అంబర్ హెర్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబర్ హెర్డ్
2018 శాన్ డియాగో కామిక్-కాన్ లో అంబర్ హెర్డ్
జననం
అంబర్ లారా హెర్డ్

(1986-04-22) 1986 ఏప్రిల్ 22 (వయసు 38)
ఆస్టిన్, టెక్సాస్, యు.ఎస్.
ఇతర పేర్లు
  • అంబర్ లారా డెప్[1]
  • అంబర్ వాన్ రీ[2]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2015; div. 2017)
భాగస్వామితస్య వాన్ రీ
(2008–2012)
పిల్లలు1, ఊనాగ్ పైగే హెర్డ్

అంబర్ లారా హెర్డ్ (ఆంగ్లం: Amber Laura Heard; 1986 ఏప్రిల్ 22) ఒక అమెరికన్ నటి. ఆల్ ది బాయ్స్ లవ్ మాండీ లేన్ (2006) అనే భయానక చిత్రంతో ఆమె హాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ది వార్డ్ (2010), డ్రైవ్ యాంగ్రీ (2011) వంటి మరిన్ని చిత్రాలలో నటించింది. ఆమె పైనాపిల్ ఎక్స్‌ప్రెస్ (2008), నెవర్ బ్యాక్ డౌన్ (2008), ది జోన్సెస్ (2009), మాచెట్ కిల్స్ (2013), మ్యాజిక్ మైక్ XXL (2015), ది డానిష్ గర్ల్ (2016) వంటి చిత్రాలలో కూడా పాత్రలు పోషించారు. ది డిసి ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ ఫ్రాంచైజీ, జస్టిస్ లీగ్ (2018), ఆక్వామాన్ (2018), రాబోయే ఆక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ (2023)లో నటించారు. ఆమె హిడెన్ పామ్స్ (2007), ది స్టాండ్ (2020) వంటి టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది.

2015లో నటుడు జానీ డెప్‌ను వివాహమాడింది. జానీ డెప్ గృహ హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2016 మేలో ఆమె విడాకుల కోసం దాఖలు చేసింది. ఆ తర్వాత ఆమె ఆరోపణలకు సంబంధించి రెండు ఉన్నత స్థాయి వ్యాజ్యాల్లో పాల్గొంది.

2022 సంవత్సరంలో గూగుల్ లో ఎక్కువ మంది శోధించిన సెలబ్రిటీగా అంబర్ హెర్డ్ నిలిచింది. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ 2022 ఆధారంగా ప్రతి నెలా 56 లక్షల మంది శోధన చేయడం విశేషం.[3]

వార్తల్లో వ్యక్తిగా

[మార్చు]

- 2017లో  తను బై సెక్సువల్ అని ఓ మేగజైన్‌లో వచ్చిన కథనంతో సినీ కెరీర్ నాశనమైందని అంబర్ హెర్డ్ వాపోయింది. లెస్బిియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై సమాజంలో చిన్నచూపుందని, జస్టిస్ లీగ్ సినిమా ప్రమోషన్ సంధర్బంలో ఆమె అన్నారు.

- తన ఆక్వామేన్ హాలీవుడ్ చిత్రం తెలుగులో సముద్ర పుత్రుడు (2018)ని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. అద్భుతమైన విజువల్స్ తో జేమ్స్ వాన్ దర్శకత్వంలో వచ్చిని ఈ చిత్రంలో అంబర్ హెర్డ్ తో పాటు జేమ్స్ మామ్, పాట్రిక్ విల్సన్ తదితరులు నటించారు.

- 2015లో ఆమె వివాహం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న జానీ డెప్ తో జరిగింది. జానీ డెప్ అంబర్ హెర్డ్ ను రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన ఏడాదికే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. జానీ డెప్ తో విడిపోయిన తర్వాత కూడా తను గృహహింసకు గురయ్యానంటూ వాషింగ్టన్ పోస్ట్ లో ఒక వ్యాసాన్ని అంబర్ హెర్డ్ రాయడంతో, అది వైరల్ అయింది. పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో జానీ డెప్ ఆమెపై 2022 ఏప్రిల్ మాసంలో రూ. 380 కోట్లకు పరువునష్టం దావా వేశారు.

- దానికి కౌంటర్ గా జానీ డెప్ పైనా అంబర్ హెర్డ్ 10 కోట్ల డాలర్ల పరువు నష్టం దావా 2022 మేలో వేసింది. ఆ విచారణ సందర్భంగా తరచూ కొట్టేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతడి అరాచకాలు అన్నీఇన్నీ కావంటూ కోర్టు హాల్లోనే వెక్కివెక్కి ఏడ్చింది.

- 2022 జూన్ లో ఇద్దరూ పరువు నష్టానికి అర్హులేనని కోర్టు తీర్పు చెప్పగా, జానీ డెప్ వైపు తీర్పు మొగ్గింది. మాజీ భర్తకు 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని అంబర్ హెర్డ్ ను కోర్టు ఆదేశించింది. తీర్పుతో నిరాశ చెందిన అంబర్ హెర్డ్ తన వద్ద అంత డబ్బు లేదని, తాను చెల్లించే స్థితిలో లేనంటూ న్యాయస్థానానికి విన్నవించుకుంది. పైగా ఈ తీర్పు వాస్తవ అంశాల ఆధారంగా లేదని, నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలు ఇతరులకు తెలియవని వ్యాఖ్యానించింది.

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
Year Award Category Work Result
2008 యంగ్ హాలీవుడ్ అవార్డ్స్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ హెర్ సెల్ఫ్ విజేత
2009 డెట్రాయిట్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్ ఉత్తమ సమిష్టి జోంబీల్యాండ్ నామినేట్
2010 స్క్రీమ్ అవార్డ్స్ విజేత
డల్లాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డల్లాస్ స్టార్ అవార్డు హెర్ సెల్ఫ్ విజేత
2011 హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ స్పాట్‌లైట్ అవార్డు ది రమ్ డైరీ విజేత
2014 టెక్సాస్ ఫిల్మ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్టీ హెర్ సెల్ఫ్ విజేత
2019 గోల్డెన్ రాస్ప్బెర్రీ అవార్డ్స్ వరస్ట్ యాక్ట్రెస్ లండన్ ఫీల్డ్స్ నామినేట్
MTV మూవీ & టీవీ అవార్డ్స్ ఉత్తమ ముద్దు ఆక్వామాన్ నామినేట్
సాటర్న్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి నామినేట్
టీన్ ఛాయిస్ అవార్డ్స్ సైన్స్ ఫిక్షన్/ఫాంటసీ సినిమా నటి నామినేట్

మూలాలు

[మార్చు]
  1. Loinaz, Alexis (June 15, 2016). "Johnny Depp's Lawyer Asks Judge to Prevent Amber Heard Witnesses from Testifying at Restraining Order Hearing". People. Archived from the original on April 3, 2019. Retrieved December 30, 2018.
  2. Guglielmi, Jodi (June 7, 2016). "Amber Heard Was Arrested for Domestic Violence in 2009 After Allegedly Striking Girlfriend Tasya van Ree". People. Archived from the original on April 23, 2022. Retrieved April 23, 2022. The actress legally changed her last name to van Ree in April 2008, and back to Heard four years later in April 2014.
  3. "Amber Heard becomes most-searched celebrity on Google in 2022. Can you guess where Johnny Depp stands? - India Today". web.archive.org. 2022-11-26. Archived from the original on 2022-11-26. Retrieved 2022-11-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)