అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం
అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం | |
---|---|
![]() 2016లో శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన లింగమార్పిడి దినోత్సవ వేడుకలు | |
అధికారిక పేరు | 18 January 2016 |
జరుపుకొనేవారు | లింగమార్పిడి సంఘం,మద్దతుదారులు |
రకం | అంతర్జాతీయం, సంస్కృతి |
జరుపుకొనే రోజు | మార్చి 31 |
ఆవృత్తి | వార్షికం |
అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 31న నిర్వహించబడుతుంది.[1][2] లింగమార్పిడి ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన పెంచడం, వారు సమాజానికి చేసిన కృషిని గుర్తిచేసుకోవడం కోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.
ప్రారంభం[మార్చు]
2009లో[3] తొలిసారిగా మిచిగాన్కు చెందిన ట్రాన్స్‌జెండర్ కార్యకర్త[4] రాచెల్ క్రాండాల్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. మొట్టమొదటి అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం 2009, మార్చి 31న జరిగింది. అప్పటినుండి యునైటెడ్ స్టేట్స్కు చెందిన యువ న్యాయవాద సంస్థ అయిన ట్రాన్స్ స్టూడెంట్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ దీనికి నాయకత్వం వహిస్తోంది.[5] 2014 నుండి ఐర్లాండ్, [6] స్కాట్లాండ్[7] దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపబడుతుంది.
కార్యక్రమాలు[మార్చు]
2015లో ఫేస్‌బుక్, ట్విట్టర్, టంబ్లర్, ఇన్స్టాగ్రామ్తోపాటు సహా వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్రచారం జరిగింది. ఇందులో చాలామంది లింగమార్పిడి ప్రజలు పాల్గొని లింగమార్పిడి సమస్యలు, ఇతర సంబంధిత విషయాలకు సంబంధించిన సెల్ఫీలు, వ్యక్తిగత కథనాలు, గణాంకాలను పోస్ట్ చేశారు.[8]
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Nenshi proclaims Trans Day of Visibility". Canadian Broadcasting Corporation. Retrieved 28 March 2020.
- ↑ "Today is International Transgender Day of Visibility". Human Rights Campaign. 31 March 2014. Archived from the original on 11 సెప్టెంబరు 2018. Retrieved 28 March 2020.
- ↑ Carreras, Jessica. "Transgender Day of Visibility plans erupt locally, nationwide". PrideSource. Archived from the original on మార్చి 27, 2013. Retrieved మార్చి 28, 2020.
- ↑ "A time to celebrate". The Hamilton Spectator. 27 March 2014. Retrieved 28 March 2020.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-02. Retrieved 2020-03-28.
- ↑ "Trans* Education & Advocacy Protest RTE March 31st". Gaelick. మార్చి 31, 2014. Archived from the original on ఏప్రిల్ 3, 2014. Retrieved మార్చి 28, 2020.
- ↑ "Twitter / The_SSP_: The SSP stands in solidarity ..." 31 March 2014. Retrieved 28 March 2020.
- ↑ "These Trans People Are Taking Selfies To Celebrate Transgender Day Of Visibility". BuzzFeed LGBT. 31 March 2015. Retrieved 28 March 2020.
ఇతర లంకెలు[మార్చు]
