అంబరుపేట (నందిగామ మండలం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంబరుపేట (నందిగామ మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందిగామ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,379
 - పురుషుల సంఖ్య 1,162
 - స్త్రీల సంఖ్య 1,217
 - గృహాల సంఖ్య 589
పిన్ కోడ్ 521185
ఎస్.టి.డి కోడ్ 08678

అంబరుపేట కృష్ణా జిల్లా నందిగామ మండలానికి చెందిన గ్రామం.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొం డూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

నందిగామ మండలం[మార్చు]

నందిగామ మండల పరిధిలోని సత్యవరం, రాఘవాపురం, అంబరుపేట, అడవిరావులపాడు, ఐతవరం, కంచర్ల, కేతవీరునిపాడు, చందాపురం, మునగచర్ల, కురుగంటివాని కండ్రిగ, లచ్చపాలెం, లింగాలపాడు, తక్కెళ్లపాడు, పల్లగిరి, మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, తొర్రగుడిపాడు, కొణతం ఆత్మకూరు, దాములూరు, సోమవరం, రుద్రవరం, గొల్లమూడి గ్రామాలున్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

అంబారుపేటను అంబరుపేటగా వ్యవహరిస్తున్నారు. కానీ అసలు పేరు అంబారుపేట. ఈ గ్రామము, జాతీయ రహదారి-9 పక్కన ఉన్నది.

గ్రామ భౌగోళికం[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

[2] నందిగామ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్ఫేస్టేషన్ విజయవాడ 45 కి.మీ

సమీప గ్రామాలు[మార్చు]

ఐతవరం 2 కి.మీ, కేతవీరునిపాడు 3 కి.మీ, గండేపల్లి 4 కి.మీ, కీసర 4 కి.మీ, చందాపురం 4 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

కంచికచెర్ల, వీరులపాడు, చందర్లపాడు, యెర్రుపాలెం

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

నెల్లూరు రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్, నారాయణ టెక్నోస్కూల్, నందిగామ

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ఈ గ్రామములో 2017,జూన్-1న, నూతనంగా, 50 ఎల్.యి.డి వీధి దీపాలు అమర్చినారు. [5]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి ఐలపోగు భాగ్యలక్ష్మి సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శివాలయం[మార్చు]

ఈ గ్రామానికి దగ్గరలో..మునేరు ఒడ్డున ఉన్న శివాలయం అతి ప్రాచీన చరిత్ర ఉంది. అయితే దీనికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ ఆలయం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. శిధిలావస్థకు చేరకముందే.ఈ ఆలయాన్ని జీర్ణోధ్దారణ చేయాల్సిఉంది. వేంకటగిరి జమిందారుల కాలంలో ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది.

గ్రామ దేవత సత్తెమ్మతల్లి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలో సత్తెమ్మతల్లి ఆలయం అతిపురాతనమైనది. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే జాతరకు ఎంతో మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు రావడం ఆనవాయితీ. ప్రధానంగా ఈ గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉండటంతో వాహన చోదకులు ఆగి అమ్మవారి ఆశీస్తులు తీసుకొని ప్రయాణం చేయడం విశేషం. ప్రముఖంగా చెప్పాలంటే ప్రతి లారీ వెనక "సత్తెమ్మ తల్లి దీవెనలతో" అని రాసి ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, అమ్మవారికి మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేసారు. జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి విశేషాలంకారణ చేసారు. చండీసహిత రుద్రహోమం, అనాసాగరం, భజనలు ఆలపించినారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. [4]

ఇక్కడ దసరాకు, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించెదరు. గ్రామస్థులంతా ఉత్సవాలలో పాలు పంచుకుంటారు. మున్నేటి తీరాన శమీ పూజలు చేస్తారు. విజయదశమి రోజున అమ్మవారి రథోత్సవం గ్రామంలోఅంగరంగవైభవంగా నిర్చహించెదరు. వీధులలో ఇంటిముంగిటకు వచ్చిన అమ్మవారికి మహిళలు హారతులిస్తారు. [3]

గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం[మార్చు]

బోధానంద ఆశ్రమం[మార్చు]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామంలో జన్మించిన అమరవాది కరుణాసాగర్ ప్రస్తుతం జర్నలిస్టుగా స్టూడియో ఎన్ సీఈఓ గా వ్యవహరిస్తున్నారు.

గ్రామ విశేషాలు[మార్చు]

శ్రీ సద్గురు బోధానందస్వామి ఛారిటబుల్ ట్రస్ట్, అంబారుపేట.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,379 - పురుషుల సంఖ్య 1,162 - స్త్రీల సంఖ్య 1,217 - గృహాల సంఖ్య 589;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1941.[3] ఇందులో పురుషుల సంఖ్య 975, స్త్రీల సంఖ్య 966, గ్రామంలో నివాసగృహాలు 440 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 324 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Nandigama/Ambarupet". Retrieved 12 June 2016.  External link in |title= (help)
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు కృష్ణాజిల్లా; 2013,అక్టోబరు-14; 9వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-15; 6వపేజీ. [5] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,జూన్-2; 2వపేజీ.