Jump to content

అంబ (మహాభారతం)

వికీపీడియా నుండి
దస్త్రం:Bhisma fight in Swayamvara.jpg
కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను వారి స్వయంవరం నుండి తీసుకుపోతున్న భీష్ముడు.

హోత్రవాహనుడు అనే కాశీరాజు పెద్ద కూతురు అంబ. ఈమెకు అంబిక, అంబాలిక అని ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అంబ సాళ్వుడిని ప్రేమించి అతనినే పెళ్ళి చేసుకోవాలనుకుంది. కానీ, భీష్ముడు తన తమ్ములకు పెళ్ళి చేయడానికి ఈ సోదరీమణులు ముగ్గురినీ స్వయంవరం వేళ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు భీష్ముడితో అంబ తన కథ చెప్పి తనని సాళ్వుడి వద్దకు పంపమని కోరింది. భీష్ముడు ఒప్పుకుని ఆమెని పంపేశాడు. కానీ, అక్కడ సాళ్వుడు భీష్ముడు వదిలేసిన అంబని స్వీకరించడానికి ఇష్టపడకపోవడంతో ఆమె తన కష్టాలకి భీష్ముడే కారణమని అతన్ని యుద్ధంలో ఓడించడానికి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఆమెకి రాబోయే జన్మలో దృపదరాజుకు శిఖండి అను కుమారుడిగా పుట్టి భీష్మునికి మరణం కలిగిస్తావని వరమిచ్చాడు. దానితో అంబ వెంటనే చితిపేర్చి శరీరము దహించుకొనింది.

వృత్తాంతం

[మార్చు]

2. కాశిరాజు కూఁతురు. ఈమెకన్యగా ఉండునపుడు తండ్రియగు కాశిరాజుచే స్వయంవరమున సాల్వునకు ఈయంబడియుండినను భీష్ముఁడు బలాత్కారమున ఈమెను ఈమె చెలియండ్రగు అంబికాంబాలికలను యుద్ధమునందు శత్రురాజునందఱను ఓడించి తెచ్చి తన తమ్ముఁడగు విచిత్రవీర్యునకు వివాహము చేయఁబోవునెడ ధర్మశాస్త్రజ్ఞులు అంబ పూర్వమే తండ్రిచే దత్త అయినందున ఆమెను మరల వివాహమగుట ధర్మువు గాదని చెప్పఁగా ఆమెను భీష్ముఁడు సాల్వరాజునొద్దకు పంప సాల్వరాజును తన్ను పెళ్ళియాడనని ధిక్కరించినందున ఆమె చచ్చి రెండవ జన్మమున శిఖండిగ ద్రుపదరాజునకు పుట్టి భీష్ముని భారతయుద్ధమున పడనేసెను. చూ|| శిఖండి.

మూలాలు

[మార్చు]