అకలేర్ సంధానే (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అకలేర్ సంధానే
Akaler Sandhane Movie Poster.jpg
అకలేర్ సంధానే సినిమా పోస్టర్
దర్శకత్వంమృణాళ్ సేన్
నిర్మాతడి.కె. ఫిల్మ్
రచనమృణాళ్ సేన్, అమలేందు చక్రవర్తి
నటులుధృతిమన్ ఛటర్జీ, స్మితా పాటిల్, గీతా సేన్, రాజేన్ తరాఫ్దార్, శ్రీలా మజుందర్, రాధామోహన్ భట్టాచార్య, జయంత చౌదరి, డిపాన్కార్ డి, జోచన్ దస్దాదార్
సంగీతంసలీల్ చౌదరి
ఛాయాగ్రహణంకె.కె. మహజన్
కూర్పుగంగాధర్ నస్కర్
విడుదల
1982
నిడివి
115 నిముషాలు
దేశంభాతరదేశం
భాషబెంగాళీ

అకలేర్ సంధానే 1982లో విడుదలైన బెంగాళీ చలనచిత్రం. మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధృతిమన్ ఛటర్జీ, స్మితా పాటిల్, గీతా సేన్, రాజేన్ తరాఫ్దార్ తదితరులు నటించారు. 1981 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (మృణాల్‌సేన్), ఉత్తమ స్క్రీన్ ప్లే (మృణాల్‌సేన్), ఉత్తమ ఎడిటింగ్ (గంగాధర్ నస్కర్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.[1]

కథా నేపథ్యం[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బెంగాల్ లో ఆకలి, పోషకాహార లోపం, అపరిశుభ్ర పరిస్థితులు, దీని కారణంగా వ్యాప్తి చెందిన మలేరియా, ఇతర ప్రాణాంతక వ్యాధులతో దాదాపు యాభై లక్షల మంది అత్యంత దుర్భరంగా చనిపోయారు. యావత్‌ ప్రపంచానికే పెద్ద గుణపాఠం నేర్పిన 1943 బెంగాల్‌ కరువు నేపథ్యంతో తెరకెక్కించిన బెంగాలీ చిత్రం 'అకలేర్‌ సందానే'. 1943లో బెంగాల్‌లో ఎటువంటి ఆకలి చావులు జరిగాయో 1981లోనూ అక్కడ అలాంటి పరిస్థితే ఉందని ఈ చిత్రం ద్వారా చెప్పడం జరిగింది.

నటవర్గం[మార్చు]

 • ధృతిమన్ ఛటర్జీ
 • స్మితా పాటిల్
 • గీతా సేన్,
 • రాజేన్ తరాఫ్దార్
 • శ్రీలా మజుందర్
 • రాధామోహన్ భట్టాచార్య
 • జయంత చౌదరి
 • డిపాన్కార్ డి
 • జోచన్ దస్దాదార్

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: మృణాళ్ సేన్
 • నిర్మాత: డి.కె. ఫిల్మ్
 • రచన: మృణాళ్ సేన్, అమలేందు చక్రవర్తి
 • సంగీతం: సలీల్ చౌదరి
 • ఛాయాగ్రహణం: కె.కె. మహజన్
 • కూర్పు: గంగాధర్ నస్కర్

అవార్డులు[మార్చు]

 • 1981 జాతీయ చలనచిత్ర అవార్డులు
 1. ఉత్తమ చిత్రం[2]
 2. ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్)
 3. ఉత్తమ స్క్రీన్ ప్లే (మృణాళ్ సేన్)
 4. ఉత్తమ ఎడిటర్ (గంగాధర్ నస్కర్)
 • 1981: 31వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - సిల్వర్ బేర్ - స్పెషల్ జ్యూరీ ప్రైజ్[3]

మూలాలు[మార్చు]

 1. నవ తెలంగాణ, సోపతి-స్టోరి (1 October 2018). "మానవ తప్పిదం కరువుకి ప్రత్యక్ష సాక్ష్యం". మూలం నుండి 10 January 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 10 January 2019. Cite news requires |newspaper= (help)
 2. "Akaler Shandhaney @ Mrinalsen.Org". Cite web requires |website= (help)
 3. "Berlinale 1981: Prize Winners". berlinale.de. Retrieved 2010-08-22.

ఇతర లంకెలు[మార్చు]