అందమైన జీవితం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందమైన జీవితం
దర్శకత్వంసత్యన్ అంతికాడ్
రచనఇక్బాల్ కుట్టిప్పురం
నిర్మాతసేతు మన్నార్కాడ్
తారాగణందుల్కర్ సల్మాన్
ముఖేష్
ఐశ్వర్య రాజేష్
అనుపమ పరమేశ్వరన్
ఛాయాగ్రహణంఎస్. కుమార్
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
ఫుల్ మూన్ సినిమా
పంపిణీదార్లుకళాసంఘం ఫిల్మ్స్
ఎవర్ గ్రీన్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2017 జనవరి 19 (2017-01-19)
సినిమా నిడివి
158 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు43 crore

అందమైన జీవితం (సినిమా) 2017 లో విడుదల అయిన తెలుగు సినిమా. ఫుల్ మూన్ సినిమా బ్యానర్ పై సేతు మన్నార్కాడ్ నిర్మించిన ఈ సినిమాకి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, ముఖేష్, ఐశ్వర్య రాజేష్, అనుపమ పరమేశ్వరన్ నటించారు.[1] ఇది మలయాళ సినిమా "జోమోంటే సువిశేషంగళ్" కి అనువాదం.

నటవర్గం[మార్చు]

కథ[మార్చు]

విన్సెంట్ బాగా ధనవంతుడైన వస్త్రాల వ్యాపారి. అతని మూడవ కుమారుడు కుమార్. కుమార్ బాధ్యతలు లేకుండా తిరుగుతుంటాడు. కుమార్ కి బాధ్యతలు తెలియాలని చాల ప్రయత్నాలు చేస్తాడు విన్సెంట్ కానీ కుమార్ అవి ఏవి పట్టించుకోకుండా కేథరిన్ ప్రేమలో పడతాడు. కుమార్ ని టెక్స్టైల్ స్టోర్ కి ఇన్‌ఛార్జ్‌గా పెడతాడు. కానీ కుమార్ అతని స్నేహితుడితో టెక్స్‌టైల్ స్టోర్‌ పెట్టడానికి అతని బైక్ ని, స్టోర్ ని అమ్మేస్తాడు. అతని స్నేహితుడు మోసం చేస్తాడు. దీని వలన ఆర్ధిక సమస్యలు వచ్చి ఆస్తులు అన్ని పోతాయి. కుమార్ ని ఇంటి నుంచి వెళ్ళగొడతారు. కేథరిన్ వాళ్ళ అమ్మ కుమార్ తో సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటుంది. కుమార్ తన తండ్రిని తీసుకోని కోయంబత్తూర్ వెళ్తాడు. ఒక టెక్స్‌టైల్ కంపెనీకి సేల్స్‌మ్యాన్‌గా పని చేయడం ప్రారంభిస్తాడు. అక్కడ వైదేహి పరిచయం అవుతుంది. ఆ తర్వాత కుమార్, అతని స్నేహితుడు, వైదేహి తో కలిసి కొత్త వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి గొప్పగా ఎదిగి మళ్ళి తన ఆస్తులను తిరిగి కొనుక్కుంటాడు. విన్సెంట్, కుమార్, వైదేహి ప్రేమించుకుంటున్నారని తెలిసి తనని కూడా వాళ్లతో పాటు తీసుకెళ్తాడు.

పాటలు[మార్చు]

  • వేచి వేచి చూసి నిన్ను
  • నిన్నే చూడను పొమ్మంటూనే
  • ఓ గాలి చిరు గాలి రావేమే
  • నీలాకాశం నీటి మబ్బుతో[3]

మూలాలు[మార్చు]

  1. James, Anu (2017-03-21). "Dulquer Salmaan's movie becomes his solo biggest hit". www.ibtimes.co.in. Retrieved 2022-07-01.
  2. "Prime Video: Andamaina Jeevitham". www.primevideo.com. Retrieved 2022-07-01.
  3. "Andamaina Jeevitham Songs Download". Naa Songs. 2018-04-10. Retrieved 2022-07-01.