అంబిక (దేవత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబిక
అనుబంధందుర్గ, పార్వతి, శక్తి ల అవతారం.
ఆయుధములుDiscus, Conch Shell, త్రిశూలం, గద, ధనుస్సు, బాణం, ఖడ్గం, Shield
భర్త / భార్యశివుడు
వాహనం(పులి లేదా సింహం)

అంబిక హిందూదేవతలలో పార్వతి /దుర్గ నామాలలో ఒకటి. ఆమె ఎనిమిది చేతులు కలిగి, వాటిలో వివిధ ఆయుధాలు ధరించబడి ఉంటుంది. ఆమె వాహనం పులి . ఆమె కౌస్తుకిగా కూడా పిలువబడుతుంది. పూర్వం దేవతల కోరికపై శుంభ, నిశుంబ అనే రాక్షసులను చంపుటకు పార్వతీ దేవి యొక్క శరీక కణాల నుండి ఆమె ఉధ్బవింనినట్లు ఇతిహాస గాథ. ఆంబిక పార్వతి, ఆదిశక్తి యొక్క ఒక రూపం. ఆమె అంబ, దుర్గ, భగవతి, పార్వతి, భవాని, అంబే మా, శేరవాలి, మాతా రాణి మొదలైన నామాలతో కూడా గుర్తింపబడుతుంది.[1]

వివిధ రూపాలు[మార్చు]

శ్రీమద్ దేవీ భాగవతంలో అంబిక అన్ని ఇతర దేవతలకు మూల దేవత. ఆమె వివిధ నామాలతో కొలువబడుతుంది. ఆమె రూపం లేదా అవతారం ఆమె మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు:

  • సతీదేవి రూపం శివుని మొదటి భార్య రూపంగా కొలువబడుతుంది. ఆమె దక్షుని కుమార్తె.
  • భద్రకాళి రూపం భయంకర రూపాలలో ఒకటి. ఆమె దక్షప్రజాపతి యజ్ఞాన్ని ధ్వంసం చేసింది.
  • పార్వతి రూపంలో మృదు స్వభావిగా ఉంటుంది. ఈ రూపాన్ని గౌరి, ఉమగా కూడా పిలిస్తారు. ఆమె శివుని భార్య.
  • దుర్గ రూపం అంబిక రాక్షసులతో యుద్ధం చేసే రూపం. దుర్గామసురుడిని సంహరించడానికి ఈ రూపంలో అవతారం ఎత్తింది.
  • కాళికాదేవి రూపం కూడా భయంకరమైనది.
  • చండి రూపంలో మహిషాసురిడిని సంహరిస్తుంది.
  • 52 శక్తి పీఠాలలోని దేవతలు ఆమె రూపాలే.
  • నవదుర్గల రూపాలు కూడా అమెవి.
  • చేప ఆకారంలో కన్నులు గల రూపం మీనాక్షి.
  • ప్రేమ, భక్తికి ప్రతిరూపమైన రూపం కామాక్షి


మూలాలు[మార్చు]

  1. Dalal, Roshen (2010). Ambika. Penguin Books. p. 18. ISBN 9780143415176. Retrieved 22 June 2016. {{cite book}}: |work= ignored (help)