అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం | |
---|---|
![]() మానవ హక్కుల లోగో (2011, సెప్టెంబర్ 23న న్యూయార్క్ లో ఆవిష్కరించారు | |
యితర పేర్లు | మానవ హక్కుల దినోత్సవం |
జరుపుకొనేవారు | UN Members |
ప్రారంభం | 1948 |
జరుపుకొనే రోజు | డిసెంబరు 10 |
ఉత్సవాలు | యునైటెడ్ నేషన్స్ |
ఆవృత్తి | వార్షికం |
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.
ప్రారంభం[మార్చు]
1948, డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటుచేయబడ్డాయి.[1]
భారతదేశంలో[మార్చు]
క్రీ.శ.1215లో ఇంగ్లండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన నుండే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రూపొందాయి. 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8నుండి అమలులోకి వచ్చింది.[2]
కార్యక్రమాలు[మార్చు]
- 2008 డిసెంబరు 10న యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్.ఆర్ రూపొందించిన డాక్యుమెంట్ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.[3]
- 1998లో మాల్దావా ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటూ ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియా మింగ్-టెహ్ 1979లో హ్యూమన్ రైట్స్ ప్రదర్శనలు నిర్వహించింది.
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి (10 December 2016). "మీకు మానవ హక్కుల గురించి తెలుసా?". Archived from the original on 19 April 2019. Retrieved 19 April 2019.
- ↑ సాక్షి, వేదిక-అభిప్రాయం (10 December 2014). "అంతర్జాతీయ హక్కుల దినోత్సవం". జాన్ బర్నబాస్ చిమ్మె. Archived from the original on 19 April 2019. Retrieved 19 April 2019.
- ↑ "The Universal Declaration of Human Rights: 1948–2008". United Nations. 2008. Retrieved 19 April 2019.