అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
Akkada Ammayi Ikkada Abbayi.jpg
సినిమా పోస్టరు
దర్శకత్వం ఇ. వి. వి. సత్యనారాయణ
నిర్మాత అల్లు అరవింద్
రచన సత్యానంద్ (మాటలు)
స్క్రీన్ ప్లే ఇ. వి. వి. సత్యనారాయణ
కథ నాసిర్ హుస్సేన్
నటులు పవన్ కల్యాణ్
సుప్రియ
సంగీతం కోటి
ఛాయాగ్రహణం ఎస్. గోపాల రెడ్డి
కూర్పు వళ్ళ స్వామి
నిర్మాణ సంస్థ
విడుదల
11 అక్టోబరు 1996 (1996-10-11)
నిడివి
150 నిమిషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు
ఖర్చు 6o లక్షలు
బాక్సాఫీసు 90 లక్షలు

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, సుప్రియ నాయకా నాయికలుగా నటించారు. ఇది కథానాయకుడిగా పవన్ కల్యాణ్ మొదటి సినిమా.[2] కథానాయిక సుప్రియకు కూడా ఇది మొదటి సినిమా. ఈమె అక్కినేని నాగేశ్వరరావుకు మనవరాలు. నటుడు సుమంత్కు చెల్లెలు. ఈ సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ అనే హిందీ సినిమాకు పునర్నిర్మాణం.

తారాగణం[మార్చు]

  • కల్యాణ్ గా పవన్ కల్యాణ్
  • సుప్రియ
  • నాజర్
  • శరత్ బాబు
  • బ్రహ్మానందం
  • బాబు మోహన్
  • కోట శ్రీనివాసరావు

పాటలు[మార్చు]

ఈ సినిమాకు సాలూరి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. పాటలన్నీ వేటూరి సుందర్రామ్మూర్తి రచించాడు. పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "టైం టైం"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 4:52
2. "బావా బావా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 5:12
3. "ప్రియ సఖి ఓం సఖి"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ 5:05
4. "చలిగాలి ఝుమ్మంది"  మనో, కె. ఎస్. చిత్ర 5:29
5. "ప్రేమన్నా చిన్నమాటలోనే"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 4:58
6. "ముద్దు ముద్దు పిల్లో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 5:13
7. "ఓ దైవమా"  ఎస్. జానకి 5:10

మూలాలు[మార్చు]

  1. "Titles". Chithr.com. 
  2. "Pawan Kalyan - Bio-graphy". idlebrain.com. Retrieved 24 February 2018.