దేశాలకు చెందినవారు బీర్లను ఈ దినోత్సవం రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం[3]

వేడుకలు

[మార్చు]

బీర్ డే సందర్భంగా ఈవెంట్ లో పాల్గొనే వారంతా ఒకరికొకరు బీర్లను గిఫ్ట్ గా ఇచ్చిపుచ్చుకుంటారు

మూలాలు

[మార్చు]
  1. Daily TWiP – International Beer Day Archived 2014-11-03 at the Wayback Machine, Nashua Telegraph August 5, 2010
  2. Today is International Beer Day Archived 2012-03-21 at the Wayback Machine. Myfoxla.com (2010-08-05). Retrieved on 2 August 2019
  3. 3.0 3.1 Start Celebrating: It's International Beer Day! – Pop Candy. USAtoday.com (2010-08-05). Retrieved on 2 August 2019
  4. Bell, Katie Kelly. "Celebrate International Beer Day With These Tasty Brews". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2 August 2019.
  5. "Reminder: Due to popular demand,... - International Beer Day - Facebook". facebook.com.
  6. Celebrate the golden suds on International Beer Day Friday. Independent.co.uk (2011-08-04). Retrieved on 2 August 2019

ఇతర లంకెలు

[మార్చు]