అంబికా బెనర్జీ
| అంబికా బెనర్జీ | |||
| పదవీ కాలం 2009 – 2013 | |||
| ముందు | స్వదేశ్ చక్రవర్తి | ||
|---|---|---|---|
| తరువాత | ప్రసూన్ బెనర్జీ | ||
| నియోజకవర్గం | హౌరా | ||
| పదవీ కాలం 1982 – 2006 | |||
| ముందు | సుధీంద్రనాథ్ కుమార్ | ||
| తరువాత | అరుప్ రే | ||
| నియోజకవర్గం | హౌరా సెంట్రల్ | ||
పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడు
| |||
| పదవీ కాలం 1996 – 2006 | |||
| నాయకుడు | పంకజ్ కుమార్ బెనర్జీ | ||
| తరువాత | అబూ హసీం ఖాన్ చౌదరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1928 ఆగస్టు 28 శిబ్పూర్ , హౌరా , పశ్చిమ బెంగాల్ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2013 April 25 (వయసు: 84) కోల్‌కతా , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ (1998-2013) భారత జాతీయ కాంగ్రెస్ (1972-1998) | ||
| జీవిత భాగస్వామి | బేలా బెనర్జీ | ||
| పూర్వ విద్యార్థి | హాట్‌ఫీల్డ్ టెక్నికల్ కాలేజ్, లండన్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అంబికా బెనర్జీ (28 ఆగస్టు 1928 – 25 ఏప్రిల్ 2013) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అంబికా బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి హౌరా సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం నుండి 1982, 1987, 1991, 1996 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2001 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
అంబికా బెనర్జీ 2009 లోక్‌సభ ఎన్నికలలో హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి స్వదేశ్ చక్రవర్తిపై 37,392 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మరణం
[మార్చు]అంబికా బెనర్జీ ప్రోస్టేట్ గ్రంథి & మూత్రపిండాల సమస్యలతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2013 ఏప్రిల్ 25న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "Trinamool MP Ambica Banerjee dead" (in Indian English). The Hindu. 25 April 2013. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.
- ↑ "Trinamool Congress MP Ambica Banerjee passes away" (in ఇంగ్లీష్). NDTV. 25 April 2013. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.
- ↑ "Trinamool's Howrah MP passes away". The Times of India. 26 April 2013. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.