అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
Date | మే 18 |
---|---|
Location | ప్రపంచవ్యాప్తంగా |
Organised by | ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ |
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించబడుతోంది.[1] అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
చరిత్ర
[మార్చు]ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి, పరస్పర సహకారం, శాంతి పట్ల అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐకామ్) సర్వప్రతినిధి సభ తీర్మానం ప్రకారం ఏటా మే నెల 18వ తేదీని అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకోవాలని 1977లో నిర్ణయించారు.[2] మ్యూజియం నిపుణులు ప్రజలను కలవడానికి, మ్యూజియంలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారిని తెలియచేయడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతోంది.
ఇతర వివరాలు
[మార్చు]2009లో ఎక్కువమందిని దృష్టిని ఆకర్షించింది. 2009లో జరిగిన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వేడుకల్లో 90కి పైగా దేశాలలో 20,000 మ్యూజియంలు వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. 2010లో 98 దేశాలు, 2011లో 100 దేశాలు, 2012లో 129 దేశాలలో 30,000 మ్యూజియంలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. 2011లో ఈ దినోత్సవ అధికారిక పోస్టర్ 37 భాషలలోకి అనువదించబడింది. 2012 నుండి ఈ సంఖ్య 38కి పెరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ఉపవ్యాఖ్యానం (18 May 2021). "International Museum Day: సంక్షోభంలో జ్ఞాన భాండాగారాలు". www.eenadu.net. డాక్టర్ దన్నారపు వెంకట ప్రసాద్. Archived from the original on 18 May 2021. Retrieved 18 May 2021.
- ↑ "ICOM Website on IMD". icom.museum. Archived from the original on 2015-03-15. Retrieved 2021-05-18.