అకేర్షసు కోట
Akershus slott og festning Castle and Fortress | |
---|---|
Oslo, Norway | |
![]() Akershus Castle and Fortress | |
రకము | Castle Royal residences |
స్థల సమాచారం | |
నియంత్రణ | Government of Norway Norwegian Army Norwegian royal family |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 1290s |
వాడుకలో ఉందా | 1290s–present |
వాడిన వస్తువులు | Stone |
Garrison information | |
Past commanders | Haakon IV Haakon V Knut Alvsson Ove Gjedde Frederik Gottschalk von Haxthausen Christian Roy Kaldager |
అకెర్షసు కోట (నార్వేజియను: అకెర్షసు ఫెస్ట్నింగు, ఉచ్ఛరిస్తారు [ɑkəʂˈhʉːs ˈfɛ̂sːtnɪŋ]) [1] లేదా అకెర్షసు కోట (నార్వేజియను: అకెర్షసు స్లాట్ [ɑkəʂˈhʉːs ˈslɔtː]) [2] అనేది నార్వేజియను రాజధాని ఓస్లోలోని ఒక మధ్యయుగ కోట. ఇది నగరాన్ని రక్షించడానికి, రాజ నివాసాన్ని అందించడానికి నిర్మించబడింది. మధ్య యుగాల నుండి ఈ కోట అకెర్షసు, ప్రధాన ఫైఫు, తరువాత ప్రధాన కౌంటీకి పేరుగా, కేంద్రంగా ఉంది. ఇది మొదట నార్వే నాలుగు ప్రధాన ప్రాంతాలలో ఒకటి, తూర్పు నార్వేలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. ఈ కోట 1919 వరకు అకెర్షసు ప్రధాన కౌంటీలో మరియు 1842 వరకు చిన్న అకెర్షస్ ఉప కౌంటీలో కూడా ఉంది.
ఈ కోటను సైనిక స్థావరంగా, జైలుగా కూడా ఉపయోగించారు. ప్రస్తుతం నార్వే ప్రధాన మంత్రి తాత్కాలిక కార్యాలయంగా ఉంది.[3]
నిర్మాణం
[మార్చు]కోట నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైందో ఖచ్చితంగా తెలియదు కానీ ఇది 1290ల చివరలో రాజు 5వ హాకోను చేత జరిగిందని నమ్ముతారు. ఆ కాలంలోని రెండు ముఖ్యమైన నార్వేజియను కోటలలో ఒకటిగా టోన్స్బర్గ్ స్థానంలో (మరొకటి బాహసు). 1287లో జరిగిన ఓస్లో మీద నార్వేజియను కులీనుడు, సర్ప్స్బోర్గ్కు చెందిన ఎర్ల్ ఆల్వ్ ఎర్లింగ్సను చేసిన దాడికి ప్రతిస్పందనగా దీనిని నిర్మించారు. దాడి తర్వాత నగరం ప్రస్తుత రక్షణలు ప్రభావవంతంగా లేవని అందువలన బలమైన రక్షణ కేంద్రం అవసరమని స్పష్టమైంది.
1300లో మొదటిసారిగా రాజు హాకోను ఓస్లోలోని ఒక చర్చికి రాసిన లేఖలో కోట గురించి వ్రాతపూర్వక వనరులలో ప్రస్తావించబడింది. అయితే అప్పటికి కోట నిర్మాణం ఎంతవరకు పురోగమించిందో ఆ లేఖలో పేర్కొనలేదు.
ఈ కోట అన్ని ముట్టడిలను విజయవంతంగా తట్టుకుంది. ప్రధానంగా స్వీడిషు దళాల ముట్టడి నుండి 1716లో 12వ చార్లెసు నేతృత్వంలోని దళాల ముట్టడితో సహా.
చరిత్ర - సైనిక ఉపయోగం
[మార్చు]మధ్య యుగం
[మార్చు]1308లో స్వీడిషు డ్యూకు ఎరికు మాగ్నుసను ముట్టడి చేసినప్పుడు ఈ కోటను మొదటిసారి యుద్ధంలో ఉపయోగించారు. చివరికి స్థానిక నార్వేజియను సైన్యం ఒక యుద్ధంలో ఈ ముట్టడిని విచ్ఛిన్నం చేసింది. (ఈ యుద్ధం సిగ్రిడు ఉండ్సెటు చారిత్రక నవల ఇన్ ది వైల్డరునెసు, ఆమె “ టెట్రాలజీ ది మాస్టరు ఆఫ్ హెస్ట్వికెను “ మూడవ సంపుటి కథాంశంలో ప్రధాన భాగం.)
పునరుజ్జీవనం డెన్మార్కు-నార్వే
[మార్చు]సముద్రానికి అతి సమీపంలో ఉండడం ఒక కీలకమైన లక్షణంగా ఉంది. ఎందుకంటే ఆ కాలంలో నార్వేజియను వాణిజ్యంలో ఎక్కువ భాగం సముద్రం ద్వారానే జరిగింది. ఈ కోట రాజధానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. అందువలన నార్వే కు కూడా ఇది అతి ముఖ్యమైన కోటగా ఉంది. అకర్షసు కోటను ఎవరు నియంత్రించారో వారు నార్వేను పాలించారు.
1449-1450లో కోటను మళ్ళీ ముట్టడించారు. ఈసారి స్వీడిషు రాజు కార్ల్ నట్సను బోండే ముట్టడించాడు. కానీ కొంతకాలం తర్వాత ఆయన ముట్టడిని ఎత్తివేయవలసి వచ్చింది. 1502లో డానిషు-నార్వేజియను రాజు సేవలో ఉన్న స్కాటిషు సైనికులు నార్వేజియను కులీనుడు నట్ అల్వ్సను చేతుల నుండి కోటను తిరిగి పొందడానికి ముట్టడించే వరకు కోటను మళ్ళీ ముట్టడించలేదు.
1523లో అకర్షసును మళ్ళీ ముట్టడించారు. ఈసారి స్వీడిషు సైనికులు కానీ ఓస్లో నివాసితులు హాన్సు ములు ఆదేశం మేరకు వారిని తరిమికొట్టే ప్రయత్నంలో వారి ఇళ్లను తగలబెట్టారు. స్వీడన్లు కొద్ది కాలం తర్వాత వెనక్కి తగ్గారు.[4] రాజు 2వ క్రిస్టియను 1531 నుండి 1532 వరకు కోటను ముట్టడించాడు కానీ డెన్మార్క్ లుబెకు నుండి దళాలు ముట్టడిని ఎత్తివేశాయి. ఈ ముట్టడి తర్వాత కోటను మెరుగుపరచి బలోపేతం చేశారు. 1567లో ఉత్తర ఏడు సంవత్సరాల యుద్ధంలో కోటను స్వీడిషు దళాలు మరోసారి ముట్టడించాయి. కానీ డానిషు-నార్వేజియను రాజు లార్డు లెఫ్టినెంటు, క్రిస్టెను ముంకు, దాడి చేసేవారికి సామాగ్రిని పొందే మార్గాలను, చివరికి స్వీడన్లకు అందకుండా చేయడానికి నగరాన్ని తగలబెట్టడం ద్వారా స్పందించాడు.
రెండవ ప్రపంచ యుద్ధం
[మార్చు]
జర్మనీ దండు కమాండరు మేజరు జోసెఫు నిచ్టెర్లీను [no]ఆయన సహాయకుడు కెప్టెను జోహన్నెసు హామెలు కోటను నార్వేజియను ప్రతిఘటన ఉద్యమానికి చెందిన టెర్జే రోలెంకు అప్పగించడం (1945 మే 11,)ఈ కోటను విదేశీ శత్రువులు ఎప్పుడూ విజయవంతంగా ముట్టడించలేదు. అయితే 1940లో డెన్మార్కు, నార్వే మీద జర్మనీ దాడి జరిగిన నేపథ్యంలో నార్వేజియను ప్రభుత్వం రాజధానిని ఖాళీ చేసినప్పుడు అది నాజీ జర్మనీకి పోరాటం లేకుండా లొంగిపోయింది (ఆపరేషను వెసెరుబుంగు చూడండి).
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పెల్లె గ్రూపు సభ్యులతో సహా జర్మనీ ఆక్రమణదారులు ఇక్కడ ప్రజలను ఉరితీశారు. ఈ కోటను 1945 మే 11న, నార్వేజియను ప్రతిఘటన ఉద్యమం తరపున టెర్జే రోలెంకు అప్పగించినప్పుడు విముక్తి పొందారు. యుద్ధం తర్వాత యుద్ధ నేరాలకు పాల్పడి మరణశిక్ష విధించబడిన ఎనిమిది మంది నార్వేజియను దేశద్రోహులను కూడా కోటలోనే ఉరితీశారు. ఉరితీయబడిన వారిలో విడ్కును క్విస్లింగు, సీగ్ఫ్రైడు ఫెహ్మెరు ఉన్నారు.
రాజ నివాసం
[మార్చు]
మధ్య యుగాలలో
[మార్చు]1300 ప్రాంతంలో కోట నిర్మాణం పూర్తయిన తర్వాత 5వ హాకోను క్రమంగా కోటను నివాస రాజభవనంగా ఉపయోగించడం ప్రారంభించాడు. కోట నివాసంగా సరిపోకపోయినా ఓస్లో కాంగ్సుగార్డు ఎస్టేటు మీద కీపుకు అనుకూలంగా ఉన్నాడు.[5] రాజ నివాసంగా మారిన కోట కూడా నార్వే రాజధానిని బెర్గెను నుండి ఓస్లోకు తరలించే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించింది. 5వ హాకోను క్వీను యుఫెమియా, ఇంగెబోర్గు ఎరిక్సుడోట్టిరు, క్వీను మార్గరెటు వంటి నార్వేజియను మధ్య యుగాలకు చెందిన అనేక మంది ముఖ్యమైన వ్యక్తులు అందరూ కోటలో నివసించారు. ఇది అనేక దశాబ్దాలుగా అధికారిక నార్వేజియను రాజ నివాసంగా పనిచేసింది. .[6][7][8]కల్మారు యూనియను స్థాపనకు ముందు చివరి నార్వేజియను రాజు 2వ ఓలాఫు 1370లో ఈ కోటలో జన్మించాడు.
డెన్మార్క్ కు చెందిన అన్నే - స్కాట్లాండ్ కు చెందిన 6వ జేమ్సు
[మార్చు]1589 సెప్టెంబరులో డెన్మార్కుకు చెందిన అన్నే రాజు 6వ జేమ్సుతో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు స్కాట్లాండుకు నౌకాయానం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఓడలు, వాతావరణంతో ఇబ్బందుల తర్వాత ఆమె స్కాటిషు ఎర్ల్ మారిస్చలుతో అకెర్షసుకు వెళ్ళింది.[9][10] వారు వివాహం చేసుకున్న తర్వాత అకెర్షసు కెప్టెను ఆక్సెలు గిల్డెన్స్టియెర్ను సేవకుడు ఎల్సినోరు (క్రోన్బోర్గు)లో ఉన్నప్పుడు స్కాటిషు రాజుకు లేఖలు తీసుకువచ్చినందుకు బహుమతి పొందాడు.[11]
పునరుద్ధరణ - రాజభవనం
[మార్చు]1624లో జరిగిన గొప్ప అగ్నిప్రమాదం తర్వాత కింగు 4వ క్రిస్టియను ఓస్లో నగరం మొత్తాన్ని వేరే చోటికి తరలించి పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. [12] రాజు కొత్త నగరాన్ని అకెర్షసు కోటకు దగ్గరగా ఉంచాలని ఆదేశించాడు. నగరానికి క్రిస్టియానియా అని పేరు పెట్టాడు. ఆ కోటను తరువాత ఆధునీకరించి పునర్నిర్మించారు. కొత్త రూపం ఇటాలియను ప్రేరేపిత బురుజులతో కూడిన పునరుజ్జీవనోద్యమ కోటలా కనిపించింది. ఈ కోట ప్రధానంగా 19వ శతాబ్దం ప్రారంభం వరకు ఒక ప్యాలెసుగా పనిచేసింది. కాలక్రమేణా కొత్త టవర్లు, హాళ్లు, గదులు, ద్వారాలు జోడించబడ్డాయి. రాజు లేనప్పుడు కోట నార్వే స్టీవార్డు స్థానంగా పనిచేసింది.
జైలు
[మార్చు]అకెర్షసు కూడా ఒక జైలుగా ఉంది. దానిలోని ఒక భాగాన్ని ది స్లేవరీ (నార్వేజియన్: స్లేవరియెట్) అని పిలుస్తారు. ఎందుకంటే ఖైదీలను నగరంలో పని కోసం అద్దెకు ఇవ్వవచ్చు. ఈ కోటలో నార్వేజియను చరిత్ర అంతటా చాలా మంది తిరుగుబాటుదారులు, నేరస్థులను ఉంచారు. ముఖ్యంగా అక్కడ ఖైదు చేయబడిన ప్రసిద్ధ వ్యక్తులలో రచయిత గ్జెస్టు బార్డుసెను (1791–1849), అదేవిధంగా ఆదర్శప్రాయమైన దొంగ ఓలే హైలాండు ఉన్నారు. అలాగే చాలా మంది ప్రారంభ నార్వేజియను సోషలిస్టులు (మార్కసు థ్రేను మద్దతుదారులు, 1817–1890) కూడా అకెర్షసు సెల్సులో గడిపారు.[13] జైలు ఫాంటే-అన్నే (1920) చిత్రంలో కూడా ఒక కథాంశం.
కౌటోకినో తిరుగుబాటు ఖైదీలు
[మార్చు]గువుడగేయిడ్నులో 1852 లాస్టాడియను సామి తిరుగుబాటు తరువాత ఇద్దరు నాయకులు అస్లాకు హట్టా, మోన్సు సోంబీ (ఆల్టాలో శిరచ్ఛేదం చేయబడ్డారు)మినహా మిగతా పురుషులందరూ అకెర్షసు కోటలో ఉన్నారు - మహిళలు ట్రోండుహీంలో ఖైదు చేయబడ్డారు. తిరుగుబాటుదారులలో చాలామంది కొన్ని సంవత్సరాల బందిఖానా తర్వాత మరణించారు. [14] ప్రాణాలతో బయటపడిన వారిలో లార్సు హట్టా (జైలు శిక్ష సమయంలో 18 సంవత్సరాలు)ఉన్నారు. ఆయన తన బసలో ఉత్తర సామిలోకి బైబిలు మొదటి అనువాదాన్ని వ్రాయడానికి సమయం, వనరులను పొందాడు.[15]
ప్రస్తుత ఉపయోగం
[మార్చు]
సైనిక ప్రాంతం అయినప్పటికీ అకర్షసు కోట ప్రతిరోజూ 6:00 - 21:00 మధ్య ప్రజలకు తెరిచి ఉంటుంది. [16] కోటతో పాటు నార్వేజియను ఆర్ము ఫోర్సెసు మ్యూజియం, నార్వే రెసిస్టెన్సు మ్యూజియం కూడా సందర్శించవచ్చు. నార్వేజియను రక్షణ మంత్రిత్వ శాఖ, దేశ రక్షణ సిబ్బంది నార్వే కోట తూర్పు భాగంలో ఉమ్మడి ఆధునిక ప్రధాన కార్యాలయాన్ని పంచుకుంటాయి. హిస్ మెజెస్టి ది కింగ్సు గార్డు కోటను కాపాడటానికి బాధ్యత వహిస్తుంది. బహిరంగ సమయాల్లో స్థిర గార్డు పోస్టులు, రాత్రి మొబైలు పెట్రోలింగుతో కోటకు రక్షణ కల్పిస్తుంటారు. కోట ప్రవేశద్వారం వద్ద ఉన్న స్థిర గార్డు పోస్టులలో ఒకటి కోటను సందర్శించే పర్యాటకులకు ప్రసిద్ధ ఫోటోగ్రఫీ ప్రదేశంగా ఉంది.
రాజ సమాధి
[మార్చు]కోటలోని రాయలు సమాధి అనేక మంది నార్వేజియను రాజ ప్రముఖుల చివరి విశ్రాంతి స్థలం. ఇందులో కింగు 1వ సిగుర్డు, కింగు 5వ హాకోను, క్వీను యుఫెమియా, కింగు 7వ హాకోను, క్వీను మౌడ్, కింగు 5వ ఓలావు, క్రౌన్ ప్రిన్సెసు మార్తా ఉన్నారు. ప్రధాన భవనం పునరుద్ధరించబడినప్పటి నుండి కోట తరచుగా అధికారిక కార్యక్రమాలు, ప్రముఖులు, విదేశీ దేశాధినేతలకు విందులకు వేదికగా ఉపయోగించబడుతోంది.
ప్రధాన మంత్రి కార్యాలయం
[మార్చు]
2011లో జూలై 22న జరిగిన దాడుల తర్వాత నార్వేజియను ప్రధాన మంత్రి కార్యాలయం కోటకు దగ్గరగా నార్వేజియను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భవనంలో ఉంది.
అనుకరణ
[మార్చు]యునైటెడు స్టేట్సులోని ఓర్లాండో వెలుపల ఫ్లోరిడాలోని బే లేక్‌లోని వాల్టు డిస్నీ వరల్డు దాని ఎప్కాటు థీం పార్కులోని నార్వే పెవిలియను కోటలో కొంత భాగాన్ని ప్రతిబింబిస్తుంది. అకెర్షసు రాజ చరిత్రకు మరింత సూచనగా, ఎప్కాటు రెప్లికేషనులో అకెర్షసు రాయలు బాంకెటు హాలు అనే డిస్నీ ప్రిన్సెసు క్యారెక్టరు రెస్టారెంటు కూడా ఉంది. ఇది కొన్ని నార్వేజియను వంటకాలను కూడా అందిస్తుంది.[17]
చిత్రమాలిక
[మార్చు]-
ఓస్లో హార్బర్ మధ్యలో ఉన్న కోట
-
అకెర్షస్ కోట లోపల
-
అకెర్షస్ కోట చర్చి లోపల
-
అకెర్షస్ కోట
-
పడమర నుండి కనిపించే అకెర్షస్ కోట
-
ఆయుధశాల తలుపు
-
సముద్ర తీరం నుండి కనిపించే అకెర్షస్ కోట పనోరమా
-
5వ ఒలావు హాలు
-
కార్పెడమ్మెను చెరువును చూస్తున్న ప్రాంగణం
-
మైఖేలు వాన్ సుండ్ట్సు ప్లాసు నుండి పశ్చిమాన చూస్తున్న కోట
-
అకెర్షసు కోటలోని కవచం
ఇవికూడా చూడండి
[మార్చు]- మొదటి స్వీడిష్–నార్వేజియన్ యూనియన్
- కల్మార్ యూనియన్
- నార్వేజియన్ రాచరికం చరిత్ర
- నార్వే అంతర్యుద్ధం
- నార్వే ఏకీకరణ
- గ్రేట్ నార్తర్ను యుద్ధసమయంలో నార్వే
- స్వీడిషు–నార్వేజియను యుద్ధం
- గన్‌బోట్ యుద్ధం
- సిల్డా యుద్ధం
- పీటరు వెస్సెలు
- డెన్మార్కు - నార్వే - హోల్స్టెయిను సంస్కరణ
- నార్వేలో కాథలిక్ వ్యతిరేకత
- రాజ్యాంగ దినోత్సవం (నార్వే)
- టోరుస్టెన్సను యుద్ధం
- క్రిస్టియనుషోం కోట
- ఉత్తర నార్వే జాయింటు రెస్క్యూ కోఆర్డినేషను సెంటరు
- నార్వేజియను ఎయిర్ అంబులెన్సూ
- నార్వేలో విమానయానం
- నార్వేలో ఎన్నికలు
- నార్వేజియను మున్సిపలు ఎన్నికలు
- దక్షిణ నార్వే జాయింటు రెస్క్యూ కోఆర్డినేషను సెంటరు
- నార్వేజియను సాయుధ దళాలు
- రాయలు ప్యాలెసు ఓస్లో
- బైగ్డోయ్ రాయల్ ఎస్టేట్
- అకేర్షసు కోట
- టోన్సుబర్గు కోట
- హాఫ్ర్స్ఫ్జోర్డు యుద్ధం
- స్టాంఫోర్డు బ్రిడ్జి యుద్ధం
- స్కాటిషు–నార్వేజియను యుద్ధం
- ఫుల్ఫోర్డు యుద్ధం
మూలాలు
[మార్చు]- ↑ Berulfsen, Bjarne (1969). Norsk Uttaleordbok (in నార్వేజియన్). Oslo: H. Aschehoug & Co (W Nygaard). pp. 20, 92.
- ↑ Berulfsen, Bjarne (1969). Norsk Uttaleordbok (in నార్వేజియన్). Oslo: H. Aschehoug & Co (W Nygaard). pp. 20, 294.
- ↑ "Kontakt Statsministerens kontor". 14 June 2006.
- ↑ "Hans Mule". 25 February 2020.
- ↑ NRK TV - Se Akershus slott og festning gjennom 700 år (in నార్వేజియన్), 12 March 2014, retrieved 2018-08-31
- ↑ "Akershus Slott og Festning - Akershus Slotts Venner". www.slottsvenn.no. Retrieved 2018-01-31.
- ↑ "Kongeboliger og nasjonalskatter i Norge". www.nb.no. Retrieved 2018-01-31.
- ↑ "3. des: Margretes nødbrev Eder, min allerkjæreste..." dokumenteneforteller.tumblr.com. Retrieved 2018-02-02.
- ↑ Alan Stewart, The Cradle King: A Life of James VI & I (Pimlico, 2004), p. 109.
- ↑ John Robert Christianson, On Tycho's Island: Tycho Brahe, Science, and Culture in the Sixteenth Century (Cambridge, 2003), p. 140.
- ↑ Miles Kerr-Peterson & Michael Pearce, "James VI's English Subsidy and Danish Dowry Accounts", Miscellany Scottish History Society, XVI (Boydell, 2020), p. 42.
- ↑ Riksantikvaren. "Bjørvika anno 1624 - Riksantikvaren". www.riksantikvaren.no (in నార్వేజియన్). Retrieved 2018-02-26.
- ↑ "Norske Dramatikeres Forbund Raud vinter". Dramatiker.no. Retrieved 2010-04-28.
- ↑ "Kautokeino-opprøret 1852: Rettsoppgjøret". Arkivverket.no. Archived from the original on 2011-07-24. Retrieved 2010-04-28.
- ↑ "Kulturkompasset". Kulturkompasset. Archived from the original on 2011-07-13. Retrieved 2010-04-28.
- ↑ "AKERSHUS FORTRESS". Forsvarsbygg. Retrieved 28 November 2023.
- ↑ "Akershus Royal Banquet Hall". Walt Disney World. The Walt Disney Company. Retrieved 23 April 2023.