Jump to content

అంబిలి (గాయని)

వికీపీడియా నుండి


అంబిలి
జన్మనామం పద్మజ తంపి
సంగీత రీతి ప్లేబ్యాక్ సింగర్, కర్ణాటక సంగీతం
వాయిద్యం గాత్రం
క్రియాశీలక సంవత్సరాలు 1970–1987
Label(s) ఆడియోట్రాక్స్

అంబిలి మలయాళ చిత్రసీమలో 1970, 1980లలో చురుకుగా ఉన్న భారతీయ చలనచిత్ర గాయని.[1] ఆమె 8 వందల చిత్రాలలో 3 వేలకి పైగా పాటలు పాడింది. ఆమె తమిళం, హిందీ, బెంగాలీ భాషలలో పాడింది.[2] ఆమె ప్రసిద్ధ పాటలలో "తెడి వరు కంనుకాలిల్", "ఊంజలా, ఊంజలా", "స్వర్ణమలకల్", "మాయల్లె రాగం మళవిల్లె", "గురువాయూరప్పంటే తిరువామ్రతిను" వంటివి ఎన్నో ఉన్నాయి.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అంబిలి అని పిలువబడే పద్మజ తంపి, తిరువనంతపురంలో ఆర్. సి. తంపి, సుకుమారి దంపతులకు ఐదుగురు పిల్లలలో చిన్నదిగా జన్మించింది. ఆమె తండ్రి ఒక సైనిక అధికారి, తరువాత ఉపాధ్యాయుడు అయ్యాడు, ఆమె తల్లి గాయని. ఆమెకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.[4] ఆమె ఫత్మా కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంది. ఆమె వి. దక్షిణ మూర్తి వద్ద సంగీతం నేర్చుకుంది. ఆమె తొలి పాట 1970లో శబరిమల శ్రీ ధర్మశాస్తా చిత్రం నుండి వచ్చిన "కరగ్రే వాసతే". ఆమె మలయాళ చిత్ర దర్శకుడు కె. జి. రాజశేఖరన్ ను వివాహం చేసుకున్నది. వారికి రాఘవేంద్రన్ అనే కుమారుడు, రంజినీ అనే కుమార్తె ఉన్నారు. ఆమె మాయాంబు అనే తన సొంత సంగీత బృందాన్ని ప్రారంభించి, రంగస్థల కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె కేరళ దేవస్వామ్ బోర్డు నుండి కళా రత్నం టైటిల్, ఉత్తమ గాయని అవార్డును అందుకుంది. ఆమె 2017లో గ్లోబల్ ఎన్ఎస్ఎస్ (నైర్ సర్వీస్ సొసైటీ) అవార్డును అందుకున్నది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Ambili:Profile and Biography, Malayalam Movie Singer Ambili latest Photo Gallery | Video Gallery, Malayalam Movie Singer Ambili, Ambili Filimography, Ambili Films and Cinemas, Ambili Awards and Nominations". Archived from the original on 14 August 2014. Retrieved 14 August 2014.
  2. "On Record with Ambili". Asianetnews. 28 August 2011. Retrieved 14 August 2014.
  3. "All you want to know about #Ambili". FilmiBeat.
  4. "Profile of Malayalam Singer Ambili". en.msidb.org. Archived from the original on 2024-03-29. Retrieved 2026-02-15.
  5. "Ambily makes a comeback". The New Indian Express. 19 June 2012.