అంత్యోదయ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Antyodaya Express
Overview
Franchise(s):అంత్యోదయ
Main Operation(s):భారత దేశం
Fleet size:11
Parent company:భారతీయ రైల్వేలు

అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ లు భారతీయ రైల్వేలు నడుపుతున్న రైలు సర్వీసులు.ఇవి పూర్తిస్థాయి అరక్షిత భోగీల కలిగిన రైళ్ళు. ఇవి ఇక్కువగా రాత్రి పూట ప్రయాణం చేస్తాయి.వీటిని 2016 కేంద్ర బడ్గెట్ లో ప్రతిపాదించారు.అత్యంత ప్రయాణికుల రద్ధి కలిగిన రైలు మార్గాల్లో నడపడానికి ప్రతిపాదనలు చేసారు. ఎర్నాకులం- హౌరా మద్య నడిచే మొదటి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ను నాటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు.

సదుపాయాలు

[మార్చు]
  • అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు పూర్తిగా సాధరణ భోగీలను కలిగి ఉంటాయి.
  • మొబైల్ ఫొన్లకు, లాప్ టాప్ లకు చార్జింగ్ పాయింట్లు ఉంటాయి.
  • వీటిలో పర్యావరణహిత శౌచాలయాలను ఏర్పాటుచేసారు
  • ఈ రైళ్ళుబయటినుండి ఆకర్షణీయంగా కనిపించడానికి వినైల్ షీట్లను వినియోగించారు.
  • ఇవి పూర్తి స్థాయి రక్షిణ సదుపాయలు కలిగివుండి స్మోక్ డిటెక్టర్లు, సి.సి.కెమెరాలు కలిగి వున్నాయి.
  • విటిలో వితరణ యంత్రాల ద్వారా కాఫీ, టీ, నీళ్ళు మొదలయినవి అందించబడుతున్నవి.

ప్రస్తుతం నడుస్తున్న అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు

[మార్చు]
Train No Name Service frequency Inaugural run on
15563/15564 జయ్ నగర్ - ఉద్న అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వీక్లీ 13/10/2017
22551/22552 దర్భాంగా - జలంధర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వీక్లీ ఇంకా ప్రారంభంచలేదు
22841/22842 సంత్రగచ్చి - చెన్నై సెంట్రల్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వీక్లీ ఇంకా ప్రారంభంచలేదు
22877/22878 హౌరా - ఎర్నాకులం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వీక్లీ 04/03/2017
22885/22886 లోకమాన్య తిలక్ టెర్మినస్ - టాటానగర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు సార్లు 18/03/2017
22895/22896 దుర్గ్ - ఫెరోజ్ పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వీక్లీ 02/05/2018
22921/22922 బాంద్రా - గోరఖ్పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వీక్లీ 13/08/2017
16191/16192 తంబరం -తిరునెల్వేలి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఇంకా ప్రారంభంచలేదు
16189/16190 తంబరం- షెంకోట్టై అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఇంకా ప్రారంభంచలేదు
16355/16356 మంగళూరు - కోచువేలి వారానికి రెండు మార్లు ఇంకా ప్రారంభంచలేదు
20971/20972 జైపూర్ - ఉదయ్ పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఇంకా ప్రారంభంచలేదు

పట్టాలు తప్పిన అంత్యోదయ ఎక్స్‌ప్రెస్

[మార్చు]

లోకమాన్య తిలక్ టెర్మినస్ - జయ్‌నగర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (11061) రైలు మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో 2022 ఏప్రిల్ 3న (ఆదివారం) 10 బోగీలు పట్టాలు తప్పాయి.[1] ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.[2]

మూలాలు

[మార్చు]
  1. Desk, India com News. "Few Coaches of 11061 LTT-Jaynagar Express Derail, Relief Train Rushed to Spot". www.india.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-04.
  2. "పట్టాలు తప్పిన ఎల్‌టీటీ-జేనగర్ ఎక్స్‌ప్రెస్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-04-04.

వెలుపలి లంకెలు

[మార్చు]
  • ప్రస్తుతం నడిచే అంత్యోదయ రైళ్ళ గురించి d.indiarailinfo.com website లో పరిశీలించండి